Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 8/గ్రంథాలయములు — జాతీయత

వికీసోర్స్ నుండి

గ్రంథాలయములు — జాతీయత

పమిడిపాడు గ్రామమున జరిగిన ఆంధ్ర గ్రంథాలయ మహా సభాధ్యక్షులగు

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్యగారు ఆశువుగానిచ్చిన ఉపన్యాసమున కనువాదము.

గ్రంథాలయోద్యమమునుగూర్చి మీయెదుట ముచ్చటించుటకు నాకు సావకాశము కల్గినందుకు నేను సంతనించుచున్నాను. సూరి వేంకట నరసింహశాస్త్రి గారు ఇదివరలో ముచ్చటించినట్లు నా స్వభావమునుబట్టి రాజకీయ క్షేత్రమున కృషి నేయుటకు నేను తగినవాడను కాను. అయితే వర మానకాలమున దేశమందిలి కవులు, గాయకులు, చిత్రకారులు, అత్వవేత్తలు, ప్రకృతిశాస్త్ర వేత్తలు, సన్యాసులు మున్నగు దేశోద్దారకు లందరు దేశాభ్యుదయమునకై సర్వతోముఖనుగుకృషి చేయవలసిన సమయ మాసన్నమైనది. నా జీవితిమందలి కొన్ని సందర్భములవలన నేను రాజకీయ క్షేత్రమునకు ఆకర్షింపబడి అచ్చటనే నా యకుంఠితే ప్రయత్నము చేయవలయునను దృష్టి సంకల్పము నాకు రూఢమైనది. ఈ రెండు సంవత్సరముల అనుభవమువలన సాంఘికము, విద్యాపిషయికము మున్నుగాగల వివిధములగు మానవకృషి నంతను ఆధ్యాత్మికదృష్టితో సంస్కరించి కేంద్రీకరిపచేసిన గాని రాజకీయముగ మనము అభివృద్ధిని పొంద జాలదును మాట నాకు నిశ్చయమైనది. ఆంధ్ర గ్రంథాలయోద్యమము భారత జాతీయ సౌధ నిర్మాణమునకు ఆంధ్ర దేశమున పునాదులు వేసెనరుమాట నిశ్చయము. జాతీయోద్ధారణ సాధకములగు అన్ని సదుద్యమాములకు ఆంధ్ర గ్రంథాలయములు ఉనికిపట్టువులుగా నుండు ననుమాట నిశ్చయము. గ్రంథాలయోద్యమము విద్యావిధానమున అంతర్భాగముగా నెంచబడతగినవియున్నది. ఇదివరకు ఈ యుద్యమ పక్షమున ఇట్టి కృషియే జరిగి యున్నది, ఈ సభకు అధ్యక్షుడుగా నుండుమని నన్ను కోరినందుని ఈ యుద్యమము యొక్క స్వభావములకు నిర్ణయించుటకును ఇందులీనమైయున్న నిజాతీయతను తొలగించుటకును ఈ సావకాశమును నేను సద్వినియోగము చేసికొనుచున్నాను. మద్రాసు అఖిల భారత సభలో ఈ యుద్యమమును గూర్చి నేను చేసిన ప్రశంస పూర్వపక్షముగను వర్తమానో పన్యాసము సిద్ధాంతముగను ఎంచవలయును. మామూలుగా అందరు సభాధ్యక్షులకు ఆచారమై నట్లు అచ్చునుండి మీకు ఉపన్యాసమును నేను చదువకుండినందుకు కొంత సమాధానము చెప్పవలసియున్నది. హావభావ విలాసములతో కూడి నా యెదుట ప్రత్యక్షముగానున్న సభ్యులతో నేను ముచ్చటించుగును గాని వారి మమోభావములు ఇట్లుండవచ్చునని ముందుగా నామనోఫలకమున చిత్రించుకొని వారిపక్షమున నాయుపన్యాసమును సిద్ధపరచు నాచారము నాకు సరిపడదు. వర్తమానకాలపు నవనాగరికపుస్త్రీ తాను కల్పించుకొన్న ఇతరవ్యావృత్తులచే నియమిత కాలముల యందు మాత్రము శిశువువకు స్తన్యమునిచ్చు అస్వాభావికపు పద్ధతి? యదలంబించవచ్చును గాని శిశు సందర్శన మాత్రముననే స్తన్యము స్రవించుటయే స్వాభావికము. వివిధ స్వభావములుగల సభ్యులు పరిషత్తులయందురు గాన వారివారి రుచుల వైచిత్ర్యమును వక్త అనుసరించ వలెను. కావున ఆశువుగా ఉపన్యసించినందుకు నన్ను మన్నించవలెను.

కేవల రాజకీయములు కాని ఇతర సభలంలో నేను జోక్యము గల్గ చేసుకొనుటకు కారణమును ఇప్పుడు చెప్పియుంటిని, మానవజీవితము ప్రభిన్నమైనదని వాదము నేనంగీకరించను. ఈ రెండు సంవత్సరములనుండియు ఇతర సాధనముల మూలమున దేశాభ్యుదయము పొందు మార్గముల ననుసరించుటకంటే రాజకీయ వ్యవహారముల యందే దేశనాయకులు నిమగ్నులై యుండిరి. జాతీయాభ్యుదయము పొందుటకు ప్రధమమున రాజకీయ సమస్యలకు సమాధానము కుదుర్చుట అత్యావశ్యకమే యైనను హిందూదేశము యొక్క ప్రత్యేక పరిస్థితులను బట్టి సాంఘిక, విద్యావిషయి జోద్యమములు జయప్రదముగా కొనసాగించుచు రాజకీయోద్యమము కొంతకాలమువరకు వెనుకకు నెట్టుట మనకు నావశ్యకమైనది. కావుననే నేను జయిలునుండి బయటకు వచ్చినప్పటి నుండియు సాంఘికశృంఖలములను సడల్పుటకే నేను కృషిచేయుచుంటిని. మహాత్ముడు నిర్మాణకార్యక్రమమున అస్పృశ్యతా నివారణకును దౌర్జన్య రాహిత్యమునకును ప్రాఖ్యత నిచ్చుటయందలి ఉద్దేశము, సాంఘిక రాజకీయ క్షేత్రములయందు తీవ్రమగు కృషి జరుపవలెనని ప్రజలను పురికొల్పుటకే యని నేనూహించుచున్నారు. గ్రంథాలయోద్యమము మఖ్యముగా విద్యావిషయికమైనది గనుక దానిని మనముచేపట్టి భారత జాత్యభ్యుదయము కొరకు ఈ యుద్యమము ఎంతవరకు సాధనభూతము కాగలదో అంతవరకు అందుమూలమున మనము సంపూర్ణముగ లాభము పొందవలసియున్నది. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమునకు మూలపురుషులగు మ.రా.రా.శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారు ఈ సభాధ్యక్షపదవి నధిష్టించవలసినదని నన్ను కోరినపుడు నేను ఆకోరికను సంతోషముతో స్వీకరించితిని. ఈయుద్యమము యొక్క ఆంతరంగిక మగు వ్యవహారములు నాకు తెలియవుగాని మహాత్ములు స్థాపించిన జాతీయోద్యమము యొక్క జయము చాల వరకు ఈ యుద్యమమూలమున చేగురినని నేనెరుగుదురు. ప్రతిగంథాలయపు అధ్యక్షుడును కార్యదర్శయు గాంధిరాజ్యపు మునసబ్బు గాని కరణముగా గానిమానెను. ఈ రెండు సంవత్సరములలో ఆంధ్రప్రదేశ మందలి చాల గ్రామములయందు నేను సంచారము చేసి యుంటిని. అప్పుడు ప్రతి గ్రంథాలయమును ఈమహదువ్యమమును ప్రజ్వలింపజేయు కార్యక్షేత్రమై ప్రాముఖ్యత వహించి యుండెను. ఈ యుద్యమములో కొంత నిజాతియత లీనమై యున్నమాట నిజమే యైనను దీని మూలమున దేశాభ్యుదయమునకు కల్గిన బలమును బట్టి ఇందును గూర్చి మనము కృతజ్ఞులమై యుండవలసి యున్నది.

