గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/గ్రంథ భాండాగారి
గ్రంథ భాండాగారి
[లండను నగరమందు జరిగిన పల్లెటూళ్ళగ్రంథాలయ ప్రతినిధుల మహాసభయందు కలనల్ మిట్ ఛాల్ నుడివినది]
పురుషుడైనను స్త్రీయైనను గ్రంథభాండాగారిగా నుండువాడు తాను చేయు పనియొక్క ఉత్కృష్టతను గ్రహించింవాడై విద్యావంతుడై ఉండవలెను. గ్రంథాలయ శాస్త్రమును కొంతవరకైన అభ్యసించి యుండవలెను. వీనియన్నిటికంటెను ముఖ్యమైనది గ్రామస్థులు విశ్వాసమును పొందినవాడై యుండి అర్హతను బట్టి ఏమనిషికి ఏగ్రంధము కావలయున ఆమనిషి కాగ్రంథమును అంద జేయుటకు సాధ్యమైనంత శ్రమను తీసుకొనువాడై నుండవలయును. విద్యాశాఖ ఉద్యోగులు, ఇతర సంఘములు మొదలగువానితో ఎక్కువ సంబంధమును కలిగి యుండయేగాక గ్రామస్థుల యొక్క సాంఘిక అవసరములను జ్ఞానసను పార్జనా విసరములను గ్రహించి యుఁడవలయును. అక్కడివర్తకములను పరిశ్రమలను ఆతడు పరిశీలించి ఉద్యోగనులు చేయువారికి పౌరులకు మొత్తముమీద అందరికి ఉపయోగ పడునట్లుగా ద్రవ్యమున్నంతవరకు గ్రంథములను తెప్పించి అందజేయవలయును. అతడు వెనుకటికాలపు గ్రంథభాండాగారికి యుండు ఆచారములను పూర్తిగా వదలివేసి అవసరమైన గ్రంధములకు ఎక్కువ ప్రతులను నుంచుచు అరల యందుండు ఏ గ్రంథము గాని వృధాగా పడియుండకుఁడు నటుల జూడవలెను.
ముఖ్యముగా ప్రారంభ సంవత్సరములందు అతడు తన గ్రామమంతయు తిరుగుచుండవలయును. పగటిగంటలు తక్కువగా నుండునట్టియు, ప్రయాణము చేయటకు కష్టముగానుండునట్టియు శీతాకాలమునందు అతడు ఉపాధ్యాయులను కలిసికొని ఉపన్యాసములు నిప్పింపవలయును. ప్రయాణ సౌకర్యము చౌక అగునటుల చేయవలయును. రుచినిబట్టి స్వాభివృద్ధిని జేసికొనుటకై చదువునెడల ప్రేమను పుట్టించుటకు గాను దేనినైన చేయగలవారి తోడ్పాటును దీనికోనవలయును. "డ్యూయీ" డెసిమల్ వర్గీకరణపద్ధతిని గాని, లేక "కలర్టు" గ్రంథవిభజన పద్ధతిని గాని దేవాలయమందలి దేవునివలె పూజించు గ్రంథభాండాగారివలన ఎంతమాత్రము ప్రయోజనములేదు. అట్టి గ్రంథ భాండా గారికి గ్రంథాలయమందుగల ప్రయోజనము ముఖ్యముగా స్వార్థమగుటిచే అతడు స్వల్పజీతమును తీసికొనవచ్చును. గడ్డి సమృద్ధిగా గలిగియుండిన బీరునందుండియు మేయజాలని ఆవువలె అట్టివాడు నిరర్థకుడు. రెండువందల గ్రామాదులు తిరిగి బోధకునివలె పని చేయవలసియుండి ౧౪ మొదలు ౯౦ సంవత్సరముల వరకు గల జనుల అవసరములను తెలిసికొనగలిగిన చురుకైన వానికి అల్పజీతమిచ్చుట అవివేకము.
చాలస్థలములయందు గ్రంథభాండాగారికి సహాయకడుగూడ నుండుట అవశ్యకము. ఇద్దరున్నప్పుడు వంతులు వేసికొని గ్రామములను చుట్టివత్తురు. సహాయకుని జీతమెంతయో నిర్ణయించుటకు ఇంత త్వరగా వీలు లేదు. ముందు ఒక పద్దతి ఏర్పడిన కొలదియును, దాని అంతట ఆదియే నిర్ధారణ కాగలదు.