గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/సంచిక 10/శ్రీ సరస్వతీ నిలయము, తిరుత్తణి. (చిత్తూరు జిల్లా)
శ్రీ సరస్వతీ నిలయము, తిరుత్తణి (చిత్తూరుజిల్లా)
ప్రజలయందు విజ్ఞానో త్తేజములను గలిగించుటకు ముఖ్య సాధనములు పుస్తక భాండాగారములని చెప్పక తప్పదు. అట్టి పుస్తక భాండాగారములు దేశమం దనెకముగా విలసిల్లుచు మానవసేవ గావించు చున్నవి. ఈ యూరియందును అట్టి సత్సంకల్పముతో శ్రీ సరస్వతీ నిలయ మనుపేర నోక గ్రంథ భాండాగారము నెలకొల్పబడి సాగింపబడు చున్నది. భగవత్సన్నిధానములగు దేవాలయము లెట్లు మనకు ప్రార్థనామందిరములై భక్తి మోక్ష సామ్రాజ్యముల నొసంగుచున్నవో యట్లే గ్రంథ భాండాగారములు గూడ సరస్వతీ మందిరములై ప్రజాళికి విజ్ఞానసిరి సంపదలను సమకూర్చుచున్నవి. ఆంధ్రాంగ్ల ద్రావిడ గ్రంథములు 600 వరకు గలవు. భాషాభిమానులగు కొందరు యుదారభావముతో కొలదిగ మాసచందాల నిచ్చియు గ్రంథములను, వార్తాపత్రికలను నుచితముగ నిచ్చియు నాదరించుచున్నారు. గ్రంథాలయమును సక్రమ పద్ధతులతో సాగించుటకు ప్రస్తుత ముందు సాధనసంపత్తి చాలక యున్నది. అందరు సహాయము చేయ ప్రార్థితులు.
౼ బూదూరు రామానుజులు రెడ్డి