Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 8/సంచిక 4/సప్తమ తూర్పుగోదావరి మండల ధర్మగ్రంధాలయమహాసభ

​

సప్తమ తూర్పు గోదావరి మండల ధర్మగ్రంథాలయ మహాసభ

25-10-29 తేదీ మధ్యాహ్నము 2 గంటలకు ఈ సభ సామర్ల కోటయందు మహావైభముగ జరిగినది. మండలమందున్న వివిధ గ్రంధాలయముల నుండి ప్రతినిధు లేతెంచిరి. ప్రార్థన గావింపబడిన పిమ్మట ఆహ్వాన సంఘాధ్యక్షులు డాక్టరు చాగంటి సన్యాసిరాజు యల్.యం.పి. గారు ప్రతినిధుల నాహ్వానించిరి.

ఆహ్వాన సంఘాధ్యక్షుని యుపన్యాసము

స్దలచరిత్ర

తామిప్పుడీ సమా వేశమైన సామర్లకోట గ్రామము ప్రసిద్ధ స్థలమును బుణ్యక్షేత్రమునై యున్నది. పూర్వమందు శ్యామలాంబా దేవీ సంరక్షితంబగు కోట యుండుటచే శ్యామలకోట యను బేరు వచ్చినది. అదియే క్రమముగా సామర్లకోటగా మారినది.

శ్వేతాధికారుల శరీరముల మంట లెక్కించిన మహావీర వనితయు బతివతా శిరోమణియునగు కామమ్మ పాట నాలింపని స్త్రీ పురుషు లాంధులలో లేరుగదా. అట్టి సాధ్వీమతల్లి ఆర్యాచార పరాయణం చూపరు లెల్ల నివ్వెరపాటోంద భర్తతో సహగమన మొనర్చిన పావనత్ర మిదియే ?

మహాశివక్షేత్రములలో సుప్రసిద్ధమగు శ్రీ భీమేశ్వరాలయ మిచ్చటనే యున్నది. యీ దేవాలయము దేవతా నిర్మాణమను బ్రతీతియు గలదు. ఇచ్చటి లింగ మత్యున్నతము. మహాశివరాత్రికి వేల వేలు భక్తులు వచ్చి భీమగుండమను కొలనులో స్నానముచేసి ​స్వామిని దర్శించి ఐహికాముష్మిక ఫలితములను బొందుచుందురు. ఈ దేవాలయోత్సవములకు శ్రీ పీఠికాపుర మహారాజావా రొసంగిన భూములున్నవి. పెద్దాపురపు రాజుల పరిపాలనలో గూడ గొప్పకోట యుండెడిది. బొబ్బిలియుద్ధములో రంగరావు కుమారుని రహస్యముగా మల్లమ్మ దేవి పంపయత్నించిన దీకోటకే. మొన్న మొన్నటి వరకు బ్రిటిషుపటాలము లిచ్చటనే యుండెడివి. గోదావరి కాలువయును, యేలామహామునిచే దీసికొని రాబడిన యేలేరును యిచ్చటనే బ్రవహించుచున్నవి. మన మండలములో పంచదార చేయు ఫ్యాక్టరీ యును, వ్యవసాయపరిశోధకశాలయను నిచ్చటనే యున్నవి.

గ్రంథాలయోద్దేశ్యము

దీనిని బ్రతి గ్రామమునను స్థాపించి తన్మూలమున బ్రజలను జ్ఞానవంతులనుగా నొనర్చు సంకల్పమే గ్రంథాలయోద్యమము. జనుల నెల్లర జ్ఞానవంతులుగా నొనర్చుటయే దీని లక్ష్యము. తాను జ్ఞానవంతుడై పరులను జ్ఞానవంతుల జేయవలెనను స్వభావమే యీ యుద్యమ కారణము. మనుజుని జీవయాత్ర పవిత్రముగను బురుషార్థ సాధకముగను జేయుటయే ఈ యుద్యమ ప్రాప్యము.

పూర్వచరిత్ర - పరిణామము

చిరకాలము క్రిందట నార్యఋషులే గ్రంథాలయములుగా నుండిరి. అప్పుడు భాషకు లిపిలేనందున దండ్రులు పుత్రులకును, గురువులు శిష్యులకును సంతలజెప్పి వల్లింపజేయుచు సుమారారు వేల సంవత్సరముల కాలము విజ్ఞానమును గాపాడిరి. లిపి యేర్పడిన పిదప దాళపత్రములు, శిలలు, రేకులు, కొయ్యలు, మొదలగు వానిపై వ్రాయుచుండిరి, పదు నేనువందల సంవత్సరములనాటి తాళపత్రి గ్రంథములందు ఒక్కొక పత్రముపై పదునారు పంక్తులు గలిగి ముత్యములు బోలు నక్కరములు గాంచిన యెడల మన పూర్వుల గ్రంథాభిమానమును వారుపడిన శ్రమయు దెలియగలదు. మన దేశమునందు గ్రంథాభిమానము నవీనముకాదు. పాశ్చాత్యులు వస్త్రధారణ మననేమో యెరుగని కాలమున గూడ మన దేశము విజ్ఞానామృతమ్మను వెద ​జల్లుచుండెడిది. ఆర్వస్వతంత్రప్రభువుల కాలమున రాజనగరులందును, దేవాలయములందును గ్రంథాలయము లుండెడివి. అలెగ్జాండరు దండయాత్రలో కొన్ని గ్రంథములను గ్రీకులు గొనిపోయిరి. అశోకుని కాలమునుఁడి బౌద్ధులును, జైనులును, గ్రంథాలయ స్థాపన చేయసాగిరి. ఆకాలముననే విశ్వవిద్యాలయము లేర్పడి వాని కనుబంధములుగా గ్రంథాలయము లేర్పడినవి. వేదకాలమునుండి నేటివరకును కాశీపురము విద్యాస్థానమై యున్నది. క్రీస్తుశకము ఆరవశతాబ్దయిన తక్షశిలా విశ్వవిద్యాలయము మహాఖ్యాతి నందెను. దానియందు పదియారు విద్యలు బోధింపబడు చుండెను. అమరావతీ కళాశాలకు చీనా, బర్మా, సింహళాది దేశముల నుండి విద్యార్థులు వచ్చుచుండిరి. దూపాంగ విశ్వవిద్యాలయము బౌద్ధులకు మిగులు లాభకారిగా నుండెడిది. ప్రాచీన విశ్వవిద్యాలయములలో నలందా విశ్వవిద్యాలయము మహెూన్నతస్థానము నాక్రమించను. ఆశియాఖండమందన్ని ప్రాతముల నుండియు విద్యార్థు లిటకు వచ్చుచుండిరి. దీని కనుబంధముగా “రత్నోదధి” యను పుస్తకాగార మెనిమిడి యంతస్థుల మేడపై నెలకొల్పబడెను.

బౌద్ధ మతక్షీణతతో నివియు క్షీణింపసాగెను. చీనాయాత్రికుడగు హీయూనిత్స్యాంగు 657 గ్రంథములను చీనాడు గొనిపోయెను. కొన్ని బౌద్ధగ్రంథములను హిందూమతోద్ధారకులు నశింపు జేసిరి. తరువాత పదునొకండు మొదలు పదునేడవ శతాబ్దము వరకును మహమ్మదీయుల దండయాత్రలవలన గ్రంధాలయములు పూర్తిగా నాశనమయ్యెను. "ఉదంతపురి, విక్రమశిల” విశ్వవిద్యాలములు మహమ్మదీయుల క్రోధాగ్ని శాహుతులయ్యెను. మొగలాయి రాజ్యవినాశనముతో దేశ మరాజకమయ్యెను. పాశ్చాత్యు లనేకులా కాలమున వచ్చి మన గ్రంథ సముదాయమంతయు గొనిపోయిరి. అగ్రంథములు, లండను, ప్యారీఘ, బర్లను లైబ్రరీలలో నిప్పుడు గూడ జూడగలను. స్వామి దయానంద సరస్వతి గారు అధర్వణవేదమును జర్మనుండియే గొనితెచ్చిరి. టిప్పు సుల్తాను గ్రంథాలయముననున్న 20,000 వ్రాతప్రతులు బ్రిటిషువారు గొనిపోయిరి. 1856 సంవత్సరములో ​అయోధ్య రాజుయొక్క గ్రంథాలయ గ్రంథములు సైనికుల వంటకట్టెలుగా నుపయోగింపబడెను. చీనా యాత్రికుడగు సాహియాను సంస్కృతమును, మత గ్రంథములను పాటలీపుత్రమున మూడేండ్లుండి నేర్చుకొనెను. గుప్తరాజుల కాలములో దేవాలయము లన్నిటియందును గ్రంథాలయము లుండెడివి. నలంద విశ్వవిద్యాలయ క్షీణకాలమునందే మగధరాజుల చే “ఉదంతపురి, విక్రమశిల" విశ్వ విద్యాలయములేర్పడి, గ్రంథాలయము లేర్పడెను. విక్రమశిల గ్రంథాగారమునందలి గ్రంథములలో బెక్కింటిని టిబెట్టు వారు గొనిపోయిరి. 1202 సం॥రం లో భక్తియారు ఖిల్జీ బేహారును జయించినప్పుడు ఉదంతపురి గ్రంథాలయ మాతని సేనానియగు మహమ్మదుబిన్ సివి చేదగుల బెట్టబడెను. ఉత్తర హిందూస్థాన మందున్న విహారములలో ననేకములు మహమ్మదీయులచే నశింపు కాబడినవి. సన్యాసులు కొన్ని గ్రంథములు “నేపాలు” నకు గొనిపోయిరి. నేపాలునుండి బ్రిటిషు మంత్రులు నయభయములచే కొన్ని గ్రంథముల గైకొని బ్రిటనులో జేర్చిరి. ఆ దేశమంత్రి 1909 సం॥రం లో ఆక్సుపోర్డు గ్రంథాలయమునకు 6,880 గ్రంధ రాజములనిచ్చి మన దేశమును గ్రంథహీనముగా జేసెను.

ఇట్లు మన దేశము పర రాజాక్రమణచే హీనదశకు వచ్చి మన గ్రంథరాజములు క్షీణించినను బొత్తిగా గ్రంథాలయములు లేవని దలంపరాదు. తురక ప్రభువులలో గూడ గ్రంథాలయములు గాపాడినవారనేకు లున్నారు. “ఫిరోజిషా పండితులచే ననేక గ్రంథము లను వ్రాయించెను. “అక్బరు చక్రవర్తి” మత, సాంఘిక, రాజకీయ, ప్రకృతిశాస్త్ర గ్రంథముల ననేకములను సేకరించి గ్రంథాలయోద్యమమునకు వన్నెదెచ్చెను. పదియవ శతాబ్దమున రాజ రాజ నరేంద్రుడును, పదునేవ శతాబ్దమున శ్రీకృష్ణ దేవరాయలును అనేక గ్రంధ రాజములను వాయించిరి. పతాను, అహమ్మదాబాదు, నద్వాను, సూరతు, కాంబే, తరాదు, జబల్ మీరు, భట్నీరు గ్రంథాగారములందు 10,000 వ్రాతపతుల వంతున నున్నవి. నేపాలులో, పతానువురిలో 40 పెట్టెల వ్రాతపతు లున్నవి. జసలీ మీరు నందున్న పరశునాధ భాండా ​గారములో వేలకొలది వ్రాతపతులున్నవి. కనరాజిల్లా ముదచిద్రిలో గొప్ప జైను గ్రంథాలయ మున్నది. మన ప్రభుత్వమువారి పరిశీలన వలన అల్వారు, బికనీరు, తంజావూరు, జుమ్ము, నేపాలు, మైసూరు, జోధపురము గ్రంథాలయములు వెలసినవి.

ఇతర దేశములు

అమెరికా, గ్రంథాలయోద్యమమునం దగ్రస్థానము వహించి యున్నది. ఇంగ్లండులో కల్లంగడులలో గూడ లైబ్రరీలు గలవట. ఫ్రాన్సు మొదలగు దేశములలో గ్రంథాలయము లేని పల్లెలేదు. ఆదేశములన్ని విధములను మహెూన్నతదశ నొందుటకు గ్రంథాలయములే కారణము.


ప్రస్తుత స్థితి

ప్రస్తుతము మన దేశస్థులు స్వరాజ్యాపేక్షాపరులై యున్నారు. దేశీయ మహాసభ తత్ఫలితమునకే బ్రయత్నించుచున్నది. గాంధీ మహాత్ముడు దీనిని నడుపుచున్నాడు. స్వరాజ్య సంపాదనకును, వచ్చిన పిదప దానిని నిర్వహించుకొనుటకును గ్రామనిర్మాణ మావశ్యకమని ప్రాజ్ఞులెల్ల రంగీకరించుచున్నారు. గ్రామ పునర్నిర్మాణమునకు విద్య పునాది. మన దేశములో నూటికి పదిమంది గూడ అక్ష రాస్యులు లేరు. జనులకు విద్యలేనిది స్వరాజ్యములేదు, వచ్చినను నిర్వహింపజాలము. మనకు జాలినన్ని పాఠశాలలు లేవు. వానిలో నేర్పు విద్యగూడ గవర్నమెంటు గుమాస్తాపనుల కక్కరకు వచ్చునదేగాని మనకు లాభకారిగా లేదు. మనము పేదలమగుటచే చిరకాల విద్యాభ్యాస మొనర్పలేము. ప్రతి గ్రామమందును గ్రంథాలయమున్న యెడల నాకొరత దీరిపోవును. అమెరికా గ్రంథాల యోద్యమనాయకులగు "డాక్టరు మెల్విడేవి” బాలురకు పాఠశాలలు, పెద్దలకు గ్రంథాలయములు అని చెప్పి యున్నారు.

ముగింపు

మన మిప్పుడు చేయవలసిన పని చాలయున్నది. గ్రంథాలయములు శైశవావస్థలో యున్నవి. మన మండలములో మణిపూస యన ​దగు గౌతమీ గ్రంథాలయము గూడ కలహభూయిష్టమగుట విచారకరము. సంఘసంస్కర్తలలో వన్నెకెక్కిన శ్రీకందుకూరు వీలేశలింగం పంతులు వారి గ్రంథాలయమును, శ్రీ చెలికాని లచ్చారావుగారిచే స్థాపింపబడిన ఆంధ్ర పరిశోధక మహామండలి గ్రంథాలయమును, కాకినాడలో శ్రీ పోలవరం జమీ౯దారు వారి గ్రంథాలయమును వృద్ధినొందుచుండుట సంతోషదాయకము. మహాత్నాజీ బోధ ననుసరించి యనేక గ్రంథాలయములు బయలు దేరుచుండుట సంతోషకరము. ప్రస్తుతమున ప్రభుత్వము వారీ యుద్యమమునకు సానుభూతి జూపు చున్నారుగాని వారిసహాయ మత్యల్పము, నిర్బంధము లనేకములగుటచే జాల గ్రంథాలయము లాకొద్దిలాభము గూడ బడయజాల కున్నవి. మన స్వశక్తివలన వీని యభివృద్ధినే జేయజాలని యెడల స్వరాజ్య మెట్లు సంపాదించగలము? కొన ప్రతి గ్రామమందును గ్రంథాలయ నేర్పరచి విద్యాభివృద్ధి చేయుడు. వీనికి అనుబంధముగా రాత్రి పాఠశాలల నేర్పరచి, విద్యాహీనులగు వారలకు విద్యాదానమొనర్చుడు. పత్రికలం చెప్పించి దేశ వార్తలను నాయకుల మహెూపన్యాసములను వినిపింపుడు. గ్రంథాగారములలో రాట్నముల నుంచి ఖద్దరును ప్రోత్సహింపుడు. గ్రాను పునర్నిర్మాణాధారమగు గ్రంథాల యాభివృద్ధికి గడంగుడు. శ్రీదరిద్రనారాయణ మంత్ర రాజమును స్మరింపుడు.

అధ్యక్షలు

అనంతరము శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారు అధ్యక్షత వహించి గంభీరోపన్యాన మొనంగిరి. వారియుపన్యాసము ముందు సంచిక యందు ప్రకటింపబడును. వారి యుపన్యాసమైన పిమ్మట శ్రీ కాట్రావులపల్లి సూర్యనారాయణ యోగినిగారు గ్రాహ్యవుస్తక పఠనమునుగూర్చి చెప్పిరి. అనంతరము ఈక్రింది తీర్మానములు చేయబడినవి.

తీర్మానములు

(1) ఆంధ్ర దేశములో 1898 సంవత్సరమున ప్రథమ గ్రంథాలయముగా ప్రారంభింపబడి, గ్రంథాలయోద్యమునకు మార్గదర్శక ​ముగా కృషి సల్పుచున్న రాజమహేంద్రవర గౌతమీ గ్రంథాలయమునకు రజతోత్సవము జరుపుటకు ఈ సభవారు తీర్మానించుచున్నారు.

ఈ యుత్సవమును జరుపుటకు గౌతమీ గ్రంథాలయ సభ్యులను, ముడలస్థాయి సంఘసభ్యులను, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ సభ్యులను పూనవలసినదిగా ఈ సభవారు హెచ్చరించుచున్నారు.

(2) గుంటూరు బెజవాడ మునిసిపాలిటి వారును, తాడేపల్లి గూడెం తాలూకా బోర్డు వారును, ధర్మగ్రంథాలయములను స్థాపించి విజ్ఞానప్రచారమునకు తోడ్పడుచున్నందులకు వారి సభినందించుచు ఇతర మునిసిపాలిటీలును లోకలు బోర్డులును వారి ఆదర్శము గైకొని గ్రంథాల యోద్యమమును ప్రోత్సహించవలెనని ఈసభవారు కోరుచున్నారు.

(3) “రేడియో” యంత్ర సహాయమున ఆంధ్రోపన్యాసములు యిప్పించుట మూలమునను, మాజికు లాంతరు సినీమా ప్రదర్శనముల వలనను జన సామాన్యమునందు విజ్ఞానము వ్యాపింప జేయుటకు స్థానిక సంస్థలను, గ్రంథాలయోద్యమాభిమానులను ఈసభవారు హెచ్చరించు చున్నారు.

(4) లోకలుబోర్డుల ద్వారాను, రాష్ట్రీయ సహకార యూనియనుల ద్వారాను నిర్వహింపబడుచున్న గ్రామ పునర్నిర్మాణ కేంద్ర స్థానములో కేంద్ర గ్రంథాలయములను స్థాపించి, ఆయా ప్రాంతములందలి గ్రామ జనులకు సంచార గ్రంథ పేటికల మూలమున గ్రంథ పఠన వ్యాప్తికి తోడ్పడవలెనని ఆయా సంస్థల వారిని కోరడమైనది.


(5) సహకార స్థానిక యూనియనుల కార్యస్థానములందు కేంద్ర సంస్థలవారిని గ్రంథాలయములను నిర్వహించి, స్థానిక యూనియను ప్రదేశములలోని సహకార సంఘముల సాముదాయ ప్రయోజన నిధితో గ్రంథాలయ సంచార ప్రచారకులను పోషించి ఉద్యమవ్యాప్తికి తోడ్పడవలెనని ఈసభవారు సహకార యూనియనులను హెచ్చరించు చున్నారు.

(6) జిల్లాలోని సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకులు వారి సాముదాయ ప్రయోజన నిధినుండి వారి కార్యాలయమున కేంద్ర ​గ్రంథాలయములను స్థాపించి, తద్వారా యూనియనుల స్థానిక గ్రంథాలయములకు గ్రామ సహకార సంఘములకు సంచార గ్రంథాలయ పేటికల మూలమున గ్రంధ పఠన వ్యాప్తిని జేయుదురని ఈసభ వారు హెచ్చరించుచున్నారు.

(7) పంచాయితీల ఆక్ట్ క్రింద నిర్వహింపబడు గ్రామ పంచాయితుల యాజమాన్యమున నిర్వహింపబడు గంథాలయములకు మూడు వందల రూపాయలతో స్వస్తి చెప్పక, గ్రామ పంచాయితీ గ్రంథాలయాభివృద్ధికి పంచాయతు లిచ్చెడు విరాళమునకు సరిసమానమగు విరాళమును ప్రభుత్వమువారును స్థానిక సంస్థలును యిచ్చి ప్రోత్సహించవలెనని ఈ సభవారు కోరుచున్నారు.

(8) కీర్తిశేషులైనకందుకూరి వీరేశలింగంపంతులుగారిచే స్వదస్తూరిని వ్రాయబడిన పుస్తకములు అఖిలాంధ్ర దేశము యొక్క సొత్తు కావున వానిని భద్రపరచుటకు రాజమండ్రి హితకారిణీ సమాజము వారిని ఈసభవారు హెచ్చరించు చున్నారు.

(9) ఆంధ్ర దేశమందలి సుప్రసిద్ధజాతీయ వారపత్రిక "కాంగ్రెసు” సంపాదకులగు శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్యగారిని చారిత్రక నాటకమును ప్రచురించినందులకై ప్రభుత్వమువారు శిక్షించియు, “కాంగ్రెసు” స్వాతంత్య్ర, విప్లవసంచికలు బహిష్కరించియు, నిజమగు చరిత్రరచన ప్రచారములను నిరోధ మొనర్చినందులు కీసభ వారు ప్రభుత్వపు నిరంకుశచర్యను నిరసించుచున్నారు. ఇట్టి సత్యచరిత్రల ప్రచురించి ప్రభుత్వపు నిర్బంధాగ్నికి గురియై శిక్ష ననుభవించుచున్న శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య గారి త్యాగ ధైర్యముల నీ సభవారు రభినందించుచున్నారు.

(10) మండలమందున్న అన్ని గ్రంథాలయములలోను హిందీ భాషాభివృద్ధికి తోడ్పడునటులను, హిందీ గ్రంథములను గూడ నుంచునట్లు ఆయా గ్రంథాలయాధికారులను ఈసభవారు హెచ్చరించు. ​(11) ఈ సభాతీర్మానములను అమలులో పెట్టుటకును, ధర్మ గ్రంథాలయోద్యమమును ఈ మండలములో వ్యాప్తి చేయుటకును ఈకింది వారిని స్థాయిసంఘముగా యేర్పాటు చేయడమైనది.

అధ్యక్షులు:–
నరసింహ దేవర సత్యనారాయణగారు


ఉపాధ్యక్షులు:—
డాక్టరు సన్యాసిరాజు గారు
యాతగిరి లక్ష్మీ వేంకటరమణగారు
మారిన నరసన్న గారు
మల్లిపూడి పళ్లమరాజుగారు


కార్యదర్శులు:-
అవసరాల రామచంద్రరావుగారు
కంభంపాటి లక్ష్మీనరసింహసోమయాజులు గారు


(12) రాబోవు సంవత్సరము ఈసభను ప్రత్యేకముగా ఆలమూరు నందు చేయుటకు శ్రీ నరసింహదేవర సత్యనారాయణ గారిచే ఆహ్వానింపబడినది.




This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse