Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/కాస్జీధంజీభాయి గ్రంథాలయము

​

కాస్ జీధంజీభాయి గ్రంథాలయము

గాందేవి, మహారాష్టము

రాష్ట్రమందున్న జిల్లా పట్టణమగు గాందేవి యందు ఈ గ్రంథాలయము 60 సంవత్సరముల క్రిందట కొంతమంది పౌరులచే స్థాపింపబడినది. ఆకాలమున అసలు విద్యావ్యాపకమే తక్కువ. పెద్దల విద్యాభివృద్ధికి గ్రంథాలయము తోడ్పడునను యభిప్రాయము అసలే లేదు. అట్టికాలమున గ్రంథాలయమును స్థాపించట మిక్కిలి ప్రశంశనీయమైన సంగతి.

ఇప్పు డీగ్రంథాలయము మండల గ్రంథాలయమై మండేలాభివృద్ధికి విశేషముగా గోడ్పడుచున్నది. బరోడా ప్రభుత్వమునుండి గ్రాంటు నుపొందుచున్నను, గ్రామస్థులచేతనే పరిపాలింపబడుచున్నది. పదిసంవత్సరములలో ఈగ్రంథాలయమందున్న గ్రంథములు 1000 నుండి 7,000 లకు వృద్ధియయ్యెను. దీనికి రు.17,000 విలువగల స్వంతభవనము గలదు. మూలధనము 7,000 గలదు.

తాలూకాయందున్న గ్రామము లన్నింటీయందును గ్రంథాలయములను స్థాపించుటకై ఈ గ్రంథాలయ నిర్వాహకులు విశేషముగా పాటుబడుచున్నారు.



కాశీ ధంజీభాయ్ గ్రంథాలయము, గాందేవి, బరోడా రాజ్యము


కాస్ జీ ధంజీ భాయి గారు,
గ్రంధాలయ భవనమును కట్టించినవారు

.