గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/కేంద్ర గ్రంథాలయము
కేంద్రగ్రంథాలయము
మనదేశమున అప్పుడప్పుడు జరుగుచున్న గ్రంథాలయసభలకు వెళ్లుచుండెడి ఏ సామాన్య ప్రేక్షుకుడైనను ఇట్టి సభయందును "కేంద్ర గ్రంథాలయములను” గూర్చి తప్పక చర్చింపబడుచుండుటయు అందునగూర్చి ఏదియో ఒక విధమగు తీర్మానమును చేయటయు గమనించియేయుండును. ఈ విషయమును గూర్చి గ్రంథాల మోద్యాభిమానులు ఎక్కువ ఆసక్తితో కృషిచేయు చుండుట కడశుభావహము. పేద గ్రంథాలయమన నేమి! దాని నిధు లెవ్వి' ఆది సంయుక్త విధానమునను ననుసరించి నిర్మాణము కావలెనా? అట్లుకాదా? అనుబంధ గ్రంధాలయములకును కేంద్ర గ్రంధాలయములకును అన్యూన్య సంబంధ మెట్లుండవలెను? కేంద్ర గ్రంథాలయము, గ్రంథాలయోద్యమాంతర్గతమగు పనులలో వేనిని నిర్వర్తించవలెను? ఈపనులను నిర్వర్తించుటకు అవలంబించిన సాధన విధానమెద్ది? కేంద్ర గ్రంథాలయ సంఘమందు సభ్యులుగా నుండదగినది ప్రత్యేక గ్రంథాలయములు మాత్రమేనా, లేక ప్రత్యేక వ్యక్తులు కూడ ఇందు సభ్యులుగా నుండ వచ్చునా? ఈ సంఘము యొక్క కార్యనిర్వాహకవమును నిర్మాణము చేయుట ఎట్లు? ఈ యుద్యమమున కృషి చెయు వారందరును పైన చెప్పిన విషయములను గూర్చియు ఇందుకు సంబంధించిన ఇతర విషయములను గూర్చియు కొంతకాలమునుండి తీవ్రముగా చర్చించు చున్నారు, కావున గ్రంథాలయోద్యమాభివృద్ధి యొక్క అభివృద్ధిని గూర్చి చేయు ప్రయత్నములలో కేంద్ర గ్రంథాలయ నిర్మాణము ప్రాధాన్యమువహించి యుండుటచే ఇందును గూర్చి నజ్ఞానము దేశముందు విరి విరివిగా వ్యాప్తి నొందుట మిక్కిలి అవసరమును ఆవశ్యకమునై యున్నది.
పైన చెప్పబడిన ప్రశ్నలకు తూచినట్లు వెంటనే పత్యుత్తరమిచ్చుటకు వీలులేదు. అన్ని ప్రదేశములకు వర్తించిగల ప్రత్యుత్తరముల నిచ్చుటకు కూడ వలనుపడదు. దేశకాలపాత్రయుల ననుసరించి ఈ జబాబులు మారు చుండును. ఆట్లయ్యును అన్ని కేంద్ర గ్రంథాలయములకును వర్తించగల సామాన్య ధర్మము లుండకపోవు. కావున ప్రపంచమందలి వివిధ దేశములయందును "కేంద్ర గ్రంధాలయము లెట్లు కృషి చేయుచున్నవో ముందుగా మనము తెలుసుకొని అందునను సరించి మనదేశపు కేంద్ర గ్రంథాలయముల నిర్మాణమునకు మనము పూనుకొనవలసి యున్నది.
ప్రధమమున బరోడా రాష్ట్రమందలి కేంద్ర గ్రంథాలయముల గూర్చి విచారింతుము. "తన దేశ ప్రజల నెట్లు అభివృద్ధి నందిచేదనా" యని బరోడా రాష్ట్రది శులగుశాయాజీగాయక్వాడీగారు అహర్నిశమును మననము చేయుచుందురు. 1910 సంవత్సరము" ఆమెరికాఖండమున గైక్వార్డ్ గారు పర్యటన చేయుకాలమున ఆదేశమునందలి సర్వసామాన్యనుగు ప్రజలయందు కూడ వ్యాపించియున్న 'గ్రంథాల యోద్యమము" ను శ్రీ వారు గమనించి జ్ఞానాభివృద్ధి పొందవలెననెడి యట్టి యాసక్తేయ తన ప్రజలకుకూడ కల్గించుటకు ఆయన సమకట్టెను. శ్రీ వారు ఇంకను స్వదేశము చేరక పూర్వమే ఇందుకు తగిన పనిని పూనుకొనుటకై అమెరికా ఖండ వాస్తవ్యలు బోర్డును గారిని బరోడా రాష్ట్ర మందు నలుదిసలను “ధర్మ గ్రంథాలయోద్యమమును” సర్వాంగసౌష్టవముగ వ్యాపింపచేయటకు నియమించి అందుకు తగిన సదుపాయములను వెంటనే ఏర్పడిచిరి. బోర్డును గారు బరోడాయందు "కేంద్ర గ్రంథాలయ" ప్రతిష్ఠాపనను నిర్మాణముచేసి దానిని కేవల బరోడారాష్ట్రమునకే గాక ఆఖిలభారతదేశమున కంతకును ఆదర్శప్రాయముగను ఆశ్చర్యప్రదముగను చేసిరి. దేశమందలి పరిస్థితులను వివరముగా గమనించి ప్రాప్యమును పొందుటకు తగిన కార్యవిధానమును నిర్ణయించుట మొదటపని. ప్రధమమైన "బరోడ కేంద్ర గ్రంథాలయ ప్రతిస్థాపన" నిర్మాణము చేయబడినది. ఈప్రతిస్థాపన యొక్క యాజమాన్యమును రాష్ట్రమందతటను నలుదెసలను ఉద్యమము దట్టముగా వ్యాప్తి నొందించబడినది. నను ?
బగోడా ప్రాంతముతో చేరి బరోడా రాష్ట్రము 4 ప్రాంతములు (లేక సుబాలుగా) విభజింపబడియున్నది. ఇవిగాక 38 ఇతర పట్నములును, 426 పల్లెటూర్లను ఇంకనెన్నియో చిన్నపల్లెళ్లను ఈ రాష్ట్రమున గలవు. బరోడా రాజధానీనగరమున సర్వాంగ సౌష్టవమగు కేంద్ర గ్రంథాలయముండునట్లు నిర్ణయింపబడినది. ఇందుకోశములు మొదలగు యద్గ్రంధములు (Reference section) తోనిండిన ప్రత్యేక శాఖ ఏర్పరుపబడినది. ఇందలి గ్రంధములను రాష్ట్రమందు గ్రంథాలయముల వారందరును తగిన కట్టుదట్టములకు లోబడి తెప్పించుకొని ఉపయోగపర్చుకొనవచ్చను. తక్కిన మూడు ప్రాంతముల ముఖ్యపట్టణముల యందును ఇట్లే 20,000 గ్రంధములు గల కేంద్ర గ్రంథాలయము లుండునట్లు నిర్ణయించబడినది. 36 పట్టణములలోను ఒక్కొక్క పట్టణమున 5,000 గ్రంధములు గల గ్రంథాలయములు నిర్మాణము చేయవలెనని నిర్ణయింపబడినది. పెద్ద పల్లెల గ్రంధాలయముల యందు ఒక్కొక్కదానియందు 500 గ్రంధములును చిన్నపల్లెలలో 200 గ్రంధముగల గ్రంధాలయములును యుండవలెను. "ప్రతి పట్టణమందును పల్లెలయందుగల ) గ్రంధాలయాల సంఘము స్వపరిపాలనగలదై యుండియు కేంద్ర గ్రంథాలయముం వరకును అనోన్యసంబంధముకలదై క్రింది తరగతి ప్రతిష్టాపనపై పైతరగతి ప్రతిష్టాపరకు పైలినిఖీ కనుక్కొనునట్లుగా ఈ పెద్దనిర్మాణమందంతటి యందును అన్యోన్యాశ్రయధర్మము ప్రతిష్టింపబడినది. “అన్ని గ్రంథాలయములను ప్రతిపౌరుడు దర్మముగా యుపయోగించుకొనవచ్చును. పైన చెప్పిన విధానము ననుసరించి ఏకగ్రామవాసియగు ఏ పౌరుడైనను రాష్ట్రమందలి ఏ గ్రంధాలయ మందున్న ఏట్టి యద్గ్రంధము యొక్క యైనను ఉపయోగమును అతి సులభముగా పొందగలడు. రాష్ట్రమండలి ఈ మహవుద్యమమంతయు కేంద్ర గ్రంధాలయ ప్రతిస్టాపన యాజమాన్యము క్రిందనే నడుపబడుటకు తగిన సదుపాయములతో ఉద్యమునిర్మాణము ప్రారంభింపబడినది. పైనవివరింపబడిన ప్రణాళికనుబట్టి సాక్షరకుక్షులకు మాత్రము విద్యాభివృద్ధి చేకూరును. ఇంక నిరరక్షరకుక్షుల గతి ఏమి కావలెను? ప్రత్యేముగా యొక గ్రంధాలయమును భరించలేని చిన్నపల్లెటూర్లు ఎన్నియో కలవు. పట్టణములలో గూడ గ్రంథాలయముల కందుబాటులో లేని ప్రజలెందరో నున్నారు. ఇట్టిప్రజలందరి యుపయోగము కొరకును కార్యవిధానము వేరుగా అవలంబించి వలసియున్నది. బరోడా కేంద్ర గ్రంథాలయమున కనుబంధముగ సంచార గ్రంధాలయ పేటికాలు ఏర్పరుపబడినవి. ఈ పెటికలయందు సర్వజనుల అభిరుచులకు దగినట్లు వివిధాంశములను గూర్చిన గ్రంధములుచబడి ఆన్నీ ఉపయోగించుకొనదగిన చదువరులున్న చోట్లకు పంపబడుటకు ఏర్పాట్లు చేయబడెను. ఈ పెట్టలు చులకనగా ఒక చోటనుండి మరియొక చోటుకు తీసుకొని వెళ్ళుటకు వీలుగా నుండునంత తేలికగా చేయబడినవి. 1923 సంవత్సరాంతముకు ఇట్టి పేటికలు 350 యుండెను. వీనిలో పెట్టుటకు ప్రత్యేకము 11,546 గ్రంధములు ఏర్పరింపబడియుండెను. ఆ సంవత్సరమున రాష్ట్రమందలి నలుదెసలయున్న 166 సెంటీమీటర్స్ ద్వారా 5726 ప్రజలకు 11,546 గ్రంథములను పంచిపెట్టబడినవి. ఇంత విశ్వప్రయత్నములు చేసినాను విద్యగానము తగినంత ప్రజలకు చేయుటకు వీలుకలగక పోయెను. ప్రజలందరికిని చదువురాదుకదా వీరలకు ప్రతేక్యకపు ఏర్పాటు చేయవలసియున్నది. వీరలకు ఉపయోగ ముకొరకు సినిమా, బయస్కోపు మొదలగు సాధనముల మూలమున ప్రజల జ్ఞానాభివృద్ధి చేయుటకు ప్రత్యేకముగా కేంద్ర గ్రంథాలయ ప్రతిష్ఠాపన యొక్క యాజమాన్యము క్రింద ఒక యిలాకా ఏర్పరుపబడినది. మరియు సర్వజనులకు తెలియునట్లు ఉపన్యాసముల నిచ్చుచు అందలి యఁశములకు దృష్టాంతముగా నుండునట్లు యంత్రసహాయమున విషయములు ప్రదర్శింపబడుచుండెను. ఈ విధమన నెంతయో కృషి జరిగి జ్ఞానదానము చేయబడినది.