Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 5/గ్రంథాలయములు

వికీసోర్స్ నుండి

గ్రంథాలయములు

(అరుమకొండ శ్రీరాజరాజని రేంద్రాంధ్ర భాషానిలయ ఏకోనవింశ ద్వార్షికోత్సవ అధ్యక్షులగు

శ్రీ ఎ. వెంకటరమణయ్యగారి ఉపన్యాసమునుండి)

విద్యాభివృద్ధికిఁ బాఠశాలలు మాత్రము చాలవు. ఇతర సాధనము లావశ్యకము. సంఘమును సంస్కరించుటకు సంఘీభావ మేర్పడుటకు సాధనముల నెల్ల మనము సమకూర్పవలెను.

జనులందరును సంఘీభావము కలిగియుండుటకును, అనూన్యపరిచయము నభివృద్ధి చేసికొనుటకును, సమత్వమును సంపూర్ణముగఁ గలిగియుండిన ధర్మపఠనమందిరములు, గ్రంథాలయూలు, వస్తుప్రదర్శనశాలలు మొదలగు వివిధ సంఘములను ఇందుకు సాధనములుగా దేశము నందెల్లెడలను విరివిగా సాపింపవలెను. సకల జనులును ఎచ్చోటికి వివక్షత లేకుండ పోగలుగుదురో అట్టిస్థలమే సార్వజనిక గ్రంథాలయము. విద్యాధిదేవతయగు సరస్వతీదేవికి జాతి, నుత వివక్షతగాని, గొప్పతనము, బీదతనము అను భేదబుద్ధిగాని ఎంతమాత్రమును లేదు. న్యాయవాదికానిండు, ఉపాధ్యాయుఁడు కానిండు, జాగీర్దారుడు కానిఁడు, వర్తకుడు కానిండు, ఇంకను ఎవరైన కానిండు ౼ ఆమె పాదపద్మముల సన్నిధిని మోఁకరించి జ్ఞానామృతమును తనివిదీరాఁ గ్రోలవచ్చును. విజ్ఞానపిపాసను దీర్చుకొను నుద్దేశముతో చనుదెంచు బీదవానితో సరిగా కూర్చుండి చదువుకొనిన తన పరువు తక్కుపగునని భాగ్యవంతు డెంతమాత్రమును భావింపరాదు. ఈ విశాలో దేశములను నెరవేర్చుటకు సంఘములను తగినంత పునాదిగలవిగ స్థాపింపవలెను. గ్రంథములను, పత్రికలను అన్ని తరగతులు జనులయొక్క రుచులను కనిపెట్టి సమకూర్పవలయును. జనుల సాంఘిక జీవనమునందేక భాజనముగ పనిచేయవలెనని తలంచు సంఘము సార్లకమగుటకు ఈవిషయములందు నిష్పాక్షికముగ నుండవలేను. ఈ విధముగ ధర్మగ్రంథాలయములును, పఠనమందిరములును, ఒక గ్రామము యొక్క గాని, పట్టణముయొక్క గాని సర్వజనులకును ఉపయోగించు సాంఘిక ప్రతిష్టాపనలై వెలయవలయును.

జనులందరును ఒక చోట సమావేశమై పరస్పరము భావములను వెల్లడించుకొను ప్రాముఖ్యమును గణుతింపశక్యముకాదు. ఇట్లు సమావేశమగుటవలన మానవుని జీవితమును నడతను అంటియుండు స్వల్పములగు అనేక దుర్గుణములు తొలగును.

గ్రంథాలయము లుంచు స్థలములు మిక్కిలి రంజకములై హృదయాకర్షకములుగు నుండవలెను. సర్వసాధారణముగా జనులు పగలు లంతయు తమ తమ వ్యాపారములను జూచుకొని సాయం సమయమునందు గ్రంథాలయమునకు గాని పఠనమందిరమునకుఁ గాని విచ్చేయుదురు. అందుచే అది బహిరంగ ప్రదేశమునందు గాలి విరివిగా వచ్చుట కనుకూలముగ నుండవలయును. దానిచుట్టును చెట్లను పెంచిన జనప్రియముగ నుండును. గంధము లందరికిని సులభముగ లభించునట్లు చేయవలయును. గంధభాండాగారికుఁడు చదువరుల రుచులను కనిపెట్టి ఎవరికి తగిన గ్రంధములను వారి కందఁ జేయుచుండవలెను. అతఁడు ఉల్లాసవంతుడై మిక్కిలి రసజ్ఞుఁడుగ నుండవలెను. గ్రంథాలయమున కాతడు ప్రాణము. దాని యొక్క పఫలతకు అతఁడే మూలము,

చదువుకొనగలిగిన వారికి గ్రంధములు నిచ్చునంత మాత్రముననే గ్రంథాలయము యొక్క ధర్మము పూతి౯ కాలేదు. దురదృష్టవశముచే మనదేశమునందు చదువుకొనజాలని వారు పురుషుల యందే ఆనేకులు కలరు. అట్టి వారిలో వయస్సు మిరినవారికి చదువు చెప్పుట మిక్కిలి కష్టమగు కార్యముకదా! కాని, వారిని జ్ఞానవంతులుగ జేయుట మనకు చేతనైనపనియు ధర్మమునునై యున్నది. గ్రంథాలయములందే గాక, వారు నివసించుచుండెడు గుడిసెలకు సహితముపోయి గ్రంథములను పత్రికలను జదివి బోధించి వారి జ్ఞాననేత్రము వికసించునట్లు చేయవలెను. అప్పుడె గ్రంథాలయము యొక్క ధర్మము పూర్ణముగ నెరవేఱినదని చెప్పవచ్చును.

స్త్రీలకును పిల్లలకును కావలసిన ఏర్పాటులు మన గ్రంథాలయములయందు లేవు. స్త్రీలు సాంఘికులుగ జేరుటకుమాత్ర మభ్యంతరము లేదు. కాని వారికి కావలసిన ప్రత్యేకమగు ఏర్పాటులు లేనిది లాభ మేమి? శ్రీ మన గృహాధిదేవతగదా! అధా౯ంగలక్ష్మికదా! ఈ లక్ష్మీ దేవతలను మనము నిరసింపఁదగునా? కావున, వారుగూడ అభివృద్ధి నొందుటకు కావలసిన ఏర్పాటులను జేయుట అత్యంతావశ్యకము. స్త్రీలందఱును గాఢాంధకారమున మునిగియున్నప్పుడు మనము చేయవలసినదే మన, చందాలేమియు తీసికొనకుండఁగనే స్త్రీణ చదువుకొనుటకు గ్రంథములను పత్రికలను వారి గృహములకు పంపు నేర్పాటులను ప్రతి గ్రంథాలయమును, ప్రతి పఠనమందిరమును చేయవలసియున్నది. ఈవిషయమున ఆంధ్రదేశమునగల కొన్ని గ్రంథాలయముల వారు పరిశ్రమ చేయుచుండుట మిక్కిలి ప్రశంసనీయము. కావలసిన గ్రంథములను, పత్రికలను, ప్రతిదినమును వారికి అందఁజేయు చుండవలెను. విద్యావతులకు కొందరు స్త్రీల నేర్పాటు చేసి వారిని గృహములకు పంపి, చదువుకొనజాలని స్త్రీలకు వారు చదివి వినిపించునట్లు ఏర్పాటు చేయవలెను.

పిల్లలు కూడ వచ్చుటకు మన గ్రంథాలయములయందు బొత్తిగా ఆకర్షణ సాధనములు లేవు. స్వాభావికముగ జిజ్ఞాసను సంతృప్తి పరచుకొనుటకును ఙ్ఞానపిపాసు దీర్చుకొనుటకును పెద్దలకువలె పిల్లలకును గ్రంథములను పత్రికలును ఆత్యంతావశ్యకములు. పాశ్చాత్య దేశముల యందెల్ల, అందును ముఖ్యముగా అమెరికాదేశమునందు, పిల్లలకు ప్రత్యేక గ్రంధములును, పత్రికలునుగూడ విశేషముగ గలవు. గ్రంథాలయములయఁదు వారు చదువు కొనుటకు ప్రత్యేక మందిరములును, వారికి బోధించుటకు ప్రత్యేక భాండాగారికులును కూడ కలదు. ఆదేశముల యందున్న గ్రంథాలయములలో పిల్లలు చదువుకొనుటకు ఎన్ని సౌకర్యములు కలవో యూహించుటకైన మనకు సాధ్యముకాదు. అట్టి సౌకర్యములు మన దేశము నందు పెద్దలకుకూడ లేవు.

పైన జెప్పినరీతిని జన సామాన్యమునందంతటను విద్య వ్యాపిఁపజేయుటయే గ్రంథాలయము యుక్కా పరమావధి. కావున పాఠశాలలవలన జనులందరికి విద్య యబ్బక పోయినను, గ్రంథాలయోద్యమమువలన విద్యాభివృద్ధియగుటకు అవకాశమున్నది.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse