గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 8/నిజాంరాష్ట్రాంధ్ర గ్రంథాలయసభ, మధిర
గ్రంథాలయ వార్షికోత్సవము, మధిర
ఫిబ్రవరి నెల ౨౧ వ తేదీ సాయంకాలము గ్రంథాలయ వార్షికోత్సవము ప్రారంభమాయెచు. చిరి. ఈగ్రంధాలయ మతి శీఘ్రకాలములో ఆశ్చర్యకరమగు అభివృద్ధి గాంచెను. స్థాపించిన రెండు సంవత్సరముల నుఁడి యింతవరకు గ్రంధముల సంఖ్య 1000 వరకు పెరిగెను. ఇట్టి ఔన్నత్యదశకు తీసికొనివచ్చిన గ్రంథాలయకార్యదర్శి యగు మిరియాల నారాయణ గుప్తగా రెంతయు ప్రశంసార్హులు. ఈ సంవత్సరోత్సవ సభకు మాదిరాజు రాచుకోటీశ్వరరావు గారు అధ్యక్షత వహించిరి. వీరు హనుమకొండ కాపురస్తులు. సుప్రసిద్ధ న్యాయవాదులు. అగ్రాసనాధిపతిగారు కొంత సమయానుకూల సంభాషణ మొనర్చిన తరువాత కార్యదర్శి గారు తమనివేదికను చదివిరి, దూపాటి వెంకటరమణాచార్యులవారి యుపన్యాసము విజ్ఞానోద్దేపితమై శ్రోతల కెంతయో యుల్లాసమును గలిగించెను. శ్రీయుతులు నయిజాము రాష్ట్ర పూర్వరాజ ప్రతాపమును, పూర్వకవీశ్వర మాహాత్మ్యమును గురించియు వర్ణించునపుడు ఆవేశపూరితుడై ఒడలు గగుర్పొడమ కంట తడిపెట్టని సభ్యుడందులేడని చెప్పుట సాహసము కానేరదు. హకీమ్ రఫీరుద్దీను గారు గ్రంథాలయోపయోగములను గురించి మాట్లాడిరి. “గ్రంథము నవరసభరితమగు స్నేహితుడు. సర్వకాల సర్వావస్థలయందును సన్నిధానవర్తియగు సెచ్చెలి. కొట్టినను తిట్టినాను తన్నినను సహించగల పరమ మిత్రుడు. ప్రస్తుతము గ్రంథాలయములు ధనాభావరోగముచే బాధపడుచున్నవి. వీరికి సువర్ణఘుటీకలనుమా త్రలను వాడవలయునను మొదలు గాగల హాస్యరి సపూరితమయి భావగర్భితమగు వాక్యములచే సభ్యులకు ఆనందమును గలిగించిరి. తరువాత హైదరాబాదు నుండి వచ్చిన అప్పన్న శాస్త్రిగారు నయిజాము గవర్నమెంటు యుద్యోగస్థులందరు మన గ్రంథాలయసభ్యులుగా జేరిన గాని జనులు భయము వీడి మన సభలకు విచ్చలవిడిగా రాగనికి, అధ్యక్షులగు రామకోటీశ్వరరావుగారు సర్కారు ఉద్యోగస్థులందరు ఇదివరకే తమయద్యమమునఁదు సానుభూతి కలిగియున్నారనియు చాలమంది సభ్యులుగా గూడ కలరనియు తమ రాష్ట్రములో సర్కారునకును ప్రజలకును భేదభావము లేకుండ నుద్యమము సాగుచున్నదనియు తమ యంత్యోపన్యాసమున సెలవిచ్చిరి, తంజావూరి లయబ్రరీలో 2000 అముద్రిత తెలుగు గ్రంధములు గలవు. భాషా పుస్తకము గూడ తెలుగు లిపియఁదు గలవు. అచట, ఇద్దరు వీరుల ప్రతిమలు గలవు. అందులో నోకవీరుని పేరు సుబ్బయ్య. దీనిని బట్టి పూర్వము తెలుగుభాష యిప్పుడు మన మనుకొనుచున్న త్రిలింగ దేశపు సరిహద్దులను దాటిపోయి ఎక్కుడు గౌరవ ప్రఖ్యాతులను గడించింది. మనము అధమము నిజాంరాష్ట్రమందున్న పూర్వాంధ్ర చరిత్ర నయినను సేకరించ వలయునని యుద్బోధ మొనర్చిరి. మాములుగా జరుగు వందన సమర్పణను జరిగిన తరువాతి, సభ ముగించబడెను.
నిజాంరాష్ట్రాంధ్ర గ్రంథాలయసభ, మధిర
ఫిబ్రవరి 9 వ తేదీ మధ్యాహ్నమున ఈ సభ మధీరయందు సమావేశమయ్యెను
సన్మాన సంఘాధ్యక్షులు శ్రీయుత మాడ పాటి తిరుమల రావు పంతులు గారి స్వాగతము
దినదినాభివృద్ధి పొందుచున్న మా మధిర గ్రంథాలయాభిమానము రచూ మమ్ముల ప్రేరేపించుటంచేసి, ప్రధమయత్ని మగు ఇట్టి మహాజనసభ సమావేశపరుప సాహసించితిమని విన్నవించుచు, నిజాంరాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయోద్యమమును గురించి సూత్రప్రాయముగ కొన్ని సంగతులను విన్నవించు చున్నాను. ఆంధ్రదేశమందలి సార్వజనిక గ్రంథాలయోద్యమ మంతటికిని పునాదియగు శ్రీకృష్ణదేవరాయల ఆంధ్ర భాషానిలయము, ఈ రాష్ట్రమునకు ప్రధాననగరమగు హైదాబాదునందే స్థాపింపబడినదని మన మెంతయు గర్వపడదగి యున్నది.
దీనితరువాతనే, మొత్తము మీద ఆంధ్ర దేశమందఁతటను అనేక గ్రంధాలయములు పాపింపఁబడినవి. ఆగ్రంధాలయస్థాపకులైనవారిలో కొందఱు స్థానాంతరములం దుండుటచేతను, అకాలమృత్యువువాత పడుటచేతను నిజాంరాస్ట్రేతర ప్రాంతమందలి ఆంధ్రగ్రంధాలయోద్యనుముతో బాటు సాగ నవకాశము లేక పోయినదని చెప్పుటకు చింతిల్లుచున్నాను. అయినను నిజాంరాష్టాంధ్ర దేశమండలి ఇతర ముఖ్యపట్టణముల యందు దేశభాషాభిమానులగు యువకుల యుత్సాహము వలన స్థాపింపబడిన గ్రంధాలయములు మిక్కిలి పాముఖ్యమును బడయుచున్నవి.
ఇప్పటికి సుమారు నూరు గ్రంథాలయములు మన రాష్ట్రమందంతటను స్థాపింపబడినవని పత్రికా పాఠకులందరకు తెలిసినవిషయమే. స్థాపింపబడిన ప్రతిగ్రంథాలయమును అభివృద్ధి పొందజాలక పోయినను మూడు నాలుగు గ్రంధాలయములు మాత్రము స్వంత భవనము గలిగియుండి, వివిధగ్రంధములను సంపాదింపగలిగి యున్నవి. తక్కిన గ్రంథాలయముల గూడ నట్టి స్థితికి దేవలసిన బాధ్యత మనయందున్నది.
గ్రంథాలయ మనగా పుస్తకము గల నీరువాలున్న జీవరహితి వస్తుసామగ్రి సంచయంబుగాదని మున్ను గ్రంథాలయోద్యమతత్వజ్ఞు లొకరు పలికిన మాటలలో నెంత యర్థము గలదో పండితులగు మీకు నేను దెలుప నవసరములేదు. గ్రంధములు సేకరించుటలో ఆయా గ్రంధాలయ ప్రాంతముల వారి స్వభావేచ్ఛల ననుసరించి పని చేయవలసియుండును. ప్రతి గ్రంధాలయమును తన ప్రత్యేకత్వము నిలుపుకొనవలెననిన మన వాఙ్మయ విభాగములలో నొకదానికి మిగుల ఆదరణ చూపించవలసి యుండుగుగదా! సామాన్యజనుల నాకర్షింప నాటకములు, నవలలు మున్నగు గ్రంధసంపాదన అవసరమైనను ఏచారిత్రీకజ్ఞానమో, వ్యవసాయక పారిశ్రామిక జ్ఞానమో, వాఙ్మయజ్ఞానమో కొందరైనా పరిశ్రమచేసి సంపాదించిన గాని దేశమునకు గ్రంథాలయములవలన నిజమైన లాభము గన్పట్టక పోవచ్చుననుట అతిశయోకి గాజాలదు. గ్రంధాలయములు చేయుపను లనంతములై యున్నవి. ఏయద్యమము బయలు వెడలినను దానికి మూల కారణము యీగ్రంథాలయోద్యమమందే గలదను అనుభజ్ఞుల మాట మన మెంతయు ఆదరించవలసి యుండును -
ఏతర్యషయములనే మనసునందుకొని మన గ్రంథాలయములలో కొన్ని ఉపన్యాస సభలు, వార్షికోత్సవ వర్తంత్యుత్సవములు మరికొన్ని వక్తృత్వ పరీక్షలు మరికొన్ని యముద్రిత సచిత్ర మాస పత్రికలను వెడలదీయుటమన్నగు శుభసూచకములగు వానిని జరుపుచున్నవి. అత్యంతోత్సవముతో చేయబడు నీ సభయందు సమావేశమయిన ప్రతినిధిమహాశయులెల్లరు ఏకీభవించి యీ గ్రంథాలయోద్యమము సజీవమగునట్లు చేయ సహాయపడు గ్రంథాలయ కేంద్ర సంఘమొక దానిని సాపింప మిమ్ముల నందరిని నేను వినయపూర్వకముగ గోరు చున్నాను.
అధ్యక్షకోపన్యాసము
అధ్యక్షులకు పింగళి వెంకటరామరెడ్డి దేశముఖు గారి ఉపన్యాసము.
నిజాంరాష్ట్రాంధ్ర జన కేంద్ర సంఘ తృతీయ సమావేశ సందర్భమున ఆహ్వాన సంఘమువారు ఈ గ్రంథాలయ సభ నేర్పరచి ప్రత్యేకముగ గ్రంథాలయోద్యమమును గురించి మాట్లాడుకొనుట కవకాశగును గల్పించి నందుకు వంద్యులు తాలూకా ప్రధాన స్థలములందిట్టి సభలను జరుపు నలవాటిదివరకు లేదు. మధిర ఆంధ్ర జన సంఘము వారీవిషయమున మార్గదర్శకులైరి. ఆంధ్ర భాషాభివృద్ధికరములగు ప్రయత్నిములు మనదేశమునందు సుమారు ౨౫ సంవత్సరముల నుండి జరుగుచున్నను నా భాగములందున్న గ్రంధాలయముల ప్రతినిధులొక్కచోటజేరి ఉద్యమాభివృద్ధి కవసరమగు విషయములను గరించి సంభాషించుకొనుట కేర్పడిన మొట్ట మొదటి సమావేశమిదియే.
ఆంధ్రజాతి మిక్కిలి ప్రాచీనమైనది. ఆంధ్రులకు నిజాంరాష్ట్రమే జన్మస్థానమని చరిత్రిపరిశోధకులు నిశ్చయించుచున్నారు. మన రాష్ట్రములో ఆంధ్రము మాతృభాషగా గల వారి సంఖ్య ౬౪ లక్షలు. మొత్తము జనసంఖ్యలో ఆంధ్రులు సగభాగమునకంటె నెక్కువగ నున్నారు. వైశాల్యమునందుగూడ తెలంగానాయని వ్యవహరింపబడు ఆంధ్రభాగము సగముకంటె నెక్కువిగనున్నది. ఈ రాష్ట్రములో ముఖ్యముగ వాడబడు తెలుగు, మహారాష్ట్రము, కన్నడము యను నాలుగు దేశభాషలలో తెలుగు భాషకే ప్రాధాన్యమివ్వవచ్చునని తేలుచున్నది. మాధుర్యమునందును, వాఙ్మయ వికాసమునందును, భాషా సౌష్టవమునందును, అక్షర రమ్యత భాషాసౌష్టవము యందును అంధ్రభాషయే ఇతర భాషలకంటె మిన్న యనిపించుకొనినది. ఇది కేవలము మన మభిమానముతో జెప్పుకొను విషయముగాదు. ఇతర దేశస్థులు సహితము దీనిని "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు" అని పొగడి యున్నారు. ఇట్టి మృదుమధురమైన మన మాతృభాష మనరాష్ట్రమునందు అన్యభాషాపద సమ్మిళితమై కడుశోచనీయఁబగు దుస్థితి యందున్నది.
ఇప్పుడిప్పుడే జనసామాన్యమునందు మాతృభాషాభిమాన మంకురించినది. మనమందరము దాని యభివృద్ధికై నిరంతరకృషి సలుపవలసియున్నది. భాషాభివృద్దికిని, విజ్ఞానప్రసారమునకును అనేక సాధనములు గలవు. వీనిలో గ్రంధపఠనము మిగుల శ్రేష్ఠమైనది. గ్రంధములను గురించి ౫౦౧ సంవత్సరములకు పూర్వమున నొక పాశ్చాత్యకవి ఈ దిగువ వ్రాయబడిన ప్రకారము నుడివియున్నాడు:౼
“కొట్టు తిట్టులు లేకుండ, కోపతాపకులు లేకుండ, డబ్పుదస్కముగైకొనక, బోధించు సుపాధ్యాయులు పుస్తకములే. వానిసన్నిధికి బోయినచో నవి నిద్రించు చుండవు. సహనవిషయమును గురించి ప్రశ్నించినచోనవి యేమియు దాచవు. వానిని గూర్చి దురభిప్రాయ పడినచో నని యెన్నడును సణుగుకొనవు. అవివేకులు జూచి అవి పరిహసించవు" కావున జ్ఞానాత్మకంబగు గ్రంధ సముదాయము అన్ని విధములైన భాగ్యములకంటే మిన్నయని భావించవలెను, సత్యపధానువర్తియై, సుఖయై, వివేకియై, శాస్త్రజ్ఞుడై, భక్తిపరుడై యుండ గోరేడు ప్రతిమనుజుడు తిప్పక గ్రంధాభిలాషియై యుండవలెను.
పూర్వకాలమున లిపి యేర్పడుటకు మునుపు మన ఋషులు విజ్ఞానమును ఆరువేల సంవత్సరములవరకు గాపొడిరి. వేదకాలమునాటినుండి ఇప్పటివరకు వేదపన్నములసంత తండ్రి కొడుకుకు జెప్పుచున్నాడు. లిపియేర్పడిన తరువాత మనపూర్వులు తాటాకులపైనను, కొయ్యల పైనను, రాగి రేకుల పైనను, శిలలపైనను వ్రాయుచుండిరి. కనుక పూర్వపు విజ్ఞానమును మనము గోరినచోనిట్టిని వీలగునంత వరకు సేకరింప బడవలయును.
వర్తమాన కాలమున ముద్రణాయంత్రముల సహాయమున మనకెట్టి ఇబ్బందులు లేక గ్రంధములు లభించు చున్నవి. ఇట్టియవకాశమును బోగొట్టుకొనక గ్రంధసముదాయమును ప్రతి గ్రామమునందు ప్రోగుచేయుటయు దానిద్వారా జనసామాన్యము లాభమును బొందునట్లు జేయుటయు మనవిధియైయున్నది. భాషాభివృద్ధి, విజ్ఞాన ప్రసారమునకేగాక ప్రజలలో అమ్యోన్య సహకారమును, స్నేహభావమును గలిగించుటకు గ్రంథాలయములు సానుభూతములగును.
దేవాలయములందు ధనాఢ్యులును, బీద వారును ఎట్టిభక్తి విశ్వాసములను జూపుచున్నారో, సరస్వతీ ఆలయము లనఁదగు నీ గ్రంథాలయములపట్ల సహితము ప్రజలు సమానమైన ఆదరణమును జూపవలెను. దేవాలయములేని గ్రామము నివాసయోగ్యముగాదన్న భావము మనవారియందు వ్యాపించియున్నది. ఇట్లే గ్రంథాలయముల యావశ్యకతను గూడ గమనించి, ప్రతిగ్రామము నందు గ్రంథాలయమును స్థాపించుయత్నములు చేయబడపలెను. ఇట్టిజ్ఞానజ్యోతులు ఎన్ని యున్నసు చాలవు.
అమెరికా గ్రంథాలయోద్యమ నాయకుడగు డాక్టరు మెల్వి డేవి గారు గ్రంథాలయములు అవసరము గురించి ఇట్లు అభిప్రాయమిచ్చి యున్నారు:-
“ప్రతిమనుజునికి బాల్యదశయందు పాఠశాలమూలమునను, పెద్దవాడైన పిమ్మట ధర్మగ్రంథాలయమూలమునను ప్రభుత్వమువారు విద్యగరపుట విధియైయున్నది. విధియేగాక పరిపాలనా సౌకర్యముకొరకును, రాష్ట్ర సురక్షితమునకును మిక్కిలి యవసరము”
స్వదేశ సంస్థానములలో నీవిషయమున మిక్కిలి శ్రద్ధ వహించింది. బరోడా రాష్ట్రాధిపతియగు శ్రీశాయాజీ గయి క్వారు మహారాజు గారే. గ్రంథాలయోద్యమ మచ్చట దినదినాభివృద్ధిగాంచి ప్రజలను విజ్ఞానవంతు లనుగ నొనర్చుట కెంతయో సహకారియయినది. ఆరంభి దశయందు గ్రామవాసులు గ్రంధాలయ స్థాపనోద్దేశముతో అని రూపాయిల విరాళములు ప్రోగు చేసినచో బరోడ ప్రభుత్వమువారు ౧౦౦ రూప్యముల వెలగల దేశభాషా గ్రంథముల నొసంగి ప్రోత్సహించిరి. పఠనమందిరములకు ప్రతి సంవత్సరము ౨౫ రూపాయల చొప్పున విరాళములేర్పాటు చేయబడెను. బరోడా ప్రభుత్వము వారిచే బ్రకటింపబడు గ్రంథములన్నియు నుచితముగ నారాష్ట్రములోని గ్రంథాలయములకన్నిటికిని నొసగబడు చుండెను పాఠశాలా ప్రధానోపాధ్యాయుడు గ్రంథాలయమును నడుపు భారమును వహించ వలెనియు, జిల్లా తాలూకా బోర్డులు వీనిని కనిపెట్టుచుండవలె ననియు కట్టుబట్టము లేర్పడెను. ఇవ్విధంబున గ్రంథాలయోద్యమ నిర్మాణ కార్యక్రమమునందు బరోడా ప్రభుత్వమువారు అత్యంత శ్రద్ధవహించి తోడ్పడిరి. ప్రతిసంవత్సరము గ్రంథాలయ భవన నిర్మాణమునకును, గ్రంథదానమునకును ౨౦ వేల రూప్యములు వ్యయము చేయబడుచుండెను, ౧౯౧౯ సంవత్సరాంతమున బరోడా రాష్ట్రమంతటను ౬౪౨ గ్రంథాలయములు వెలసినవి. ఇవి గాక సంచార గ్రంథాలయల మూలమున గ్రామములు లోని ప్రజలయందు గ్రంధపఠనాభిలాషను గలిగించి ప్రత్యేకముగ కృషి సలుపబడెను. సంచార గ్రంథాలయముల ౪౫౦ వరకుండేను. ఈ విషయమున ప్రభుత్వము వారు దయచేసిన విరాళము ఆరువేలు.
మైసూరు ప్రభుత్వము వారుగూడ దీని నాదర్శముగ గైకొని గ్రంథాలయములను స్థాపించు విషయమున శ్రద్ధ చూపుచున్నారు. బొంబాయి నగరమున సేవాసంఘము వారు ౨౦౪ సంచార గ్రంథాలయములను నెలకొల్పి సుమారు పది ఏండ్లనుండి విద్యాదానమును జేయుచున్నారు. పాశ్చాత్య దేశము నందీ విషయమున జూపు శ్రద్ధ అపారమైనది.
తమ అమెరికా సంయుక్తరాష్ట్రములందు గ్రంథాలయోద్యమము ఉన్నత దశయందున్నది. అన్ని విధములైన గ్రంధముల నొకచోట ప్రోగుచేసి గాపాడుటయందలి విలువను గ్రహించియే బ్రిటిషు ప్రభుత్వమువారు తమ సామ్రాజ్యమునందు ముద్రితమైన ప్రతి గ్రంథము యొక్క ప్రతి యొకటి లండనులోని "బ్రిటీషు మ్యూజియం" నకు బంపవలెనని నియమ మేర్పరచిరి. ఈ మ్యూజియములోను; పారిసు 'నేషనలు లైబ్రరీలోను, బెర్లిన్ రాయలు లైబ్రరీలోను, సంస్కృత గ్రంధములు విశేషముగ నున్నవని మనము తెలిసికొనినపుడు మనకాశ్చర్యము గలుగకమానదు. ఇతర దేశములు తమకు వీలుగలిగినపుడెల్ల మనదేశములోని గ్రంధసముదాయమును తమ దేశములకు గొనిపోయిరి, మన మీ విషయమునందెంత ప్రమత్తులమై యుంటీమో ఇతర దేశములంత శ్రద్ధవహించియుండును. సరస్వతీ దేవి స్వస్థానమును విడచి పరదేశవాసము జేయట సంభవించినది.
నాగరికాగ్రగణ్యములగు దేశములందెల్లను గ్రంథాలయములను విరివిగ నెలకొల్పాటకు రాజులును, ప్రజలును ఉత్సాహమును జూపుచున్నారు.
మన రాష్ట్రములో ప్రభుత్వమువారు విద్యాశాఖకై ప్రతిసంవత్సరము ఒక లక్షల రూప్యములవరకు వెచ్చించుచున్నారు. చదువువచ్చిన వారి సంఖ్య ౧౦౦ కి 3.8 చొప్పున మాత్రమే యున్నది గనుక విద్యావ్యాప్తికై పాఠశాలలును విరివిగ స్థాపించుచున్నారు. బరోడా, మైనూరు రాష్ట్రములందువలే గ్రంథాలయోద్యమమునందు కృషి సంఖ పుటకై స్కీము తయారు కాబడు చున్నదని కొంత కాలను క్రిందట ఆర్థికశాఖాసభ్యులు ఒకసభలో సెల విచ్చియుండిరని దెలియుచున్నది. ఈ ప్రయత్న ములింక ను ఫలసిద్ధి నొందకున్నను ప్రస్తుతము సర్కారు వారి చే పోషింపబడుచున్న గ్రంథాలయ కులం హైదరాబాదులోనున్న స్టేటు (ఆసిఫియా) లైబ్రరీ విశాలమైన భవనముతోను, నానావిధ పత్రికలతోను, అత్యుత్తమమైన కార్యనిర్వహణపు చేర్పాట్లతోను, విల పిల్లుచున్నది. మతను, నీతి, వేదాంతి, చరిత్ర, కళ, రాజకీయము, ప్రకృతిశాస్త్రము, సాహిత్యము, ఆ కను, పరిశోధనము మున్నగు యుద్ధంధములతో విరా జిల్లుతున్నది. ఆంగ్లేయు, ఉర్దు, అరబ్బీ, పారసీ భాషలకు ప్రత్యేక శాఖ లేర్పడియున్నవి. ప్రతిదినము నియమిత ద అందరు ఉచితముగ జరుపుకొనవచ్చును. దీనికై ప్రభుత్వ యు వారెంతో దివ్యమును ప్రతి సంవత్స రము వెచ్చించుచున్నారు. దేశభాషలగు తెఱగు మరాఠీ, కన్నడభాషా గ్రంథములు గూడ దీనియందుండి నచో నిధి సమమనిపించుకొనును. వీలునుబట్టి ఈ విష యమునగూడ శ్రద్ధవహించుట ప్రభుత్వము వారి యాశ యమైయున్నదని మనము నమ్మవచ్చురు. ఇదిగాక పురో ధ్యానవనమునందు (పబ్లికు గార్డెన్) గ్రంథాలయ మొకటి సాపించు నేర్పాట్లు జరుగుతున్నవి. భవన నిర్మాణ కార్యము జరుగుచున్నది. కళాశాఖలలోను, పాఠశాలలలోను ప్రత్యేకముగ కొన్ని గ్రంథాలయములు గలవు. వినియభివృద్ధికై ఏపేట గొంతద్రవ్యము వ్యయము చేయబడుచు నేయున్నది. ఇవిగాక ప్రజల చేనడుపబడు కొన్ని గ్రంథాలయములకు ప్రభుత్వమువారు వార్షికముల నేర్పరిచి తోడ్పడు చున్నారు. కేవలము విద్యాశాఖ పైన నింత గొప్ప మొత్త మును దియతో వెచ్చించుచున్న ప్రభుత్వము వారి పైననే గ్రంథాలను స్థాపన భారమునుగూడ మోపుట సమంజ సముగా నేగదు. ప్రజణ ప్రభుత్వమువారికి తోడ్పడి గాని ప్రభుత్వము వారి విద్యావ్యాపరోద్దేశ్యము కొన సాగదు. కనుక పాఠశాలల మూలమున నొకదెస విద్యా వ్యాప్తికై ప్రభుత్వమువారు ప్రయత్నించుచుండ, గ్రం థాలయములను నెలకొల్పాటయందు ప్రజణ శ్రద్ధవహిం చుట సత్వరాభివృద్ధికి శుభసూచకమగును. ఇట్టి గ్రంథాలయములకు లోకఫండునుండి ద్రవ్యసహాయము చేయబడునన్న నమ్మకము గలదు. ప్రభుత్వమువారి సానుభూతియు, విద్యాశాఖాధికారుల సహాయమును లభించగలదు.
నిజాంరాష్ట్రంధ్ర దేశములో గ్రంథాలయస్థాపన విషయమున నెంతవరకు కృషి సలుపబడినదో అరయుదము.
౨౪ సంవత్సరములకు పూర్వము హైదరాబాదులో స్థాపింపబడిన శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషానిలయము నిజాంరాజ్యములోనేగాక ఆంధ్రదేశము నంతకును, సక్రమపద్ధతుల పైన స్థాపించబడిన గ్రంథాలయములలో మొట్టమొదటిది. ఇయ్యది నిజాంరాష్ట్రాంధ్రుల యభివృద్ధికై పునాదిగా బనిజేసి స్వంతభవనముతోను పలువిధిసౌకర్యములతోను, అధిక సంఖ్యాకములైన సంస్కృతాంధ్ర గ్రంథములతోను విరాజిల్లుచున్నది. ప్రజలచే నడుపబడు ఆంధ్ర సంస్థలలో కెల్ల నీ రాజ్యమునందిది ఆగ్రస్థానము వహించినది. దీనితరువాత జేర్కొన దగినవి సెకంద్రాబాదు, హనుమకొండ, మట్టెవాడ, ఎఱ్ఱుపాలెము నున్నగు స్థలములలో నెలకొల్పబడిన గ్రంథాలయములు. దయామయులై ప్రజలయభివృద్ధికై విశ్వప్రయత్నములను జేయుచున్న మన ప్రభువుగారి పవిత్రనామముతో నిచ్చట మధిరయందు నెలకొల్పబడిన ఉస్మానియా ఆంధ్ర భాషా నిలయము యొక్క వార్షికోత్సవము నిన్ననేగదా జరిగినది! మటైవాడ, హనుమకొండలో నున్న గ్రంథాలయములకు ప్రతిమాసము ౧౫౧౧ రూపాయిల చొప్పున ప్రభుత్వమువారు గ్రాంటు దయచేయుచున్నారు.
ఆంధ్రజన సంఘోద్యమమారంభమైన గత మూడు సంవత్సరముల కాలములో గ్రంథాలయముల సంఖ్య చాలవరకు హెచ్చినది. ప్రస్తుతము వీని సంఖ్య ౮౩ వరకు వచ్చినదని తెలియుచున్నది. నూతన గ్రంథాలయములను స్థాపించు ప్రయత్నములతో బాటు స్థాపిఁపబడినవన్నియు సక్రమముగ నడుపబడుతుఁడుంది లేనిది అవలోకించుట కేర్పాట్లుచేయట కేంద్రసంఘము వారి విధియైయున్నది. ఈ కార్యము నిధిపైన నాధారపడియున్నది గనుక దేశీయులు ఉదార భావముతో ద్రవ్యసహాయము చేయవలెను.
గ్రంథాలయముల లాభములను గురించి గాని వాని పాలననుగురించి గాని నేను ప్రత్యేకముగ చెప్పవలసిన దేదియు లేదు. గ్రంథాల యోద్యమమునందు కృషి సలుపుచు తదభివృద్ధికై ప్రయత్నములు సలుపుచున్న యనుభవజ్ఞులు తన యభిప్రాయములను దెలుప వేడుచున్నాను,
గ్రంథాలయముల కనుబంధముగ నాటక సంఘములను, అన్నదాన సమాజములను, రాత్రిపాఠశాలలను, వినోదకరములగు ఆటపాటల క్లబ్బులను జేర్చవచ్చునని కొందరభిప్రాయ పడుచున్నారు. కాని దీవివలన గ్రంథాలయములు క్షీణించుటయు, నశించుటయుగూడి సంభవింపవచ్చునని నాయభిప్రాయము. గ్రంథాలయ కార్యనిర్వాహకులు ఇతరోద్యమముల ఫలసిద్ధికై ఆశించినచో గ్రంథాలయాభివృద్ధి విషయమున సఫలీకృత మనోరధులు కాజాలరు. భినృద్ధివిషయమ
పలువిధోద్యమములందు కృషి సలుపుటకు సమకటీన కేంద్ర సంఘమునందు గ్రంథాలయశాఖ ప్రత్యేకముగ నేర్పడవలయును. ప్రతియుద్యమునకు ప్రత్యేక శాఖల నేర్పరచవలెననెడి యుద్దేశ్యమున్నట్లు ఇదివరకేర్పడిన పరిశోధకశాఖవలన దెలియుచున్నది. గ్రంథాలయములన్నియు కేంద్ర సంఘముయొక్క ప్రాపకము నఁగీకరించినచో వారి స్వాతంత్యమునకు గాని ప్రత్యేకకృషికి గాని భంగము వాటిల్లకుండు విధమున కేంద్రసంఘ గ్రంథాలయ శాఖవలన సహాయమును బొందవచ్చును. గ్రంథాలయోద్యమ ప్రయత్నములు దీనివలన కేంద్రీకరింపబడి సమత్వము అన్నిటియందేర్పడును. ఈవిషయమును గురించియు, దీనియందలి సాధక బాధకములను గురించియు ప్రతినిధులందరాలోచించెదరు గాక!
తీర్మానములు
౧ మహా ఘనతవహించిన మన నిజాము ప్రభుత్వమువారు గ్రంథాలయోద్య మాభివృద్ధియెడ చూపుచున్న సానుభూతికిని, వాడొనర్చుచున్న సహాయమునకును ఈసభవారు కృతజ్ఞతను ప్రకటించు చున్నారు.
౨ నిజాంరాష్ట్ర ఆంధ్రదేశమున గ్రంథాలయోద్యము విషయమున జేయుచున్న ప్రయత్నములకు గాను ఆంధ్రజన కేంద్ర
సంఘమువారిని ప్రశంసించుము ఉద్యమప్రచారమునకై ప్రత్యేకమగు ఏర్పాటు చేయుటకు వారిని ఈ సభవారు కోరుచున్నారు.
3 మహాఘనత వహించిన నిజాము ప్రభుత్వమువారు కొన్ని గ్రంథాలయములకు గ్రాంటులనొసగి చేయుమున్న సహాయమునకు ఈసభవారు కృతజ్ఞతను గనబరుచుచు తక్కినవారిని గూడ ద్రవ్యసహాయము చేయవలయునని ప్రార్థించు చున్నారు. ౪ నిజాం రాష్ట్రాంధ్ర గ్రంథాలయోద్యమ వ్యాప్తినిమిత్తము గ్రంథాలయ సంఘ మొకటి స్థాపించుట యవసరమని యీసభవారు అభిప్రాయపడుచూ దీని కార్యప్రణాళికను తయారు చేయుటకై యీ క్రింది సభ్యులుగల ఉపసంఘమును ఏర్పాటు చేయుచున్నారు. ఆ నివేదికను త్వరలో (అనగా మూడుమాసములలో) ప్రత్యేక గ్రంథాలయ ప్రతినిధుల సభ సమావేశపరచి ప్రవేశపెట్టవలెనని తీర్మానించుచున్నారు.
ఒక విలేఖరిచే వ్రాయబడిన వృత్తాంతము
ఆదివారము ఉదయమంతయు సభ్యులు ఇష్టాగోష్ఠి ప్రసంగములతో కాలయాపనము గావించిరి. మధ్యాహ్నము 1½ గంటలకు వడ్డెపల్లి దేశమఖులగు శ్రీయుత పింగలి వేంకటరామారెడ్డి దొరగారు నిజాఁరాష్ట్రఆంధ్రగ్రంథాలయ సభాధ్యక్షత వహింపవలెనని స్థానికులు ఆహ్వాన సంఘాధ్యక్షులు నగు శ్రీమాడపాటి తిరుమలరావుగారు స్వాగతోపన్యాసము చదివిరి. అధ్యక్షులగు శ్రీయుత పింగలి వేంకటరామ రెడ్డి గారు విపులముగు అధ్యక్షోపన్యాపము చదిపిరి. పిదప గ్రంథాలయోద్యమమును గూర్చి బెజవాడ వాస్తవ్యులను సూరి వేంకట సరసింహశాస్త్రిగారు భారతదేశ గ్రంథాలయములను గూర్చియు, నిజాఁరాష్ట్రఆంధ్రగ్రంథాలయమును గూర్చియు గంభీరోపన్యాసము మొసంగిరి. పిమ్మట శేషాదిరమణ కవులలో నొకరగు వేంకట రమణాచార్యులుగారు తమ పరిశోధనానుభవముల గూర్చి విపులముగా వివరించి చెప్పిరి. అనంతరము అధ్యక్షులు వక్తల ఉపవ్యాసరుల ప్రశంనించిరి. తరువాత గ్రంథాలయోద్యమాభిరూనులును విద్యాధికులునగు యువకులు కొందరు నిజాంరాష్ట్రాంధ్రజన కేంద్రసంఘమునుండి గ్రంథాలయ సంఘమును విడదీయవలయునను నభిప్రాయమును సూచించిరి. పిదప అధ్యక్షులు కాలహరణములతో బసలేదని తెలుపుచు 'ఆంధ్ర కేంద్ర సంఘములు గ్రంథాలయ సంఘమున కలుపవలయునా? వలదా? నియమము లెవ్వియను నంశము ముందు జరుపబోవు సమావేశములో జర్చింపదగినదని అధ్యక్షులు తీర్మానించి సభ విరమించినారలు. సభ్యులలో మఖ్యముగా నొక విధమగు సంచలనముకలిగెను. అనంతరము వందనములతో సభ ముగింపఁబడెను. నాటీసభకు సుమారు 200 మంది ప్రతినిధు లేతెంచియుఁడిరి. శ్రీ శేషాద్రి రమణకవులు అధ్యక్షులనుగూర్చి సభ్యులనుగూర్చి కొన్ని పద్యము చదివి యానందపఱచిరి, సభ 5 గంటలకు ముగింపబడేను.
పైన వివరించిన ప్రకారము సభ ముగింపు అయిన పిమ్మట, కేంధ్రగ్రంధాలయా సంఘము నిర్మాణింపఁబడకపోవుట పరితాపకరమని ప్రత్యేకముగా ప్రతినిధులందరును సమావేశమై తీర్మానించి అధ్యక్షులకంపి కదలిక కలిగిందగా భోజనానంతరము రాత్రి 10 గంటలకు మఱల గ్రంథాలయ సంఘసభ జరిగినది. సభ్యులు ఉత్సాహముగా పాల్గొనిరి. ఆసభయందు గ్రంథాలయ సంఘమును స్థాపింపవలయునని ఆ సంఘ నియమములను ఉపసంఘమువారు తయారు చేయవలయునను తీర్మానము ఎంతయో చర్చమీద అంగీకరింపబడెను. సభ రాత్రి 12 గంటలకు ముగింపబడెను,
భారత వర్షమందరీలి ప్రాచీన సరస్వతీ భాండారములు
(మొగలాయి చక్రవర్తుల గ్రంథాగారములు) ఆఱు శతాబ్దముల కాలమును మనదేశము మొగలాయీ! ప్రభువు లేలియుండిరి కదా! కావున నీ ప్రభువుల కాలమున మనదేశమునందు విద్యయు జ్ఞానమును యేరీతిని వ్యాప్తి జేందినదియు తెలిసికొందము. మహమ్మదీయులు దేవాలయములను, మఠముల నాశనము చేసినకొలదని, మన విజ్ఞానేశ్వద్యము. ఉత్తర హిందూదేశ పర్వత ప్రాంతముల కెట్లు పారిపోయి తలదాచు కొనినదియు ఇదివరికే వినియుంటిరే. అదేరీతిని హిందూ