గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/పుదుక్కోట సంస్థానమందు గ్రంథాలయోద్యమము
పుదుక్కోట సంస్థానమందు గ్రంధాలయోద్యము
ఒక జాతియొక్క అభివృద్ధికిని సౌఖ్యమునకును ధర్మగ్రంథాలయమువంటిది మరియొకటిలేదు. పుదుక్కోట సంస్థానమందుగల 441 గ్రామములలో 32 గ్రామములందు మాత్రము గ్రంథాలయములు, పఠనమందిరము, స్థాపింపబడినవి. పల్లెటూరునందుఁడు ఉపాధ్యాయుడే గ్రంథభాండాగారిగా నుండుటకు తగినవాడు. అతఁడే దానికాధారభూతుడు. ఆ సంస్థానమునందుగల దాదాపు అన్ని గ్రంథాలయములును వారివారి గ్రామములందు గల బడిపంతుళ్ల వల్ల స్థాపింపబడిన వైయున్నవి. వారిశ్రద్ధ వల్లనే అవి పెంపొందుచున్నవి.
1. పట్టణములందు పెద్ద గ్రంథాలయములు గూడ గలవు. అట్టివి మూడు తాలూకా పట్టణములందు గలవు. పదు నెనిమిది సంచార గ్రంథాలయ పేటికలు విద్యాశాఖ వారివలన ప్రచారమునకు దేబడుచున్నవి.
2. చదువుకొనజాలని జనులకు జ్ఞానమును గలుగజేయుటకై కాలక్షేపములు, ఉపన్యాసములు మిక్కిలి ప్రయోజనకరములు. ఈ విషయమునగూడ యాగ్రంథాలయములు పాటుబడు చున్నవి.
ప్రత్యేకము స్త్రీలకొరకు రాజధాని పట్టణమునందొకటియు తాలూకా పట్టణములందు మూడును గ్రంథాలయములు గలవు. వానిని ఆయా గ్రామములందుగల ఉపాధ్యాయులే నిర్వహించుచున్నారు.
కొద్ది మాసములక్రిఁదటనే శ్రీ సూరి సింహశాస్త్రిగారి అధ్యక్షత క్రింద అయిదవ గ్రంథాలయ మహా సభ జరిగినప్పటినుండియు యా సంస్థాన గ్రంథాలయోద్యమము నందొక నూతనశకము ప్రారంభమైనది. సలహావలన కేంద్రగ్రంథాలయ స్థాపనము జరుగు చున్నది.
గ్రంథాలయోద్యమము వలననే జ్ఞానభిక్షు జనులకు లభ్యము కాగలదు. గ్రంథాలయోద్యమమువలననే జాతి అంతయు ఒకే మాటమీద నిలువబడగలదు. గ్రంథాలయోద్యమమువలన జీవసహితమైనట్టియు, స్థిరమైనట్టియు, ఐకమత్యము చేకూరగలదు. గ్రంథాలయోద్యమము వలననే భారతవర్షము ఇతర జాతులయందు తన యర్హస్థానమును పొందగలదు.