గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/సంచిక 4/అఖిల భారత గ్రంథాలయసభ
స్వరూపం
అఖిల భారత గ్రంథాలయసభ
ఆరవ అఖిలభారత గ్రంథాలయ ప్రతినిధులనుహాసభ డిశంబరు నెల ఆఖరు వారమున కలకత్తా పట్టణమునందు జరుగును. పలుకు బడిగలిగిన ఆహ్వాన సంఘము ఏర్పడినది. డాక్టరు రవీంద్రనాధ ఠాకూరు గారు ఆహ్వాన సంఘాధ్యక్షులుగాను, బిపిన్ చంద్రపాలు గారు, డాక్టరు కుమార నరేంద్ర నాధలా యం. ఏ. బి. ఎల్. గారును ఉపాధ్యక్షులుగాను, పండిత అమూల్యచంద్ర విద్యాభూషణ గారు కార్యదర్శిగాను ఎన్నుకొనబడిరి. ఈసభతో బాటు అఖిలభారత ప్రదర్శనముగూడ జరుగును. ఆంధ్రదేశ గ్రంథాలయసోదరు లందరును విచ్చేయబ్రార్థితులు.