గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 6/జర్మను గ్రంథాలయములందు సహకారము
జర్మను గ్రంథాలయములందు సహకారము
జర్మనీ దేశమందు ప్రష్యాయను రాజ్యము గలదు. ఆ రాజ్యమునందుగల విశ్వవిద్యాలయములు పదింటి యందును రాజమందిర మందును గలసి పదునొకండు గొప్ప గ్రంథాలయములు కలవు. ఆగ్రంథాలయములన్నియు ఒకే విద్యామంత్రియొక్క పరిపాలన క్రింద ఉండియున్నవి. ఆగ్రంథాలయములన్నింటి యొక్క ఉద్యోగులకును ఒక మాదిరిగానే జీతము లియ్యబడుచుండును. ఒకమాదిరి గానే తరిబీకుడు పొందియుండిరి. ఈ గ్రంథాలయ ఉద్యోగులందరును ఒక గ్రంథాలయమునుండి మరియొక గ్రంథాలయమునకు బదలాయిఁప బడుచుందురు. ఆ గ్రంథాలయము లందలి గ్రంథముల పట్టిక లన్నియును ఒకే నిబంధనలనను సరించి తయారు చేయబడినవి. ఆ గ్రంథాలయములందలి నూతన గ్రంథములు పేర్లన్నియు ఒక ప్రచురమునందే ప్రచురింపబడు చుండును. అన్నిటియందు గల గ్రంథము లన్నింటికిని కలిపి గ్రంథముల పట్టిక నొక దానిని తయారుచేసిరి. విదేశ సారస్వత గ్రంథముల కొనుట యందీ గ్రంథాలయములు ఒక్కొక గ్రంథాలయ మొక్కొక్క విషయకమైన గ్రంథములను విక్రయమునకు దీసికొను చుండును, అందువలన విదేశ సారస్వత గ్రంథములన్నియు మొత్తముమీద ఏదో యొక గ్రంథాలయ మందు కాన్పించుచుండును.
విద్యార్థి తనకు కావలసిన గ్రంథము తన గ్రామ గ్రంథాలయమందుదొరకని యెడల, ఆగ్రంథాలయముద్వారా, తన గ్రామమునకు దగ్గరనున్న విశ్వవిద్యాలయమునకు గాని రాజభవన గ్రంథాలయమునకు గాని ఆ గ్రంథుకొరకు వ్రాయును. అక్కడను దొరకనియెడల "ప్రచురణ సంఘము” వారికి వ్రాసి, అగ్రంథము ఏ యితర గ్రంథాలయము నందున్నదో తెలిసికొని, ఆ గ్రంథాలయమునకు తన గ్రంథాలయముద్వారా వాయును. చదువరి తన గ్రామ గ్రంథాలయమునకు జవాబుదారిగా నుండును, ఎరువు తీసికొను గ్రంథాలయము ఎరువిచ్చు గ్రంథాలయమునకు జవాబు దారిగా నుండును.
ప్రచురణ సంఘము
ఏ గ్రంధమైన జర్మనీ దేశమందున్న ఏ గ్రంథాలయ మందున్నదో తెలుసుకొని, ఆవిషయమును కోరినవారికి తెలుపుటయే ఈ సంఘము యొక్క పని. ఏ పుస్తకము విషయమైన తెలిసికొనగోరు వారు అగ్రంథము తన కెందుకు కావలెనూ వ్రాయుచు స్వల్పముగ రుసుమును ఇయ్యవలసియుండును. ఈ ప్రచురణ సంఘము యుక్క ఉపయోగమును పొందుచున్నవి. జర్మనీ దేశమందే 382 గ్రంధాలయములు కలవు. ఇవి గాక ఇంకో ఐరోపాదేశమందున్న ఇతర గ్రంధాలయములు గూడ దేనియుక్క ఉపయోగమును బొందుచున్నవి.
ప్రష్యా రాజ్యగ్రంథాలయ గ్రంధముల యొక్క పుస్తకముల పట్టికకును ఈ ప్రచురణ సంఘమునకును విశేషమైన సంబంధములదు. ఈ రెండును రాజమందిర గ్రంథాలయముతో గూడ విశేషసంబంధమును కలిగి యున్నవి. ఈ సంఘ కార్యాలయమందు 1,283,000 కార్డుల మీద వ్రాయబడిన గొప్ప గ్రంథముల పట్టిక కలదు. అందు పదకొండు ప్రస్యారాజ్య గ్రంథాలయము లందుగల గ్రంథములనుగూర్చియు విపులముగా వ్రాయబడి యుండును. ఇదిగాక, ఆ దేశమందుగల ఇతర గ్రంథాలయము లందుగల గ్రంధముల పట్టికలలు కూడ సిద్ధముగ నుండును. జర్మనీ దేశమందలి ముఖ్య గ్రంథాలయములఁదు గల 16,000 పత్రికల యొక్క పట్టికను గూడ ఈ సంఘము వారు తయారు చేసినారు.
ఏ పుస్తకము గూర్చియైన విచారణవచ్చినప్పుడు, ఆ గ్రంధమును గూర్చి కార్డులమీద వ్రాసి అన్ని గ్రంథాలయములకును పంపెదరు. ఆ గ్రంధమున్న గ్రంథాలయము వారు ఆ కార్డుమీద ఆగ్రంథము తమ యొద్ద గలదని వ్రాసి, తిరిగి ప్రచురణ సంఘమునకు పంపెదరు. ఈరీతిగా విచారణకొరకు వచ్చిన గ్రంథవిషయము తేలిసిన పిమ్మట "ఆ ఫలితము గ్రంథస్థము" చేయబడును. 1912 సంవత్సరమున దీసంఘము వారికి 13,965 గ్రంధములను గూర్చి విచారించుచు 1,35,207 ఉత్తరములు వచ్చినవి. అందు 9,737 గ్రంథములను గూర్చిన విచారణ ఫలప్రదమైనది.
గ్రంథముల ఎరుపు
ఈ ప్రచురణ సంఘమునకు చెంది 400 గ్రంథాలయములు గలవు. ఈ సంఖ్య దినదినమును అభివృద్ధి జెందుచున్నది. ఈసంఖ్యలో ముప్పాతిక భాగము పాఠశాలలకు చెందిన గ్రంథాలయములై యున్నవి, వ్రాతగ్రంధ ప్రతులు, అమూల్యములైన ముద్రిత గ్రంధములు ఎరువు ఇయ్యబడవు. మొత్తము మీద గ్రంధములన్నియు మూడు వారముల వరకు ఎరువియ్యబడును. పత్రికలు, కరపత్రములు మొదలైనవి ఒక వారమునకు మాత్రమే ఎరువియ్యబడును. ఎరువును తీసికొను గ్రంథాలయము, ఎరువిచ్చు గ్రంథాలయమునకు జవాబుదారీయైయుండును. ఎరువుతీసికొను గ్రంథాలయము, తన చదువరులకు కావలసిన నిబంధనలను ప్రత్యేక మేర్పరచుకొనును. ప్రష్యారాజ్య మందుగల 11 పెద్ద గ్రంథాలయములందును సభ్యులు తాము మామూలుగా ఇచ్చుచందా గాక, తీసికొను ప్రతి పుస్తాకమునకు వేరు చందా ఇయ్యవలసియుండును. ఆ తీసికొను పుస్తకమే, ఇతర గ్రంథాలయము నుండి తెప్పించి ఇయ్యవలసియుండిన, రుసుము కొంచెము ఎక్కువయుండును, ఆరుసుములో కొంతభాగము గ్రంధమును ఎరువిచ్చు గ్రంథాలయమునకు జెందును. ఇంకను అవసరమయ్యే ఇతర యేర్పాట్లుగూడ గ్రంథాలయములు పరస్పరము జేసికొనుచుండును.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse