గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/ఈడుముదిరినవారికి విద్యాభివృద్ధిచేయు మార్గము
ఈడు ముదిరినవారికి విద్యాభివృద్ధి చేయుమార్గములు
(ADULT EDUCATION)
ఈ కాలమున మన దేశమందు సామాన్యముగా విద్యాదానము చేయు సంస్థలు పాఠశాలలే. ఈ మూలమున కోమల వయస్సునందున్న వారే విద్యను పొందగలరు. ఆవయస్సు మీరిన వారు విద్యాభివృద్ధి నొందించుకొను సాధనములు మన దేశమున నేమియు లేవనియే సామాన్యముగా చెప్పవచ్చును. పూర్వము మన దేశపు స్థితిగతులు ఇట్లుగాదు., ఇప్పటి కాలమున కూడ స్వరాజ్యమనుభవించుచు ఆధునిక నాగరికతయందు వన్నె కెక్కిన పాశ్చాత్య దేశముల యందును జపాను, చీనా మన్నగు ప్రాచ్యదేశములియఁదుకూడ నిట్లు కాదు. మనదేశమునిప్పుడు చీకాకుపర్చుచున్న సమస్యలను తిృప్తికరముగా చేయుటకు ముఖ్యముగాను అత్యవసరముగాను మనము పూనుకోనవలసిన పని "ఈడు ముదిరిన వారి విద్యాభివృద్ధినిగూర్చినది". ఈ పనిని మనమెంత కాలము పూనుకొనక యుపేక్షించెదమో, ఆపనికి తగిసంత ప్రాధాన్యముతోను, సమర్థతతోను, దానిని నిర్వహించిమో అంత కాలమును మన దేశము దురవస్టయందుండ వలసిసదే. మరియొక విషయము. ఇందును గూర్చి ప్రభుత్వము వారు వెంటనే పూనుకొనరు, ప్రజలే ఈ కార్యభారము వహించి, సాధన విధానమును నిర్ణయించుకొనవలసి యున్నది. ఈ నిర్ణయమందు ఆధునిక నాగరికత దేశముల స్థితిగతులు మాత్రమేగాక పూర్వపు మన దేశమందలి సంస్థలు కూడ మనకు సహాయము నోసగగలవు.
పాఠశాలకు వెళ్ళతగిన ఈడుకు మించినవారు మన దేశమున ఎన్నితరగతులవారున్నారో ముందుగా మనము పరికించి చూదము. పల్లెటూరు పాఠశాలలలో ప్రాధమిక విద్యను మాత్ర మభ్యసించి తమకు నిర్ణయమైన వ్యవసాయమో, పల్లెటూరు చేతిపనులమో అవలంబించి తన్మూలమున జీవయాత్ర గడుపువారు మొదటి తరగతివారు. ఇట్లే పల్లెటూఁడ్లయందు నివాసము కల్గి విద్యగఁధ మేమియు లేనివారు రెండవ తరగతివారు. కేవలము కూలి నాలి చేయుచు తిన్మూలమున జీవయాత్ర గడుపుచు పల్లెటూఁడ్లయందు నివాసము కలవారు మూడవ తరగతి వారు. సేవలను సంస్కృతమును ఆంధ్రమును పూర్వకాలపు మార్గమున యభ్యసించి పల్లెటూఁడ్లయందు పూర్వార్జితమగు భూములయదాయముపై నాధారపడియున్న వారు మరియొక తరగతి వారు. స్కూ% ఫైనులు వరకో అంతకు లోపుగానూ లేక పైగానో ఏపట్టణమందో అభ్యసముచేసి భగ్నమనోరథులై, పూర్వార్జితమగు ఆస్తి నపేక్షించి తిరిగి పల్లెటూండ్లకు చేరి అక్కడ జీవయాత్ర గడుపుచుండువారు మరియొక తరగతివారు. నిశ్చితముగా ఏవృత్తియును లేక పిల్లిమీద ఎలుకను, ఎలుకమీద పిల్లి ఎక్కించుచు తమ జీవనమునకు ఇతరులపై నాధారపడియుండి పల్లెటూండ్లను చీకాకు పరుచుచున్న “జ్ఞానలవదుర్విదగ్ధుడు" కొందరు, వీరొక ప్రత్యేక తరగతిగా పరిగణింపతగియున్నారు. పైన చెప్పిన తరగతుల వారందరును పల్లెటూండ్ల నాశ్రయించి యున్నవారే.
ఇక బస్తీలలోనున్న ఈడుముదిరిన వారిని గూర్చి విచారింతము. ఇందు ముఖ్యముగా పరిగణింప తగినవారు పాశ్చాత్యవిద్యల నభ్యసించి అందు ప్రావీణ్యత పొంది తన్మూలమున జీవనాధారము నేర్పర్చుకొన్న వారు అగ్రగణ్యులు. ఉద్యోగములు నాపేక్షించక వర్తకము మొదలగు మఖ్యముగు వృత్తుల నవలంభించి ఐశ్వర్యముతో తులతూగుతున్న వారు మరియొక తరగతివారు. అంత ఐశ్యర్యవంతులు కాకపోయినను స్వతంత్య్రవృత్తి నవలంబించి మర్యాదగా జీవనము గడుపుతున్న వారు ఇ౦కొక తరగతివారు. కేవలము కలమపోటుపల్ల జీవనము చేయు సామాన్యముగా వర్తకుల గుమాస్తాలు, న్యాయవాదుల గుమస్తాలు మొదలు వారందరును ఒక ప్రత్యేక తరగతిగా నెన్నతగినవారు. అందరికన్న ఎక్కువ సంఖ్య కల్గినట్టియు, ప్రాముఖ్యత వహించినట్టియు వారు నిక్షరకుక్షులైన పాటకపుజనులు. వీరందరికీ అతీకులైన వార్తె నిరిష్టమగు వృత్తి ఏదియు లేక పరులను దురదృష్టములపాలు చేయటయే తమ జీవనాధారముగా కలవారు. ఆధునిక కాలమున అన్ని దేశములలోను ఈ తరగతివారి సంఖ్య దినదినాభివృద్ధి నొండుచున్నట్లు మనము చూచుచున్నాము. ఈ పైన చెప్పిన అన్ని తరగతులవారును విద్యాభివృద్ధి పొందవలసినవారే.
విద్య అనంతము. సర్వకాల సర్వావస్థల యందునను సేవించి సంపాదించతగినది. ఇప్పటికాలమున మన దేశమున విద్య కేవల జీవనాధారముగా సామాన్యముగా పరిగణింప బడుచున్నది. తత్వమిదికాదు. విద్య సామాస్యముగా నాల్గుభాగములుగా విభజించినది. ఒకటి: వృత్తికి సాధన భూతమైనది. రెండవది: పౌరసత్వపు హక్కు బాధ్యతల సలవడ చేయునది. ఆత్మవికాసమునకును, మనోమోవికాసమునకును యుపకరించి మనుజుని ఆనంద నిమగ్నునిగా చేయగల్గినది మూడవది: ఆత్మ సంరక్షణకొరకు వినియోగపడు విద్య నాల్గవ తరగతిది. ఈ నాల్గు విధములగు విద్యయు ప్రతివ్యక్తికిని కొలదిగనో, గొప్పగనో యుండి తీరవలసినదే.
ఏదియోవిద్యయందు ఇదివరికే ప్రావీణ్యము చెంది తనుఁతట తాము పుస్తక సహాయ్యమున విద్యాభివృద్ధి స్వయయుగ చేసుకొనగలవారికి జ్ఞానాభివృద్ధికి ముఖ్య సాధనములు పౌరగ్రంథాలయములు. వీరి సంఖ్య మన దేశమున హెచ్చియి ప్రతిపల్లెయందును బస్తీ యందును ఈ సంస్థలు వెలసి దినదిననాభివృద్ధినొందిన గాని ప్రజల పరిజ్ఞానము అభివృద్ధి చెంద నేరదు. కేవల వృత్తి సాధకమగు విద్య వ్యక్తికి ఆనందమును సమకూర్ప నేరదు. సంపూర్ణమానుషానందము నియ్యజాలదు. కావున ఈడు ముదిరిన వారి విద్యాభివృద్ధికి సాధనమగు సంస్థలలో ఆగ్రగణ్యమైనది పౌరగ్రంథాలయములు.
రెండవ సంచార గ్రంథాలయ పేటికల మూలమున పల్లెందును పల్లెటూళ్లయందును చదువరులకు వారి వారి అవసరములను బట్టియు రుచులను బట్టియు యందచేయుట. ఈ మూలమున పాశ్చాత్యదేశములయందు జరుగుచున్న విద్యాప్రచారము వర్ణవాతీతము. ఆదేశపు శ్రీమంతులు ఈ సంస్థలకొరకై మితిలేని ద్రవ్యములు వెచ్చించి దేశోద్ధారకులగుచున్నారు. మన దేశమునకూడ దేవళములను, సక్రిములను, స్టాపించి దేశోపకారము చేయుచున్న లక్ష్మీపుత్రులు, "అన్ని దానయిలలో విద్యాదానము ప్రశస్త" మను యార్యోక్తి ననుసరించి గ్రంథాలయముల స్థాపించి తన్మూలమున విద్యాదానము చేయగడంగుటకు ప్రార్ధితులు.
గ్రంథాలయములు పుస్తకములమూలమున విద్యాభివృద్ధిని తమంతటతామే పొందగలవారలకే యుపకరించును. మన దేశమున నిరక్షరకుక్షుల సంఖ్య ఆగణ్యము. కేవలము చదువుట, వ్రాయుటమాత్రమే తెలిసినవారు చదవు వచ్చినవారిలో లెక్కకు వచ్చినను, స్వయముగా పుస్తకములు చదివి తమకు కావలసిన జ్ఙానము సంపాగించుటకు తగిన సామర్ధ్యను లేనివారై యున్నారు. ఈపైన చెప్పిన తరగతివారు మన దేశమున ఎందరో యున్నారు. వీరందిరికి పైనచెప్పబడిన నాల్గువిధములగు విద్యను యలవాడచేయు మార్గములను మనదేశ స్థితిగతుల ననుసరించి మనము వెంటనే నిణ౯యించి ఆచరణలోనికి తెచ్చుట అవశ్యకర్తవ్యము.
ఇందును గూర్చి పూర్వకాలమున మన దేశమువు ఎట్లు జరిగినదియు ఇతర దేశములనెట్లు కృషి జరుగుచున్నాదియు ప్రధమములో గమనించెదము. పూర్వకాలమందు మనదేశమున పల్లెటూండ్లవారు దిశమంతయు శ్రమపడి ఇంటికివచ్చిన పిదప విశ్రాంతికొరకును జ్ఞానాభివృద్ధి కొరకును ఏతటాక ప్రాంతమునకో లేక తరుచ్చయకో చేరుచుండెడివారు. అక్కడ గ్రామమందలి పెద్దలు విచ్చేసి తమ లోకానుభవమును జ్ఞానమును ఇతరులకు అబ్బునట్లు బోధించెడేవారు. పాదచారులై దేశమంతటను తిరుగుచు లోకకల్యాణమే తమ శ్రేయస్సుగా నెంచుకొనెడిసాధువులు ఈ సమావేశములకు విచ్చేసి తమఅముల్య పరిజ్ఞానములు జానపదులగు బోధించి వారల ధన్యుల చేసెడివారు. ఆ కాలము వేరు. ఈ కాలము వేరు. అప్పటిస్థితిగతులు పూర్తిగా మారినవి. ఈ సమావేశమువల్ల పూర్వము ఈడు ముదిరిన వారికి జ్ఞానాభివృద్ధి సావకాశములన్నియు ఇప్పుడు సంపూర్ణముగా నశించినవి. వాని స్థానమున నూతన సంస్థలేమియు నిర్మాణము కాలేదు. ఈ లోపమునే మనము వెంటనే పరిపూర్తి చెందింపవలసియున్నది.
దేవాలయము మరియుక సంస్థ. మన దేవాలయములు పరమేశ్వరారాధన కేర్పడిన పూజాస్టానములు మాత్రమే కావు. మన దేవళము వివాహములకు సాక్షి, ధర్మశాస్త్ర చర్చలకు సభాభవనము, పరదేశీయులకు ధర్మశాల. పనివాండ్రుకు ప్రాపు. సన్యాసులకు మఠము. భక్తపరుల కునికిపట్టు. ఇదియదియననేల ప్రజలకు జీవనాధారమై, విద్యాపోషకమై ఆనందాంబుధియై దేవిళంబు విరాజిల్లు చుండు. మనుజుడు జీవయాత్రయం దలవడచేసుకొనవలసిన సద్గుణము లన్నిటికిని శిక్షాస్థానముగరు సర్వవిధములగు విద్యను బోధించెడి పాఠశాలగను మన దేవాలయములు అభివృద్ధి గాంచియున్నవి. అన్ని అంతరముల నుండు ప్రజలను అచ్చట సమావేశమై ఆనౌన్య స్నేహముచే ఏకలక్ష్యమున మనస్సును లగ్నము చేసుకొన్న కారణమున సంపూర్ణ సోదర భావమును తన్మూలమున యలవడ చేసుకోనుచుండిరి. దేవళములయందు చిత్రింపబడియయందు చిత్తరువులు మిక్కిలి మనోరంజకములై చిత్తశుద్ధిగావించి ఈశ్వరుని అనంతికల్యాణ గుణానుభవము కోలది కాలమునకైనను మనుజునికి సమకూర్చుటకు తగు సమర్థములై యున్నవి,
పురాణ కాలక్షేపములును హరికధా కాలక్షేపములను మన దేశమున ఎక్కువ ప్రసిద్ధి గాంచి ప్రాజ్ఞులకును పామరులకునుకూడ తారకమై వెలయుచుండెను. ఈ కాలమున హరికథాకాలక్షేపము పూర్వముకన్న ఎక్కువ విరివిరిగా జరుగుచున్నను, పూర్వమువలె విధ్యుక్త ధర్మములను నెరవేర్చునవిగా నుండక నేరుగా పరిణమించు చున్నవి. హరికథా కాలక్షేపమందేమి, పురాణ కాలక్షేపముందేమీ ప్రధానాంశము “కథకుని ” యోగ్యతయు, పాండిత్యమును. ఇప్పటి కథనలలో ఇట్టి యోగ్యత గలవారు బహు అరుదు.
శ్రోతలుగూడ కధకుని సంగీత విద్యాపాండిత్యమును బట్టియు కంఠ శ్రావ్యమును బట్టియు వారి యోగ్యతను నిర్ణయించుటకు ప్రయత్నిఁతురే గాని యందలి యంశముల ప్రాశస్త్యమును బట్టియు, ప్రజల మనసులకు ఆహ్లాదపర్చ ఆకర్షించగల శక్తి ననుసరించియు అట్లు నిర్ణయించరు. ఈ రెండు సంస్థలను విధ్యుక్త ధర్మములను నిర్వర్తించు విధముగ దేశమంతటను తిరిగి వ్యాపించినచో ఇందుమూలమున జనసామాన్యమునకు కల్గెడి జ్ఞానాభివృద్ధి కడుమెండు. వీనియందలి యుత్కష్టత ఏక కాలమున వివిధాంతరములు కల్గినట్టియు సభ్యులను ఆహ్లదపర్చి వారికి అవసరమైనట్టియు అభివృద్ధికరమైనట్టిము విషయములను గూర్చి వారికి హృద్యముగా నుండునట్లను జ్ఞానబోధచేయుట యందు కడు సామర్ధ్యము కల్గియుండట యందు యుండియున్నది. దేశముస ఈ రెండు సంస్థలను ప్రధమమున హిందు సంస్థలేయైనను ఈ కాలమున ఇతర మతస్థులుకూడ ఈ మూలమున జ్ఞానాభివృద్ధి చేయుటకు ఎక్కువ సావకాశములను గమనించి వానిని గ్రహించి యున్నారు.
ఇక ముందు పాశ్చత్య దేశములయందు ఇందునుగూర్చి జరుగుతున్న కృషిని గూర్చి వివరించెదము.