Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 7/అఖిలభారత గ్రంథాలయ సంఘము

​

అఖిల భారత గ్రంథాలయ సంఘము

ఈ సంఘము యొక్క సామాన్య సమావేశము 28.12.24 తేదీన బెల్గాంనందు విజయనగర శిబిరమున సమావేశ మయ్యెను. అప్పుడు ఈ సంఘమునకు ఈ క్రింది ప్రకారము ఉద్యోగుల నెన్నుకొనిరి:—

ఈ సభకు అధ్యక్షులగు దేశబంధు దాసు గారే ఈ సంఘమునకు అధ్యక్షులుగా నుందురు.
ఇదివరలో ఉన్న ఉపాధ్యక్షులకు అదనముగా శ్రీయుత టి.సి. గోస్వామి గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకొనిరి.
అయ్యంకి వేంకట రమణయ్య గారిని తిరిగి జనరల్ కార్యదర్శిగా నెన్నుకొనిరి. కళా వెంకటరావు గారిని సంయుక్త కార్యదర్శిగానెన్నుకొనిరి. ​
నూరి వేంకట నరసింహశాస్త్రి గారిని కార్యనిర్వాహక సంఘమునకు ఉపాధ్యక్షులుగా ఎన్నుకొనిరి.
సుశీల కుమార ఘోషుగారిని వేరొక కార్యదర్శిగా నెన్నుకొని వారిని వంగదేశమందు ఈ యుద్యమమును వ్యాప్తము జేయవలసినదని కోరిరి.
ఈ సంఘాధ్యక్షులకు సహకారులుగా నుండుటగాను శ్రీయుత పి.ఉ.సర్కారుగారును, యన్.సి.ఘోషు గారును సహాయ కార్యదర్శులుగా నెన్నుకొనబడిరి.
వీరు గాక కార్యనిర్వాహక సంఘసభ్యులు కూడ ఎన్నుకొనబడిరి.
1860 సం. 21 నెం. అక్టు క్రింద ఈ సంఘమును రిజస్టరీ చేయుటకు తీర్మానించిరి.
1924 సంవత్సరము యొక్క లెక్కలను ఆడిట్ చేయుటకు ఆడిటర్ గారగు చంద్రశేఖర రెడ్డి గారిని నియమించడమైనది.

గ్రంథాలయములు

యగ్నగూడెం తాలూకా ప్రజాసభకు అధ్యక్షులగు శ్రీ మాగంటి శీతయ్య యం. యల్.సి.గారు తమ అధ్యక్షకోపన్యాసమందిట్లు జెప్పిరి. ప్రతి గ్రామమునను మీ ముఖ్యముగ నొకగ్రంథాలయ ముండవలెను. గ్రంథాలయములు గ్రామములయం దైక్యతను బోషించుటకు దోడ్పడగలవు. నిర్వ్యాపారతను దూర మొనర్పగలవు. గ్రామ్య జీవనమునకు వెఱుపురుగువలెనున్న యైకమత్యరాహిత్యమునకు నిర్వ్యాపారత జనని పనిపపాటు లేని సమయములయందే లేనిపోని వివాదములు పుట్టి యవియనేక విధములు బెరిగి గ్రామముల నాశనము చేయుచున్న సంగతిమీ రెఱుంగనిది కాదు. గ్రంథాలయమున్నచో సద్గ్రంథ పఠనముతో కాలక్షేపమొనర్చెదరు. వార్తాపత్రికలవలన దేశపరిస్థితుల నవగాహ మొనర్చుకొందురు. ఇతర దేశము లేయేతీరున సాంఘిక, ఆర్థి కాది విషయములలో సభివృద్ధి బొందు చున్నవియు గ్రహించెదరు. తద్వారమున నిర్వ్యాపారత దూరమై ఐకమత్యత యభివృద్ధియె తొల్లింటి గ్రామ్యజీవనమును జవిజూచెదరు. కావున ముఖ్యముగ ప్రతి గ్రామమున నొక గ్రంథాలయముండుట యవసరమని మఱల నొక్కి చెప్పుచున్నాను. ప్రతి గ్రామమువను శివకేశవాలయములు రెండును కనబడు చున్నవి. ఈయాలయము లేని యూర కాలు బెట్టరాదని పూర్వుల యభిప్రాయము. ఈ కాలమున మనమంతతో సరిపెట్టుకొనక అందు గ్రంథాలయమున్నుగూడ జేర్చి ముఖ్యముగ మూడాలయము లుండవవలెనని నిర్ధరించవలసి యున్నది.