ప్రధమ అఖిలభారత గ్రంథాలయసభ చెన్నపట్టణములో జరిగినపుడు గ్రంథాలయోద్యమము జాతీయ ప్రతిష్టాపనమేనా యనునంశము గూర్చి తీవ్రమగు చర్చ జరిగింది. అపుడు సభాధ్యక్షులగు కుడల్కాగుగారు ఆయన పదవినిబట్టి ఆయనకు అదనముగాగల వోటు నిచ్చుటచే ఈ యుద్యమము విజాతీయమని నిర్దారణకాకుండ తప్పించిరి. అప్పటినుండియు నీవిషయమై పత్రికాముఖమున గాని సభలలో గాని చర్చ జరుగలేదు. కడచిన పదిసంవత్సరములనుండియు ఉద్యమ చరిత్రను మనము పరిశీలించితిమేని ఇందు లీనమైన విజాతీయ స్వభావమును పోగొట్టుకొనుటకును జాతీయ ప్రతిష్టాపనగా దీనిని నిర్మాణము చేయుటకును మనజాతీ యాంతరాత్మ చేసినకృషి మనకు బోధపడక మానదు. ఒక గ్రంథాలయము కుస్తీపట్లు, కత్తిసాముకు ప్రాముఖ్యత నిచ్చుచున్నది. ఇంకొకటి గ్రంధప్రకటన కార్యము నవలంబించు చున్నది. కొన్ని గ్రంథాలయములు సంగీతము మొదలగు లలితకళల యభివృద్ధికొరకు కృషిచేయు చున్నవి. ఇంకొకటి స్వచ్ఛంద భటులను లేక రామదండును తయారు చేయుచున్నది. మరియొకటి వడుకు నూలు ఉద్యమమును వ్యాప్తి నొందించుచున్నది. కొన్ని గ్రంథాలయములు సహకార సంఘములను అభివృద్ధి నొందించుచున్నవి. దీని యంతటి వలనను విజాతీయ భావములు దేశీయోవ్యమములయందు లీనమగుటచే స్వాభావికముగా తీురుగు ఏవగింపు కల్గుననియు, జాతీయాంతరాత్మయుక్క ఉత్తేజముతో అట్టి యుద్యమములు స్వాభావిక స్వరూపమును పొందుచున్నననియు మనకు బోధపడక మానదు. నిజముగా ఐరోపా గ్రంథాలయములలో ఏదియు ఇట్టిపనులకు తలపెట్టదు.

గ్రంథాలయోద్యమమందు లీనమైయున్న మొట్టమొదటి విజాతీయాభావము ఆ ప్రతిష్ఠాపనయందు ఉపదేష్టకు స్థానము లేకపోవుట. భారతీయ ప్రతిస్థాపనలలో ఏదియు మానవప్రకృతికి సహజనుగు లక్షణములేనిది లేనేలేదు. ప్రతి గ్రంథాలయమును నడుపు కార్యదర్శియు ఆద్యక్షలును గ్రంథాలయమునకు వచ్చువారితో నన్యోన్యసంబంధము కల్పించుకొనువారు కారు ముఖ్యముగా వారు పుస్తకములను సేకరింతురు. వానిని భద్రపరుతురు. వర్గీకరణ చేయుదురు.నును. ఈ వర్గీకరణము 'అ' కారాది క్రమముగ పుస్తకముల నామణులను బట్టిగాని వాని గ్రఁథకర్తలనామములనుబట్టి గాని చేయబడును గాని చదువరుల మానసఫరిణామమునుబట్టి గాని వారి అవసరములను బట్టి గాని జరుగుట లేదు. వారు చదువరులకు ఉపదేశము చేయువారమని గాని లేక చదువు కొనుటయందు సహాయము చేయువారమని గాని ఎప్పుడును చెప్పరు. ఈ గ్రంథాలయ సభ్యులు చాలవరకు యువకులుగానే యుందురు గాని వారి మానసవికాసమును నైతికాభివృద్ధిని సరియైన మార్గముల నడుపుటకు ఒక సహాయకుడు ఉండితీరవలయును. గ్రంథాలయము నిర్జీపమైనది గానుండక సజీవమై మనుష్యత్వవికాసమునకు సహాయము చేయునదిగా నుఁడవలెను. చదువరుల అధికారానుసరముగ వారలకు పుస్తకములం చదువనిచ్చిన గాని గ్రంథాలయము ఉపయోగకారి కానేరదు. చిరకాలాగతముగ వచ్చుచున్న తత్వవేత్తల యొక్కయు, కళాభిజ్ఞుల యొక్కయు పరిజ్ఞానమును భద్రపరచెడు ఊరగాయలజాడీలవంటివి గ్రంథాలయములని చెప్పనొప్పును. గ్రంథాలయము సర్వజనసామాన్యము చేయవలయునను సుత్సాహముతో ఉత్తరాధమగ్రంథములకు సమానముగ అందు స్థానమియబడు చున్నది. ఇందువలన విక్షణునా జ్ఞానములేని చదువరులకు ముప్పు వాటిల్లును. భారతీయవిధ్యామర్యాదలను పరికించుచో పఠనీయ గ్రంధముల నిర్ణయించుటయందు అధికారిభేదము బాగుగా పాటింపబడినట్లు బోధపడగలదు. రసాయనశాస్త్రజ్ఞుని రసశాలలో అజ్ఞాని ప్రవేశించి అందలి వస్తువులను ఇచ్చినచ్చినట్లు స్పృశించినచో కల్గెడు ఫలితమేమో కొంచెము యోచింపుడు. రెండవది జాతీయభానము. గ్రంథాలయములయందు గ్రంథములయెడల సవినమగు భక్తిలేగుండుట. భారతజాతియొక్క మర్యాదల ననుసరించి మనము ఏదైన పుస్తకము చదువుటకు ప్రారంభించక పూర్వము సరస్వతి, గజాశన మొదలగు దేవతా ప్రార్ధన శ్లోకములను చదువవలసియున్నది. ఆధునిక విద్యార్థులకు ఇది నిర్థకముగా తోచవచ్చును గాని అక్షరవిన్యాసము చేతను, వానిని సుస్వరముగా నుచ్చరించుట చేతేను ఎట్టిమహాశక్తులవనించుచున్నదియు, ఆశక్తులు ఆత్మీయశక్తి యొక్క వికాసమున కెట్లు సాధనభూతము లగునదియు విచక్షణాబుద్ధితో విచారించిన రూఢ మగును. మత్రంముల ప్రభావమునుగూర్చి ఇచ్చట ముచ్చటించుట అప్రస్తుతము. పుస్తకములు కేవల విద్యాసాధన ములుగనే గాక నాదనిక్షిప్తపేటికలుగ గూడ మనము పూజించివలెను. గ్రంధపఠనము పాఠకునియొక్క అధికారమును బట్టి అనేకరూపములను తాల్చవచ్చును. ఒకరు కానీపత్రికలో విమర్శను ప్రచురించుటకు చదువవచ్చును. ఇంకొకరు రాజ్యాంగపక్షమున గ్రంధమును బహిష్కరించు సుద్దేశముతో చదునవచ్చును. మరియొకరు తన పొడిత్యమును తన విద్యార్థులయెదుట ప్రగల్భములు కొట్టుకొనుటకు చదువవచ్చును. వేరొకరు కునికి పాటులు వచ్చుచున్న కాలమున ఎట్లో కాలము గడుపుటకొరకై చదువవచ్చును. మనము మన గ్రంథాలయలయందలి పుస్తకములను సర్వినియోగముచేయు నుద్దేశముతో చదువవలెనని గదా మన యాశయము, దానినుండి చదువరి సంపూరజ్ఞానము పొందవలయును. అందలి వర్ణసమామ్నాయోచ్చారణమువలనను దానియందు నిరూపణము చేయబడిన తత్వానుభవమువలనను కల్గెడి సంపూర్ణ లాభమును పొంది చదువరి అభ్యుచ్ఛయము పొందవలసి యున్నది. వర్ణములును వాని యుచ్చారణము “మహేశ్వరమాత్రములు” అవి సర్వేశ్వరుని ఆలంకారమగు వర్ణమాల. బ్రహ్మవర్ణములనుండియే ప్రపంచము సృష్టి చేసెను. అవి ప్రకృతిబీజములు. మరియు అవి ప్రపంచ పరిణామము యొక్క ప్రత్యక్ష స్వరూపము. నాదము పురుషునియొక్క ప్రధమ స్వరూపము. అది మానవుని అంత్యస్వరూపము కూడ నగుచున్నది. తక్కిన కళలు తర్వాత ఉత్పన్నమగును. మనము వినుధ్వనికంటే నాదము ఎక్కువ సున్నిత మైనది. మనకు అనుభూతమగుదానికంటే దానియందు ఎక్కువ అర్ధము లీనమై యున్నది. ఏక వస్తువు వివిధశబ్దవాచ్యపై వివిధ స్థలములయందు వివిధ మానవుల చేసుచ్చరింప బడుతున్నది. ఉదాహరణకు దహింపచేయు వస్తువు నొకదానిని తీసుకొందుము. ఒకరు దీనిని ఫైరు అనిపిలుతురు. మరియొకరు అగ్నియందురు. ఇంకొకరు నిప్పు అందురు. వస్తువు ఒకటే, వేరువేరు మనుష్యులు, దీని పేరును, వేరువేరుగా ఎందుకు వ్యవహరించవలెను? హలుఫైరు అనుశబ్దము వినినతోడనే మనకు కొన్ని యూహములు కలుగుచున్నవి. లంక లంగుచున్నవి. అగ్నియను మాట వినినతోడనే మరియొక విధమగు సూహలు కలుగుచున్నవి. ఈ రెండు మాటలు రెండు భాషలలోనివి. ఈ రెండుమాటల ఉచ్చారణవలన కల్గెడీ మనోభావములు వేరుగానున్నవి. అవి వ్యక్తితో సంబంధముకలని, మనము మన ఇష్టదేవతలనే యారాధింతుము. పరిస్థితితో కూడినపుడు గాని వ్యక్తిత్వమునకు సంపూర్ణవికాసము చేకూరదు. ఈ అనంతమగు బ్రహ్మాండమందు అనేకమగు అంతరము గల లం గల పరిస్థితులుండియున్నవి. ప్రతివ్యక్తియు తన కనురూపమగు పరిస్థితి నాశ్రయించు చున్నాడు. గ్రంథాలయమున చదువరు లందరకు సమానమగు సావకాశములు కల్గచేయుట యుక్తమేగాని ఈసావకాశములను సద్వినియోగము చేసికొనుటకు తగిన సహాయము లేనిచో అందువలన అనర్థకములు కల్గును. కావున ఉచిత గ్రంధములను చదువరి ఏరుకొనుట ముఖ్యావసరము. తాత్కాలిక ఉద్రేకము చేతను అసంస్కృతవాంఛచేతను పఠనీయ గ్రంథమును నిర్ణయించు కొనినచో దారి ఎప్పుడును తప్పుగానే పోవును. చదువరియొక్క అధికారమును నిర్ణయించి తదనుగుణమగు గ్రంథమునూ పఠింప చేయుటకు తగిన గురువు గ్రంథాలయమందుండితీరవలయును. చదువరియొక్క ఇష్టదేవత ప్రళయ కాలాగ్ని రుద్రుడైయుండి ప్రళయకాలమందు బీభత్సరసముతో నాట్యముచేయు నటరాజుయొక్క పదవిన్యాసము. అవ్యక్తియొక్క కార్యములను ప్రేరణ చేయవలసినప్పుడు తగిన గ్రంధమును చదువరికి మనము నిర్ణయించనిచో సంతత సమరోన్ముఖుడగు పరశురాముని బుద్ధునిగా మార్పుటకు ప్రయత్నము చేయుటయగును. ఇట్టి విపరీతములు చదువుకి అనుకూలమగు గ్రంథము లభ్యముకానప్పుడు ఏర్పడును. గ్రంథస్థ పదములను, పదములందలి వర్ణములను, పదమునుండి వాక్యములను కూర్చినప్పుడు వానియన్నిటీ యందు గ్రంథకర్త మాతృవాత్సల్యము కల్గియుండును. గ్రంథమును ప్రీతితో పఠనముకొరకు స్వీకరించుట యనగా దానిని పూజించుటయే. తల్లి తన శిశువును ఇతరులకు ముద్దాడ నందించునపుడు శిశువును అధమము ఆఇతరుడు ఆశీర్వదించవలయునని యైనను తల్లి తలంచును. నీపిల్లలయందు నీకు ఎంత ప్రేమయో ఇతరుల కూడ తమపిల్లలను అట్టి ప్రేమతో చూడవలయునని కోరుదురు గదా. నీపిల్లలు చేయు తప్పులను నీవు ఖండిందుదువుగాక ! నీ పిల్లవాని అలవాట్లు మంచివికావని నీకు సంకోచ ముండును గాక! అయినను నీపిల్లయెడల నీవు సంపూర్ణ మానవస్వభావముతోనే ప్రవర్తించెదవు. మన జీవితాభ్యుదయమునకు సాధనభూతముగా నుండు దానినే మనము స్వీకరింతును. మనము స్వీకరించిన దానియందు మనకు భక్తి యుఁడితీరును. ఇట్టి భక్తిభావము శూన్యముగానున్న పుస్తకాగారమును భారత జాతీయ ప్రతిష్ఠాపనగా పరిగణించుటకు వీలులేదు.

ధారావాహికముగా వచ్చుచున్న జాతీయజీవనమునకు అనుగుణ్యమగునట్లు అధునాతన పరిస్థితులను మార్చుటలో గ్రంథాలయమునందు దేవాలయమునందువలె పూజ్యభావము నెలకొల్పబడును, సంపూర్ణముగ పాశ్చాత్య ప్రతిష్టాపనయగు ఈ గ్రంథాలయమునకు అను గుణ్యమగు బాహ్యరూపమును పొందియు ప్రత్యక్ష విరుద్ధ లక్షణములతో కూడియున్న భారతీయ ప్రతిష్టాపన సిక్కుల గురుద్వారమును అందుపూజింపబడు గ్రంధసాహెబును, ప్రపంచ మంతటియందు ప్రసిద్దివహించిన సంయమాంద్రుల గీతాఁజలుల యొక్క సమూహమే గ్రంథసాహెబు అగుచున్నది. అధునాతన గ్రంథాలయమున కొరతబడి యున్న భక్తి పరిపూర్ణులగు చదువరులు, ఏకలక్ష్యమందు మనస్సులను లగ్నముచేసిన శ్రావకులు, గురువురు శిష్యులును వైద్యుడును రోగులను - వీరందరి ఏకత్రసమావేశమే ఈఉన్నతమగు భారతీయ పత్రిష్ణాపనము నందలి ప్రాముఖ్య లక్షణములు.

గ్రంథాలయములయందు ఎట్టి గ్రంథములుండవలెనూ విచక్షణ లేక పోవుట ఈ ప్రతిష్టాపన యందలి మూడవ నిజాతీయ లక్షణము. ప్రచురింపబడిన ప్రతిగంధమును ప్రతి మనుజునికిని అవసరములేదు. కొన్ని ప్రత్యక్షములుగా హనికరములైనవి. కొన్ని తాత్కాలికముగా ఉపయుక్తము లైనవి. కొన్ని గ్రంథములే శాశ్వతముగా భద్రపర్చతగినవి. గ్రంథాలయమును సృష్టిపై చిత్రములతో నింపిన బ్రహ్మడంముతో పోల్చిచూచినచో చవిటిపఱ్ఱలు, ఎడారులు ఱూతిభూములు, బురద మడుగులకు పోల్చతగిన కొన్ని గద్య కావ్యములును సర్వపుష్పఫలశోభికమ వనాంతరములు, నేత్రపర్వము నొనర్చు రమణీయమగు ఉద్యానవనములు, నైలు గంగా మొదలగు మహానదులతో పోల్చదగ్గు పద్య కావ్యములును ఇందున్నవి. ఇవి యన్నియు మనుజునిదైనది జీవయాత్రకు అవసరమైనవి కావు. అయితే ఇందులో లేనివి మాత్రము గ్రంథాలయమందు, గృహస్తుని ఇంటియందును, గ్రామమందును, గ్రంథాలయమందును, భద్రపర్చతగినవి. బొమ్మ జెముడును ఉద్యానావనమందు పెంచవలెనని ఏ మనుష్యుడును వాంచించడు. కాని ఔషధీవనములో వైద్యుడు దానిని పెంచితీరవలయును. మనుజుడు కుక్కను, ఆవును తనయింట పెంచను గాని సింహమును పెద్దపులిని పెంచడు. వీనిని వివిధ జంతు ప్రదర్శనశాలయందు జంతుశాస్త్రజ్ఞుడు పెంచును. ఔషధీవనము జంతుప్రదర్శనశాలయు కూడ సంపూర్ణముగ ప్రయోజనకరములని చెప్పుటకు దలనుపడదు. పెద్దపులియొక్కయు,సింహము యుక్కయు, సంపూర్ణ స్వభావము స్వాభావికస్థితిలో వనమున వేటాడునపుడు వ్యక్తమగును గాని బందీకృతముగా బోనులో నుంచినపుడు కాజాలదు. నూతనముగా అభివృద్ధిని గాంచుచున్న జంతుశాస్త్రజ్ఞులకు ఈ ప్రదర్శన శాలలవలన కొంత ప్రయోజన ముండవచ్చును. ఆది ఉత్తమ ప్రయోజనము కానేరదు. సనాతనమగు ధర్మమును బోధించు గ్రంథములే గ్రంథాలయముందుండతగినవి. అచ్చుపడినంత మాత్రమున గ్రంథాలయమున గ్రంథమునకు స్థానముండరాదు, ముద్రణ యంత్రమును, ప్రజాస్వామికతత్వము యొక్క అపభ్రశ్రభావమును ప్రతి గ్రంథమునకును గ్రంథాలయమున స్థాన మిచ్చుటకు కారణములు. గ్రంధ ప్రకాశకులు కూడ ప్రతిగ్రంధమును ప్రకటించరాదు. నిజమగు గ్రంథాలయమందు వేదములు, ఖురాను, బైబిలు, తత్వశాస్త్రగ్రంథములు, ప్రకృతిశాస్త్ర గ్రంథములు, విజ్ఞాన సర్వస్వములు మొదలగు నుద్గ్రంధములు మాత్రమే యుండతగినవి. వివిధ వస్తు ప్రదర్శనశాలలు, భారతీయజాతిజీవనమునకు అనుగుణ్యమైనవికావు. అవి మనుజుని లలితకళాసౌభాగ్యమునకు శ్మశానవాటికల వంటివి. అచట భస్మము, బొమికెలు మాత్రము భద్రపర్చబడును. ఇవి యన్నియు చరిత్ర కాధారమని చెప్పెదరు. పితృవర్గము యొక్క సుగుణపుంజమును విశదీకరించుటకు ఈ కాలపు చరిత్రలు ఎంతవరకు ఉపకరించుచున్నవి? దేవాలయముసు మసీదును జీర్ణోద్ధారణ చేసినచో పితృవర్గము నెడల మనకుండు భక్తిని ఎక్కువబాగుగా తెలుపుడు చేయదా! స్వాతంత్య్రభావమే ఇప్పుడు ప్రపంచము నంతను ఊగులాడించుచున్నది. ఈ తత్వము యొక్క సరియైన వ్యాప్తి సామాన్యజనులకు సంపూర్ణముగా వ్యక్తమగుటలేదు. అధునాతన మనుజునకు సమ్రతలేదు. కృతజ్ఞత లేదు. చరిత్రయన అతనికి ఎక్కువ సరదా. అదియే అతనికి తెలుసును. వైచిత్య్రముచే మమోహరముగు జీవితతత్వము ఆతినికి సామాన్యముగా బోధపడదు. కాలప్రవాహమున అతడుపడి కొట్టుకొనిపోవుచున్నాడు. ఆధునిక గ్రంథ భాండాగారికుడు గ్రంథ విభజన పట్టికలను వ్రాసినట్లుగానే ఆధునిక మనుజుడు సమాధుల మీద మృతమనుజుని సంక్షిప్తచరిత్రను మాత్రము వ్రాయగలడు. నిజమైన రసస్ఫూర్తిగల ఏవ్యక్తియు వివిధ వస్తుప్రదర్శనశాలను మాని ఆనందము పొందనేరడు. గ్రంథాలయముకు వివిధ వస్తుప్రదర్శనశాల కాకూడదు. కూడదు. కుంఠీభావమును పొందిన మనుజుని మనోవికారమునకు ఫలితమగు నుత్పన్నమగు అధమ గ్రంథములకు గ్రంథాలయమున స్థానముండరాదు. సార్థకమగు గ్రంథాలయమఁదలి గ్రంథములం మనుజుని మానసిక, నైతిక జీవితము నుత్తేజము చేయునవిగా నుండవలెను.

ఇంక గ్రంథాలయముల వలన సంఘమునకు కల్గెడు లాభములనుగూర్చి వివరించెదను. ఈ ఉద్యమ ప్రచారకులు ప్రతి గ్రామమందును ఒక గ్రంథాలయము స్థాపించివలెనని వాంఛించుచున్నారు. అట్లు చేసినచో మనుజుని జీవితమును సర్వతోముఖముగ వికసింపచేయ గల్గును. మనుజుని సాంఘిక, నైతిక, మానసిక తత్వముల యభివృద్ధికొరకు దొరతనమువారి తటస్టభావకారణమున మనదేశమన తగిన సాధనములు లేక యున్నవి. ఈవిధులను పూర్వపురాజు నిర్వర్తించుచుండిరి. ఇపుడు ఫ్రాన్స్ దేశమున లలితకళల అభివృద్ధికొరకు రాజ్యాంగమున ప్రత్యేక శాఖకలదు. ఇట్లే పాశ్చాత్య దేశములందన్నిటియందునుకూడ కలదు. సాంఘికాభివృద్ధికొరకు అచ్చటి ప్రభుత్వములు విశ్వప్రయత్నిములు చేయుచున్నవి. మనదేశమున మాత్రమే ప్రభుత్వము వారు ఈయన్ని విషయములయందును మూకీభావమును పొంది యున్నారు. ఆంధ్ర గ్రంథాలయ సంఘమువారు ప్రతిగ్రామమందును ఈ జబాబుదారీ వహించవలెనని నా యాశయము. రాజకీయ విషయములయందు కృషి చేయుటకు ప్రతి గ్రామమందును కాంగ్రెను సభయుండునుగాన తక్కిన అన్ని విధములగు మనుజునీయభివృద్ధుల గూర్చియు పాటుపడుటకు తగినట్లు గ్రంథాలయములుండవలెను. అట్టయినచో గ్రంథాలయములు, జీర్ణమై పోయిన చిత్తరువులును మనకు తిరిగి సంగ్రహమగును. ప్రాచీనపండితుల వైదుష్యలాభము దేశము పొందగలదు. జాతివర్ణ విచక్షణ లేకుండా “సర్వేజనాః సుఖినోభవంతు" అను న్యాయానసారమున బీదజనులకు అన్నదానము అచ్చట చేయవలెను. అనాథలకు అచటశరణ్యము చేకూరవలెను. బీదలకు అన్నదానము అందరకును ఆదరణీయమే. ఈపని వెఁటనే వూనుకొనవలసి దైయున్నది. అనాథలను జాడ్యగ్రస్తులను సంరక్షణ చేయుట అవశ్యాచరణీయము. ఈ విధిని కూడ గ్రంధాలయములు నిర్వర్తించవలసియున్నది. గ్రంథాలయ నిర్వహణములో ముఖ్యముగ గమనించవలసిన విషయమొకటియున్నది. ఈ ప్రతిష్ఠాపనలు సర్వజనసమాదరణీయముగా నుండవలేను. తగాదాలను పెంచు విషయములలో గ్రంథాలయము లెన్నడును దిగకూడదు. భారతజాతియొక్క పరమ లక్ష్యమును, జీవిత పరమావధియు ఈశ్వర సృష్టి యందలి ఐక్యభావమును అనుభవములోనికి తెచ్చుటకు గ్రంథాలయములు నిరంతరము కృషి చేయుచుఁడవలేను. గ్రంథాలయభవనమందైనను అచ్చట సమావేశమగు స్వల్పకాలమువరకైనను అయ్యోన్య సౌజన్యము కల్గి యుండునట్లు మనము పరిస్థితుల నేర్పర్చుకోవలెను. జగన్నాథస్వామి దేవాలయమందు జాతిపిచక్షణలేక అందరికి ఎట్లు ప్రవేశమున్నదో గ్రంథాలయమందు కూడ నల్లే జాతిమతనిక్షణలేకుండ ప్రవేశముండవలయును. స్వరాజ్య సౌధనిర్మాణముకు ఈ గ్రంథాలయములు ప్రధమపునాదులుగా నుండును.

మనకు ఇక జాగుచేయకూడదు. మన భావిభాగ్యము త్రాసులో ఊగులాడుచున్నది. పాశ్చాత్య దేశమున సుద్భవించినదను కారణమున గ్రంథాలయమును గాని మరియే ఇతర ప్రతిస్థాపననుగాని మనము త్యజించకూడదు. భ్రమర కీటన్యాయానుసారముగా ఏప్రతిస్థాపన నైనను మన జాతీయ జీవనమును కనుగుణ్యమగునట్లు మనము చేసుకొనవలసి యున్నది.

గ్రంథాలయోద్యమముయొక్క పూర్వ వృత్తాంతమును గూర్చి నేను ఖండించను. నిశ్చితలక్ష్యము ననుసగించకుండ పలుత్రోవలు వం తొక్కుచు ఈ యద్యమము ఇదివరలో కృషి చేసియున్నది. కొన్ని సత్కార్యములు కూడ ఈ యుద్యమపక్షమున జరిగినవి. గుంటూరు మండల గ్రంథాలయ సంఘమువారు ప్రచురించిన కరపత్రములు నిరర్ధము లైనవి. ఈ యుద్యమము నిర్ణీత ప్రాప్యము కలదై దేశాభ్యుదయముకొరకు కృషిచేయు ఇతరోద్యమములతో ఉచితమగు సంబంధములు కలదిగా నుండవలెను. విస్పష్టమగు కార్యప్రణాళికను నిర్ణయించు కొనవలసినదని మిమ్ములను కోరుచున్నాను.