గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 5/అఖిల భారత గ్రంథాలయసభ, సంచార గ్రంథాలయములు; స్థానిక సంఘములు
సంపాదకీయములు
అఖిలభారత గ్రంథాలయ మహాసభ
మూడవ సమావేశము
జాతీయవారములో (డిశంబరు ఆఖరు వారములో) బెల్గాము పట్టణమున జరుగును
జాతీయవారము సమీపించుచున్నది. కర్నాటక రాష్ట్రమందు చేరిన బెల్గామునగరమున జాతీయమహాజన సభ తోపాటు అనేక అఖిల భారత సభలు జరుగును. అందు ఈసభ ప్రాముఖ్యతయందు ఇతర సభలకు తీసిపోవునది కాదు, భారతజాతీయ జీవనపునర్నిర్మాణ విధానమందు గ్రంథాలయోద్యమము ఆక్రమించు స్థానమును గూర్చి ఎంత చెప్పినను చెప్పవచ్చును. ఇందును గూర్చి తిరిగి చెప్పుట చర్వితచర్వణము కాదు. ఈ ఉద్యమము ప్రజలను ఉద్దేకపూరితులనుగా చేయునదిగాక మెల్లమెల్లగా పటాటోపములేకుండునట్లు విధ్యుక్తకార్యములను నేరవేర్చునది యగుటచే నుత్సాహపూరితులగు యువకుల మనస్సును ఇతరోద్యమములు కొన్నియాకర్షించినఁత తీవ్రముగా యాకర్షించ లేదు మాట సత్యము. రాజ్యాంగ సభలలోనేమి లేక రణరంగముననేమి, జరుపబడు సమరము చిరకాలమునుండియు ప్రజల నాకర్షించుచున్నది. కాని జాతియొక్క స్థైర్యను కొరకు ఆవశక్యమగు శాంతియుతమైన విధానములు అట్లు చేయుట లేదు. ఒక గొప్ప తత్వవేత్త ఇట్లు ప్రశ్నించెను:— “ఈ ఇద్దరిలో ఎవరుగొప్ప వాడు ప్రపంచమునంతను రక్తప్రవాహములలో ముంచి ఆట్టి భీభత్సరంగమున తాండవమాడు సీజరు గొప్పయా లేక ఆడంబరములేక నెమ్మదిగా చెట్లు, పుట్టలు బాగుచేసి భూమిని ఫలవంతముగా చేసిన వ్యవసాయకుడు గొప్పయా?”
మంచికైన నేమి చెడుగుకైననేమి ప్రతిమనుజుడును తనకుతానే ఇతరులపై నాధారపడకుండునట్లును, స్వయం సహాయము చేతను, తనజన్మస్థానము గానుండిన ఇతరుల అధికారమునకు లోబటినట్టియు ఇతరులపై అధికారము చెలాయించనట్టియు, పల్లెటూరునందు నివసించి జీవితమును గడుపుటకు వీలగు పరిస్థితులన్నియు సంపూర్ణముగా మారిపోయినవి. ఆధునిక ప్రజాస్వామిక తత్వమునకు ఉచ్ఛాటనమంత్రములగు “స్చేచ్ఛ, సమత్వము, సర్వజన సోదరభావము” అను మాటలు ప్రపంచము యొక్క నలుదెసలను మారుమోగుచున్నవి. మన దేశపు జానాపదులు కూడ తెలిసియైననేమి తెలియకయైననేమి సంపూర్ణ స్వతంత్య్రము యొక్కయు స్వరాజ్యము అనుప్రవాహమనపడి దానిచే తరుమకొట్టబడుచున్నారు. ఈ సంపూర్ణ స్వతంత్య్రము యొక్కయు తత్వము, ప్రజలకు సుబోధకము కానిచో వారందరు ఆరాజకము, అవినీతి, దౌర్భాగ్యము పాలగుదురు. మరియు మన దేశమున వెంటనే తీర్మానమై తీరవలసిన సమస్యలు రాజకీయములు. సాంఘికములు, మతవిషయకములు, ఆర్థికములు — ఎన్నియోకలవు. వీని యన్నిటిని పరిష్కరించుట యందు ప్రజాసామాన్యము యొక్క తోడ్పాటును నిర్మాణశక్తియు ముఖ్యముగా వినియోగించవలసియున్నది. జనసామాన్యమందరును దొరతనము వారిచే స్థాపింపబడు విద్యాలయముల యందు మెల్ల మెల్లగా విద్యనభ్యసించి ఆటుపిమ్మట ఈసమస్యల పరిష్కారముకొరకు సహకారులు కావలయు ననినయెడల అంతవరకును ఈపని అగునది కాదు.
గ్రంథాలయోద్యమమున అనంతమగుళక్తులు ఇమిడియున్నవి. కావున దేశాభిమానులు ఈ యుద్యమమును చేపట్టి సరియైన మార్గమున నడిపిన యెడల మన దేశాభివృద్ధికి అంతరాయమును కల్పించు అభ్యంతరము లెన్నియో నివారణ కాగలవు. ప్రజల విజ్ఞానాభివృద్ధి అచిరకాలమున లభించును. ఈ యుద్యమము నిర్దుష్టమగు నౌన్నత్యము పొందవలెనన్న దొరతనము వారి చేతులో కీలుబొమ్మ కాకూడదు. ఈ యుద్యమ నిర్మాణ కార్య విధానమంతయు ప్రజల చేతిలోనే యుండవలెను. ప్రభుత్వము వారు తమద్రవ్యమును ఇందుకొరకై సహాయము చేయుచు తామిచ్చుద్రవ్యము సర్వినియోగమగునట్లు భద్రము చేసుకొనవచ్చును. హిందూపత్రికలో ప్రచురింపబడి నట్లు —"ప్రజలకు స్వాభావికమగు ధర్మశీలత ఈయుద్యను ప్రచారణకొరకు సంపూర్ణముగా వినియోగము కావలెను. దేశమంతటను వ్యాప్తమైయున్న విద్యాభివృద్ధిని చేయునట్టియు, జాతీయసౌధ నిర్మాణమునకు సాధన భూతమగునట్టియు ప్రతిష్ఠాపనలన్నియు ఇందు కొరకై కృషి చేయవలెను.”
బెల్లాములో సభజరుపుటకు ప్రత్యేకము ఆహ్వాన సంఘ మేర్పడువరుకు ఇందును గూర్చిన ఏర్పాట్లన్నియు బెజవాడయందున్న అఖిలభారత గ్రంథాలయ సంఘ కార్యస్థానమునుండియే జరుగును. సభ యేతేదీలను జరుగునదియు ముందు ప్రచురింపబడును. ఈ పభ చాల ముఖ్యమైనది. ఈ యుద్యమము దేశమంతటను వ్యాప్తినొందించుటకు తగిన కార్యక్రమము ఈ సభయందు స్థిరపర్చబడును. కావున ఉద్యమాభిమాను లందరును తాము ఉపన్యాసములను చదువనిచ్చయించినచో ఆయా విషయములను, తీర్మానములను సభలో ప్రవేశ పెట్ట నెంచినచో ఆవిషయమును బెజవాడకు సంఘ కార్యస్థానమునకు తెలుప ప్రార్థితులు.
సంచారగ్రంథాలయములు
స్థానిక సంఘములు
కడచిన నెలలో బందరు తాలూకా బోర్డు వారు తమ బోర్డులో చేరిన గ్రామములయందు సంచార గ్రంథాలయములను స్థాపించి తన్మూలమున పల్లెటూరు వారికి జ్ఞానాభివృద్ధి చేయుటకు తీర్మానించి అందుకొరకై రు 500-0-0 వినియోగ పరచుటకు నిశ్చయించిరి. బందరు తాలూకా గ్రంథాలయ సర్వస్వము అందులో ఆజా బోర్డువారు ప్రారంభించినపని చాలా ముఖ్యమైనదియు అత్యవసరమైనదియునని వేరుగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు మనదేశమున కోమలవయస్సు గలిగి పాఠశాలలకు వెళ్లుటకు అరువగు వయస్సుకలవారు విద్యాభివృద్ధి నొందుటకు తగునట్లు పాఠశాలలు స్థాపించుటకుతోడు ఈడుముదిరిన వారి జ్ఞానాభివృద్ధికొరకు తగిన ఏర్పాటు లేమియు లేవు, మన దేశమున స్వపరిపాలన వెంటనే మనకు సిద్ధించవలయునని కోరుచున్నాముగదా. అప్పుడు ప్రజాసామాన్యమందరకు తగినజ్ఞానవంతులై తమ విధ్యుక్త ధర్మములను నెరవేర్చుటకు సమర్థులై యుండవలెను. ముఖ్యముగా స్థానిక స్వపరిపాలన సంఘములు పల్లెటూరి వారిచేతులలో నుండ వలెను. వానికి సభ్యులను ఎన్నుకొను వోటర్లు పల్లెటూరువారు. వారినుండియే సభ్యులను ఎన్నుకొనుట భావ్యము. ఇప్పుడు కొంతవరకు అట్లే జరుగుచున్నది. ఈవిధముగా ఎన్నుకొను సభ్యులు తమ విధ్యుక్తధర్మములను నెర వేర్చుటకు తగిన జ్ఞానము పల్లెటూరు సామాన్య జనులకు లేదని చెప్పుట సాహసము కాదు. ఆజ్ఞానము లభించుట ఎట్లు? ఈ ఈడుముదిరిన వారు నూతనముగా పాఠశాలలకు వెళ్లి చదువుకొనుటకు వీలులేదుగదా. అట్లు వెళ్లినను అక్కడ బోధించుపాఠములకును వీరికి కావలసిన జ్ఞానమునకును ఆన్యోన్య సంబంధములేదు. కావున ఈడుముదిరిన వారికి తగిన జ్ఞానము వృద్ధిపరచు సావకాశము గ్రంథాలయములకే కలదు. ఈ గ్రంథాలయములు కొన్ని స్థిర మైనవి. కొన్ని సంచారము చేయునవి. ప్రతి గ్రామమందును స్థిర మైన గ్రంథాలయములు భరించగల పరిస్థితులు ఉండనేరవు. కావున ప్రతి గ్రామమువారికి అందుబాటులో నుండునట్లు సంచార గ్రంథాలయములను స్థాపించవలసి యున్నది. ఇంకొక విశేషమున్నది. మన తెలుగుభాషకు తగిన పోషణ లేక సరియైన గ్రంధములు ఇందు వెలుపడుటలేదు. దేశభాషలయందు అన్ని శాఖలవిజ్ఞానమును గూర్చిన గ్రంధములు ప్రచురింపబడి గాని ప్రజలందరును జ్ఞానవంతులు కారుగదా. అట్టి పుస్తకములు వెలవడుటకు గ్రంధకర్తలకు ఎక్కువప్రోత్సాహము కావలసియున్నది. ప్రస్తుతిస్థితిలో దేశభాషలలో గ్రంధముల రచించు గ్రంధకర్తల దుస్థితి మిక్కిలి శోచనీయము. వీరిలో చాలమంది పేదవారు. వేరే గ్రంధము వ్రాయుటకు తగిన పరికరములను ఎక్కువ ప్రయ ప్రయాసలకోర్చిన సంపాదించుకొనవలెను. వారే పుస్తకముల అచ్చుఖర్చు భరించుకొనవలెను. పుసకములం వారే నెత్తిన పెట్టు కొని దేశమంతటను తిరిగి అమ్మకొనవలయును. ఇతర దేశములలో ఇట్లు కాదు. పుస్తకములు ప్రచురణ చేయుటకు ప్రత్యేకము విరివిగా పెట్టుబడితో వ్యాపారము చేయు ప్రతిష్ఠాపనలేర్పడియుండును. ఆప్రతిష్ఠాపనల యధికారులు గ్రంథకర్తల వద్ద గ్రంధములుకొని ప్రకటింతురు. మనదేశమున ఇంగ్లీషు వారిచే స్థాపింపబడిన ప్రతిస్థాపనలిట్టివి పెక్కుకలవు. మాక్ మిలన్ కంపెనీవారు, లాంగ్ మన్ గ్మన్ గ్రీసు కంపెనీవారు ఇట్టివారే. వీరు దొరతనమువారు అంగీకరించి వారిచే పాఠశాలలయఁదు చదుపుటకు పాఠపుస్తకములుగా ఏర్పరచబడిన గ్రంథములను గాని ప్రకటించరు. జనసామాన్యమునకు స్వపరిపాలనకు సంబంధించినట్టియు, దేశాభివృద్ధికి సంబంధించినట్టియు జ్ఞానమలవడచేయు గంధములను ఈకంపెనీ వారు ప్రకటించుట లేనేలేదు. ఇట్టి గ్రంథ ప్రకటన ప్రోత్సాహము చేయు బాధ్యత ప్రజలపై యున్నది. ఎక్కువ పుస్తకములనుకొని గ్రంధకర్తలకు ప్రోత్సాహముకల్గ చేసినగాని మంచిపుస్తకములు వెలువడవు. మంచిపుస్తకములు వెలువడిన గాని ప్రజలు ఎక్కువగా పుస్తకములు కొనరు. ఈ రెంటికి మధ్యనుండు సంధికాలమున మన మిప్పుడున్నాము. కాబట్టి స్ధానిక స్వపరిపాలక సంఘములు ఈ తరుణమున భాషాభివృద్ధికి తోడ్పడవలసి యున్నది. మన ఆంధ్రదేశమందలి స్థానిక స్వపరిపాలక సంఘములు ఈపని పూనినయెడల భాషాభివృద్ధి అచిరకాలమున లభించును. తపస్తానిక సంఘమును సంవత్సరమునకు సుచార గ్రంథాలయములు స్థాపించుటకు గాని స్థిరమగు గ్రంథాలయములకు పుస్తకములు కొనుటకుగాని రు 500 లం చొప్పున వెచ్చించినయెడల గ్రంధకర్తలకు ఎక్కువ ప్రోత్సాహముకలిగి మన దేశ ప్రస్తుత పరిస్థితులకు అవసరమగు గ్రంథములు ఎన్నియో వెలువడును. పాఠశాలలకు వెళ్లు తరుణవయస్కులేగాక ఈడుముదిరిన వారుకూడ జ్ఞానాభివృద్ధిచేసుకొను సాధనము లేర్పడును. పల్లెటూరువారును బస్తీల వారును, విద్యాభివృద్ధిచే విజ్ఞానమును పొందినవారై స్వపరిపాలనను సక్రమముగా నిర్వర్తించుటకు తగిన శక్తి వంతులగుదురు. కావున స్థానిక స్వపరిపాలక సంఘమువారు ఈయుద్యమమును చేపట్టి తగుసహాయము చేసి మాతృభూమికి ఆభ్యుచ్ఛయమును తేచ్చుటకు ప్రార్థితులు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse