Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/పల్నాటి వీరచరిత్ర (కీర్తనలు)

​

పల్నాటి వీరచరిత్ర

[1]
౧

దేశగౌరవము దీపింపగా తమ దేహమ్మలు గోసి

వీర - వేశంబున బోరి
రక్త - పోశనములు బట్టి

ఆశ మెయిన్ తలిదేశఋణంబును దీర్చిన వీరులనూ

తల్లీ! వేడుక - వినుతిఁతూ
౨

అంధ్రవీరులకు ఆభరణంబయి అమృతకిర్తిమించీ

రణమున - ప్రాణము లర్పించీ
వీరా - స్వర్గము సేవించీ

నరులును సురలను నవనవ కవితల నతులీయగ వెలసీ

శూరుల - నయగతులను నిలిపీ.
3

వెలిగిన బాలుని వీర చరిత్రము వీరుల కింపైన

తీయని - పలుకుల సొంపెన
రసములు - గులుకగ సొగ సైన

లలితపు శైలిని వలతితవంబులు కలితముగా గూర్చు

తల్లీ! ధన్యత చేకూర్చు
४

అతిరమ్యంబగు నాంధ్ర దేశమున నలరాడు వీడూ

ఇంద్రుని - అమరావతితోడూ
ధనదుని - ఆలకాపురి జోడూ

వ్రతముల క్రతువల పాడిపంటలను వర్దిలెడి ణేడు

వీరులు - పుట్టిన పల్నాడూ
. ​
౫

అందు సమీపమునందు మనౌహర మందమందగతుల

కెరటము - అందమైన పాటా
ఎప్పుడు - ఇంపుగాను బాడా

సందడి పారెడు నాగులేరు జగు లందరు సేవింపా

గంగా - నందని యని పిల్వా.
౬

యేటికి యిటునటు సొంపారగ సమరారెడు నగిరీ

బంగరు - పరిమళములు చిమ్మా
భూమిని - పొందగు మాచెర్లా

తేలియక యేలిరి పౌరుషవంతులు పేరెన్నిక గాంచా

ధర్మము - వసివాడక యుండా.
౭

మరల మంత్రిశిఖామణియై కడు వాసిగాంచి మించె

బ్రహ్మో - నాయడు తరియించె
బ్రాహ్మణభక్తిని మితిమించే

నారాయణపద నలినమ్ముల మది నమ్మి సుకృతిగాంచె

కీర్తిని - దిక్కుల గీలించె.
౮

గట్టి కదనంబున శత్రుల కడికండలు సేయా

మిత్రుల - కరుణ నభయమీయా
ధాత్రికి - దుష్టభయము బాయా
   పథమున ఒక కాల్పాలకు ఒక కాల్మంటలనూ
పెట్టీ - నీతిని వెలయించె.
౯

కీర్తిని అడవులలో బోయలం గూడను బాడా

సరిరా - జ్యంబుల వ్యాపించీ
సరిలే - దంచును మతిగాంచి
 స్వర్గము గల్పించెను అతిపణ్యవంతమౌచూ
మత్రుల - మల్లెదండయగుచూ
౧౦

శ్రీనాయని భార్యారత్నము పరమ సుగుణవల్లి

ఐతకు - భాగ్య కనక వల్లీ
వీర కు-మారులకును తల్లీ

సతీపద పద్మ సమార్చన భాసిల్లిన మల్లీ

లాపకుల - మతెల్లీ
౧౧

అర్హుల కీయ నన్నపూర్ణయని అందరు కొనియాడా

ఆబలల - కందరాని యశమూ
ఐతమ - ప్రీతిని గడియిఁచీ

వర్ణిలె పుణ్యనివాస మనంగను వడివంకలు లేనీ

నడవడి పడతులు ప్రేమింపా.
౧౨

చేసినపూవుల చిత్తిపూజలును శ్రీపతిసేవలుమా

నోచిన - ఆచ్చపునోములునూ
పంచిన - పండ్లువాయనములు౯

వాసి ఫలింపగ ఐతమగర్భము భాసురముగ పండెన్

తండ్రులా - కోర్కెలెల్ల నిండె౯
౧౩

మహనీయుండగు ఐతమపుత్రుడు మహిపై బడువేళ౯

గ్రహములు భగభగ తెగమండెన్
దిక్కులు గడగడ కడు వడికెన్

దహనుని ప్రళయము తాకిన పగిదిని దద్దరిల్లె జగముల్

శేషుడు - తలలు వంగ జింకెన్.
౧౪

ఆబాలుని శీరోదయ సమయమునందుపడిన నీరూ

హేమ మ - యంబగు మేడలనూ
రత్న భ - రంబగు గోడలమా

ప్రాబల్యంబున పగులకొట్టుకొని పాతాళము కేగె౯

భూమియు - బ్రద్దలగుచు లోగె౯
౧౫

వీరుడు వీరుడు వీరుడటంచును వితికంఠమెత్తి

రభసము - రాపాడెడురక్తి
సభమున - వినిపించెను వాణి

పారిజాతములు జోరుగగురిసెను పరిమళములు పొదలా

పౌరుల - వేడుక లఁప్పొంగా
౧౬

కానక కన్నకుమారుని గాంచియు కన్నులపండువు గా

సలిపిరి - దానములను తండ్రుల్
కొలిచిరి - కులపతులను పౌరుల్

తెలిపిరి బాలుండితడని భూసుగతిలకులు మంత్రోక్తి౯

సభ్యులు సంతసింపరక్తి౯
​
౧౭

దిన దిన మొకపొందికయగు అందము తేటదేరిమెరియ

అవయవ - నవ్వరుచులు విరియ
నిద్దపు - చక్కదనము లొరియ

గొనబారెడి ముఖకోమల కాంతులు కొదమపన్నె లీన

ఐతిమ తనయు డెదిగే నిటులా
౧౮

బాలుని బాల్యము పసిడియుయాలల భాగ్య సౌధములలో

పూచిన - సంపగి పూభంగి
మొలిచినా - కనక శేఖరీతీ

లాలించిరి కడుగారాబంబున లీలల జోలలతోన్

ముద్దుల - సోలించిరి తమితో౯
౧౯

పన్నెండేండ్ల కుమారుని ప్రాయము పడుచుదనమురాగా

మిసమిస - పన్నెలొలుకబాగా
మొగమున - పొగరుతీగెసాగా

నున్నని మీపము నూనూగుగ మొలకెతి మోజులీ నె౯

సాగసాక - సోగఠీవిదే౯
౧౦

ఈడువచ్చి కళలీనెడి బాలుని ఇంపుసొంపులరసి

పెండ్లికి - వేడుకపడి మురిసీ
జనకులు - బాంధవములు తెరచీ

ఈడును జోడును కులశీలములును కూడినరాజింట౯

కన్యను - తోడుదెచ్చి రుత్కంఠ౯
౨౧

మగువమాంచాలకు మానధరుండుగు సొగసులబాలునకున్

జరిగెను - మంగళ కార్యములూ
మొరసెను - శోభన వాద్యములూ

తగినవధూవరులంచును చూపరు లగణితముగ బొగడ

బ్రాహ్మణ - దీవనలును మిగులా
౨౨

కలిసె బాలునకు కర్మవశంబున కామిన సబ్బాయీ

ఆచెలి - వలపులలో దగిలీ
మరచెను - మగువను నంచాల

వెలసఖి పలుకులు కులంకులు తళుకులు వింతమందులగుచూ

బాలుని - మనసు విరిచి వేయా
౨౩

తాళిగట్టి తను బాసలుజేసిన ధర్మపత్ని మంచాల౯

బాలుడు - దరిశియేరుగడాయె౯
సబ్బాయి - తన్నువిడువదాయె౯

తన కర్మంబని దైవకృతంబని ధర్మపథము విడక

ఆయమ తపసు జేయుచుండే౯
౨౪

తెల్లనికోకలు తీరిచికట్టదు మల్లెపూలసరుల౯

మెడలో - కొల్లులుగానిడదూ
ఎదలో - మల్లాసముగనదూ

సల్లాపింపక మాసినమెయితో చాన గడుపు దినముల్

భ్రమరము రానిపూవు పోల్కి౯
౨౫

ఆట బాలుండొకనాడుదయంబున ఆటల తమకమునా

సహచరు - లందరు కుతుకమునా
తనతో - చనుదేరగ వీధీ

నీటుఁగోటుగ బొంగరాలాటకు బాటించిరి వేడ్క౯

పకపక - లాడుచూరిబైట౯
౨౬

నిమ్మలబావికి నీరుదెచ్చుటకు నెలతలేగుదెంత్రూ

వారిలో - వైశ్యవనితె యొకతే
బాలునీ - వాలకమునుజూచీ

సమ్మదమంగుచు నిమ్మళముగ నట జనుచునుండె నంత౯

బొంగ్రము - సఖియచరణమంటె౯
౨౭

తాకిన బొంగ్రపుదెబ్బకు వనితయు తల్లడిలుచుగూలీ

కోపము - దహియింపగ కీనిసీ
తహ తహ - పొరలాడుచులేచీ

తాళలేక బాలచంద్రుని దిట్టుచు తరుణులెల్లమూగ౯

వల వల - ఏడ్చుచు గొంతెత్తి
౨౮

ఓరిమదాంకుడ, ఓరినరాధను ఓరికులద్రోహీ

నీకీ - చేటుకాలమేలా
కన్నుల - కింతపొగరుమేలా

ఆరయజాలవు కండకొవ్వున కులగౌరపములు నేనీ

పౌరులా - మరియాదను గానీ
౨౯

వారవధూటికి ఆడుగులొత్త నలవాటుపడిన నీవూ

సెండ్లము - నెడబాసిన నీవూ
తండ్రుల - గతులెరుగని నీవూ

క్రూరుడవై కులకాంతా జనములు కొట్టసాగినావే

ఇంతటి - దగునెనీదుచేనా
​
30

చండసమరమన నాయకురాల్ నీతండ్రులచెండాడా

పన్నిన - వ్యూహఁణులజిక్కి
సడలిన - సాహసములదక్కి

బెండుగ బొంగరాలాడదు దండియింటా బుట్టి

నడుమున - వీరకాశెగట్టీ
౦౧

అనికోమటీసతి తెగబడి తిట్టిన ఆలకించి బాలుం

డెదలో - కరుణరేకు లెత్తిన్
తోడ్తో - దుఃఖభరము లొత్త౯

వినయంబున నాసతి జేరంగబని ఆనెయె సాశ్రమక్తి౯

అండరు - నాలకింపభక్తిన్
౩౨

తల్లి ఐగుదువో తరుణీరత్నమ దయజూపుము నాపై

తెలియని - అపరాధము సైచీ
నాపై - తగిన శిక్షవైచీ

కల్లగావు సల్లాపంబులు కనికారముతో వినుమూ

దైవము సాక్షి నిజము గనుమూ
౩౩

ఆటల మోజున నయ్యె ప్రమాదము ఆత్మకినియబోకూ

చేసెద - నుపచారము నీకూ
కలహము - పలికి పైకతేకూ

గాటపు నిందరు బాపికొనంగను కల తెలగును మాకూ

తెలుపుము - వందనములు నీకూ
౩౪

అనుతాపంబున బాలుండాడిన ఆమాటలు విన్నచూ

జనములు - ఆశ్చర్యముగనుచూ
బాలుక - డింతయున్నె యనుచూత్ర౯

పెనబడిపలుకుచు మొగమొగములుగనుగొనుచు పోయిరం

కోమటి - కోమలిపైచింత౯
౩౫

అంతట బాలుండంతరంగమున నాందోళము బడుచూ

సారకు - వైశ్యవనిత పలుకుల్

తనమది - ములగులగుచు తగుల౯ చింతావశుడై తల్లి యైతమను జీరబోయవేగ౯

సంశయా - భావము లెదరీగ౯
౩౭

వచ్చిన బాలుని గనుగొని యైతను హెచ్చిన సుప్రీతి౯

కన్నుల - కౌగలించి ప్రేమ౯
కుశలము - లడిగి గారవమున౯

మెచ్చుల పీఠమునిచ్చి కనుంగవ విచ్చిన బాష్పముల౯

నిలిచెను - ఆనందాలసయై
'౩౮
'

బాలుంయ్యెడ సాష్టాంగయి భక్తిసలిపీ తల్లి౯

ఆయా - మాటలాడి పలికె౯
చిత్తము - నుత్తరించు కలకి౯

తల్లీ! యడిగెదనొక యార్ధ్రంబును దాచక యెరిగింపూ

వీరులా - గన్నఫలము నింపూ
౩౯

ఎక్కడికగిరి నాజనకులు రణమేల దాపురించే

కలసిన - నీరు పాలవలెనూ
మెలిగిన - అన్నదమ్ములేలా

చిక్కుకొనిరి యా నాయకురాలికి దిక్కుమాలి యకటా

తల్లీ! - చెప్పు మేలదాచా
౪౦

కాకలు దీరిన గండునుగలతో కారెమపూడెపుడు

తీవ్రపు - కదనరంగమయ్యెక్
కత్తుల - వియ్యమెట్లు గలసె౯

నాకానందము నానాలాడగ చెకోని వినుపింపూ

వీరులా - ధర్మము నెరిగింపూ
౪౨

శూరూలకిరవగు నీపుట్టింటికి విరవాసమైనా

ధైర్యపు - జీవగడ్డయైనా
పరువాగు - నిపల్నాటికినీ

పేరుమాపు నీపిరికి విదంబులు చేరనీయబోకూ

నీమది - వీరమాతనగుచూ



  1. ↑ ఈ కీర్తనములు ఒక స్నేహితుని ఇంటియందు ప్రాత కాగితములందు దొరకినవి. ఏ కాలమునాటివో తెలిఁయక ప్రాచీనకవికృతములై యుండుననుటకు సంము లేదు. శ్రీనాథ మహాకవియే దీనిని రచియించి నోపునని పలువురు స్నేహితులు తలంచుచున్నారు. మిక్కిలి రసవంతకులుగా నుండుటచే ప్రచురుణకు బంపితిమి, మిగిలిన భాగము ఎక్కడనైన దొరకినయెడల దానిని పంపిన మిక్కిలి కృతజ్ఞతతో ప్రచురించుటకు ఆంధ్రదేశమునకు అట్టి భాగ్యము జేకూరుగాకయని భగవంతుని ప్రార్థించుచున్నాము.