Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/సంచిక 11-12/ఆంధ్ర గ్రంథాలయోద్యమము

వికీసోర్స్ నుండి

ఆంధ్రగ్రంథాలయోద్యమము ముందు కావలసిన అభివృద్ధి మార్గములు. ఇంత కాల మునుండియు ఆంధ్ర దేశమందంతటను గ్రంధాల యోద్యమమును గూర్చి జరిగిన కృషికి ఫలితముగ బ్రిటిషు ఇండియా యొక్క ఇతర ప్ర్రాంతములకంటె ఎక్కువ గాఢముగా పౌరగ్రంథా 2 లయములను గూర్చిన పరిజ్ఞానము ఈ దేశమున వ్యాప్తినొందినదని చెప్పవలసి యున్నది. జరిగినవని తక్కువ, జరుగవలసిన పని ఎక్కువ. ఇట్టితరి ఆంధ్రులు తమకర్తవ్యమును బాగుగా గుర్తెరిగి కార్యవిధానములను నిర్ణయించు కొనుటయు, దానిని కార్యాచరణలోనికి తెచ్చుటయు అత్యవసరము. లేనిచో ఇదివరకు జరిగిన కృషి యంతయు గూడ నిష్ప్రయోజన మగును.

ఇదివరకు మన దేశమున మారుమూలల గూడ గ్రంథాలయములు స్థాపింపబడి యున్నవి. పౌర గ్రంథాలయముల విధులేమో, ఇచ్చటి గ్రంథాలయములను నడుపువారలలో చాలమందికి తెలియును. వీనిలో అచ్చటచ్చట కొన్నిటికి స్వంతభవనము లున్నవి. కొన్నిటి యందు వేలకొలది గ్రంథములున్నవి. ఏకొద్ది సంఖ్యగల వానికైనను నిశ్చితమగు ఆదా యుండియన్నది. మన మ్యూన్సి పాల్టీలును లోకలు బోర్డులును గ్రంథాలయ నిర్వహణము తమ విధియని గుర్తెరింగిరి. దీని నంతను యాధార పరచుకొని మనము ముందంజ వేయవలసియున్నది.

ముందు జరుగవలసిన కృషి ఏదో ప్రథమమున నిర్ణయించుకొని, అటుపిమ్మట అందుకు సాధన విధానమును సూచించవలసి యున్నది,

గ్రంథాలయము యొక్క ప్రణము చదువరులు, వారి సంఖ్య యభివృద్ధి నొందుచు వారల విజ్ఞానము విశాల మగుచుండినగాని ఆసంస్థ శోభాయమానముగా నుండుటకు బదులు నిరుత్సాహకరముగా నుండును. కాన గ్రంథాలయాధికారులు ముఖ్యముగా చేయవలసిన విధి చదువరుల సంఖ్యను హెచ్చించుకొనుట. ఇందుకు అనేక మార్గములున్నవి. వాని నన్వేషించి కార్యాచరణలోనికి తేవలసి యున్నది.

విద్యాగోష్ఠులు, పోటీపరీక్షలు, తాత్కాలిక పాఠశాలలు, లిఖత మాసపత్రికలు మున్నగు సాధనముల మూలమున గ్రంథాలయపు చదువరులయందు అనేక విధములు జ్ఞానాభివృద్ధి చేయవచ్చును.

విద్యాగోష్ఠులను నేమో మొదట విచారింతము. కొందరు చదువరులు సారస్వత గ్రంథములు చదువుటయం దభిరుచి గలవారుగా నుందురు. మరికొందరు వేరొక విషయమునం దభిరుచి కలిగియుందురు. ఇట్లు ఏకవిషయమునందు పరిశ్రమ చేయగోరువారు ఒకగోష్ఠిగా జేరి ఏదో యొకగ్రంధమును గాని లేక ఒక విషయమును గూర్చి వేరు వేరు గ్రంథములనుండి గాని సవిమర్శకముగా విద్యాపరిశ్రమ చేయవచ్చును. అందుకు ఫలితముగ యొక సభను సమావేశపర్చి అందు గోష్ఠి సభ్యులలో సమర్థులైన వారు వ్యాసములను చదువవచ్చును. ఇట్టి వ్యాసములు కొన్ని చేర్చివాని నన్నిటిని ఆగ్రంథాలయము యొక్క లిఖతపత్రిక యను పేరిటప్రకటించ వచ్చును. ఎక్కువ సమర్థతను చూపగల వ్యాసములేవైన యున్నచో “భారతి” మున్నగు పత్రికలయందు ప్రకటించవచ్చును. ఈవిధమున గ్రంథాలయమునకు నూతనమగు విశాసము వచ్చును. ప్రత్యేకవ్యక్తులు వైదుష్యమునందు ప్రసిద్ధి జెందుదురు. ఇట్టిఫలము సిద్ధించినప్పుడే గ్రంథాలయములు సార్ధకమగును. భాష యభివృద్ధిజెందును. గ్రంథస్థమగు విషయములు విద్యావంతుల మూలమున ప్రజాసామాన్యమునకు కూడ వ్యాపించును.

పోటీపరీక్షలు మన యాంధ్ర దేశమందు మిక్కిలి పరిపాటిలో యున్నవే, విజ్ఞానచంద్రికామండలివారును నర్సాపురపు సంఘము వారును రాజమండ్రియందలి కొన్ని గ్రంథాలయముల పక్షమున పోటీపరీక్షలు జరిగినవి. సారస్వత విషయములనుగూర్చియు ఇతర విషయములను గూర్చియు పరీక్షలు జరుపుటయు ఉ త్తీర్ణులైన వారిలో అప్గ్రేసరులకు బహుమతు లొసంగుటయు ఈమూలమున జరుగు చుండెను. నర్సాపురపు సంఘము వారు ఇప్పటికిని నిరంతరముగ పరీక్షలు జరుపుచునేయున్నారు. తక్కిన సంఘములవారు జరుపు చున్నట్లు కనపడదు. తగిన సందర్భములుగల గ్రంథాలయములు ఇట్టి పోటీపరీక్షలను నెలకొల్పి చదువరులయందు విద్యాభిలాషను వృద్ధి పరచవచ్చును. కొందరు సామర్థ్యముగల విద్వాంసులు వారినుండి బయలు దేరుదురు. ఇక తాత్కాలిక పాఠశాలలను గూర్చి స్థలాంతరములు వివరించి యుండుటచే ఇచ్చట తిరిగి వ్రాయలేదు. వీనిని సాగించుటకు కున్న సాధనములనుగూర్చి యే ఇచ్చట వివరింపబడును. కృష్ణామండలము నొక దానిసి మాదిరిగా తీసుకొనవచ్చును. ఈ జిల్లాయందు 3 హైస్కూళ్ళున్నవి. మరియొక అయిదారు అసంపూర్తి హైస్కూళ్లున్నవి. వీనియన్నిటిలో ఏ నాలుగై దోతప్ప తక్కిన వన్నియు పల్లెటూండ్లయందే యున్నవి. ఈ పాఠశాలలయందు భాషా సేవాపరతంత్రులును దేశోద్ధరణకై బద్ధకంకణులు నెందరో యున్నారు. వీరిసహాయముతో ఆయా ప్రాతములయందున్న గ్రంథాలయ సంఘముల వారు తాత్కాలిక పాఠశాలలను స్థాపించవచ్చును. ఆమూలమున గ్రంథాలయముల మూలమున విధ్యాభివృద్ధి నొందించు కొనువారి సంఖ్య హేచ్చు చేయవచ్చును.

వీనికన్నిటికంటె ముఖ్యమగు విధి మరియొకటి యున్నది. దానిని వెంటనే ఆంధ్రగ్రంథాలయములు కార్యాచరణలోనికి తేవలసినవై యున్నవి. గ్రంథాలయపు వ్యవహారములు చక్కగ కట్టుదిట్టముల ననుసరించి జరుగుచుండిన గాని తగినచదువరు లచ్చటకు నాకర్షింపబడరు. అభివృద్ధికూడ జరుగదు. ఇందుకు ముఖ్యసాధనము తగిన తరిబీతుపొందిన గ్రంథ భాండాగారిని (librarian) నియమించుట ఈ తరిబీతు సామాన్య విషయమైయున్నది. మన దేశపు స్థితిగతులను బట్టి మనకు కావలసిన విషయములను బోధించుటకు ఆంధ్ర గ్రంథాలయ పక్షమున తాత్కాలిక పాఠశాలను స్థాపించవచ్చును. ఈతఁబీతు బొందుటకు యువకు లాకర్షింపబడ రేమోనని సందేహింపవలసిన పనిలేదు. ఉద్యోగమునకన్న వేరుశరణ్యము లేదనుకొనువారిలో కొందరికి ఈ మూలముగ కొంత మార్గమేర్పడును. భాషా సేవయు దేశ సేవయు చేసి ధన్యత గాంచదలచిన యువకులెందరో మన దేశ మధ్యమందున్నారు. కావున వీరందరును తరిబీతుపొంది గ్రంథాలయములయందు భాండాగారిక స్థానముయందుండి మనగ్రంథాలయములను తగినకట్టు దిట్టముల ననుసరించి నడుపుదురు. కావున మనగ్రంథాలయములు తమవిధులను తృప్తికరముగా నిర్వర్తించి తర్మూలమున దేశాభ్యుదయము చేకూరవలెనన్న పైన వివివరించిన విషయములను గమనించి వెంటనే కార్యాచరణలోనికి తెచ్చుట ముఖ్యావసరము,

- సూరి వెంకట నరసింహశాస్త్రి

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse