గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/ఈ ప్రపంచమునందెల్ల గొప్ప గ్రంథము
ప్రపంచము నందెల్ల గొప్ప గ్రంధము
ప్రపంచమునందున్న గ్రంథములందెల్ల గొప్ప గ్రంథము చీనాదేశమందు ఉద్భవిల్లిన విజ్ఞానసర్వస్వమను గ్రంథము. ఈ గ్రంథము 11,100 సంపుటములుగా వ్రాయబడినది. ఈ సంపుటములలో రెండు ఇటీవలనే లండను గ్రంథాలయమునకు జేరినవి. చైనాదేశ పండితమండలి చేత తయారు చేయబడిన ఈ గొప్ప గ్రంధము 1900 వ సంవత్సరమున "బోక్సరు” నందు జరిగిన తిరుగుబాటు యుద్ధమునందు నాశనమైపోయెను. అక్కడ నున్న కాలేజీకి తిరుగుబాటుదారులు అగ్నిని పెట్టగా ఆ కాలేజీయందున్న ఈగ్రంథము నుండిపోయెను. ఆకాలేజీ భవనము యొక్క శిధిలములనుఁడి ఈ మహాగ్రంథము యొక్క కొద్దిసఁపుటములు మాత్రము సంరక్షింపబడినవి. చైనాదేశమునకు 1860 వ సంవత్సరమునుండియు విదేశీములను రానిచ్చుచుండినను, ఈ గ్రంథమును మాత్రము వారిని చదువుకొననిచ్చెడివారుగారు.
చైనా దేశము నేలిన రాజులలో ప్రముఖుడగు “యంగులో” ఆను పేరుగల రాజు ఈ గ్రంథమును వ్రాయింప 1403 సంవత్సరములో దలపెట్టెను. "హేచిన్” అను గొప్ప పండితుని రావించి, ఈమహాగ్రంధమును తయారు చేయవలసినదని ఆజ్ఞాపించెను. ఆయన 146 మంది పండితుల సహాయముతో 16 మాసముల కాలములో గ్రంథమును ముగింపగలిగెను. కాని రాజు గారికి సంతృప్తిని గలిగింపలేదు. అందుచేత తిరిగి మరియొక గొప్ప గ్రంథము తయారు చేయుటకై మూగ్గురు అధిపతులను, అయిదుగురు సంపాదుకులను, ఇరువది సహాయ సంపాదుకులను ౨౧౪౧ మందిని సహాకారులను ఏర్పరచెను. వీరందరును అహోరాత్రములును కష్టించి పనిచేసి నాల్గు సంవత్సరముల కాలములో ౦౧,౧౦౦ సంపుటములు గలిగిన “విజ్ఞాన సర్వస్వము” ను తయారు చేసిరి. ఈ గ్రంధమునందు ౨౨౮౭౭ విభాగములు గలవు. ఇవిగాక ౬౦ విభాగములలో విషయవివరణము గలదు. ఈ సంపుటములలో ప్రతియును ఆరఅంగుళము దళసరి యుఁడును. ఈ సంపుటములన్నియును ఒక దానిమీద మరియొకటి పెట్టి యెడల 450 అడుగుల ఎత్తుగును, ప్రతి సంపుటమున్ను ఒక అడుగు వెడల్పును, ఇరవైఆఁగుళముల పొడవును గలిగియుండి అట్టతో బౌండ్ చేయబడియుండి పసుపు పచ్చపట్టుతో అలంకరింపబడి యుండెను. ఒక్కొక్క విభాగమునందు ఇరువదిపుటలో వంతున మొత్తము గ్రంథము ౯౧౭,౪౮౦ పుటలు గలవు. ఆంగ్లేయుల విజ్ఞాన సర్వస్వమునందు ౨౨,౦౦౦ పుటలు మాత్రమే గలవు. రాజు గారు ఈ గ్రంథమును అచ్చువేయింప దలచిరి. కానీ వ్యయము అత్యధికమగుని చూచి ఆప్రయత్నమును విరమించిరి.
౧౫౬౨ వ సంవత్సరమునందు ఈ మహాగ్రంధమునకు నకలును వ్రాయుటకు 100 మంది పండితులను నియమంచిరి. వారు నకలును ౧౫౬౭ సంవత్సరమునందు ముగింపగలిగిరి. ౧౬౪౪ సంవత్సరమునందు రాజ వంశము అంతరించినప్పుడు నకలు గ్రంధము తగులబడి పోయినది. పిమ్మట అసలు ప్రతిని "జోక్సరు” కాలేజీకి మార్చిరి. ఆ మార్పు జరిగిన పిమ్మట అనేక సంపుటములు అగుపడకుండపోయినవి.
చైనా ప్రభుత్వమువారు విదేశయులను ఈ గ్రంథము చదువనివ్వకపోవుటచేత ఈ గ్రంథము లందున్న ఆమూల్యవిషయము లన్నియు బైటకు రాకుండ పోయినవి.