గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 7/భారత వర్షమునందలి ప్రాచీన సరస్వతీ భాండారములు
భారతవర్షమునందలి ప్రాచీనసరస్వతీ భాండారములు
౩ శ్రీ సారస్వతరక్షణము
ప్రాచీన కాలమునందు విద్యనభ్యసించు పద్ధతి యిప్పటివలె నుండునది కాదు. ఆకాలమునందు గురువు ముఖస్థమన శిష్యులు పాఠములను గంఠపాఠము జేయుచుండిరి. ఈవిధమున నేగ్రంథములు నెల్ల కఁఠపాఠము జేయుచుండిరి. వ్రాతప్రతులయందు స్టాలిత్యములుండుట నైజమగుట చేత ఆకాలమునందు శ్రుతి పాండిత్యమునే యెక్కువగ నబివృద్ధిపఱచిరి. ఇందుచేత విద్యార్థికి తాను జజవిన గ్రంథములు నెల్ల కంఠస్థములై పుస్తకాపేక్షలేకయే ఎప్పుడే విషయము కావలసినను సిద్ధముగ జ్ఞప్తియందుండు చుండెడివి. పుస్తకములను వ్రాసి జాగ్రత పరచుటకు సామాన్యులకు సాధ్యముకానిపని యగుట కూడ ఆ కాలమునందు శ్రుత పాండిత్యమే యెక్కవ వ్యాప్తముగా నుండుటకొక కారణమై యుండవచ్చును. ప్రాతిమోక్షమను కావ్యము బౌద్దులకు మిక్కిలి పవిత్రవంతమైన కావ్యము. దీనిని ప్రతి మఠము మందును నెలకొకసారి భిక్షులు చదువవలసియుందురు. ఏమఠమునందెన దీనినికంఠ పాఠముగా వల్లింపగల భిక్షుణ లేనియెడల తమకు సమీపముగానున్న మఠమునుండి దీనిని చింతనము చేసిన భిక్షువుని పిలిపించి వల్లిపవలయును. అంతేగాని గ్రంధమును దెప్పించుకొని చదువగూడదని నిర్ణయిఁపబడెను. భిక్షులు వర్షాకాలమునందు ప్రయాణము జేయగూడదను నియమము గలదు, కాని యేభిక్షువైన తనయవసానకాలమునందు తానెరిగియున్న సూత్రంత్రముల నితరులకు చెప్పవలెనని వాంఛించి, కోరినప్పుడు వారీనియమమును మీరవచ్చును. ఈ సంగతులనుబట్టి ఆకాలమందు శ్రుతపాండిత్యమున కెట్టి ప్రాధాన్య మీయబడెమో తెల్లము కాగలదు.
“ఫాహియాను” అను చీనా దేశ యాత్రికు డయిదవ శతాబ్ద ప్రారంభమునందు “వినయ" అను బౌద్ధ మతగ్రంథ సంపాదనార్థమై భారతవర్షమునకు వచ్చినప్పు డాయన కాగ్రంథము యొక్క వ్రాతప్రతు లెక్కడను దొరికియుండలేదట. గురువులు ముఖతఃమాత్రము పాఠములను జెప్పుచుండిరట.
౪ ప్రాచీనకాలమునందలి గ్రంథాలయములు
భారతవర్షమున ప్రథమమున గ్రంథ భాండారముల నేర్పరచినది బౌద్ధులని చెప్పవచ్చును. “ఫాహియాను” సంస్కృతభాషను చదువుటకును, గ్రంథముల ప్రతులను వ్రాసికొనుటకును మూడువత్సరముల కాలమును పాటలీపుత్రమందు గడిపియున్నాడు. మఱియు, మహాసాంఘికము, సర్వాస్తివాదము, సంయుక్తాభిధర్మహృదయశాస్త్రము, పరినిర్వాణవైపుల్య సూత్రము, మహా సాంఘికాభిధర్మము, అను గ్రంథములనుగూడఁ జూచెను. ఈ గ్రంథముల కన్న ప్రాచీనములగు సంస్కృత గ్రంథములు వ్రాతప్రతులు మధ్యాసియాయందున్న బౌద్ధ విహారములయఁదు గానుపించినవి. కానీ అయిదు, ఆరు, ఏడు శతాబ్దములయందు బౌద్ధవిహారములు దేశమునందంతటను ప్రబలి, విద్యావ్యాపంగమునకుగు, వివిధములగు కళల యభివృద్ధికిని కారణభూతము లయ్యెను. అప్పుడే మహాయాన పౌరాణిక బోధనలు ప్రాముఖ్యతకు వచ్చి శాస్త్రము, వేదాంతము, మతము, మున్నగు విషయములను గూర్చిన గ్రంథములు విశేషముగ ప్రబలినవి. ఆసియాఖండము సఁతకును నలందా విశ్వవిద్యాలయము మాతృరాజమై వెలసినప్పటి నుండియు గ్రంథ భాండారములకు ప్రత్యేకముగ గొప్ప భవనము నిర్మింపఁబడు చుండెను. బౌద్ధ జైన మఠము[1]* లయా మత గ్రంధములకు నిలయములైన రీతినే గుప్తావంశ చక్రవర్తుల కాలమున దేశమఁదలి దేవాలయము లన్నియు సనాతన ధర్మగ్రంధములకు నిలయములయ్యెను. దేవాలయములు మొదలగువానికి గ్రంథములను దానము చేయుట పరమోత్కృష్ట మగు కార్యమని హేమాద్రి తన దానఖండమందు[2]♦ జెప్పియున్నాడు. పౌరాణిక మతానుసారులేగాక బౌద్ధజైన మతావలంబకులు గూడ దీనిని ఘనకార్యము క్రింద పరిగణించిరి. [3]? ఈ కాలమునాటి శాసనములు కూడ గ్రంధములను దానమిచ్చుట యందుగల ప్రాశస్త్యము నుద్దోచించు చున్నవి. పశ్చిమ హిందూదేశము నేలిన వలాభిరాజులచే వ్రాయబడినట్టి క్రీ.త.౫౬౮ సంవత్సరము నాటిదగు నొక శాసనమునందు, బౌద్ధభిక్షులడుగు దుద్ధమఠము యొక్కయు ఉపయోగార్థమై సద్ధర్మ పుస్తకములను గొనుటకై విరాళము నొకిరిచ్చినటులు జెప్పఁబడినది. ఇప్పటికినిగూడ జైనులలో ధనవంతులు గ్రంథప్రతులను వ్రాయించుటకును, పవిత్ర గ్రంథములు నభివృద్ధిపఱచుటకును మఠాధికారులకు విశేషద్రవ్యము నొసంగెదరు. అందుచేత పశ్చిరు హిందూ దేశమున జైన గ్రంథాలయములయందు ఒకే గ్రంధమునకు వందలకొలఁది పతులు గూడ నేర్పడినవి. “అహమ్మదాబాదు” నందున్న ఒక గ్రంథాగారమునందు "ఆవశ్యక సూత్రములు” అను జైనగ్రంథము యొక్క నాలుగు వందల వాతప్రతులుఁ గలవు.
౫ మూడు విధములగు గ్రంథాలయములు.
బౌద్ధ, జైన మఠములయందుగల గ్రంథాలయములను గూర్చియు, హిందువుల దేవాలయములయందుగల గంథాలయములకు గుఱించియు నింతవరకు జెప్పితిమి. ఈ రెండును ద్వివిధములగు పరిజ్ఞానములకు నిలయములై యెప్పియున్నవి. కాని కాలక్రమమున చక్రవర్తుల పోషణచే లౌకిక సారస్వతము అభివృద్ధియైన కొలదిని రాజభవనములును, సభామండపములును గూడ గ్రంధ భాండారములకు నిలయమాలయ్యెను. నేటికిని ఈ త్రివిధములగు గ్రంథభాండారిములకును దృష్టాంతములు నిలిచియేయున్నవి. ఇట్లు నిలచియున్న వానిలో మొదటి తరగతివగు పశ్చిమ హిందూదేశమునందలి జైన భాండారములును, వివిధ మఠములయందున్న గ్రంథాలయములును తంజావూరు, కాశ్మీరము, నేపాలు, మైసూరు రాజభవనములయందున్న గ్రంథ భాండారములును, పుత్రి సభామండపములయందున్న గ్రంథ భాండారములును ముఖ్యములైనవిగ నున్నవి.
౬ ప్రసిద్ధములగు బౌద్ధగ్రంథాగారములు
బౌద్ధనుతిభిక్షలకు సంబంధించిన ప్రాచీన గ్రంథాలయముల కెల్ల పెద్దదియు, ప్రఖ్యాతివంతమైనదియునగు గ్రంథాలయము "నలంద" గ్రంథాగారమై యున్నది. భారతవర్షమున ప్రాచీనకాలమునందు గల విశ్వవిద్యాలయముల యఁదెల్ల యీ గ్రంథాగారమే అగ్రస్థానమును వహించియున్నది; ఈ గ్రంథాగారము రత్నోదధియను నామముచే విఖ్యాతవంతంబగు తొమ్మిది యంతస్తులుగల దేవాలయమునఁదు పెట్టబడి యుండెను. "బుద్దగీయ” యందు గల తొమ్మిది యఁతస్థుల దేవాలయమునే యిదియు పోలియుండెను. ఈ గ్రంథాగారము మహాయన హీనయన బౌద్ధగ్రంధములకెల్లమని చెప్పనొప్పుచు. ఈ గంథములయందెల్ల "ప్రజ్ఞా పరిమితసూత్రము” “సమాజగుహ్య సూత్రము” ఆరు తాంత్రిక గ్రంధములు ప్రాధాన్యములు. ఈ గ్రంథాగారమునందలి గ్రంథములన్నియు యేమయ్యెనో చెప్పుట కాధారము లేమియు లేవు. కాని ఈమఠ మునందున్న క్రొత్త శిష్యు డొకనివలన ఆవమానింపఁబడి తీర్ధిభిక్షుడొకడు దీనిని తగులఁబెట్టునని టిబెతు దేశమునందు ప్రచారము వందున్న ఒక కథ వలన తెలియుచున్నది. దైవవశముచే బౌద్ధమత గ్రంథములన్నియు అందు తగులబడకుండ రక్షింపబడెనని కూడ ఆకధయందే చెప్పఁబడియున్నది. ఈ సంగతి ఎనిమిదవ శతాబ్దమునందు జరిగినటుల దోచు చున్నది. ఏడవ శతాబ్దమునందు నలంద విశ్వవిద్యాలయము ఉచ్ఛదశయం దున్నప్పుడు మన దేశమునకు చీనా దేశస్థుఁడగు హ్యనిత్స్యాంగు అను యాత్రికుఁడు విచ్చేసెను. [4]..ఆయన గ్రంథముల యొక్క వ్రాతప్రతులను విలువగల యితర వస్తువుల ననేకమగ సంపాదించెను. కాని దొంగలు దోచుకొనుట చేతను, ప్రమాదవశముపలనను, అనేక సారులు వాని నన్నిటిని గోలుపోయెను. అయినను తుదకు బుద్దునియస్తికల యొక్క ఏబది శకలములను, వెండి బంగారుల తోడను చందనము తోడను చేయఁబడి బుద్దుని ప్రతిమలను, ఇరువది గుఱ్ఱములమీద వైచి ౬౫౭ వ్రాతపుస్తకములు తన దేశమునకు గొనిపోగలిగెను. తన దేశమునకు పోయిన పిమ్మలు, ఆయన తన జీవితశేషమునంతను భాషాంతిరీకరణమునిందే గడపెను. అందుచేత ౬౬౦ సంవత్సరము నందాయన తప సారస్వత పరిశ్రమను ముగించునప్పటికి వివిధములగు డెబ్బదినాలుగు గ్రంథములను చీనాభాషలోనికిఁ దేఁగలిగెను. భారతవర్షము యొక్క విజ్ఞానైశ్వర్యమును చీనా, జపాను,కొరియా మున్నగు దేశముల కుఁగొనిపోఁగలిగిన మహాత్ములయందీయన యోకరు. ఈకారణము చేతనే మహాయన బౌద్ధసిద్ధాంతములను గూర్చిన ప్రాచీన సంస్కృత గ్రంధము లనేకములు జన్మస్థలమగు భారతవర్షమునందు లభ్యము గాకున్నను, వాని భాషాంతరీకరణములు మాత్రము చీనా, జపాను దేశముల యందుగల దేవాలయ గ్రంథ భాండాగారముల యందు సురక్షితముగా నున్నవి.
“నలంద విశ్వవిద్యాలయము యొక్క ప్రాముఖ్యత క్షీణిఁచుటకు ప్రాణః భించినప్పుడు డీ మగధరాజ్యము నేలంచుండిని "పల" రాజులు యాదరణ క్రింద “ఉదంత పురి” యందును “విక్రమశిల” యందును రెండు విశ్వవిద్యాలయములు బయలు దేరును. ఈరెండు విశ్వ విద్యాలయములకును ననుబంధముగ మిక్కిలి ప్రాముక్యత జెందిన రెండు గొప్పగ్రంథాలయుములు గలవు. నలంద, ఉదంతపురి, విక్రమశిల గ్రంధాగారంములనుండియే అసంఖ్యకములగ గ్రంధరాజములను దీసుకొనిపోయి తమ భాషను టిబెత్తు దేశీయులు ఐశ్వర్య వంతముగా జేసి కొనిరి. గ్రంథాగార ముంపబడిన ఉదంతపురి విహారము "నలంద" "బుద్ధగయల" యందున్న విహారముల కంటే మహోత్తరమైనదని చెప్పదరు. ఈ ఉదంతపురి గ్రంథాగారము నందు బౌద్ధ సంబంధములను సనాతన మతసంబంధములును నగు గ్రంధములు అసంఖ్యాకముగా నుండెను. ౧౨౧౨ క్రీ.శ. సంవత్సరమునందు బీహారు దేశమును భక్తియారు ఖిల్జి జయించినప్పుడు జానీ సేనయగు "మహమ్మరు బిన్ సి వి” చే నీ గొప్ప గ్రంథాగారము తగలబెట్టబడెను.
ఉత్తర హిందూస్థాన మందున్న విహారములలో చాల భాగము ప్రధమమున మనదేశమునకు వచ్చిన మహమ్మదీయుల వలననే నిర్మూలము గావింపఁ బడినది. అందుచేత భిక్షులు తాము మోయ గలిగినన్ని మత గ్రంధములను దీసికొని “నేపాలు” దేశమునకు పారిపోయిరి. టిబెత్తు దేశమునను హిందూదేశమన కంతకును నేపాలు దేశమునందును మాత్రమే బౌద్ధమతమునకు సంబంధించిన సంస్కృత గ్రంథములలో కొన్నియైన దొరకినవి. ఈ భాగములను మిక్కిలి శ్రద్ధతో పరిశీలించిన బౌద్ధమశమును గూర్చిన అమూల్య ములగు విషయములను బోధింపగల అపూర్వ గ్రంధము లింకను బయలు వెడల వచ్చును. నేపాలు దేశమునకు భిక్షులచేఁ గొనిపోఁబడిన అమూల్యములగు గ్రంథరాజములను గొన్నిటిని మన ప్రభుత్వము వారిచే నియోజితులగు మంత్రులు సంపాదించి ఇంగ్లాండునకు గొనిపోయిరి. ఇదిచాలక ఆదేశమునకు మంత్రియగు మహారాజు - చంద్రపఁషీ రుజంగు బహద్దరు గారు ౧౯౦౯ సంవత్సరమున ఆక్సఫోర్డ్ నగరమునందలి బొడ్డలి బోడియను గ్రంథాలయమునకు ౬౩౩౦ సంస్కృత లిఖిత గ్రంథములను ఉచితముగా నొసంగి మన దేశమునకు యథార్థమగు దార్ఢ్యమును దెచ్చెను. మన దేశమునకు ఐశ్వర్యమే సారస్వతైశ్వర్యము. ఎంత వెండిపోయినను బంగార మెంత పోయినను దిగులు పడవలసిన పనిలేదు. కాని యీ విజ్ఞానైశ్వర్య నష్టముయొక్క పరిమితి యందు కొంతభాగమునైనను గూడదీయగల వారెవ్వరును లేరు. ఖిలమయి పోవుచున్న యధర్వణ వేదము యొక్క వాతప్రతి నొక దానిని ఆస్ట్రియా దేశమునకు దీకికొనిపోయి దాని పుట లన్నింటికీ ఫోటో గ్రాపులను తీసియుంచిరి. ఆ ఫోటోగ్రాఫులను మైసూర్ నందున్న గ్రంధాలయాలయము నందు మనమిప్పుడు చూడగలము.
౭ జైన గ్రంథాలయములు
బౌద్ధ గ్రంధాలయములు నశించినప్పటికిని వానిస్టానమును జైనగ్రంథాలయము లాక్రమించుకొనినవి. బౌద్ధమతమువలెనే జైన మతమును భారతవర్షముందికను జీవించియే యున్నది. రాజపుత్రస్థానము, గుజరాతు, పఠాను, జపల్ మీూరు, సూరతు, కాంబే, అహమ్మదాబాదు మున్నగుపటణములయం దనేక జైన ఉపాశ్రయములున్నవి. వీనియన్నింటికిని గూడ జైనుల యొక్క మతము చరిత్రములను తెలియజేయు నట్టి ముఖ్య గ్రంధములు గలిగినా గ్రంథాగారములు కలవు. వీనికి " భారతీభాండారము” లని పేరు. జైను భండాగారములయందు ప్రాముఖ్యములగున వన్నియు దక్షిణహిఁదూస్థానమునందే గలవు. వీనిలో పతాను * అహమ్మదాబాదు, వద్వాను, సూరతు,
1 * ఇది బరోడా రాజ్యము నందు ఉన్నది. ఈ గ్రంథ భాండాగారముల నుండి కాంబే, తరాదు, జఫల్ మీరు, భట్నీరు నగరములందు గల గ్రంథాగారములందు ప్రతిదానియందు పది వేల వ్రాతప్రతులు కలవు, పూర్వకాలమున, అన్హిల్ వాడ' అను పేరు గల “సిద్దాపురపతాను" అనునది పదునొకొండు పన్నెండు శతాబ్దములయందువలె నేటికిని జైనుమతమునకు ఆట పట్టయియున్నది. ఆచటి యుపాశ్రయములయందు 'శ్రావకు'లని పిలువఁబడుయతులు చాలమంది నివసించెదరు. ప్రతి యుపాశ్రయమునందును మతగ్రంథముల వ్రాతప్రతులు కొన్ని భద్రపరుపబడియుండును. కాలము జరిగిఐ కొలదిని గ్రంథములు సంఖ్యయు, ప్రాముఖ్యతయు కూడ హెచ్చుచుండును. పతాను నగరమునందు పది కంటె నెక్కువ ఉపాశ్రయములుగలవు. వీనిలో గొన్ని చాళుక్యరాజుల కాలమున ప్రారంభింపబడినవై యున్నవి. అందుచేత ౧౨, ౧౩ శతాబ్దముల గ్రంథములు మన అచట లభ్యమగును, వీనియందు గ్రంథకులు ఆట్టల పెట్టెట్టెలయఁదు భద్రము చేయబడినవి. ఒక్కొక్క పెట్టెయందు పది మొదలు పదునైదు వరకు వ్రాత గ్రంథములు లుండును. వీనిని యతులు తెఱచుగఁదీని చెదివి వినిపించు చుందురు. అందుచే నివి గాలి పోసికొని చెడిపోక నిలచియున్నవి. జైను మఠములంయంచెల్లెడలను వాత గ్ర౦థములను మిక్కిలి శ్రద్ధాభక్తులతో కాపాడుచుండిరి. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ గ్రంథాలయము లన్నిటియందును గ్రంథముల ప్రతులను వ్రాయుపనిని యతులే నిర్వహించుచుండిరి. దీనియందు నీరి సామర్థ్యము నిరుపమానము. అందుచేత నేపాలు దేశ ప్రభువుయొక్క గ్రంథాగారమునకు వాతప్రతులను తయారుచేయుటకై వీరినే నియోగించిరి.[5] "పతాను” పట్టణమువంగున్న గ్రంథాలయములలో కెల్ల, నలువది "పెట్టెల" వ్రాతప్రతులు గల హేమచంద్ర భండారము, ౧౨౦౦ ల వ్రాతప్రతులు గల తిపొగచ్ఛభాండారము,౫౦౦ తాటియాకుల గ్రంథములుగల సంఘవినపాదన గ్రంథాగారము మిక్కిలి ప్రాముఖ్యను లెయున్నవి. ఈ సంఘవినపాదన గ్రంథాగారము నందు జైనమతమునకు సంబంధించిన గ్రంధమాలన్నియు, వాని భాష్యములు, చూర్ణికలు, వృత్తులు సహితముగాఁ గలవు. జైన మతమును పారస్వతమును గూర్చిన పరిశీలనలను జేయుటకును, గుజరాతు దేశ చరిత్రకు సంబంధించిన ఆధారములను సంపాదించుటకును యీ గ్రంథము లమూల్యములై యున్నవి.
ఈ గ్రంథాగారమునకు పిమ్మట జపల్ మీరు నందున్న పరశనాధ దేవాలయమందలి భండాగారము గొప్పది. దీనియందపూర్వములగు కొన్ని జైనమత గ్రంధము లేగాక, పన్నెండు, పదిమూడు, పదినాలుగు శతాబ్దముల యందు వ్రాయబడినట్టి సంస్కృత సాహిత్య కావ్యము లును, వైదిక గ్రంథములును అనేకముగా కలవు. బిల్హణ విరచితమగు విక్రమాంక చరిత్రమును, [6]* జలంధరు వాస్తవ్యులగు ఉపేంద్ర వార్షి పాటకుడు రచించిన యశోవర్మ విజయమును నిచటనే ప్రథమమున పంపాదింపబడినవి. ఈ సంగతులను బట్టి ఈ గ్రంథాగారము లందు మత గ్రంథములనేగాక, లౌకిక విషయములగు గ్రంథములను గూడ స్వీకరించి పెట్టెవారని స్పష్టమగుచున్నది.
పశ్చిమ సముద్రతీరమునందు కనరాజిల్లాలో "ముద బిద్రి” అను గ్రామమునందు జైనమఠ మొకటి కలదు. అందు గొప్ప వ్రాతప్రతుల భాండార మొకటి గలదు. అనేక పూర్వగ్రంధము లిక్కడ కననగును. మైసూరు సంస్థానమునందున్న "శ్రమణబిల్ గోలా” అను ప్రదేశము జైనుమతమున కొక ప్రధానస్థానము. మార్యవంశ్యుడగు చంద్రగుప్తుఁడీ గ్రంథాగారమును దర్శించెనని చెప్పుదురు. ఇచటఁగల కొండమీఁద ౭0 అడుగులు యెత్తుగల నల్ల రాతిబండమీఁద చెక్కఁబడిన "గొంతీశ్వరు” ని విగ్రహమొకటి గలదు. క్రీ. శ. తొమ్మిదవ శతాబ్దమున “చాముండీరాజు" చే నిది నిర్మింపఁబడియున్నది. ఈ కొండక్రిందనున్న జైనుల విహారమునందు మంచిస్థితియందున్న గొప్ప గ్రంథాగారము గలదు. ఈ గ్రంథమాలలో చాల భాగము తాటియాకులమీద పాలి, సంస్కృతము, కన్నడకు, అరవభాషయందు వ్రాయబడియున్నవి. మైమారు రాజ్యమునందే "హుంచ" జైన విహారమునందొక సామాన్యమైన గ్రంధాగారము గలదు, ఇంతేగాక విశేషముగ వ్రాతప్రాతులను
సంపాదించి భద్రముగ కాపాడుకున్న జైనపండితులనేకు లీప్పటికిని పశ్చిముహిందూదేశమునందు గలదు. ౮ సభామంటపములు - గ్రంథాగారములు
సన్యాసులకు నిలయములగు విహారములు, ఉపాశ్రయములు, మఠములతో రియులతో బాటు రాజుల సభామంటపములు గూడ గ్రంధ భాండారాములకెట్లు నిలయములగుచున్నవో, ఇదివరకే చెప్పఁబడినవి. ఈ సభామంటప గ్రంథాగారములయందు లౌకిక విషయములను గూర్చినట్టియు, శిల్పకళలకు సంబంధించినట్టియు గ్రంథములు విశేషముగ సేకరింపఁబడుచుండెను. నాలుగవ శతాబ్దమునుండియు వ్రాయఁబడుచున్న శాసనము [7]* లనుబట్టి చూచిన, ఆకాలమున రాజులు కవులను విద్వాంసులను విశేషముగా నాదరించుచుండినటులఁ గన్పట్టుచున్నది. కాని పదునొకఁడవ శతాబ్దమందేలిన భోజమహారాజుయొక్క గ్రంథాగారమునకు[8] పూర్వము నుండిన సభామంటప గ్రంథాగారములను గూర్చిన ప్రశంస మన కెచ్చటను గానుపించుట లేదు. మధ్య కాలమునందు రాజులచే పోషింపంబడిన గ్రంథ భాండారములకెల్ల నిదియే మేటియని చెప్పవచ్చును. ౧౧౪౦ సంవత్సరం ప్రాంతమునందు " సిద్ధరాజ జయసింహుడు” మాళవ దేశమును జయించి, ఈ గ్రంథభాండారమును అన్హిల్ వాడునకు తీసికొనిపోయి అచట నుండినట్టి చాళుక్య గ్రంథభాండాగారముతో కలిపి వైచెను. చాళుక్యరాజుల భారతీ భండారము నుండి[9] సంపాదింపబడిన నైపధీయ ప్రతికి విద్యాధరుఁడు ప్రధమ భౌప్యమును రచియించెను. మరియు "కామసుత్రము" లినీ భాండారమునుండియే కైకొని, యశోధరుడు జయమంగళ టీకను రచియించెను. పైన జెప్పబడిన చాళుక్యరాజుల భారతీ భాండారమనందున్న రామాయణ ప్రతినుండియే జర్మనీ దేశమునందు "బాన్" పట్టణమునఁగల విశ్వవిద్యాలయము వారు స్వీకరించిన రామాయణ ప్రతి వ్రాయబదినది.
మన ప్రభుత్వమువారు చేసిన వ్రాత ప్రతుల పరిశోధన వలస అల్వారు, బికనీరు, జమ్ము, నేపాలు, మైనూరు, తంజావూరు
లందుగల అస్థాన గ్రంథాగారములు బయలుబడి మిక్కిలి, యుపయోగ కారు లయ్యెను. ఉత్తర హిందూస్థానమునందలి రాజులలో అనేకమందిని మహమ్మదీయుల వశపఱచుకొని యున్నను రాజపుత్రిస్థానము, నేపాలు, ఒరిస్సా దేశప్రభువులును దక్షిణ హిందూ
స్గానమునందలి ప్రభువులును తమస్వాతంత్యమును నిలుపుకొని భోజమహారాజువలె కవులను పండితులను ఆదరించి మనవిజ్ఞాన మడుగుటకుండ జేసిరి. రాజపుత్ర స్థానము, నేపాలు, కాశ్మీరము, తంజావూరు ఆస్థానములయందు గల గ్రంధ భాండారములలో సంస్కృతమునందును, యితర దేశభాషలందును గల అనేక వ్రాత ప్రతులను నేటికిని మనము చూచు చున్నారము. పదునెనిమిదవ
శతాబ్ద ప్రారంభము నందు అంబరు రాజ్యము నధిష్టించిన పవాయ జయసింగు మహారాజు విజ్ఞానవ్యాప్తికై మిక్కిలి పాటుపడెను. ఆయన జయపురము[10]ను నిర్మించి కళలను, శాస్త్రములను బోషించేను. వీధులన్నియు ఒకదాని నొకటి సమకోణములయందు సమభాగములంగా భాగించు నటుల సరియైన పద్దతి ప్రకారము కట్టబడిన పట్టణము "జయపురము" తప్ప వేరెద్దియు లేదు. విద్యాధరుడను నామముగల వంగదేశపు డొకడు రాజు దగ్గఱనుండెను. రాజు చేయు శాస్త్రవిషయిక ఉద్యమములన్నిటియందు సహాయ కారియై సమర్థతతో నెఱవేర్చు చుండెడివాడు. ఆయన సహాయము ఢిల్లీ జయపూరు, ఉజ్జయిని, వారణాని, మధురాపట్టణములయందీరాజు నక్షత్రమలను చూచుటకు పలయు సాధనములతో సమర్చబడిన మందిరములను కట్టించెను. ఆమందిరములయందుపయోగింపఁబడిన పరికరములన్నియు ఆయన చేస్వయముగ కనిపెట్టబడినవి. అందుచే చేయబడిన పరిశోధనలు గొప్ప పండితులను గూడ ఆశ్చర్యమును గొల్పినది. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలిఆయన రేఖాగణితశాస్తమును, త్రికోణశాస్త్రమును, సంవర్గమానమును సంస్కృతమునందు వాయించేను. మనదేశ దురదృష్టవశము చేత నీజయసింగు మహారాజు స్త్రీలోలుడై తన రాజ్యమును
+ C. 12. n గ్రంధ భాండారమును గూడ గోలుపోయెను. మిగిలిన గ్రంధములు కొన్ని ఇప్పటికిని జయపురమునఁదు, శోత్రియ బ్రాహ్మణుల యధీనమునందున్నవి.
జోధపురము, బికనీరు, అల్వారు మహారాజుల గ్రంథాభాండారములు గూడ మిక్కిలి ప్రఖ్యాతవంతము లైనవి. జోధపురి గ్రంథాగారము నందు ౧౮౦౦ సంస్కృత వ్రాత పత్రులను మద్రితములగు సంస్కృతిగంధము లనేకములుకలవు. ఇంతేగాక దేశభాషలయందు వ్రాయబడిన గ్రంథము లనేకవందలు కలవు. ఈ గ్రంధాగారము నందున్న వానిలో పురాణములం, మాహాత్మ్యములు, తాంత్రిక గ్రంధములు పెక్కులుకలవు. బికనీరు మహారాజుయొక్క గ్రంధాగారము నందు ౨౦౦౦ సంస్కృత వ్రాతపతులు గలవు. అనేక శతాబ్దములనుండి కాశ్మీర దేశము విద్యాధిదేవతకు ప్రీతిగల స్థానమై యున్నది. ఆదేశమనంప్పటికిని సరస్వతీదేవి తన ప్రభుత్వమును నిరంకుశముగ సాగించుచున్నదని మన పండితుల నమ్మకము. రాజతరంగిణీయము సంస్కృత గ్రంథమునందు జెప్పబడిన అనేకమంది కాశ్మీర దేశ కవుల గ్రంథము లింకను కానరాకున్నవి. కావ్యము లేగాక, శాస్త్రములు – అందుముఖ్యముగా వ్యాకరణశాస్త్రము, అలంకార శాస్త్రములు. ఈదేశమనం దనేకవందల సంవత్సరముల నుండియు అభ్యసింపబడుచున్నవి. అధర్వణ వేదము నధ్యయనము జేసిన పండితులనేక మంది యిప్పటికిని యీ దేశమునందు మాత్రమే కలరు. చరిత్రాత్మకమగు “రాజతరంగిణి” యను సుప్రసిద్ధ గ్రంథము ఇచటనే దొరికినది. ఈ దేశ ప్రభువులు మన సారస్వతైశ్వర్యమును గుర్తెఱింగి నేటికిని దాని పోషణమునకై సర్వవిధములదోడ్పడు చున్నారు. ఈ రాజు తన ఆస్థానమునందనేక పండితుల నేర్పరచి నేప్పించి దేశము యొక్క పలుస్థలములందుగల సంస్కృత వ్రాతపతులకు ప్రతులను వ్రాయించి దెప్పించి తన గంధాగారమునందుంచు చున్నాడు, ఈరాజుయొక్క గ్రంధాగారము “జుమ్మా ” పుటణమునందు దున్నది.
ఈరాజు వారణానిపురమునందు కొందఱు సంగీతులనుంచి, ప్రాచీరములగు వ్రాతప్రతులు అమ్మకమునకు వచ్చినపుడెల్ల వానిని క్రయమునకు దీసికొని, యిప్పటికిని తన భాండారము నభివృద్ధి జేయుచుండును. కాశ్మీరదేశమునందు వ్రాయఁబడిన వ్రాతప్రతులన్నియు మిక్కిలి సొంపుగ నుఁడును. ఆవి పుష్పలతాదులతోడను విపరీతములగు సంకేతాక్షరములతోడను, అంచులయందు పట్టీలతోడను చరిత్రాత్మకములగు బొమ్మలతోడను అలంకరింపఁబడి తోలుతో బైండు చేయఁబడియుండును. వానిని ఈ కాలపు గ్రంథాలయముల వలెనే బీరువాలయందు భద్రముగా నుంచెదరు.
ఉత్తర హిందూస్థానమందెల్ల ప్రాచీనతచేతనేమి, ప్రాముఖ్యతచేతనేమి, వన్నెకెక్కి యున్న గ్రంథాభాండారము నేపాలు దర్బారునందు గలదు. గుప్త ప్రభువుల కాలమునాటి వ్రాతప్రతులు గలవు, బౌద్ధమతమునుము, వెదికమతమునకు గూడ నేపాలు దేశమునందాశ్రయము గలదు. మహమ్మదీయులు దేవాలయములను మఠములను గ్రంథాగారములను తగులబెట్టఁ జొచ్చినప్పుడు, జనులు చేతనైంత్తవఱకు అమూల్య గ్రంధములనేకములను యీ దేశమునకు గొనిపోయిరి. అందుచేతనే అతిప్రాచీనములగు అపూర్వ గ్రంథములనేకములు యీ దేశమునందు దొఱకినవి. ఈ గ్రంథాగారమునందు కాకితముల మీఁద తాటియాకుల మీఁదను వ్రాయఁబడిన ౫౦౦౦ ల వ్రాతపతులు గలవు. ఈ రాజ్యము నేలిన ప్రభువులెల్ల దీని అభివృద్ధి పఱచుటకు సదాపాటుపడు చున్నారు. ఈ దేశ శీతోష్ణస్థితి వ్రాతప్రతులు చెడిపోకుఁడ నుండుటకు మిక్కిలి సహాయభూతముగ నున్నది.
దక్షిణ హిందూదేశమున, తంజావూరు రాజుల గ్రంథాభాండారమును, మైసూరునందున్న సరస్వతీ భాండారమును, దక్షిణహిందూ దేశమున ప్రాముఖ్యములై యున్నవి. వీనియఁదు తంజావూరు గ్రంథాగారము మిక్కిలి ముఖ్యమైనది. ప్రపంచము నందంతటను తంజావురు గ్రంథాలయము గొప్పయు, ప్రాముఖ్యమైనదియని బర్నెలు దొరగారు చెప్పియున్నారు. తంజావూరును తెలుగునాయక ప్రభువులేలు చున్నప్పుడు పదునాఱవ శతాబ్దాంత్యముననో, పదు నేడవ శతాబ్ద ప్రారంభముననౌ ఈ గ్రంథాగారము ప్రారంపబడినది. ప్రధమముసందారాజులు తెలుఁగులిపియండు వ్రాయఁబడిన సంస్కృత గ్రంధములను సంపాదింప నారంభించిరి.
పదునెనిమిదివ శతాబ్దమును దీదేశమును మహారాష్ట్రులు జయించిరి. అప్పటినుండియు గ్రంధసంపాదన
a
. యందశద్ధ ప్రబలెను. ఇప్పుడుగ్రంథాగారము నందున్న సంస్కృత వ్రాతప్రతులలో చాలాభాగము శరభోజ మహారాజు వారణాసీపురమునకు బోయినప్పుడు(౧౮-౨౮-౩౦) సంపాదింపబడినవియే యైయున్నవి. దేవనాగరి,నంది నాగరి, తెనుఁగు, కన్నడము, గాంధీ, మళయాళము, బంగాళము, పంజాబీ, కాశ్మీరము, ఓద్రము, అరవము అను పదునొకండు భాషలలో వ్రాయబడిన ౮ వేల గ్రంధము లీగ్రంథాగారమునందు గలవు. భారతవర్షముయొక్క అన్ని భాగములనుండియు సంపాదింపఁబడిన గ్రంథములును నిందుగలవు. సంస్కృత గ్రంధముల యొక్క భిన్న పాఠాంతరము లీగ్రంథాగారమునందు గలవు. ఈవిషయమునందు దీనితో సాటిరాతగినది మఱియొకటిలేదు. తంజావూరు గ్రంథాగారము నందున్న గ్రంధములు సంపాదించుట కేడులక్షల యేబది వేల రూపాయలైన వ్యయపడియుఁడునని డాక్టరు బర్నెలు దొరవారభిప్రాయపడుచున్నారు. అపూర్వములగు ఆంధ్రభాషా గ్రంధము లనేకము మనకీ గ్రంథాగారముననే దొరకీయున్నవి. ఇంకను అముద్రితములగు ఆంధ్రగ్రంధము లనేకములు ఈ గ్రంథాలయమునందు గలవు. వానికి ప్రతులువ్రాయించి ఆంధ్రదేశమధ్యభాగమునందుండు ఏగ్రంథాలయమందైన జాగ్రత్తపెట్టి ఆంధ్రులకు అందుబాటునందుంచుట అత్యంత ఆవశ్యకమై యున్నది.
మైనూరునందున్న సరస్వతీ భాండాగారము పదునెని మీది వత్సరముల క్రిందట అగ్ని దేవున కాహుతియాయెను.
- ↑ వీనిని విహారము లనియు సంఘారము లనియు ఉపాశ్రయము అనియు మఠము లనియు బిలిచెదరు
- ↑ Referred to in Buhlers Indian Paleography P. 99
- ↑ Cassatas of the old Manuscripts.
- ↑ t Early History of India by Mr. Vincent Smith P. 3. lek
- ↑ + Catalogue of Durbar Library of Nepal by Mahamahopadhyaya Haraprasad Sastri.
- ↑ * దక్కను దేశము నేలీనటి చాళుక్యరాజఅగు విక్రమార్కుని చరిత్రము.
- ↑ వీనిని ఏశస్తుల నెదరు
- ↑ Buhler's Indian Paleography p. 99
- ↑ ఈ రాజుల పేర్లు విశాలదేవుడు, విశ్వమల్లుడు (క్రీ.శ. ౧౨౪౨-౧౨౬౨)
- ↑ రాజపుత్ర స్థానమందున్నది.