Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 8/సంచిక 4/బర్మాదేశ గ్రంథాలయోద్యమము

​

బర్మాదేశ గ్రంథాలయోద్యమము

గ్రంథాల యోద్యమము ఆంధ్రసీమలండు విరివిగా మొలకలెత్తుచు సర్వజనాదరణమును బొందుటయేగాక యిరుగుపొరుగు రాష్ట్రీయ సోదరుల మానస సీమలందును గూడ నాకర్షింపబడి నీ యుద్యమమును దమదమ మండలములందును వెదజల్లవలయున నెడు యుత్సాహము వారి నాయకశిఖామణులకు జనించి, దానికి దగినకృషి సల్పుచున్నారు. అయితే పొరుగుననుండు నీబర్మాదేశమున గ్రంథాలయోద్యమమునందు పూనిక వహించియుండునటుల కాన్పింపదు. ఎందుకన భారతీయులవలె బర్మీయులందు ప్రోత్సాహము లేకపోవుట యటుండ, ఈ యుద్యమమునకు ప్రజాప్రతినిధుల మనోదృష్టి యందైన స్థానమేర్పడియుండలేదు. విద్యావంతులకన్ననో ఉద్యమతత్వ మింకను సువ్యక్తముగా బోధపడలేదు, రంగూను విశ్వవిద్యాలయము కార్యరూపము ​దాల్చిననాటి నుండి విద్యావంతులకు కొరతలేదుగాని దేశ ప్రముఖులు రాజకీయమున పాల్గొని బర్మాప్రత్యేక రాష్ట్ర విభజనకై యాందోళన మారంభించియున్నారు. విద్యాధికులన్ననో స్వధర్మమును పూర్ణముగా త్యజించి పరధర్మవ్యామోహమున చిక్క సినిమా ప్రదర్శనా పరిశ్రమమునందు పాటుపడుచున్నారు. నాగరికత హెచ్చగుకొలది బాల బాలిక విద్యాలయ సంస్థలు యభివృద్ధి యగుచున్నవే గాని తరిగిపోవుట లేదు, విద్యాభివృద్ధి యధికమగు చుండెడు నీకాలమున నవలలు. నాటకములు - చిత్రవిచిత్ర మాసపత్రికలు నెక్కువగా బయలు దేరుచున్నవి. దేశ బాషయను "బర్మా ”ను నిర్బంధ పాఠముగా నొనర్పవలయునని దేశీయ విద్యా విచారణ సంఘము వారు రంగూను విశ్వ విద్యాలయమును నిర్బంధమొనర్చుచున్నారు. బర్మావాఙ్మయమున నవలలు - నాటకాది భాషాంతరీకరణములే గాక విజ్ఞాన శాస్త్రీయ గ్రంథములును, వాణిజ్యారి పరిశ్రామిక విషయముల గూర్చి నింక నెన్నియో గ్రంథములు రచించుటకు దేశీయ పత్రికాసంపాదకులు తీవ్ర పయత్నము లొనర్చుచున్నారు. బర్మా సారస్వతము కృష్ణపక్షమున నున్నదనుటకు వీలు లేదు. గ్రంథాలయమునకు బర్మా భాషయందు “సదాడె” యని పేరు. పూర్వమున ముద్రణా సౌకర్యములు లేకపోవుటంబట్టి తాళీయదళ సంపుటములగు నా యమూల్య గ్రంథజాలములు పండితుల గృహములందును, రాజభవనములందును, “పొంగీ” లనబడు బౌద్ధభిక్షువులు మఠములందును, బౌద్ధాలయములలోను నా యపూర్వ పుస్తక సముదాయములకు పీఠములై యుండినటులు బర్మా దేశ చరిత్రాంశముల వలన తెలియుచున్నది. ఆకాలమున ముఖ్యముగా మతమునకు యావశ్యకములగు త్రిపీఠక బౌద్ధమత రహస్య గ్రంథ ములు ఆధ్యాత్మిక ధర్మములు, మానసిక మర్మతత్వములు, రాజనీతి, అర్థనీతి, శిల్పి, వైద్య శాస్త్రీయ గ్రంథములే యధికముగా యుండినటుల కనబడుచున్నవి. ఇంకను బడాక త్వాట్ యను సారస్వతమండలియందు బర్మాసన్యాసులు యనేక శాస్త్రవాదములు విపులముగా నక్కాలమున జరుపుచుండిరని, పూర్వవిర చితములగు త్రిపీఠక వ్యాఖ్యాన భాష్యముల మూలమున విదితమగుచున్నది, దేశమున స్వాతంత్య్ర మస్తమించి రాజ్యము పర ​హస్త గతంబైన పిదసనే నా విమర్శక గ్రంథములు సహా కొంత క్షీణించినవి. 1882 వ సంవత్సరమున కమిషనర్ గానుండిన చార్లెస్ బర్నార్డు దొర గారు కు(Charles Bernard) దేశీయుల విద్యాభివృద్ధికై పాఠశాల నొకదానిని నెలకొల్పి దానికి దగిన పరికరములు సేకరించు సమయమున అధ్యాపకులకు సహాయ గ్రంథములతోను పరిశోధనకొఱకు కొన్ని గ్రంథ సంపుటములతోను నొకయనుబంధ గ్రంథ నికేతనము నెలకొల్పెను. కాలక్రమమున యాగ్రంథాలయము బర్నార్డు మహనీయుని నిరంతర కృషివలన విశేషాభివృద్ధి గాంచుటచే బర్నార్డు ధర్మ గ్రంథనిలయ మను నామముచే ప్రసిద్ధి కెక్కి యున్నది. ప్రకృతము నియ్యది బర్మా రాజ్యాంగపు వారి పోషణమున నున్నది. ఇదియే బర్మా దేశమంతటికిని కేంద్ర గ్రంథాలయము. భాండాగారమున రెండు మూడు వేల తాళపత్ర గ్రంథరాజములు గలవని గ్రంథ పేటికల మూలమున తెలియుచున్నది. దొరతనము వారి చేతను విద్వాంసుల చేతను సేకరింపబడిన గ్రంధ సంపుటము లన్నియు ముద్రితములుగాక పోయినను కొన్ని యైనను మరియే పుస్తకాగారము నందును లేనివి గలవని యా గ్రంథ భాండాగారి చెప్పెను. ఆ నికేతనమున నుండు సంపుటములను పండితులచే పరిశోధించి యపూర్వ పరిశీలనములు గ్రంథవివరములు విమర్శక వ్యాఖ్యానములు బర్మాపరిశోధక సంఘము వారి మూలమున ప్రకటితమగు మాసపత్రికయందు జర్చింపబడు చుండును.

ఇక్కాలమున దేశ భాషామూలక విద్య ప్రోత్సహింపబడు చుండినను గ్రంథముల జదివి రసమును గ్రహించువారి సంఖ్య యల్పమని చెప్పుటకు సంశయములేదని బర్మా సన్యాసి వుద్దండాగారు యాన ఇచ్చిరి. ప్రాథమిక విద్య నిర్బంధముగను యుచితముగను బ్రసాదించుటకు బర్మా విద్యాశాఖ వారివలన బ్రయత్నము లొనర్ప బడుచున్నవి. ఇంకను రూపు గనలేదుగాని శుభసూచకములు మెండుగా గానవచ్చుచున్నవి. వర్తమానకాలమున విద్యావిషయము లందు బర్మీయులు కొంత వెనుకబడియున్నారనఁట వాస్తవమైనను విద్యా నిధులగు ఆధునిక యుపాధ్యాయులవలనను నవీన పద్దతులయందు ​సహేతుక పూర్వకములైన అభినవజ్ఞాన శాస్త్రీయ గ్రంథ రచనలకు ప్రయత్నములు విరివిగా సాగించుచున్నారు. పాఠ్యగ్రంథ నిర్ణయ సంఘము వారుకూడ చేయూత నొసంగుచుండుట చేత కొలది కాలములో బ్రకృతివిషయ శాస్త్రీయ గ్రంథములు యుద్భవిల్లినవి. అయితే అది చాలదు. ఇంకను నెక్కువ కృషి యొనర్చునటుల కనబడుచున్నది.

బర్మారాష్ట్ర నిర్మాణ ఉద్యమమే బర్మీయులకు సకల ఆధునిక ఉద్యమములయందు పాల్గొనుటకు యుత్సాహ మొసంగుచున్నది. వారి సహజ అంధత్వమును వీడి యొక్క నూతన భావోద్రేకము వారి హృదయమున స్పందించుచున్నది. ఇప్పుడు యీ యుద్యమ ప్రచారమునకై "స౯" యను బర్మా దినపత్రిక బండులాయను వారపత్రిక తీవ్రపచారము సేయుచున్నవి. ప్రస్తుతము బహిరంగ యుపన్యాసము లెల్లను బర్మా భాషయందే యివ్వబడుచున్నవి. భాషావిషయమున తగవులు లేవు. భారతీయులవలె మతము నందు కులములందు కక్షులులేవు. స్త్రీలకు సమాన స్వతంత్య్ర ధర్మములు వెలయుచుండుట చేత బర్మీయుల ప్రయత్నావళి యనతికాలమున సాఫల్యము నొందునిని సూచించుటకు ప్రబల నిదర్శనములు గలవు.


- మా. సుబ్బరామయ్య




This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse