Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 5/ద్వితీయ అఖిల భారత గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ

​

ద్వితీయ అఖిల భారత గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ

ఈ మహాసభ కాకినాడ పట్టణ పురమందిరమున 1923 సం॥ డిశంబరు నెల 26, 27 తేదీలయందు అతి వైభవముగ జరిగినది. మద్రాసునందు ప్రధమ సభ జరిగిన పిమ్మట, ద్వితీయ సభ బరోడాయందు జరుగ వలసి యుండెను, కాని అట్లు జరుగకుండుటచేత పమిడిపాడు నందు జరిగిన ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభచే తీర్మానింపబడిన ప్రకారము, ఈ సభ కాకినాడ యందు సమకూర్పబడెను. 26వ తేదీ మధ్యాహ్నము 2 గంటలకు సభ ప్రారంభమాయెను. సభకు నిర్ణయింపబడిన కాలమునకు పూర్వమే సభాభవనమంతయు ప్రతి నిధులతోను ప్రేక్షకులతోను క్రిక్కిరిసిపోయెను. వివిధ రాష్ట్రములనుండి వచ్చిన ప్రతినిధులు రమారమి 250 మంది గలరు. బరోడా, మైసూరు, పుదుక్కోట, సంస్థానములనుండియు, బొంబాయి విశ్వవిద్యాలయము నుండియు ఈ సభకు ప్రతినిధులు పంపబడిరి. ప్రార్ధన జరిగిన పిమ్మట, ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీ చెలికాని ధర్మారావు బార్-అట్-లా గారు తమ ఉపన్యాసమును గంభీరమగు వాక్కులతో ఈ క్రిందిరీతిని ఒసంగి యుండిరి.

ఆహ్వాన సంఘాధ్యక్షుని ఉపన్యాసము

ఆహ్వాన సంఘ ముపక్షమున మీకు స్వాగత మొసంగు భాగ్యము నాకు అబ్బినందులకు మిక్కిలిగర్వపడుచున్నాను. ఎనిమిదవ ఆంధ్రగ్రంథాలయ మహాసభలో జరిగిన తీర్మానానుసారముగా, కాకినాడలో ఈ సభ కూడు ఉన్నది. ఈ సభకు వచ్చిన ప్రతినిధులందరి కార్యదీక్షయు, దేశాభిమానమును, ఈ సభను నిర్విఘ్నముగ జరుపగలుగును, మిక్కిలి విచారికరమగు కొన్ని ఆలోచనలు నా మనస్సును చీకాకుపరచుచున్నవి. ఈ ఉద్యమముతో అత్యంతమైన సంబంధముగల ప్రముఖులిద్దరు పరలోకగతులైరి. మొదటి అఖిలభారత గ్రంధాలయసభకు

​అగ్రాసనాధిపతిగారగు కుడు హోల్కరు గారును ఆసభకు అహ్యానసంఘాధ్యక్షులు కస్తూరి రంగఅయ్యంగారును మనలను విడచి స్వర్గస్తులైరి. వారు ఉభయులు మిక్కిలి కీర్తిమంతులు, వారిని పోగొట్టుకొనిన దుఃఖముతో మనము నిరుత్సాహులము కాగూడదు; అందుకు బదులుగా వారిమరణముచే గలిగిన లోపమును కూడ దీర్చికొనుటకు ఇతోధికధిక ప్రయత్నములను మనము జరుప వలసియున్నది. కాకినాడకు అత్యంత సమీపమున నాప్రియసోదరులగు కావ్యనిధి చెలికాని లచ్చారావుగారు కూడ దివికేగిరి, వారికి మనయుద్యమమందు పట్టుదల కడుమెండు. వారి మరణమువలన గలిగినలోపము చులకనగా దీరునది గాదు. మన మాతృభూమియెడల మనము నిర్వర్తించవలసిన విధులను మనము నెరవేర్చుటకు తగిన శక్తిని పరమేశ్వరుడు మనకొసంగుగాక!

సామాన్యముగా విద్యాభివృద్ధినిగూర్చియు, అందుప్రాముఖ్యముగా గ్రంథాలయోద్యమమును గూర్చియు, కొద్దివిషయములను మీయెదుట మనవి జేయుచున్నాను. మన దేశాభివృద్ధిని గోరువారందరు ఆలోచించుచున్న రాజకీయ ఆర్థిక సాంఘిక మతవిషయిక సమస్యలన్నీయు ప్రజలయందు జ్ఞానమును వ్యాపింపజేయుటచే నెరవేరగలవని ఎంచతగియున్నది. ప్రతిమసుజుడున తనయొక్క శక్తిని, దాని ఆభావమును గుర్తొరింగి తనమమోభీష్టము సిద్ధినిబొందుకొరకు ఏయే విధానము అవలంబించవలయునో దానినంతను జ్ఞానజ్యోతి ద్యోతకముజేయును, ప్రతిమనుజుడును తనవాంఛలను ఆకలిదప్పులవలెనే తీవ్రముగ అనుభవములోనికి తెచ్చుకొన్నగాని వాంఛిత ఫలసిద్ధి పొందనేరడు.

మనము ఉపదేశించువిద్య జాతీయపద్ధతి నవలంబించి యుండవలేను. ప్రతిజాతియు, నిర్దిష్టముగు ఆదర్శసిద్ధికై కృషి చేయుచున్నది. ప్రాచ్యా పాశ్చాత్య ప్రాప్యములలో భేదము చాలగలదు. అందువలననే పాశ్చాత్య పద్దతుల నవలంబించి మన పాఠశాలలలో బోధించెడి విద్యమనకు ఈప్సితఫలమును ఇచ్చుట లేదు. చిరకాలాభ్యాసము వలన భారతీయుల మానసిక నైతికతత్వమునందు తృప్తి, ఆడంబరములేని జీవితము, ఆత్మసమర్పణము చేయుధర్మము, త్యాగమునకు లోబరచబడిన భోగము ౼ సంపూర్ణముగ లీనమైపోయినవి. ఈతత్వమును గ్రహించక ఇందుకు వ్యతిరేకమగు సూత్రముల ననుసరించి నిర్మాణము చేయబడు విద్యాభ్యాసవిధానమంతయు మన దేశమునకు నిజాతీయమైన దగుటచే గుంటపూవులు పూయవలసినదే.

కాని ఎన్నటికిని అభివృద్ధిని గాంచనేరదు. ఇంతటితో మనము అన్నిటియందును సంపూర్ణత్వమును పొంది యుంటిమనియు, ఇతరుల వలన నేర్చుకొనవలసిన విషయములు లేనేలేవనియు నేను చెప్పుటలేదు. ఇతరులవలన నేర్చుకొని తీర్చుకొనవలసిన లోపము లనేకములు మనకుకలవు. మనకు నిర్మాణశక్తి బహుతక్కువ. పాశ్చాత్యులను జూచి, మన విధులను సక్రమముగా నెరవేర్చుకొనుదీక్ష , మనము నేర్చుకొనవలసియున్నది. ఇట్లు నేర్చుకొను విషయములయందుగూడ మన జాతీయవ్యక్తిత్వమును మనము మరువగూడదు.

కేవలము కళాశాలాభవనములు మొదలగువానిని నిర్మించుటకును, వానికి తగుపరికరములను చేర్చుటకును ఐశ్వర్యములతో తులదూగుచున్న పాశ్చాత్య దేశములందు మిక్కుటముగ ద్రవ్యము వెచ్చింపబడుచున్నట్లు మన బీద దేశమందు సొమ్ము వ్యయపెట్టలేము, పాశ్చాత్య దేశములలో తప్పనిసరిగా ఉండితీరవలెనను ఎన్నియో వస్తువులు మనదేశమున కేవల వైభవమునకు సంబంధించినవై యున్నవి. ఈ వైభవములు శరీరమును నున్నితపరచి, జీవితమును హ్రస్వముజేయును. ఇప్పటి విద్యార్థులు పూర్వపు వారికంటె ఎన్నియోమడుంగులు బలహీనులు. గ్రంధాలయములు స్థాపించుటయందు ఈ విషయములనన్నింటిని మనము మనస్సు నందుంచుకొనవలయును.

గ్రంథాలయనిర్మాణము మనదేశమునకు క్రొత్తదిగాదు. కాశీ మొదలగు పుణ్యక్షేత్రములందును, మఠములయందును ఆశ్రమములందును నెలకొల్పబడియున్న గ్రంధసమితులు ఆధునిక గ్రంధాలయములవంటి వేను. పరిస్థితులు మారినవి ప్రజలయందు జ్ఞానము ఎక్కువ దట్టముగా వ్యాపించుటకుగాను పాశ్చాత్య పద్ధతులకు కొన్నింటిని మనము అనుకరింపవలెను. ఎక్కువసొమ్మును వెచ్చించి పెద్ద భవనములను, మనస్సును వ్యామోహము చెందించి కర్రసామానులకు, సేకరించుటయందు ద్రవ్యము దుర్వినియోగము చేయక తగు ద్రవ్యమును ఉచితరీతిని వ్యయ పెట్టి గ్రంథాలయస్థాపనమును మనము చేయవలయును,

మిక్కిలి విజ్ఞానవంతులగు బరోడా గాయక్వారుగారు, కీర్తిశేషులు కులాల్కరు గారివంటి కార్యదీక్షాపరుల సహాయముతో ప్రారంభ ఉచితివిద్య మూలమునను, గ్రంథాలయస్థాపన మూలమునను, ఆయన రాజ్యమున ప్రజలకు జ్ఞానాభివృద్ధి చేయుటకు అత్యత్తమములగు సాధనములను అవలంబించియున్నారు. మైసురు, తిరువాన్కూరు మున్నగు ఇతర సృదేశ సంస్థానాధకులు గూడ ​గాయక్వారుగారిని అనుకరించి తమతమ దేశములందు నిరక్షరకుక్షుల సంఖ్యను తగ్గించి ప్రజలయందు జ్ఞానాభిలాషను అభివృద్ధి జెందించుచున్నారు. అక్కడ ప్రజలకును రాజులకును విరుద్ధప్రయోజనములేదు. కావున మనకు ఆంతరాయములుగానున్న కొన్ని ప్రతిబంధకములు వారికి లేకుండుటచే అచ్చట ఈ ముద్యమము ఎక్కువనుకరముగా వ్యాప్తి జెందుటకు సావకాశములున్నవి.

ఆంధ్ర దేశమున బెజవాడపట్టణము గ్రంథాలయోద్యమమును అభివృద్ధికి దెచ్చుటకు నిరంతర కృషి సలుపు చున్నది. మద్రాసునందు జరిగిన ప్రథమ అఖిల భారత గ్రంథాలయ సభయందు ఆంధ్ర దేశమున ఇందునుగూర్చి చేయబడుచున్న కృషియు, అందు ముఖ్యముగ శ్రీ సూరి వేంకట నరసింహశాస్త్రి గారి దేశసేవయు, మిక్కిలి పొగర్తను గాంచినవి.

దేశమునకు పల్లెలు పునాది. కావున పల్లెటూరు గ్రంధాలయములనుగూర్చి ఎక్కువ కృషి చేయవలసి యున్నది. స్థానిక స్వపరిపాలక సంఘములు తమవిధ్యుక్తమగు ఈ పనిని నెరవేర్చినచో అంతయు సులువుగానే యుండును. ఈ గ్రంథాలయముల అభివృద్ధిమీదనే స్వపరిపాలక సంఘములు అభివృద్ధిగూడ ఆధారపడియున్నది. ప్రజా సామాన్యము విద్యావంతులు కానియెడల తగిన ప్రతినిధులు ఈసంఘములకు ఎన్నుకొనబడరు. వోటర్లు అజ్ఞానులైనచో ఈ సంఘములు కూడ నిరర్థకములుగానే యుండును.

మూడునాలుగు గ్రామముల వారు చేరి చందాలు వేసికొని, చిన్న గ్రంథాలయమును స్థాపించుకొనవచ్చును. ఇందుకు ముఖ్యముగా అచ్చటి విద్యావంతులు శ్రద్ధ తీసికొనవలెను. వీలైనయెడల నెలసరిజీత మిచ్చిగాని, వార్షికముగా ధాన్యము నిచ్చిగాని, ఒక గ్రంథభాండాగారికుని నియమించుట ఉచితము. కొద్దికాలము క్రిందటివరకు ఈపద్దతిని అవలంబించి ఉపాధ్యాయులు నియమింపబడు చుండిరి. అప్పటివారు ఇప్పటివారి కంటె ఎక్కువ సమర్థులైయుండిరి. వీలైనంతవరకు దేశభాషయందు ప్రచురింపబడు పత్రికలను తెప్పించి పఠన మందిరమును గూడ స్థాపింపవలెను. స్థానిక పాఠశాల ఉపాధ్యాయుల సాహాయముతో ప్రజలను జ్ఞానవంతులుగా జేయుటకు గ్రంథాలయములును, పఠన మందిరములును ఎన్నియోవిధముల ఉపకరింపగలవు. పాటకపుజనుల ఉపయోగము కొరకు రాత్రిపాఠశాలలు స్థాపించవలయును. ప్రకృతిశాస్త్ర రహస్యములను వెలిబుచ్చుటకును, వర్తమానపరిస్థితులను దెలుపుటకును, తరుచు ఉపన్యాసములను జరుపుచుండవలయును. ఈ సంస్థలకు అనుబంధముగ పంచాయతీకోర్టుల నేర్పరచి వ్యాజ్యముల సంఖ్య తగ్గింపవలెను. పల్లెటూళ్ల గ్రంథాలయములు అచ్చటచ్చటి ప్రజలకు చేయగల మహోపకారములు అనంతములు. స్థానికులకు దేశాభిమానుల కార్యదీక్ష ఎంతవరకు విజృంభించిన ఈ సంస్థలవలన సంస్థలవలన కలిగెడి లాభము అంతయెక్కువగా వృద్ధి జెందగలదు. ఇట్లు ప్రవర్తించినచో గృహకల్లోలములు, పల్లెటూళ్ళ తగాయిదాలు రచ్చకెక్కినగాని తీరవను తగవులు కూడ అనుకూలముగ పరిసమాప్తి నొందగలవు. పురాణకాలక్షేపములు, హరికధలుకూడ గ్రంథాలయముల యాజమాన్యమున జరుపవచ్చును.

ఈ విధముగ ఒక జిల్లాయందు స్థాపింపబడిన గ్రంథాలయములన్నియు చేరి, జిల్లా గ్రంథాలయమును నిర్మాణముచేసి దానికి అనుబంధముగా చేరవచ్చును. అవసరమైనచో ఒకేజిల్లాయందు రెండు మూడు కేంద్ర గ్రంథాలయములు కూడ ఉండవచ్చును. ఈజిల్లా గ్రంథాలయములు స్థానికముగా చేయవలసిన పనియేగాక, జిల్లాయందలి గ్రంథాలయములన్నింటిని అన్యోన్యాశ్రయములుగజేసి, అన్ని సంస్థలు చేయుపనిని ఏకముఖమునకు ప్రసరించనట్లు చేయవలయును. దేశాభిమానులగు లక్ష్మీపుత్రులును, భూస్వాములును, దేవాలయ ధర్మకర్తలును, దేవాదాయ ధర్మకర్తలునుకూడ ఈ ఉద్యమమునకు సహాయము చేయునట్లు వారలను ప్రార్థించవలయును. ధనసంపత్తి యున్నచో మాజిక్కులాంతరు సహాయమున ప్రజలకు జ్ఞానాభివృద్ధి చేయుటకు సంచారప్రవర్తకుల నేర్పరచవచ్చును. ఆరోగ్యము, రాజకీయపరిస్థితులు మొదలగు విషయములనుగూర్చి సులభశైలిని కరపత్రములు ప్రచురించి గ్రంథాలయముల మూలమున మన దేశమును వ్యాపింపజేయవలయును. ఈ జిల్లా గ్రంథాలయములపైన రాష్ట్రముల రాజధాని పట్టణములందు స్థాపింపబడెడు రాష్ట్రీయ గ్రంథాలయము లుండవలెను. ఈ రాష్ట్రములన్నియు భాషాప్రయుక్తముగా నుండవలయును. ఈ రాష్ట్రీయ గ్రంథాలయములు రాష్ట్రభాషయందు కరపత్రములను ప్రచురించవలెను. ఇంగ్లీషునందుండు అమూల్యములగు గ్రంథములు కొన్నింటిని తర్జుమా చేయించి సరసమగు ధరలకు గ్రంథాలయములకు పంచిపెట్టులు ఉచితము. ​

ఆఖిలభారత గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ, కాకినాడ.

ప్రతినిధులు

​పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.5 (1924).pdf/10 ​

ద్వితీయ అఖిలభారత గ్రంథాలయప్రతినిధుల మహాసభ

సంపూర్ణమగు కేంద్రీకరణము ఎప్పటికిని పనికి రాదు. పల్లెటూరి గ్రంథాలయములకును జిల్లా గ్రంథాలయములకును వీలగువరకు తమవ్యక్తిత్వమును స్వేచ్ఛగా ఆభివృద్ధినొందించుటకు తగు సావకాశములుండి తీరవలేరు. భేదములేని సంపూర్ణఐక్యతయందు ఎప్పుడును సౌందర్యము ఉండనేరదు. మనదేశపు మతము యొక్క ముఖ్య సిద్దాంతమిదియేను.

రాష్ట్రీయ గ్రంధాలయసంఘము లన్నిటిని, సమ్మేశనముజేయు ఆఖిలభారత సంఘమొకటి ఉండితీరవలెను. ఇట్టి సంఘము 1919 సంవత్సరమున జరిగిన మదరాసు సభలో నిర్మాణము చేయబడినది. ఇంకెను ఈ సంఘము పని ప్రారంభించలేదు. ఈ సంఘ నిర్మాణముతో, హిందూదేశీయమహాసభతో బాటు గ్రంథాలయోద్యమమునకు గూడ అంగ సౌష్ఠవము సంపూర్ణముగ ఏర్పడుచున్నది. దేశమునందు నలుదిక్కుల స్థాపించబడియున్న గ్రంథాలయములతో పనిజేయవలసివచ్చినప్పుడు కొన్ని కష్టములు తటస్థింపవచ్చును. అయితే నిజమైన ఆనందము కష్టములు నివారణ చేసికొన్నప్పుడు కలుగునుకాని, నివారణ చేసి కొనవలసిన కష్టములు లేనప్పుడు ఎన్నటికిని కలుగ నేరదు. మన దేశమును అన్ని దిక్కులను, అన్ని శాఖలయందును, జాతీయప్రబోధను గలిగియున్నది. రాజకీయ సాంఘిక మతవిషయక స్వేచ్ఛను ప్రజలు మిక్కిలి వాంఛించుచున్నారు. ఈ అన్ని ఉద్యమములకును, మనఉద్యమము విరోధమైన దెన్నటికిని కాదు. ఈ అన్ని ఉద్యమములకును మనఉద్యమము సహాయము చేయునదిగా వర్ధిల్లుచున్నది. ప్రజాసానూన్యమునకు విద్యాదానము చేసి, ప్రజలయందు దట్టముగా వ్యాపించియున్న అజ్ఞానతిమిరమును జ్ఞానతేజస్సుచే తరుమగొట్టుటయే మన పరమప్రాప్యము.

సోదర ప్రతినిధులారా! నా వాంఛలను, నాఉద్దేశ్యములను మీకు ధారాళముగా నివేదించితిని. దేశారాధన తత్పరులగు విద్యాధిక బృందముతో ఈ సభ నిండియున్నది. నేను నివేదించినదానిలో ఎంతవరకు ఆచరణీయమో నిర్ణయించుట మీ విధ్యుక్తధర్మము.

ఆహ్వాన సంఘాధ్యక్షుల యుపన్యాసాంతమున ఆంధ్రభీష్ములనదగు మహారాజశ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు, బొంబాయి నగర వాస్తవ్యులను, శాసన సభాసభ్యులును బారిష్టరును ఆగు ఎమ్.ఆర్.జయకరు గారిని సభకు అధ్యక్షులుగా ఉపపాదించిరి. ఈ ఉపపాదన తగువిధముగా బలపర్చబడిన పిదప అధ్యక్షులు సభ్యుల కరతాళధ్వనులు మిన్నుముట్ట సభాధిపత్యము వహించి అనర్గళవాద్ధోరణితో ఆశువుగా నాఆంగ్లమున నుపన్యసించిరి. అందునుండి యీ క్రింది ముఖ్యాంశములు గ్రహింపబడినవి.

అధ్యక్షుని ఉపన్యాసము

“కడచిన పదిసంవత్సరములు పైకాలమునుండియు ఎక్కువ కట్టుదిట్టములతో దేశాభివృద్ధికై కృషిచేయచున్న ఆంధ్ర గ్రంథాలయోద్యమా భివృద్ధిని స్వయముగా కనుగొను సావకాశము ఇప్పుడు నాకు కలిగినందులకు నేను మిక్కిలి సంతసించుచున్నాను. నేను ఆంధ్ర దేశమును చూచిన కొద్దికాలములోను ఇచ్చటి పల్లెటూళ్లు పురాతనపు సౌందర్యమును వీడలేదనియు, మహారాష్ట్ర దేశమందువలెగాక ఇప్పటికిని పరిశుభ్రముగ నున్నవని నేను కనుగొంటిని. మలేరియా సూక్ష్మజీవులను నాశనము చేయుచున్నామను మిషతో ప్రభుత్వము వారు మహారాష్ట్రదేశమున పురాతనసలో వరములను పూడ్చి వేసిరి. ఇందువలన మా పల్లెటూళ్లలో చెరువులు లేనేలేవు. ఉన్న కొద్దినియైనను మంచిస్థితిలో లేవు. పల్లెటూళ్ల గ్రామకంఠములు నిర్మానుష్యముగను అపరిశుభ్రముగను నున్నవి. ఆంధ్రులు పురాతన సంస్థలను నాశనము నొందించువారుగాక తమ జాతియొక్క వ్యక్తిత్వమును, ధారావాహిక పరిజ్ఞానమును తమ విజ్ఞానమందురు. తమ ప్రతిష్ఠాపనలయందును బాగుగా కాపాడుకొనియున్నారు. ఆంధ్రులజాతియొక్క వ్యక్తిత్వమును కనుగుణ్యముగ ఆంధ్ర గ్రంథాలయోద్యమము కూడ పురాతన సంస్థలయందుత్తమమగు విషయములనెల్ల సంరక్షించుకొనియు నూతన సంస్థలలో అవసరమగువాని నెల్ల సంగ్రహించియు నిర్మాణమైనది. సామాన్యముగా ఆంధ్రగ్రంథాలయము కేవల పుస్తకనిక్షేపమేగాక రాజకీయ, సాంఘిక, నైతిక, మత విషయము మొదలగు జానపదుల ఉత్తమవ్యవస్థలకు సంబంధించిన అన్ని విధములగు కృషియు జరిగెడు కేంద్రస్థానముగా విరాజిల్లుచున్నది. కొన్ని గ్రంథాలయములు పోటీ పరీక్షలు జరిపి ఉత్తీర్ణలగువారికి బహుమతు లొసఁగును. కొన్నిటి యాజమాన్యమున పాఠశాలలు నిర్వహింపబడుచుండును. కొన్ని సంఘములు సాంఘిక సేవ చేయును. ఇప్పుడు భారతదేశము నెదుర్కొన్న సమస్యలలో పల్లెటూళ్లను బాగుపర్చేడి సమస్య అగ్రస్థానము నధిష్ఠించియున్నది. ఈ సమస్యను ఆనుకూలముగా పరిస్కరించుటకు ఆంధ్ర గ్రంథాలయోద్యమము పూని యున్నది. హిందూదేశమంత్రి ఒకరు ఇదివరలో చెప్పినట్లు ఇంతవరకును భారతీయులు వెనుక ​బండ్లు లేని కేవలము ఇంజన్లు మాత్రమే అయియున్నారు. ఇప్పుడు ఆస్థితి మారినది. పల్లెటూళ్లలో పౌరజీవనము సుస్థాపితమైన గాని స్వపరిపాలనకు సరియైనపునాది యుండనేరదని సంపూర్ణముగా గ్రహింపబడినది. ఆంధ్రగ్రంధాలయోద్యమపక్షమున మహరాజశ్రీ సూరి వేంకట నరసింహశాస్త్రిగారు చేయుచున్న కృషి మిక్కిలి ప్రశంసనీయము. ఆంధ్రులు తమ రాష్ట్రములో గ్రంథాలయోద్యమమును వ్యాప్తి చెందించుటతో తృప్తినొందరాదు. ఇతర రాష్ట్రములలో ఇట్టి ప్రాప్యములతోనే స్థాపింపబడి వర్ధిల్లుచున్న సంస్థాపులుండియున్నవి. మహారాష్ణదేశమున గ్రంథాలయోద్యమ ప్రచారకులందరు రెండు సంవత్సరముల క్రిందట సభలో కూడి ఆ సభకు నన్నగ్రసనాధిపతిగా చేసిరి. అచ్చట ఒక కేంద్ర సంఘ మేర్పడినది. దాని కనుబంధముగ 120 గ్రంథాలయములు చేరియున్నవి. వివిధ రాష్ట్రముల యందలి యుద్యమమును సమ్మేళనచేయుటకు అఖిలభారత కేంద్ర గ్రంథాలయ సంఘ మొకటి యుండవలెను. ఇందుకు చిత్తుచట్టములు ప్రథమ అఖిలభారత గ్రంథాలయసభలో చేయబడిన తీర్మానముననుసరించి తయారు చేయబడినది. వీనిని అంగీకరించ వచ్చును. పాశ్చాత్య దేశములలోనున్న పెద్ద గ్రంథాలయములలో, అందులో ముఖ్యముగా ఇంగ్లండు దేశమందున్న బ్రిటిషు మ్యూజియముయొక్క అత్యంతాభివృద్ధికి ముఖ్యసాధనము ఆయాదేశములలో నున్నకాపీరైటు ఆక్టులు. మనదేశమంచుకూడ అనుకూల పరిస్థితులేర్పడినపుడు అట్టి చట్టములు చేయవలసియున్నది.

ఉపన్యాసములు

అధ్యక్షుని ఉపన్యాసము పూర్తిఅయిన పిమ్మట బరోడా సంస్థానమందలి గ్రంథాలయోద్యమాభివృద్ధిని గూర్చి ఎమ్.ఎస్. అమీను గారును, మైసూరు సంస్థానమందలి గ్రంథాలయోద్యమమును గూర్చి వె.వి.చంద్రశేఖరయ్య గారు, పుదుక్కోట సంస్థానపు ఉద్యమము గూర్చి ఎ.ఎస్.ముత్తుకృష్ణన్ గారును హైద్రాబాదు సంస్థానమందలి ఆంధ్ర ప్రాంతపు గ్రంథాలయాభివృద్ధిని గూర్చి కంభంపాటి అన్నప్న శాస్త్రి గారును మహారాష్ట్రదేశమండలి గ్రంధాలయోద్యమమును గూర్చి వి.వి.ఘణీకర్ గారును ఉపన్యసించిరి.

గంజాంజిల్లా గొలజాం గ్రంథాలయ కార్యదర్శి తూర్పాటి సన్యాసమ్మగారు “ఆంధ్ర గ్రంథాలయము” అను విషయమును గూర్చి సప్రమాణముగా అనర్గళధారతో ఉపన్యసించిరి. శ్రీయుత శనగపల్లి రామస్వామి గుప్తగారు ఆంధ్రదేశ గ్రంధాలయోద్యముమును గూర్చి యుపన్యసించిరి. ఇంతటితో ఆనాటి సభ సమాప్తమైనది.

ప్రతినిధులందరు విషయనిర్ణయిక సంఘముగా చేరి చిత్తు తీర్మానములను చర్చించి నిరూపణ చేసిరి. 27 తేదీ ఉదయం 8½ గంటలకు సభకూడినది. గ్రంథాలయోద్యమము యొక్క వివిధశాఖలనుగూర్చి విద్యాధికులు ఉపన్యాసము చదివిరి. కీర్తిశేషులగు శ్రీ చెలికాని లచ్చారావుగారి అకాలమరణమునకు వగచుచు ఆంధ్రపరిశోధక గ్రంధభాండాగారికులగు కేశవరపు రామకృష్ణశాస్త్రిగారును, జనమంచి సీతారామయ్యగారును జాలికరమగు పద్యములను గానము చేసిరి.

27 వ తేది సాయంత్రం తిరిగి సభకూడి ఈక్రింది తీర్మానములను అంగీకరించెను:-

తీర్మానములు

I ప్రధమ అఖిలభారత గ్రంథాలయసభకు అధ్యక్షులుగానున్న జనార్ధనకుడల్కరు గారును ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీమా౯ కస్తూరి రంగయ్యంగారు స్వర్గస్థులగుటచే సామాన్యముగా భారతభూమికి, అందుప్రత్యేకముగ గ్రంథాలయోద్యమమునకును, కల్గిన తీరనిలోపము. ఈ సభవారు స్మరించుచు వారియాత్మలకు శాంతినొసంగవలెనని పరమేశ్వరుని ప్రార్థించుచున్నారు.

II కీర్తిశేషులగు కొమర్రాజు లక్ష్మణరావుగారు, చెలికాని లచ్చారావుగారు, వఁగూరు సుబ్బారావుగారును ఆంధ్ర దేశాభ్యుదయముకొరకును, అందు ప్రాముఖ్యముగా గ్రంథాలయోద్యమాభివృద్ధి కొరకురు నిరంతరకృషి జరుపుచు పిన్నవయస్సులో స్వర్గస్థులైనందుకు ఈ సభవారు వగచుచున్నారు.

III ప్రథమ ఆఖిలభారత గ్రంథాలయసభలో జరిగిన తీర్మానము ననుసరించి అఖిలభారత గ్రంథాలయ సంఘము నడుపుటకు చేయబడిన నియమావళిని పరిశీలించి అంగీకరించడమైనది.

IV ఆఖిల భారత దేశమందంతటను గ్రంథాలయ వ్యాప్తినొందించుటకు గాను ఉద్యమాభిమానులందరును ఆయా రాష్ట్రములయందును, జిల్లాల యందును రాష్ట్రీయమండల గ్రంథాలయ సంఘములను స్థాపించి వానిని, అస్యూన్యసహాయములు చేయుటకు ఈ సభ వారు హెచ్చరించుచున్నారు.

V స్థానిక స్వపరిపాలనా సంఘములును, స్వదేశ సంస్థానములును దేవాదాయ ధర్మాదాయ సంస్థల ధర్మ ​కర్తలును పౌరగ్రంథాలయములను ధర్మముగా స్థాపించుటకును, ఇదివరకు పనిచేయు గ్రంథాలయములకగు ఖర్చులో అధమము సగము వరకు భరించుటకును ఈ సభ వారు ప్రార్ధించుచున్నారు.

VI గ్రంథాలయాధికారులు తరువద్దగల ముద్రిత, అముద్రిత గ్రంధములను పండితుల ఉపయోగము నిమిత్తము ఎరువిచ్చుటకు తగు సదుపాయములను చేయవలయును.

VII గ్రంథాలయములకు సంబంధించిన విద్యయందు నిధులగువారి యాజమాన్యము కింద, గ్రంథాలయ పాఠశాలలను స్థాపింపవలెనని హిందూదేశమందలి విశ్వవిద్యాలయము యొక్కయు, రాష్ట్రప్రధాన నగరములయందున్న పెద్ద గ్రంథాలయముల యొక్కయు అధిపతులకు ఈ సభవారు కోరుచున్నారు.

VIII ట్రెయినింగు పాఠశాలలందును, కాలేజీలయందును జాతీయ పాఠశాలలందును, సెకండరీస్కూలు లీవింగ్ సర్టిఫికెట్టుక్లాసు నందును, గ్రంథాలయశాస్త్రమును గూడ అభ్యసింపదగిన విషయముగా ఏర్పరచవలెనని ఈసభవారు కోరుచున్నారు.

IX లిఖితగ్రంథములంను, శాసనములను, స్థానిక కథలును, ఏలపాటలును, జాతియొక్క విజ్ఞానమును, భద్రపరచిన నిక్షేపములు గాన గ్రంథాలయములు నన్నిటిని సేకరించి గ్రంథాలయములయందు సంగ్రహించి యుంచవలసినదని గ్రంథాలయయోద్యభిమానులను ఈసభవారు హెచ్చరించుచున్నారు.

X గ్రంథాలయోద్యమమునకు సహాయము చేసిన శ్రీయుతి కంచుకుర్తి చంద్రరావుగారు మొదలగువారికి ఈ సభవారు తమవందనము లర్పించుచున్నారు.

XI వార్తాపత్రికలయొక్కయు గ్రంధముల యొక్కయు ప్రకాశకులను గ్రంథాలయములకు సులువగు ఖరీదులకు గ్రంధములును, వార్తాపత్రికలును లభించునట్లు సదుపాయము చేయుటకు ఈ సభవారు ప్రార్థించుచున్నారు.

అంతట సభాధ్యక్షులకు వందనము లర్పింపబడెను. అధ్యక్షులు తమ అంత్యోపన్యాసములో తాము సభకు అధ్యక్షపదవి నలంకరించినందులకు మిక్కిలి సంతసించితిమనియు తాము కాకినాడలో ఉన్న కాలములో తమకు సౌకర్యములను సమకూర్చిన ఆహ్వాన సంఘ మువారు, అందులో ముఖ్యముగా కోశాధ్యక్షుడగు గమినె శ్రీరామలు గారు మిక్కిలి వందనీయులని సెలవిచ్చిరి. మూడవ సభను బొంబాయిరాజధానికి అధ్యక్షులు ఆహ్వానము చేసిరి, సభవారంగీకరించిరి. వివిధ రాష్ట్రములనుండివచ్చిన ప్రతినిధులును ఆహ్వాన సంఘము వారికిని స్వచ్ఛంద సేవకులకును వందనములను సమర్పించిరి.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse