గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 7/తృతీయ అఖిలభారత గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ
తృతీయ అఖిల భారత గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ

తృతీయ అఖిలభారత గ్రంధాలయ ప్రతినిధుల మహాసభ
కర్నాటక రాష్ట్రమునందున్న బెల్లాఁపట్టణ పరిసరమునందు కాంగ్రెసునకై ప్రత్యేకముగ నిర్మితమైన విజయ నగరమునందు 1924 స౹ డిశంబరు నెల 26 తేదీ ఉదయ మ 8-30 గంటలకు ఈ సభ సమావేశమయ్యెను.
భారతవర్షము యొక్క వివిన భాగములనుండి ౧౫౦ మంది ప్రతినిధులు విచ్చేసిరి. మైసూరు, పుదుక్కోట సంస్థానములనుండియు, బొంబాయి విశ్వవిద్యాలయమునుండియు గూడ ప్రతినిధు లెతెంచిరి. ఇతర సభలతో సంబంధములేకుండ ప్రత్యేక మీ సభకు గూడ కొంతమంది ప్రతినిధులు విచ్చేసియుండిరి. భారతవర్షము యొక్క వివిధప్రాంతములనుండి పెక్కుమంది ప్రేక్షక మహాశయులుగూడ విచ్చేసియుండిరి.
ప్రార్ధనతో సభ ప్రారంభింపబడెను. ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీ డి.కే. భారద్వాజగారు ప్రతినిధులకు హృదయపూర్వకమగు స్వాగతమిచ్చిరి. వారి యుపన్యాపమునందు ప్రస్తుత దేశ స్థితిగతులను చర్చించి, దేశము నిప్పుడు కలవరబెట్టుచున్న అసంఖ్యాక ములగు సమస్యలను గూర్చి జనసామాన్యమునకు జ్ఞానాభివృద్ధిని గలుగజేయుటకుగాను గ్రంథాలయములను స్థాపింప వలసిన యావశ్యకతను విపులముగా జర్చించిరి. తదుపరి దేశబంధు చిత్తరంజనదాసుగారు అధ్యక్షత వహించవలెనని ఉపాదించుచు వేమవరపు రామదాసు పంతులు గారు, దాసు గారు గ్రామజీవన పునర్నిర్మాణమునకై ప్రారంభించిన నూతన కార్య క్రమమును గూర్చి వివరించి స్వసహాయ విలసితమును స్వపరిపాలనా భాసితంబునునగు గ్రామమునందు గ్రంథాలయము ప్రాధాన్య భాగమై యున్నదని చెప్పిరి. వీరి యుపపాదనను జి.హరి సర్వోత్తమరావుగారు కన్నడభాష యందు బలపరిచిరి. మైసూరు సంస్థాన ప్రతినిధియగు సి.చంద్రశేఖరయ్యరు గారు కూడ ఈ యుపపాదనను బలపరచుచు దేశబంధుదాసు గారు జనులయొక్క నిజమైన దాసుడనియు అందుచేత ఈ సభాధ్యక్షత వహింప దాసుగారు అన్ని విధముల నర్హులనియు జెప్పిరి. అప్పుడు వందేమాతర ధ్యానములు జిలఁగుచుఁడ దేశబంఘ “దాసుకీ జై” అను కేకలు మిన్నుముట్టుచుండ దామగారు అధ్యక్ష పీఠమలంకరించి ఈ క్రింది విధమున ఉపన్యాసమిచ్చిరి.
అధ్యక్షకోపన్యాసము
ఈ సభకు అధ్యక్షత వహించుట నాకెంతయో ఆనందముగ నున్నది. ఏలయనగా ఈ యుద్యమము ప్రజల మనమును వారి కుండు కొరతలలో ముఖ్యమగు కొంతను తొలగించుటను గూర్చి ఉద్బోధన జేయుచున్నది. ఈ మూడవ అఖిల భారత గ్రంథాలయ సభను దేశీయమహాజన సభతో బాటు ఈ బెల్గాంపట్టణముననే జరుపుట మిక్కిలి ఆనుకూలమగు సంగతి. ఇందువలన ఈ యుద్యమమునకు ఎక్కువ ప్రాముఖ్యత గలిగి దేశ సేవాతత్పరులు ఎక్కువమంది ఇందును గూర్చి తమ శక్తి యుక్తులను విని యోగించుటకు తెగువిధమున వానిని ప్రేరణ జేయుటకు సావకాశము గలిగింది. మనదేశీయులందరమును ఇప్పుడు భారతజాతీయతా సౌధనిర్మాణమనెడి మహత్కార్యమున నిమగ్నులమై యున్నాము. ఇది కేవల రాజ్యతంత్య్రమును స్వాధీనపరచుకొను పని మాత్రమేగాదు. కావున మన దేశమునందలి అన్ని తరగతుల ప్రజలను చేతనైన కృషిజేసి, ఈమహత్కార్యమునకు తోడ్పడ వలసియున్నది. నా అభిప్రాయమునందు స్వరాజ్యము ఇంత విపులమైన అర్థము కలదిగా నున్నది. ఈ అభిప్రాయమునే నేను ఇదివరలో ఎక్కువగా చెప్పియున్నాను. కొందరు స్వరాజ్యమునకు సంపూర్ణ స్వాతంత్య్రమును, మరికొందరు బ్రిటీషు సామ్రాజ్య అధినివేశదేశములతో బాటు రాజ్యతంత్రమును కలిగియుండుటయు పర్యాయ పదములుగా వాడుచు ఈ శబ్దమునకు పరిమితమను అర్థమును కల్పించుచున్నారు. రాజ్యతంత్య్ర ధురీణునియొక్క ముఖ్యవిధి జాతియొక్క నిర్మాణమునకు తగిన వసతులు సమకూర్చుట. ఇట్లాలోచించినచో భారతజాతి యొక్క పరిమావధిని పొందుటకు రాజ్యాంగ స్వాతంత్య్రము ఒక సాధనము మాత్రమే యగుచున్నది. కావుని భారతీయులు వెంటనే నిర్వర్తింపవలసిన కార్యము మిక్కిలి గొప్పదిన్ని ఎక్కువ కష్టముతో కూడ కొన్నదియునునగు చున్నది. రాజ్యాంగ స్వాతంత్య్రముగల దేశములలో జాతీయనిర్మాణమునకు వలయు ద్రవ్యము రాజ్యము యొక్క బొక్కసమునుండి వ్యయ పెట్టబడును. మనకుండు దౌర్భాగ్యమువలన మన దేశమున ఆట్లు జరుగుట లేదు. మనము అవలంబించు కార్యవిధానములన్నియు స్వయం సహాయము మీద ఆధారపడవలసినవిగా యున్నవి. మన పురోభివృద్ధి దేశీయుల స్వయం సహాయము మీద ఆధారపడియున్నదను విషయము మన దేశ ప్రజలు పూర్తిగా గ్రహింపలేదు. మన శక్తులను మన ధనమును కట్టుబాట్లకు లోబరచి రాజ్యాంగము వారి సహాయము కోరకనే జాతీయాభివృద్ధికి కావలసిన ముఖ్యసాధనములను మనము సమకూర్చుకొనవలసి యున్నది.
మీ యుద్యమము మిక్కిలి శైశవావస్థ యందున్నది. ఇందువలన కలిగెడు లాభములను పజ్రలు ఇంకను గుర్తెరుఁగుటలేదు. మన పూర్వులు చేసిన మహత్కార్యములను గూర్చి మనము పలుమాకు చెప్పుకొనుట కేవలము వృధాడంబరమని ఇతరులు మనలను హాస్యము చేసిన చేయుదురు గాక! మనపూర్వులకు విద్యయఁదు పక్షపాతమును మన మెన్నడును మగవజాలము. కాశీ, తక్షశిలా, పాటలీపుత్రము మొదలగు ఉన్నతవిద్యార్థ స్థానముల యందు గొప్ప గ్రంథాలయములం స్థాపింపబడి ప్రవృద్ధినొందుటతో పాటు ప్రతిదేశాలయమును ఆకాలమున ఒక విద్యాపీఠముగా విలసిల్లెను. గ్రీసు దేశములోపలె ప్రతిగ్రామమందును ప్రజలు తమ పనులు తీరినపిదప సమకూడి అనూన్య సహాయముచే తమజ్ఞానాభివృద్ధిని చేసుకొనుటకు తగిన పరిస్థితులు అప్పటికాలమున ఉండి యుండెను. చరిత్రాత్మకమగు విషయము నొకదానిని మీకు జ్ఞప్తికి దెచ్చుచున్నాను. గ్రీసు, రోము మొదలగు ఐరిరోపాదేశము లందు వెలుగునుండిని జ్ఞానజ్యోతి అంతరించి ఆఖండమంతయు అజ్ఞానతిమిరములో యున్నప్పుడు ఐరోపా దేశస్థులు జ్ఞానభిక్షకై యాచించినది. తూర్పు దేశముల అప్పటి కాలమున ప్రాచ్యపరిజ్ఞానమే — అందు ముఖ్యముగా మహమ్మదీయ పరిజ్ఞానము ౼ ఐరోపా ఖండమునకు జ్ఞానదానముచేసి ఆ ఖండపు ఆధునిక చరిత్రకు శంఖుస్థాపన చేసినది. కేవల శాస్త్రములు, కళలు, వాఙ్మయములందు మాత్రమునే గాక గ్రంధాలయ స్థాపనము నందు గూడ పాశ్చాత్యులకు ప్రాచ్యదేశస్థులు గురుస్థానము నలంకరించు చున్నారు. ఆధునిక పాశ్చాత్య గ్రంథాలయములు నిరుపమానమగు అప్పటి కాలపు మహమ్మదీయా ఖాలీపులచే స్థాపింపబడిన మహోన్నత గ్రంథాలయముల యొక్క అనుకరణములు కాదా! అయితే వర్తమాన కాలమున నిజమాడవలెనన్నను అభివృద్ధిపొందవలెనన్నసు మనముపాశ్చాత్య దేశముల జ్ఞానజ్యోతికై మనదృష్టిని ప్రసరింప చేయవలసియున్నది. మనదేశీయులకు విద్యనభ్యసింప జేయు పద్ధతులయందును కట్టుబాటుల యందును మనమెంతయో వెనుకబడియున్నాము. పరిస్థితులు మారినకొద్దీ పాశ్చాత్య దేశములందలి విద్యావిధానములు మారుచు మనలను ఆశ్చర్యనిమగ్నుల జేయుచున్నవి. ప్రజాసంఖ్య మిక్కిలి హెచ్చినది. ముద్రిత గ్రంథములు తండోపతండము లైనవి. రాకపోకలు అతి సులభములైనవి. దూరపు పట్టణములు కూడ దగ్గరకు వచ్చినట్లు కనబడుచున్నవి. పట్టణములకు పల్లెలకు సన్ని హిత సంబంధ మేర్పడింది. ఈ అన్ని కారణములచేతను ప్రాచీన విధానముల ననుసరించి మనదేశమున ప్రజాసామాన్యమునకు విద్యాభివృద్ధి జేయుటకు వీలుపడదు. ముఖ్యముగా మనము గమనించవలసిన విషయమొకటి యున్నది. ఆధునిక పరిస్థితులయందు గురుశిష్య ధర్మము సంపూర్ణముగా నశించినది. ఇది సహజమైనది.
ఐరోపా ఖండమున స్వసహాయము వలననే విద్యోపార్జనము చేయు సాధనములు ప్రజాసామాన్యమునకు పౌరగ్రంథాలయముల మూలమున సమకూడు చున్నవి. ఇట్టి ప్రతిస్థాపనలు మన దేశమున లేని కారణమున అట్టి వసతులు మనప్రజలకు లభించుట లేదు. గ్రంథా లయములు కేవల గ్రంధములను భద్రపరచు స్థానములే కావు. అని స్థాపింపబడియుండు పరిసరమంతయు జ్ఞానతేజముతో ప్రకాశింప జేయబడును. కేవలగ్రంథమూలమున లభించు పాండిత్యమును కొందరు హాస్యము చేసినను “తత్వోపదేశము చేయు గ్రంథము సంయమీంద్రుల హృదయనాళమునుండి బయలు వెడలు రక్తమువంటిది. అవి ఉత్తరజన్మోపయోగము కొరకై నిక్షేపము చేయబడినవిగా నున్నవి” అని ఆంగ్ల కవి శేఖరుఁడగు "కౌబరు” మహాకవి చెప్పిన మాటలు మనకందరకు అనుభవ సిద్దములేదు. అయితే అసంఖ్యాకములు గ్రంథములు ముద్రితములగు చున్న సదసత్వస్తక విచక్షణా కార్యము కష్టసాధ్యమగు చున్నది.
మీయద్యమము జయప్రదమగు గాతమని నేను సర్వేశ్వరుని ప్రార్థించుచున్నాను; మీ యుద్యమము మన దేశమున గ్రంథాలయములు విరివిగా సాపింపబడు గాక ! ఎవరు ఙ్ఞానవంతులు కాకుండ నిరోధించుటకు ఎవరికిని అధికారము లేదు. అట్లుగాక ప్రజాసామాన్యమందలి ప్రతివ్యక్తికిని జ్ఞానము సమకూడునట్లు సాధన విధానమును నిర్మాణము చేయుట దేశాభివృద్ధిని గోరు ప్రతిభారతీయుని యొక్క ముఖ్య కర్తవ్యమై యున్నది.
అధ్యక్షులు వారి యుపన్యాసము ముగియగానే, ఇతరపనుల తొందరవలన వెళ్ళవలసియుండుటచేత చెంగాలు స్వరాజ్యపాటీ౯ నాయకుడగు టి.సి.గోస్వామిగారిని ఆధ్యక్షులుగా నియమించి సభాభవనమును విడచిరి.
కార్యనిర్వాహక సంఘాధ్యక్షుని నివేదిక
అంతట అఖిల భారత గ్రంథాలయ సంఘ కార్యనిర్వాహక సభాధ్యక్షులగు శ్రీ సూరి వేంకట నరసింహశాస్త్రి గారు ఈ క్రిందవివరించిన ప్రకారము కార్యనివేదికను సభ్యులకు వివరించి చెప్పిరి.
"మొదటి అఖిలభారత గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ" మద్రాసునందు జరిగినది. ఆసభవారు “అఖిల భారత గ్రంథాలయ సంఘము” నకు నిబంధనల నేర్పరచుటకుగాను ఒక ఉపసంఘమును ఏర్పాటుజేసెను ఆఉపసంఘము వారిచే ఏర్పరుపబడిన నిబంధనలు కాకినాడయందు 1923 డిశంబరు నెలలో జరిగిన ద్వితీయ అఖిల భారత గ్రంథాలయ మహాసభయందు అంగీరింప బడెను మరియు ముందు వత్సరము జరుగవలసిన పనిగూడ అప్పుడే నిర్ణయింపబడెను. అప్పుడు నిర్ణయింపబడిన కార్యక్రమము ఈక్రింద వివరింపబడిన రీతిగా మూడు విధములుగా నున్నది.
(3) గ్రంథాల యోద్యమమునకుగాను ఆంగ్లేయ భాషయందు మూడు మాసముల కొకసారి పత్రికను ప్రకటించుట
గ్రంథాలయ చరిత్ర తయారు చేయుటకొరకు హిందూదేశమునందు మాకు తెలిసినంతవరకు గ్రంథాలయములకెల్ల ప్రశ్నల పత్రమును బంపితిమి. కాని ఇంతవరకు సుమారు 24 గ్రంథాలయములు మాత్రము వానిని పూర్తి జేసి పంపినవి. దేశమునందుగల గ్రంథాలయ నిర్వాహకులందరికిని వినతిపత్రము లంపబడినవి. ఈ తీరుగా గ్రంథాలయములయొక్క చరిత్రను తయారు జేయవలసిన ఆవశ్యకత అందరికిని తెలిసే యున్నది. అలహాబాదునందున్న పానినీ ఆఫీసు వారు అయిదారు సంవత్సరములు క్రిందట గ్రంథాలయముల యొక్కయు, శాస్త్ర సంఘములయొక్కయు డైరెక్టరీ నొకదానిని ప్రకటించినారు, కాని ఇటీవల దానిని తిరిగి ప్రకటింపలేదు. ఇంతేగాక, గ్రంథాలయములను గూర్చి తెలియవలసిన విశేషములన్నియు అందు తెలుపబడియుండలేదు.
రాష్ట్రీయ సంఘములలో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమును పుదుక్కోట రాష్ట్ర సంఘమును ఈ సం ఘమునకు శాఖా సంఘములుగా చేరినవి. పునహా నగరమందున్న మహారాష్ట్ర గ్రంథాలయ సంఘము కొంత పనిజేసినది. కాని ఇప్పుడు సరిగా పనిజేయుట లేదు. తమిళరాష్ట్రమందును, వంగ దేశమందును రాష్ట్రీయ సంఘముల స్థాపనకై గట్టి ప్రయత్నములే జరిగినవి. త్వరలోనే సంఘములు స్థాపనకగలవు.
గ్రంథాలయములలో చాల భాగము దేశభాషల యందే నిర్వహింపబడుచుండుట చేతను రాష్ట్రీయ గ్రంథాలయ సంఘములు పనిచేయవలసిన విషయములలో దేశ భాషాభివృద్ధియే ప్రాధాన్యత జెంది యుండుట చేతను భాషాప్రయుక్త రాష్ట్ర సంఘముల నిర్మాణమే ఈ సంఘనిబంధనల యందు ఏర్పరుపబడింది. ఈ రాష్ట్ర గ్రంథాలయ సంఘములు ఏర్పడుటకు రెండు మార్గములు గలవు. ఒక రాష్ట్రమునందు అదివరకే జేయుచున్న పలు గ్రంధాలయము లుండవచ్చును. అట్టి చోట్ల అగ్రంథాలయములన్నియు సంయుక్త విధానము ననుసరించి రాష్ట్ర గ్రంథాలయ సంఘము ఏర్పడవచ్చును. కొన్ని రాష్ట్రములందు గ్రంథాలయ స్థాపనోద్దేశ్యమే వ్యాపిన జేయవలసి యుండవలసి వచ్చును. ఆట్టిచోట్ల గ్రంథాలయోధ్యమాభిలాషులను పనిచేయదగిన కార్యదీక్షాపరులును నగు కొందరిని చేర్చి ఆరాష్ట్రమునకు మధ్యస్థానమన రాష్ట్రీయ గ్రంథాలయ సంఘమును ఏర్పరుపవచ్చును. ఇట్లు నిర్మాణమైన సంఘము ఈ యుద్యమమును గూర్చి ముందుగా రాష్ట్రమునందు ప్రచారముసలిపి పిమ్మట గ్రంథాలయ సంఘముల స్థాపసకు పూనుకొనును.
ఈ రాష్ట్రీయ సంఘములు చేయవలసిన పనులను ఈ క్రింది విధముగా, మూడు భాగములుగా విభజింప వచ్చను, (1)ప్రచారణ కార్యము (వ) నిర్మాణ కార్యము (3) సాంకేతిక భాగము.
ప్రచారణ కార్యము సామాన్యముగా వార్తాపత్రికల మూలమునను, సభల మూలమునను జరుపవలసి యుండును. మన యుద్యమము యొక్క స్వరూపస్వభావములను బట్టి మనము ఫలమును, దృష్టిని, విభ్రాంతి జెందించునంతటి విద్యచ్ఛక్తి తీవ్రముతో చూసింపజాలము, అనుక్షణము మనము కృషి చేసినగాని మనకు ఫలము చేకూరదు. రాజధానీ నగరిములందున్న మహత్తరులగు గ్రంథాలయాధికారులే ఈ యద్యమముయొక్క సాంకేతిక భాగము కొరకు కృషి సల్పగలరు. జాగర్తగా తయారు చేసిన గ్రంథవిభజన పట్టికలును గ్రంథవర్గీకరణములును లేకుండ వాఙ్మయము అభివృద్ధి చెందనేరదు. సర్వాంగ సంపూర్ణమగు గ్రంథాలయములున్నగాని ఇట్టి పట్టికలు తయారు చేయుటకు వీలుందుడు.
పల్లెటూరు గ్రంథాలయముల వలన కలిగెడు లాభములో అమితములు, అనంతములు. అవి కేవల గ్రంథనిక్షేపములే గావు. ఆధునిక భారతీయ గ్రంథాలయములు ప్రాచ్య పాశ్చాత్య సంస్థల ఉత్తమ భాగములను ఏకత్ర సమావేశపరిచి, మేళవింపజేసిన సంస్థలై యున్నవి.
పిమ్మట ఆంధ్ర దేశమఁదలి గ్రంథాలయోద్యమమును గూర్చి సూక్ష్మముగా వివరించిరి. ఆంధ్రరాష్ట్ర గ్రంథాలయ సంఘముయొక్క కృషి సర్వతోముఖము. ఆసంఘమువారు విద్యార్థిదశను మించిన వయస్సుగల వారి ఉపయోగముకొరకై తాత్కాలిక పాఠశాలను నిర్వహించిరి. ఇక నెన్నియో దేశాభివృద్ధికరములై నట్టియు, భాషాభివృద్ధికరములైనట్టియు విధమున కృషి సల్పిరి. కడచిన మూడు నాలుగు సంవత్సరముల నుండియు భారతభూమి రక్తపాతరహితమైనట్టియు దౌర్జన్యరాహిత్యమైనట్టియు స్వరాజ్యసమయమున నిమగ్నమై యుండుటచే గ్రంథాలయోద్యమమువఁటి సంస్థలు ఎక్కువ విజృంభించుటకు తగిన సావకాశము కలుగకపోయెను. ఇప్పుడు ప్రజలు మామూలుస్థితికి తిరిగి వచ్చిరి. దానశీలందరు లక్ష్మీపుత్రులు గ్రంథాలయములకు గొప్ప దానములు చేయుచున్నారు. మొన్నమొన్ననే వేటపాలెం వాసవ్యలగు ఊటుకూరి వేంకట సుబ్బరాయ శ్రేష్ఠిగారు రమారమీ అయిదువేల రూపాయలు విలువగల భవనమును గ్రంధములను ప్రజాసామాన్యమున కర్పించి ధన్యలైరి. కార్యదీక్షాపరులగు దేశారాధకులు ఈయుధ్యమకొరకై తమ జీవితమును వినియోగపరచుటకై ముందుకు వచ్చుచున్నారు. మన దేశమును ప్రస్తుతము చీరాకు పరచుచున్న సమస్యలలో పెక్కింటిని సమాధానపరచుటకు గ్రంథాలయస్థాపన తగు సమర్థము కలిగి యున్నదని నొక్కి వక్కాణించుచు తమ యుపన్యాసమును విరమించిరి.
ఉపన్యాసములు
వారి యుపన్యాసమైన పిమ్మట వంగ దేశమునుండి వచ్చిన సుశీలకుమార ఘోషు గారు గ్రంథాలయముల ఆదర్శములను గూర్చి చక్కని యుపన్యాసమిచ్చిరి. ఆనం తరము మైసూరు సంస్థాన ప్రతినిధియగు వై.చంద్రశేఖర అయ్యరు గారు వారి రాష్ట్ర మందలి గ్రంథాలయోద్యమమును గుర్చియు, పుదుక్కోట సంస్థాన ప్రతినిధియగు ఏ.ఎస్.ముద్దు కృష్ణగారు వారిసంస్థాన గ్రంథాలయోద్యమమును గూర్చియు వ్యాసములను జదివిరి.
తీర్మానములు
అనంతరము ఈ తీర్మానములు చేయబడినవి. (1) హిందదేశమందుగల వివిధ గ్రంథాలయములును, గ్రంధాలయోద్యమాభిలాషులును, "భారత గ్రంథాలయ సంఘము" నందు సభ్యులుగా చేరి దేశమందంతటను అప్పుడప్పుడు జరుగు గ్రంథాలయ సభల పాల్గొనుచు, భారత గ్రంథాలయ సంఘ కార్యదర్శికి వారి గ్రంథలయములను గూర్చిన వివరములను రిపోర్టులను పంపవలసిందని ఈ సంఘమువారు కోరుచున్నారు.
(2) ఒకటికంటె ఎక్కువ గ్రంథాలయములు గల రాజధానిపట్టణములందును తదితర ప్రధాన స్థలములందును గల గ్రంధభాండా గారికు అందరును గలసి ఆయా పట్టణ గ్రంథాలయ సంఘములను స్థాపించి, గ్రంథాలయశాస్త్ర విషయములను అభివృద్ధిలోనికి దెచ్చి దేశమందు గ్రంథాలయ నిర్వహణమును అందరికిని తెలియునటుల జేయుదురవి ఈ సభవారు కోరుచున్నారు.
(3) పాఠశాలలో విద్యనభ్యసించు వయస్సు ముదిరిన వారు జ్ఞానాభివృద్ధి నొందించుకొను సాధనములు మన దేశమున ఇప్పటి కాలమున లేకుండుట మిక్కిలి నష్టకరముగ నున్నదిగనుక అట్టికొరతను దీర్చుటకై గ్రంథాలయ సంఘములు అట్టి యీడు ముదిరిన వారికి విద్యాభివృద్ధి నొందించుటకు పగు సమర్థమగు తాత్కాలిక పాఠశాలలన స్థాపించవలెననియు, అందుకుతగిన వాఙ్మయమును, ప్రచురించ వలెననియు, ఈ సభవారు తీర్మానించుచున్నారు.
(4) అఖిల భారత గ్రంథాలయ సంఘము యొక్క పని సులభముగా నెర వేరుటకు ప్రతిరాజధాని యందును గ్రంథ భాండాగారికుల సభలను సమకూర్చి జాతీయ విద్య వ్యాపించుటకు గాను మార్గముల నన్వేషింపవలసినదని ఈ సభవారు తీర్మానించుచున్నారు.
(5) జాతీయ పాఠశాలలందును కళాశాల లందును గల ఉపాధ్యాయులకును విద్యార్థులకును ఉపయోగముగా నుండుటకై వివిధ విషయములను గూర్చిన గ్రంధముల యొక్క ప్రకటనను రాష్ట్రీయ గ్రంధాలయ సంఘములు చేయవలయునని ఈ సభవారు తీర్మానించుచున్నారు.
(6) ప్రస్తుత దేశస్థితిగతుల ననుసరించి స్త్రీలకు ప్రత్యేక గ్రంధాలయములు అత్యంతావసరము గనుక అట్టి గ్రంధాలయములను స్థాపించుటకును లేదా ఉన్న గ్రంధాలయములలోనే స్త్రీలకు ప్రత్యేక శాఖలను ఏర్పరచుటకును వాటిని విరివిగా ప్రోత్సహించుటకును గ్రంధాలయల యోద్యమాభిలాషులను ఈ సభవారు కోరుచున్నారు.
ముగింపు
తీర్మానములు ముగిసిన పిమ్మట అధ్యక్షత వహించిన గోస్వామిగారు లేచి తమ అంత్యోపన్యాసము నందు దేశమును కలవర బెట్టుచున్న అనేక సమస్యలను పూర్తి జేయుటకు ఈ గ్రంధాలయోద్యమమే ప్రాముఖ్యతను వహించినదనియు అందుచేత భారతవర్షమున దంతటను ధర్మగ్రంధాలయ స్థాపనము విరివిగా సాగవలెననియు జెప్పి తమయుపన్యాసమును ముగించిరి. అంతట టంగుటూరు ప్రకాశం గారు ఆధ్యక్షునకు వందనము అర్పించిరి. అంతటితో సభ ముగిసినది.