గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 5/ధర్మగ్రంథాలయము—గ్రంథాలయ పాలకుడు సిబ్బంది
ధర్మగ్రంథాలయము
గ్రంథాలయపాలకుడు - సిబ్బంది
బి. హెచ్. మెహతాగారు
(అనువాదకుడు:— యాతగిరి లక్ష్మీ వేంకటరమణ)
గ్రంథాలయ పాలకుని నియమించుటలో ప్రతి గ్రంథాలయమువారును మిక్కలి జాగరూకత వహింపవలెను. వలెను. ఒక పక్షమునకు సంబంధించిన మనుజుని నియమించుటకు ప్రయత్నింపగూడదు. పాలకత్వమనకు తగిన మనుజునే నియమింపవలెను. ఈసూత్రము అన్ని దేశములకును, కాలములకును వర్తించును. అనేక మతములు, జాతులు, ఆచారములు కలిగిన ప్రజాసమూహముతో నిండిన మన హిందూ దేశములోని ధర్మగ్రంథాలయము నకు పాలకుని నియమించుటలో చాల కష్టమున్నది. గ్రంథాలయపాలకుడు కార్యనిర్వహణమందు సమర్థుడై యుఁడుటయేగాక యింకను కొన్ని సుగుణములను కలిగియుండవలేను. అతడ అవసరసమయములందును స్థలములందును మనస్ఫూర్తిగా పనిచేయు గుణమును, శక్తిని గలిగియుండవలెను, అతనికి భాషాభిమాన మెంతయున్నను, యెట్టి గొప్ప పరీక్షలలో కృతార్థుడైనను కార్యము లేదు. పైని పేర్కొనబడిన గుణములను కలిగియుండిననే కార్యకారి కాగలడు. ఆయన జాతిమతభేదములను పాటింపనివాడై సర్వమానవసమానత్వ తత్వము గలవాడై యుండవలెను. జాతిమత భేదములను గ్రంథాలయ కార్యనిర్వహణమందు ప్రవేశపెట్టినయెడల గ్రం థాలయాభివృద్ధికి తప్పక భంగము కలుగును. చక్కని దస్తూరి వ్రాయుటకూడ పాలకుని కుఁడవలసిన ముఖ్యగుణములలో నొకటి. గ్రంథాలయ రికార్డును అచ్చువేయించి యుంచుట మేలు పద్ధతి. కానీ ధనవ్యయమును అన్ని గ్రంథాలయములు భరించుట కష్టముగావున ఆదరణయోగ్యము కాదు, శాశ్వతరికార్డును టైపుచేయించుటకుగూడ వీలులేదు. ఏలన కొన్ని దినములకు అక్షరములు హరించిపోవును. కావున చేతితో వ్రాయుటయే యూత్తమమైన మార్గము. గ్రంథాలయమున రికార్డ్ తయారుచేయున దొకరైనను పెక్కురైనను అందరు నొకేమాదిరి దస్తూరి నవలంబింపవలెను. వ్రాయసకాడు రికార్డులోనుండి తాను వ్రాసిన భాగములను కనుపరుపలేనంత శ్రేష్టము వ్రాయవలెను. ఆమెరికా గ్రంథాలములలో గ్రంథాలయదస్తూరియని పిలువబడు గుండ్రని నిలుపుటక్ష రములను వ్రాయుచున్నారు. గ్రంథాలయములోని వ్రాయసకాండ్రలో ముఖ్యముగా శాశ్వతరికార్డును తయారు చేయువారందరును తప్పక గ్రంథాలయదస్తూరి నవలంబించునట్లు నిక్కచ్చి చేయవలెను. గ్రంథాలయదస్తూరి వ్రాయని వారిని వ్రాయలేని వారిని నియమింప కుండుట యుత్తమమార్గము. గ్రంథాలయదస్తూరి నవలంబించుట విశేష కష్టకార్యము కాదు. కొలది యోర్మి వహించి వ్రాయుటకు ప్రయత్నించిన యెడల దస్తూరి బాగులేనివారుకూడ గ్రంథాలయదస్తూరి బాగుగ వ్రాయగలరు, దీని ముఖ్యాభిప్రాయమేమన గ్రంథాలయ దస్తూరి అచ్చునకు మేనల్లునివలె నుండవలెను.
శ్రేష్ఠమైన పాలకుని నియమించిన పిమ్మట ఆయనకు మంచి జీతము నేర్పరచి క్రమాభివృద్ధి నొందునట్లు చూడవలెను. అప్పుడు కార్యసంఘమువారతనిపై కొన్ని బాధ్యతలను మోపి తప్పులను సవరించు పద్ధతిని, తగినంత స్వతంత్రము నొసగవలసి యున్నది. గ్రంథాలయమునకు గుమాస్తాల నేర్పరచు అవసరము కలిగినప్పుడు అట్టివారిని పాలకునితో సంప్రతించియే యేర్పరుపవలెను. తగిన కారణములను చూపుచు ఒకానొకవ్యక్తిని నియమింపగూడదని పాలకుడు అడ్డుపెట్టిన యెడల అట్టి యాక్షేపణను కమిటీ వారు తప్పక గమనింపవలెను. ఇట్టి యుద్యోగముల కన్నిటికీ మామూలు పరతులతో రెండుమూడు వత్సరములకు తాత్కాలిక యేర్పాటులను గావింపవలెను. అవసరమునకు పనికి వచ్చుటకు కొంతమందిని జీతముపైనిగాని లేకగాని ఉమేజు కారీలను చేర్చుకొనుట లాభకరము. . చిన్న గ్రంథాలయములకు అన్ని శాఖలకు కలిపి నిబంధనలను పాలకుడు తయారుచేసి కమిటీవారి యనుమతికి పంపవలెను. సహాయపాలకులుండు పెద్ద గ్రంథాలయములకు బ్రత్యేక శాఖలకు ప్రత్యేక నిబంధనలను తయారు చేయవలసియున్నది. నిబంధనలను తయారు చేయుటలో నేమనుజూడేయే కార్యముల నొనరించుచుండవలెనో స్పష్టముగా వివరించి వ్రాయటమేలు. వారికి కొంత స్వతంత్రము గూడ చూపనియెడల వ్యక్తినిర్ణయాధికారమునకు భంగము కలంగును.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse