Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 8/సంచిక 5/బర్మాగ్రంథాలయ చరిత్ర

​

బర్మాగ్రంథాలయ చరిత్ర

(మా.సుబ్బరామయ్యగారు)

పూర్వకాలమునుండియు, బ్రహ్మదేశము (బర్మ) ) సుభిక్షమగు దేశములలో బ్రధాన రాష్ట్రముగా పరిగణింపబడియె. పొడవు జీవనదులు - సారవంతమగు భూములు - సమశీతోష్ణ స్థితి - పుంజీకరములగు దట్టములైన యడవులు - మున్నగు స్వభావసిద్ధములైన సౌకర్యము లనేకములుండుట చేతను నానా విదేశీయ వ్యాపారులకును యద్యోగము నిరసించేడు కార్మికులకును నివాసస్థానమయ్యె కార్యాంతరులై వచ్చి నీ ప్రాంతమన నివాసమేర్పచురచుకొని యుండు రాష్ట్రతేరులు వారి దేశీయసాం

​ ​హూణ గ్రంథ సంపుటములు సమకూర్చబడినవి. ప్రారంభమున రెండు మూడు పత్రికలు కలిగి యల్పసంఖ్యాకులగు చదువరులను యాకర్షించిన గ్రంథనిలయు మిప్పుడు దాదాపుగా నూట యేబది వార్తాపత్రికలను గలిగి యనుదినమును వందమంది పాఠకుల నాకర్షించుచున్నది. ఇట్టి యున్న తదశయందుండు నీభాషానిలయ విశాపురమందలి పల్వురు శ్రీమంతుల యావరమునకు బాత్రమై యున్నదని వేరుగా జెప్పవలయునా? స్వ దేశస్థులగు బర్మీయులును, విదేశీయులగు భారతీయులును, ఐరోపా దేశీయులును, చైనీయులును నీ వాచనాలయమునకు నెక్కువ శ్రద్ధ జూపెదరు. బర్మా విద్యా విచారక రైలును రంగూను పురపాలక సంఘము (Corporation of Rangoon) వారి లైబ్రరీ చేయుచున్న మహెూపకారము గమనించి దగురీతిని సహాయ మొసంగుచున్నారని ప్రతీతి.

ఈగ్రంథ భాండాగారమున పనిజరుగు సమయము యుదయమున రెండుగంటలును, సాయంకాలమున 5 నుండి 8 గంటలవరకు తెఱచి యుండును, గాన నింకను కాలపరిమితిని హెచ్చించుట యవసరము. ఆలయమున పుస్తకముల బోషించువిధము, కార్యనిర్వాహకుని యరుపమ భక్తివిశ్వాసములకు బరమ నిదర్శనమై కన్పట్టెడిని. పాఠశాలలో ప్రవేశమునొందుటకు సావకాశములేనివారికిని వానిని వదలిన యీడు ముదిరిన వారికిని జ్ఞానాభివృద్ధి చేయుటయు, మహనీయుల సదాదేశముల యేర్పరచి తన్మూలమున జదు వెరుగని సామాన్యజనులు కింత జ్ఞానభిక్ష యిడుటయు ముఖ్యోద్దేశములుగా గలిగియున్నది.


ఇక నీ పుస్తకాగారమును గూర్చి నింతటితో ముగించి హిత కారవర్ధని సంఘమునుగూర్చి యొక్కింత చర్చించెదము. హితకారవర్ధని సమాజమెప్పుడు జనించెనో తెలియుటకు ఋజువులైన యాధారములు మృగ్యములు. కాని 1926 మొదలు కొనియున్నదనుట నిశ్చయము, ఇందు ఆంగ్లెయ, గుజరాతీ మరాటీ గ్రంథములు, హూణ గుజరాతీ ​ఇక యుత్సాహపూరితులగు మర్వారీ జనసమితి వారిచే నెలకొల్పబడిన మార్వారీ గ్రంథాలయము గలదు. అందు ముఖ్యముగా హిందీ భాషకు సంబంధించిన వార పక్ష మాస పత్రికలును గుజరాతీ భాషకు, హిందీ భాషకు సంబంధించిన యుత్తమ గ్రంథములును మిక్కుటముగ నేకరింపబడియున్నవి. అవియన్నియు నాయావర్గముల కనువుగ నున్నతమైన యద్ధాల బీరువాలలో గ్రమభంగి సమర్పబడినవి. ఈ గ్రంథాలయము చిన్నదైనను బుస్తకములు బోషించు విధము గాంచినతోడనే నెవనికైన నానందము గలుగకమానదు. ప్రొద్దున 9 గంటలనుండి సాయంత్రము 6 గంటలవరకు తెరవబడియుండును. అనుదినమును యెల్లరను యుచితముగా చదవనిచ్చెదరు గాని పాఠకులు యెక్కువగా గాన్పించుట లేదు.

ఇంకను నాటుకోటి శెట్టియారులు గ్రంథాలయము, చులీయా మహమ్మదీయుల గ్రంథ భాండాగారము, బంగాలీయుల గ్రంథవాచక సమితి, తెల్లవారి యుపయోగార్ధమై స్థాపింపబడిన రంగూను సారస్వత సమాజము, మహిళామండలి వారి శారదా సదనము గలవుగాని సభ్యులు తప్ప నితరులు ప్రవేశించుటకు వీలు కానివిగా నుండుటచే నావిషయము గూర్చి నిట చర్చింపబడలేదు.

మాతృ భాషాభివృద్ధికై యిప్పురమున ననేక గ్రంథాలయములు మఖలో పుట్టి పుబ్బలో సంతరించుచున్న స్థితి యందున్నవి.

ఆఁధ్రమహాజన సంఘము వారు ప్రతిష్టించియుండిన భాషానిలయము తెరమఱుగున జేరినట్లు కనబడుచున్నది. అధికయాంధ్ర మహాజనులు నివసించెడు మోల్మీసుపురిలోని గ్రంథాలయోద్యమపు బొలకువ యసలే గావరాదు. సిరియములోని వెనుకటి రాజా రామ మోహనరాయల వాచనాలయము దీర్ఘనిద్రబొందినది.

చున్నద య మివః ఆంధ్ర మహాజనసభ వారి గ్రంథనిలయము, ఆంధ్ర సేవా సంఘమునకు ఆంధ్ర సేవాసంఘ్ ~ ు కనులు మూసి తెరుచు సమువారి పఠనాల ట గమనించు ​చున్నారము, ప్రజాసమితి కత్యంతోపయోగకరములగు నీ పుస్తకా లయము లిటు లధోగతి నందుటకు పురాంధ్రపౌరులలో వైషమ్య ములు ప్రబలుటయు, కార్యకరులయందు మాత్సర్యములు చెలరేగు టయు, నీసరస్వతీ నిలయములకు స్థిరప్రతిష్టుకు దగిన యాధారములు లేకపోవుటయు కారణములుగా యుండవచ్చు నని తోచుచున్నది. పైన బేర్కొనిన యుత్కృష్ణాదర్శముల ననుసరించి సక్రమపథమున నడ చుచు రంగూను నగరమందలి ఆంధ్ర భాషానిలయముల కెల్ల నద్వితీ యమగు స్థానము వహించిన పురమధ్యమందలి రెండు గ్రంథాలయముల గతి యేమైనదో? దీనపోషక సమాజము కొనయూపిరితో నున్న. దనియు, మరొకటి రూపు చెడి నశింపనున్నదనియు చెప్పవచ్చును. ఇందు లకు ఆంధ్ర మహాజను లేగాక మరెవ్వరు బాధ్యులు? ఈ గ్రంథాలయముల పూర్వస్థితి నూహించి యిప్పటి పతితదశను గూర్చి యోచించుచో పౌరవర్యులగు నాంధ్రసభామండలి కనులు మూసికొని పోయిరా యను నంతటి విచార మెట్టివారికైనను కలుగకమానదు. పురమున త్యాగ శీలురగు యాంధ్రమహామహులెందరో యున్నారు కాని ప్రయత్న ప్రాబ ల్యముమాత్రం మావశ్యకము. బర్మాదేశమున యాంధ్రజన సామాన్య మంతయు అజ్ఞానమువలనను, దురాచారముల వలనను, దురలవాటుల వలనను పొందుచున్న విపత్తులు మెండుగా నున్నవి. కనుక తన్ని వారణ కొరకు భాషానిలయసంస్థలు తగినట్లు కృషి చేయుట ప్రధానకర్తవ్యము.

గ్రంథాలయోద్యమము

ఈ పేరున మద్రాసు గ్రంథాలయ సంఘమునా రొక చక్కని × థ రాజమును బ్రకటించినారు. ఇందు ఆంధ్ర, ఆంగ్లేయ, ద్రవిడ, ༥ ​మదన గోపాలనాయుడు, వావిళ్ళ వేంకటేశ్వర్లు, వింజమూరి గోవిందరాజా చారి, కోరాడ రామకృష్ణయ్యగార్లు గ్రంథాల యోద్యమమును గూర్చి వ్రాసిన వ్యాసములు గలవు. వెల రు 2 లు. ఆంగ్లేయ ఆంధ్ర భాగములు వేరుగా దీసిన ప్రతిని గ్రామ యూనిలియనులకును, పఁచాయతులకును ఉచితముగా పంపెదరు. ఇతర సంఘములకు పోస్టేజీ కొరకు రెండు అణాల బిళ్ళలను పంపిన పంపెదరు. మద్రాసు గ్రంథాలయ సంఘ నిబంధనలను ఉచితముగా బంపెదరు.




This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse