గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 8/గ్రంథాలయ వార్షికోత్సవము, మధిర
గ్రంథాలయ వార్షికోత్సవము, మధిర
ఫిబ్రవరి నెల ౨౧ వ తేదీ సాయంకాలము గ్రంథాలయ వార్షికోత్సవము ప్రారంభమాయెచు. చిరి. ఈగ్రంధాలయ మతి శీఘ్రకాలములో ఆశ్చర్యకరమగు అభివృద్ధి గాంచెను. స్థాపించిన రెండు సంవత్సరముల నుఁడి యింతవరకు గ్రంధముల సంఖ్య 1000 వరకు పెరిగెను. ఇట్టి ఔన్నత్యదశకు తీసికొనివచ్చిన గ్రంథాలయకార్యదర్శి యగు మిరియాల నారాయణ గుప్తగా రెంతయు ప్రశంసార్హులు. ఈ సంవత్సరోత్సవ సభకు మాదిరాజు రాచుకోటీశ్వరరావు గారు అధ్యక్షత వహించిరి. వీరు హనుమకొండ కాపురస్తులు. సుప్రసిద్ధ న్యాయవాదులు. అగ్రాసనాధిపతిగారు కొంత సమయానుకూల సంభాషణ మొనర్చిన తరువాత కార్యదర్శి గారు తమనివేదికను చదివిరి, దూపాటి వెంకటరమణాచార్యులవారి యుపన్యాసము విజ్ఞానోద్దేపితమై శ్రోతల కెంతయో యుల్లాసమును గలిగించెను. శ్రీయుతులు నయిజాము రాష్ట్ర పూర్వరాజ ప్రతాపమును, పూర్వకవీశ్వర మాహాత్మ్యమును గురించియు వర్ణించునపుడు ఆవేశపూరితుడై ఒడలు గగుర్పొడమ కంట తడిపెట్టని సభ్యుడందులేడని చెప్పుట సాహసము కానేరదు. హకీమ్ రఫీరుద్దీను గారు గ్రంథాలయోపయోగములను గురించి మాట్లాడిరి. “గ్రంథము నవరసభరితమగు స్నేహితుడు. సర్వకాల సర్వావస్థలయందును సన్నిధానవర్తియగు సెచ్చెలి. కొట్టినను తిట్టినాను తన్నినను సహించగల పరమ మిత్రుడు. ప్రస్తుతము గ్రంథాలయములు ధనాభావరోగముచే బాధపడుచున్నవి. వీరికి సువర్ణఘుటీకలనుమా త్రలను వాడవలయునను మొదలు గాగల హాస్యరి సపూరితమయి భావగర్భితమగు వాక్యములచే సభ్యులకు ఆనందమును గలిగించిరి. తరువాత హైదరాబాదు నుండి వచ్చిన అప్పన్న శాస్త్రిగారు నయిజాము గవర్నమెంటు యుద్యోగస్థులందరు మన గ్రంథాలయసభ్యులుగా జేరిన గాని జనులు భయము వీడి మన సభలకు విచ్చలవిడిగా రాగనికి, అధ్యక్షులగు రామకోటీశ్వరరావుగారు సర్కారు ఉద్యోగస్థులందరు ఇదివరకే తమయద్యమమునఁదు సానుభూతి కలిగియున్నారనియు చాలమంది సభ్యులుగా గూడ కలరనియు తమ రాష్ట్రములో సర్కారునకును ప్రజలకును భేదభావము లేకుండ నుద్యమము సాగుచున్నదనియు తమ యంత్యోపన్యాసమున సెలవిచ్చిరి, తంజావూరి లయబ్రరీలో 2000 అముద్రిత తెలుగు గ్రంధములు గలవు. భాషా పుస్తకము గూడ తెలుగు లిపియఁదు గలవు. అచట, ఇద్దరు వీరుల ప్రతిమలు గలవు. అందులో నోకవీరుని పేరు సుబ్బయ్య. దీనిని బట్టి పూర్వము తెలుగుభాష యిప్పుడు మన మనుకొనుచున్న త్రిలింగ దేశపు సరిహద్దులను దాటిపోయి ఎక్కుడు గౌరవ ప్రఖ్యాతులను గడించింది. మనము అధమము నిజాంరాష్ట్రమందున్న పూర్వాంధ్ర చరిత్ర నయినను సేకరించ వలయునని యుద్బోధ మొనర్చిరి. మాములుగా జరుగు వందన సమర్పణను జరిగిన తరువాతి, సభ ముగించబడెను.