Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 6/గ్రంథాలయ ప్రయోజనము

​

గ్రంథాలయ ప్రయోజనము

(హైదరాబాదునందున్న శ్రీ కృష్ణ దేవరాయలఆంధ్ర భాషానిలయమందిర ప్రవేశమహెూత్సవమునాఁటి అధ్యక్షకుఁడైన

కట్టమంచి రామలింగారెడ్డి యొక్క వచసమునుండి)

ఆంధ్రులది పరాశ్రయమును ఆశించు బ్రతుకు కాదు; స్వసహాయము చేత ముద్ధరింపదగు ప్రారంభములు మనయందెక్కువ. ఇందులకు మనవారు సంఘసంస్కార విషయమందును గ్రంథాలయ వ్యాపన మందును గడించి యుండెడు సిద్దలే సాక్షి. ఈ గ్రంథాలయోద్యమము జనబాహుళ్యము చేతి అంగీకరింపబడక ముందే శ్రీ మునగాల జమీఁదారు గారు ఈనిలయమును నిర్మించినవారిగుట ఈ యుద్యమము నకు వారు మార్గదర్శకులమట అతిశయోక్తి కానేగదు. ప్రకృతము గ్రంథాలయములు విశేషముగ స్థాపింపబడుచున్నవి; అమితముగ నేనాటికి స్థాపింప బడనేరవు. అవి యెన్నియున్నను జాలవు. అంధకారమును విరియింపజేయు నీ నక్షత్రమండలిలో మీ నగరమందు ద్భవించినయది ప్రాథమికము. భాగ్యనగరమన మీ యూరి పేరు దీనిచే సార్థకమైనది.

మీ యొక్క ఆంధ్రజాతీయ భావోన్నతికి సూచికముగ నీ పుస్తకాశయమును శ్రీ కృష్ణదేవరాయ నామాంకితము జేసియున్నారు. దీనికన్న గొప్ప పేరు దేశచరిత్ర మందు కన్పట్టదు. దేశభక్తికి, కార్యోత్సాహమునకు, భాషాకృషికి, ఈ "హిందూరాజ్య రమాధురఁధరుని” స్మరణ అమోఘమైన మంత్రము. దాని ధ్యానముచే ఆంధ్రులు ధన్యులౌట నిజము.

జ్ఞానమును వ్యాపింపజేయు పద్ధతులలో ముఖ్యము లెనివి నాలుగు:— పాఠశాలలు, పుస్తకశాలలు, వార్తాపత్రికలు, ప్రసంగములో ప్రజాప్రతినిధులచే పరిపాలింపబడు దేశములలో ఈనాల్గును బహు చక్కగ నిర్వర్తింపబడుచున్నవి. కారణము స్ప్రష్టము. రాజ్యతంత్రము ప్రజాధీనము గావున ప్రజల యొక్క మేలును వృద్ధిజేయుటయ దానికి సహజమైనకర్మము. రెండవది: ప్రజల యొక్క వివేకము ననుసరించి రాజ్యతంత్రము నడచును. జనబాహుళ్యమునందు జ్ఞానాభివృద్ధిని గలిగిఁపకపోయిన రాజ్యము చెడును. మూఢరాజ్యము మంచిరాజ్యము కానేరదు. అట్లగుట నెల్లకును విద్యను విస్తరింపజేయు మార్గముల ననుసరింతురు. అమెరికాదేశము ప్రజాపాలిత రాష్ట్రములలో ప్రాధమికము. అక్కడ పుస్తకాగారములు వ్యాప్తికిని వృద్ధికిని వచ్చిన రీతి నింకే దేశ మందును లేదు. పురములు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రములు మొదలగు ప్రకృతులు తమతమ పరిపాలనా పరిమితిని ఆదాయమును అనుసరించి లైబ్రెరీల స్థాపించు చున్నవి. పసిపిల్లల కాశ్రయమైన వానిని పెద్దవారికి నుచితమైనవానిని ప్రత్యేకించి యుంతురు. ఇట్లుచేయుట యవశ్యకర్తవ్యము. రాజ్యాంగముల చేత నిర్మింపబడు వానికన్న ధార్మికులైన ధనాఢ్యుల చేత ప్రతిష్ఠింపబడినవి సర్వవిధముల నెక్కుడని చెప్పవచ్చును. పాశ్చాత్యులు ధనసంపాదనమందే కాక వినియోగమునందును సమర్థులు. మన జన సామాన్య మట్లు కుటుంబములకు మించని దృష్టియు శ్రద్ధయ లేనివారు కారు. వ్యష్టికన్న సమష్టి ముఖ్యమనియు, సంఘముచెడిన కుటుంబములను గౌరవహీనదశకు వచ్చుననియు చక్కగ హృదయ పూణ౯ముగ భావించి, వారు సంఘశక్తికి నిద్దీపకములైన త్యాగముల నన్నింటిని ధారాళముగ జేతురు. లైబ్రెరీల కొఱకు ఒక్క ఆమెరికాయందే కాక ఇంగ్లాండునందును విశేషముగ కార్నెగీయను మహాత్ముడు ద్రవ్య సహాయము చేసియుండుట జగద్విదితము. రాక్ ఫెల్లర్ మొదలగువారు చేసిన త్యాగములు అనేక కోట్లను మీఱియున్నవి. నిజమైన క్షాత్ర తేజస్సు ప్రబలి యుఁడు చోట్లలో దేశమునకై ప్రాణమును ధనమును వినియోగింపనెవ్వరు వెనుదీయరు.

జ్ఞానము ఉత్పత్తికి రానిది జరులలో ప్రసరింప నేరదు. జ్ఞానము విరివియైన మాత్రన చాలదు. అది పొడుగుగును లోతుగను దినదినము పోవుచుండవలయును. అపుడు గదా నిక్కమైన జ్ఞానాభివృద్ధి! ఎప్పుడో ఎవ్వరో కనిపట్టి చేకూర్చిన విద్యలను విమర్శింపక, అప్పుడప్పుడు పరిశీలిఁపక, వానియందలి ముఱికిని దీరుక, అవి శుభ్రతరము లగునట్లు నూతనాంశములను చేర్పక, నిలకడ దాల్చిన కుళ్లు నీళ్లుగా నుంచుకొని, జనులకు పోయచు వచ్చిన అనారోగ్యము ప్రబలి క్షయవ్యాధిని కలిగింపక మానదు. కావున వ్యాప్తికి సృష్టియు ప్రధానమని భావించి ప్రకృతాది శాస్త్రకృషికిని తిన్మూలమున నూతన ​ఫలితమును బడని సంఘమును విజ్ఞానసస్యాఢ్యము చేయుటకును వలయు సౌకర్యముల గలిగింపవలయును. పుస్తకాగారములు కాలువలవంటివి. చెరువు లేనిదే కాలువలు వృధలు. చెఱువులుండియు వానలు కురియకున్న క్షామము నివారణకాదు. మనుష్య ప్రయత్నముచేత సాపింపబడియుండు నూతన పరిశోధకశాలలు చెఱువులు వంటివి; మహనీయుల యొక్క ప్రతిభావి శేషమే వర్షము. ఏ ఏ రాజ్యమున మూఢభక్తి ప్రబలి, మతములు పేర, మనుష్యుల యోజనాశక్తికిని, నీతికిని, వర్తనముసకును తగుమైన స్వాతంత్యము నియ్యకుందురో ఆరాజ్యము కుళ్ళి కంపెత్తిపోవుట. అట్లు దుగ్గఁధముగా నుండినయెడల ఏపరదేశీయులను మునిసిపాలిటీవారొ వచ్చి దానినూడ్చి పాఱగ్రుక్కుదురు.

పాశ్చాత్య దేశములలో నూతన పరిశోధనలు, తత్త్వములు, సిద్ధాంతములు, సృష్టులు వెలువడనిదిన మొక్కటియు లేదు. మనుష్య- ప్రకృతి యను మహావృక్షమక్కడ క్షణక్షణమును క్రొత్త చిగుళ్లను నూతన వికాసములను బయలుపుచ్చుచుండును. క్రొత్తకొత్త గ్రంధములు ప్రతిదినమును ప్రచురమునకు వచ్చుచుండును. మన యందు ఆధునికవిద్యలు మిక్కిలియు బీడుపడి శోషించి యున్నవి. ఏ గ్రంథాలయమును లెక్కించి చూచినను సరే, ప్రాచీనమునకు చేసిన గ్రంథములు వెయ్యియున్న, ఆధునికములు ఏబదియైన నుండుట యరిది. శ్రుతిష్మృతులు, వానిమీద వ్యాఖ్యానములు, ఆవ్యాఖ్యానముల మీద వ్యాఖ్యానములు, వ్యాకరణములు, కావ్యములు, ప్రబంధములు, సాహిత్యదర్పణములు, సంగీతకళానిధులు, శతకములు, ఇచ్చివేగని సంఘ, మానస, ఆర్థిక, రాజ్యతంత్ర, ప్రకృత్యాది శాస్త్రములకు చేరిన గ్రంథములు అపురూపములు. సనాతనములు నీరితి నింతఘనముగ మెడబట్టుకొని యేదేశమును వర్తమానమను అల్లకల్లోలమైన సముద్రమును ఈ భద్ర భవిష్యత్తు దీవిని చేర జాలదు.

లైబ్రరీల కట్లు సాహ్యాయము చేసిన కార్నెగీ రాక్ ఫెల్లరు మొదలగువారును, ప్రకృత్యాది శాస్త్రములను, ఇంజనీరింగు మొదలగు కళలను పరిశోధించి నూతనాంశముల కనిపట్టుటకు సాధకములైన గొప్పశాలలను స్థాపించి అచ్చట పని చేయువారలకు గొప్ప వేతనములను కలిగించి యున్నారు. సృష్టికి వ్యాప్తికియుండు సంబంధమును గ్రహించినవారగుట కాబోలు ఈ నిలయమునకు స్థాపకులైన శ్రీ మునగాల జమీందార్లును, విజ్ఞానచంద్రికామండలి ఇత్యాది గ్రంథకర్తృ సమాజములకును స్థాపకులును పోషకులై యున్నారు. మన దేశమునందు ఆధునిక శాస్త్రములను కళలను వివరించు గ్రంథములు విశేషించి ప్రచురింపబడక యుండినయెడల, ప్రాత వాసన పర్విన గ్రంథాలయములచే మేలా కీడా యెక్కువ గలుగుననుట చర్చనియమగును. మంచినీళ్ళు లేనిచో కొళాయీలును లేకుండిననే మేలు!

గ్రంథాలయములు గ్రంథకర్తృత్వమునకు ప్రబల సాహాయ్యకములు. ప్రతి యొక్క ఆలయమును ఒక్కొక్క ప్రతిని గొనినయెడల పుస్తకకర్తల యొక్క దౌర్భాగ్యము తొలగిపోవును. అట్లు చేయక ప్రతియాలయమును కర్తలను ఉచితముగా గ్రంధముల నిమ్మని యాచించుటకు మొదలిడిన, అభిక్షాధికారుల కష్టము దేవునికే యెఱుక. ఒక్కడు నూరుమందికి దక్షిణ పెట్టుటకన్న, నూరుమంది ఒక్కనినుండి వెలయిచ్చి కొనుట సుగమ మని మనవారెఱిగి వర్తింతురు గాక!

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse