గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 4/నవీనాంధ్ర కవులు
నవీనాంధ్రకవులు
III మంగిపూడి వెంకటశర్మ
తెలుగు కైతలు నన్నయ గారి త్రోవనంటియు, పోతనార్యుని పాదపంక్తుల ననుసరించియు బెంపొందుచుండెను. రాజనరేంద్రపురోహితుని కావ్యారంభములు తిక్కియద్యవలన పదప్రయోగ సంపదల వడసి, ప్రబంధ పరమేశ్వరునిచేత గాథాచమత్కారమును గాంచి, కవి సార్వభౌముని వర్ణనాసామర్థ్యమును, పితామహుని యల్లికబిగివిని, సూరనార్యుని పాతౌచిత్యమును, చేమకూరివాని పలుకుసొంపులను సంపాదించి, రాజసభాపూజితంబులగు కావ్యరూపముల దాల్చినవి. రాచకవుల కావ్యాంశములు వీరపురుషుల యొక్కయు, దివ్యపురుషుల యొక్కయు నుదార ధీర సద్గుణంబుల సెంచుచుండెను. రాజాశ్రితులై, ధనగౌరవాదుల నుపేక్షించి “సకలదిర్దేశ రాజ్యసభలయందు డంబు” మీరెడు పద్యోపన్యాసములు గావించి, యుభయభాషాలక్షణాభిజ్ఞులై, ప్రాచీన కావ్యమర్యాదల దప్పకుండ రచియించిన తిరుపతి వేంకటేశ్వరులు నన్నయసాంప్రదాయపు రాచ కవులలో చివరవారు. ప్రభుసంతోషమునకు మారు ప్రజాసంతుషృష్టనే యదర్శనముగా గ గైకొని, లౌకిక ప్రపంచమందలి సామాన్యవిషయములు కావ్యాంశముగ నంగీకరించి జనబాహుళ్యముని కుచితమై సుబోధకమగు తేట తెలుగును గల్పించి, బలుతెఱవులు స్వతంత్రించి నడచిన తిరుపతికవిపుంగవు లాధునికాంధ్రలౌకిక కవిత్వమునకు మూలపురుషులని మన్నిందగును.
ఆంధ్రలౌకిక కవిత్వమున తిరుపతికవు లెట్టి నవ్యారంభముల నేర్పరచిరో, దివ్యాంధ్ర కవిత్వమునఁదు మంగిపూడి వెంకటశర్మ అట్టి సిద్ధినే పొందియున్నాడు. ఇతను పోతనాదుల పద్దతిలో చివరివాడు. పోతన, గోపన, త్యాగరాజులవలె సహికసంపదల నిరసించి పరవిభూతుల నాశ్రయిచిన ధీరుడు – వారివలెనే దరిద్రుడు. పాండితీగరిమ చేకన్న, అర్ద్రయశోభిలాషల చేకున్న, అనివార్యమగు భూతదయచేతను, పట్టరాని యనుకంపమునను, భక్తిపారవశ్యమునను, మైమరచి, తన భావోద్రేకమలఁ పద్యరూపమున జాటిన నిసర్గసత్కవి. తిరుపతి వెంకటేశ్వరులవలె, ప్రతివాది భయంకరంబగు లక్షణపరిజ్ఞానము కాని యుభయభాషాకవిత్వసర్వజ్ఞతనుగాని పొందినవాడు కాడు. తక్కుడు నవీనాంధ్ర కవులవలె నాఁగ్లవంగీయ భాషా పరిచయమున నూత్నకవిత్వ నైఖరులగుర్తెరిగి, యను$రింప జూచెడు కావ్యశిల్పియుకాడు. ఉండేది పిప్పర – చిదివినది ఏ భాగవతమా, సంస్కారమా కొద్ది, సంపదిలాసున్న, నవ్యకవితారంభములకు దారిజూపుచు, నాగరర్ధసా హాయ్యముల నిచ్చి పురికొల్పెడు మిత్రవర్గమాలేరు. కాలచోజతుడై నవ్యకాలోచితమగు దివ్యాధర్మములను
ఉపాపకరీతులను గుర్తించి యావేశతత్పరత్వమున జల్పించు నైజనుకవి. నవీనాంధ్రకవులలో వెంకటశర్మ కర్హమగు స్థానమును నిర్ణయించుటయందాతని పద్యలక్షణమునుగాని కావ్యాంశముల యౌచిత్యమునుగాని, శివ్యబాహుళ్యమునుగాని, మానసికవిభూతులగాని పరిగణింప దగదు. తిరుపతి వెంకటేశ్వరుల వలె వేలకొలది బాలకవులకు కావ్యభిక్షములిడిన యాదర్శసిద్ధి వెంకటశర్మకు కలుగలేదు. రాయప్రోలు సుబ్బరాయనివలె తియ్యని తెలుగుపలుకుల తేనియలూరగూర్చి చిత్రించిన పదశిల్పి కాడు. భావ విమర్శనము కాని, యలౌకికాభిప్రాయ సంస్ఫురణముగాని గావించిన కావ్యోపన్యాసకుడు కాడు. తెలుగుదేశమన వెంకటశర్మ మొలకెత్తజేసిని నవ్యవైఖరులచే గాని కావ్యభేరీని నాదార్భాటమున గాని, పేరుపేపంపునగాని, యాతని మే మెంచుటలేదు. ధన విద్యాసంస్కార బాహుళ్యములేక నొంటరిగా భూతప్రపంచము నవలోకించి,యెల్లెడల నీశ్వరనిర్మాణవైదుష్యసౌందర్యమును గుర్తించి దయానుకంపమున, తీరని భక్తితో, నాధునిక దివ్యపద్ధతుల స్వతంత్రముగ ననుభవించిన నిసర్గసూరి యగుటచే మామన్ననకు గురియగుచున్నాడు. వెంకటశర్మ భక్తుడు, ఉపాసకుడు, కరుణాంతి రంగుడు. భూతాత్మకమై సమాన ప్రపత్తితో నెల్లెడల రాజిల్లు దివ్య స్వరూపమునుగుర్తించి సంతసించి, యుప్పొంగు వినయవివేకి. కావ్య వైఖరులలో నవీనాంధ్రమునకు నూత్నఫణతులు లేర్పచకపోలేదు. కాని కార్యసిద్ధికన్న, ప్రతిభభాప్రాచుర్య గాంభీర్యముకన్న వెంకటశర్మ సచ్చరిత్రమే, యాతిని నిర్మలకరుణాంతరంగమే, భక్తలక్షణములే యాతని నవీనదివ్యాంధ్ర కవిత్వమునకు మూలపురుషుని జేయుచున్నవి.
పోతనాదులగు తెలుగుభక్తులు హైందవపురాణేతిహాసములందు ప్రసిద్ధమైన మార్గములు నీశ్వర గుణాభివర్ణన మొనర్చుచుండిరి. రాచకవులు దారవీరగుణశోభితులైన చారిత్ర పురుషుల నభివర్ణించినట్టు, ప్రాచీనదివ్యాంధ్రకవు లవతారగాధలను భగవంతుని, యపారనుహిమోన్నతుని మహావిర్భావసందర్భములలో చిత్రించుచుండిరి. వీరు దేవుని భట్రాజులు ౼ వందికవులు. వీరి రసావేశమనుభూతమై యుండవచ్చును. రాజకవుల ప్రభుభక్తియు నటులనే గౌరవసద్బావసంజనితమై యుండవచ్చును. వీరి మనశుద్ధిని మేము శంకింపము. కాని ప్రాచీన తెలుగుకవులలో దివ్యలౌకిక కావ్యముల చెప్పిన రెండు తెరంగులవారు. మహాగణములున్న పట్టులనే కావ్యసామాగ్రిగ నంగీకరించిరి. పోతనాదిభక్తకవులు భగవంతుని మానవ రూపమున బొగడిరి. "హైందవవేగాంతులు "ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేకర్జున తీష్ఠరి" “భూతమయుం డీశ్వరుఁడని” యు "ఆత్మవత్ సర్వ భూతాని యః పశ్యతి స పశ్యతి” యనియు మున్నగు వాక్యములతో సిద్ధాంత లక్షణముగ నీశ్వరస్వరూపమును వర్ణించుచుండిరి. కాని, కావ్యశిల్పాడలందు ధేనతో పాసనయంతయు స్త్రీ పురుపరూపముననే జరుగుచుండెను. “జంతూనాం నరజన్మ” నుత్తమమనియు, మానసప్రభావమున మానవు డీశ్వరసాదృశ్యమును సమీపించెననియు, అందుచే విపరీతమహాగుణంబు లేర్పడిన స్త్రీ పురుషులే భగవవాత్సస్వరూపవిగాజితులుగ, భగవంతునిగ నెంచదగుదురనియు వాదించ వచ్చును. కాని వేదాంతోపన్యాసము లందు కనుపడు అద్వైతము, నిర్గుణజగద్వ్యాప్త పరతత్వలక్షణములు కావ్యములం దెచ్చటను కానరావు. ప్రాచీనకవుల దేవోపాసనమంతయు విశిష్టాద్వైతము మానవసంపూజనము. కాని భూతమయుడై, సర్వసబుడైన భగవంతుని యారాధించుట కాదు. ఇది మనదేశపు ప్రాచీనభక్తకవులలక్షణము మాత్రమే కాదు; కాలస్వభావము. ఆకాలమున జగమంతట, భగవంతుని మానవరూపమున మహాగుణగరిష్ఠునిగ పూజించుచుండిరి. సూరుపియు కురూపియు, ద్రవ్యైశ్వర్య విఖ్యాతుడు, దారిద్య్రపీడితుడును, మంచివాడు చెడ్డవాడు సమానులనియు, భగవంతుని లీలా స్వరూపపాచుర్యసాధనములనియు భావించు శక్తి 18వ శతాబ్దాంతమునకు గాని యేర్పడలేదు. 19ప శతాబ్దాంతమునకు శాస్త్ర పరిశోధనల వెలుగున పరిమాణువు మొదలు బ్రహ్మాండమువరకు గల సమస్తచేతనాచేతనమగు భూతరాసులన్నియు నొక విధమగు పరధర్మముల ననుసరించి నడచుచు నొక చైతన్య కాంతిని వెదజల్లుచు, సమానగౌరవార్ధములై భగవత్స్వరూప నిర్ణాయక సాధనలై వెలుగొందునను యూహ ప్రపంచమంతట నేర్పడినది. ఈ విజ్ఞానము శాస్త్ర పరిచయమున గాని, కావ్యపఠనమునగాని, కళావలోకనమునగాని, యోగాభ్యాసమునగాని, భక్తిసాధనచేగాని సిద్ధించినదికాదు. ఇట్టి సంస్కారసంజనితమైన విశ్వవిజ్ఞాన మిదివర కెవరికో యొకరికి గలుగుచుండెను. ప్రస్తుతమున నిది. “ఏవం ఇత్థంవా మాంసిద్ది” అను యీశ్వర సంకల్పప్రాబల్యమున జగత్సామాన్యధర్మమై చదివినవారికిని, చదువనివారికిని, యోగులకును, భవబంధనిబద్ధులకును సమానమానసిక లక్షణమై దనరారుచున్నది.
ఈనాటిదేవుడు దేవకీనందనుడు కాడు. కైలాసవాసియగు మదనవిరోధియు గాడు. భూతమయముయిక విశాల ప్రపంచమే ప్రస్తుతమానవమానసము నానందపరచున్న దేవస్వరూపము. వెంకటశర్మ కాలచోదితుడై సమస్త భూతముల మంచిచెడ్డలను, సుగుణదుర్గుణములను, సుఖదుఃఖములను ఈశ్వరలీలలుగా నెంచి, యన్నిట దేవమహిమాతరంగతాడనము లనుభవించి సమానుకంపముతో "అంతా రామమయం జగమంతా రామమయం” అనుసూత్రమును అనుభవపూర్వకముగ తరఖండ కావ్యములలో జాట మొదలిడెను. వేదాంతపరిజ్ఞానముచే గాక, శాస్త్రపరిశోధనచే గాక, మాటల పొందికచే గాక, కేవల మల్పసామాన్య భూజీవితములను, వాని చేష్టలనుజూచి, కరుణానుకంపమున, నీశ్వరవిలాసముల నెల్లెడల గుర్తింపగలఁగుటయే, వెంకటశర్మ యొక్క దివ్యాంధ్రకవిత్వమార్గదర్శిత్యమును సూచించుచున్నది. భూతమయమయిన భగవంతుడీనాటి జగదు పాసితద్రవ్యము. స్వానుభవమున నెజావేశముతో తెలుగుకవిత్వమున నద్దానిజేర్చవాడీ పిప్పరకవి. విదేశవిజ్ఞానసాధన లమరకయే, స్వకీయాత్మప్రేరణముచే నీపనిజేయ లుగుట ఈతని భూతోపాసనను దెల్పుచున్నది. ఈ భావఫలితముగ నీతడు కొన్ని చక్కని ఖండకావ్యముల రచించి యున్నాడు.
భగవస్స్వరూపము భూతమయముగ నెల్లరచే విశ్వసింపబడుచుండ, విశ్వమే పరతత్వముగ నంగీకరింపబడు చుండ. దీని యుపాసితరూపము ప్రస్తుతము కాలములో మాతృదేశమైనది. "మాతృదేశారాధనము మహితమోక్ష సాధనము,” “జన్మభూమి స్స్వర్గాదసి గరీయసీ" జన్మభూమియే స్వదేశమే ఈనాటి దైవము. శివును కాడు. విష్ణుమూర్తికాడు. ఇతర దైవతము లేవియుకావు. తల్లి నేల నలంకరించు గిరిన దీవన విన్యాస సౌందర్యమే మాతృస్వరూపము, ఫల సస్య మృగ పక్షి మానవవస్తు సమృద్ధియే, యాధునిక దేవవిభూతి. ఈ దేశమున కాలపరంపరలో నివసించి పాటుపడిన వీర భక్త కవి శిల్పి జనంబుల నిస్స్వార్ధ సంకల్పఫలములేమన గుణసంపద. తల్లినిచూచి యుప్పొంగుట, తల్లిగుణముల దలపోవుట, తల్లికై వగయుట, తల్లి నుద్ధరించుటకై పాటుపడుట. ఇదియే, దేశసేవయే, ఈనాటి మతము. తల్లియే పరదైవము. ప్రపంచమునకును, హైందవులకును, ఆంధ్రులకును, ఆయా జాతులు నివసించు ప్రదేశమే పరమదైవతమయినది. ఈ దేశభక్తి, పరప్రభుత్వబాధకముల తప్పించుకొనుటకు గారి, ఆర్థికసౌఖ్యముల వడయుటకు గానీ, రాజ్యతంత్రజ్ఞుల యుపదేశమున ప్రజలనేర్పడిన తాత్కాలికావేశము కాదు. పరమేశ్వరుడు అనేక కాలములలో అనేక రైతుల పూజ లందికొనచు, నీ నాడు మాతృదేశస్వరూపమున నన్నరాధింపుడని సర్వమానవకోటికిని యానతిచ్చి, వారి వారి హృదయాంతరాళముల నిట్టి దివ్యభావముల బురికొల్పియున్నాడు. కాలమహిమచే దేశమే దైవమైనది. దేశభక్తియే దైవభక్తిగను, దేశసేవయే యుపాసక సాధనగను మారినవి. ఈ భావానుగుణ్యముగ:
"వేడుకను జాతీయతాయను
వేగుచుక్కా పొడ చే నదుగో
కూడి వందేమాతరం బని
కుక్కుటము లరచెన్”
Nationality is the presentation of a united front of opposition by people living within geographical, ethnographical and linguistic limits and possessing common experiences of political, religious, economic and artistic life, to the aggressive advance of foreign religion. art, political domination, and economic exploitation. It is the inertia of change possessed by people of a certain culture and ways of life to all other impulses. This is nationality.
జాతీయతకు నా నిర్వచన మిది. పరినాగరికతా సంపర్కములు ఒక జాతి వారికి అభ్యర్తాచార భావములను దాకునపుడుదయించి, వానిని గర్హించి గుర్తించి, స్వకీయ చిరాభ్యస్త విశ్వాసముల నిలుప యత్నించు మానసస్థితియే జాతీయభావ మనఁబడును. ఈజాతీయభావమే నవీన మతమైనది. ఆంధ్రమాలనే తల్లిగ విశ్వనించి యుపాసించుటయు, అంధ్రజాతీయతినే మతముగ గైకొనుటయు మంగిపూడి వెంకటశర్మగారి కవిత్వపు విషయలక్షణముల రెంటియందును రాజిల్లుచున్నది.
దేశమే దైవముగను, జాతీయతనే మతముగను భావించు నిక్కాలమున, మోక్షసాధనలు కూడ కాలోచితముగ మారినవి. పునశ్చరణములకు విలుపలేదు. యజ్ఞయాగాదుల నాచరించు వారగుపడరు. సాంఘిక సేవయే, స్వార్థపరిత్యాగమే దయాసత్యశౌచములే ఇప్పటిదేశ దైవతమునకును జాతీయతామతమునకును తగిన యుపాసన. సంఘ సంస్కరణాభిలాషయు నీచజాత్యుద్ధారక ప్రయత్నములును సాంఘిక సేవలో చేరిన విషయములే. మరియు జాతీయవిద్య మున్నగు నవ్యప్రయన్నములన్నియు మాతృసంపత్సలపాదక సాధనములుగ సెంబడచు నవీనదివ్యోపాసనలో చేరియున్నవి. వెంకశర్మ రచించిన పద్యములలో పెక్కు లీసాంఘికవిషయములకు సంబంధించి యున్నవి. ఇతడు ఆంధ్రోద్యమపు తాలికు లలో ముఖ్యుడు, దేశభక్తిని పురికొలుపు గీతములను పద్యములను చక్కని తేటతెలుగున రచించి భావము నందునే కాక, కావ్య వైఖరులందు కూడ నాంధ్ర జాతీయ స్వరూపమును దెలుపయత్నించిన స్వతంత్రుడు.
తిరుపతి వెంకటేశ్వరులు ఈనాటి లౌకికవ్యవహారముల కనుకూలమయిన కైత దారుల నెల్లుతొక్కీరో అటులనే వెంకటశర్మ, పోతన సాంప్రదాయమును వర్తించు భక్తుడయ్యును, నవయుగోచితిమగు దివ్యాదర్శములను, ఉపాసకలక్ష్యములను, సాధనక్రమమును లెస్సగా జింతించి వచించియున్నాడు. దివ్యకవిత్వమును సామాన్య విషయసులందును వర్తమాన చరిత్య్రాంశము లందును సాంఘికావస్థల యందును విరివిగ బ్రవర్తింపజేసియున్నాడు. విశాలభూతప్రపంచమే దైవముగను, దేశమే పరదేవగను, సాంఘికసేవనే యుపాసన క్రమముగను, నిజానుభవమున సూహించి, నిరవధికరసాదేశముతో తెలుగువారల కెఱిగించుచున్న దేశభక్తులలో వెంకటశర్మ యగ్రగణ్యుడని చెప్పుట కావంతయు సంశయ ముండనేరదు. కవిశ్వపాటవ మెట్లున్నను, దేశకాల లక్షణముల ననుభవించిచూచి లోతుల గుల్తెరిగి వ్రాయువాడగుటనే మంగిపూడి మెకటశర్మ నెంతయు నవీన దివ్యాంధ్ర కవితాసూత్రధారునిగా బ్రశంసించెదను.
1902-07 వరకుగల తెలుగుపత్రికలలో నూతన ఖండకావ్యము లగుపడలేదు. అప్పుడప్పుడు సందర్భవశమున ఒనుపబడిన ప్రాస్తాపిక- పద్యాపతులు, భట్రాజుధోరణితో సీసభరితములై యుండెను. అచ్చటచ్చట గొందరు ఆంగ్ల కావ్యములలోని పట్టులుగొన్నిటి తెనిగించి తెలుగుబాసకు కొత్తయూహల గూర్చుచుండిరి. 1903-08 మధ్య భారతిభూమిలో దేశీయభావ మంచిగురించి, వంగీయోపన్యాసకులు పౌరోహిత్యమును ప్రబలముగ నల్లుకొనుచుండెను. రాజమందిరమున చిలకమర్తి లక్ష్మీనరసింహము దేశాభిమానసంజనకమగు గాథల రచించుటయే గాక,
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువు లేగదూడలై యేర్చుచుండ
కొల్లవారను గడసరి గొల్లవారు
బితుకుచున్నారు మూతులు బిగియగట్టి.
అని సాటించి "చెరపాలల్ వరచంద్రశాలలు" మున్నగు పద్యరాజంబులు దెలుగువారాల నిద్రేకపూరితుల దేశసేవోత్సాహుల గావించుచుండిరి. బందరులో భానుమూర్తి ప్రాచీన హైందవమహోన్నతిని
“మఠములు చొచ్చినిల్లు జన
ప్రతిమ దయాశమాదిగుణ
శ్వత నిరపాయమోక్ష ఫల
యతుల విభూతి బొలు విల
సంబరొ నీసరిధన్య లుందురే?"
అని నుతించుచు “మాసె కళాప్రవీణత సమస్తము నస్తము నొండె సత్కళల్ వాసె డే" నని వగచుచు నైకమత్యమునను, సంఘ సంస్కరణమునను, పంచమోమొద్దరమును జాతీయవిద్యా వ్యాపకముగను, స్వదేశవస్తు సంపాదనమునను భారతభూమి. క్రమ్మర బూర్వోన్నతి జెందగలదానియు, నిజస్వరూపవివేకులగు భారతీయులు కష్టములీడేరి, తమజాతీయ సంస్కారముల నలుదెసల బ్రచురించి శ్వేతద్వీపనివారు లెల్లరు "చేతో మోదము దెల్పగా శృతి శిరఃసిద్ధాంత తాత్పర్యముల్, గీతాసారము దెల్పుచుండ్ర ధిషణాగీః ప్రౌఢిమన్ నీసుతుల్” అనునాశ లూంరించు చుండిరి. బంగాళావిభాగమునను, కర్జను దుష్పరిపాలనా ఫలితముగను జనించిన ద్వేషానలము 1910-11 లో మార్లి సంస్కరణ శీతలమును గొంత చల్లారేను. ఇంతవరకు తెలుగు దేశమున వెలువడిన పద్యములు, నాటకములు సంఘ సంస్కరణము గూర్చియు, ఆంధ్రతరదేశనాయకగుణాభి వర్ణనమందును వినియోగింప బడుచుండెను. 1911 లగాయతు ఆంధ్రుల ఆదర్శములు స్వజాతీయ గౌరవప్రతిస్థాపనముపై రాష్ట్రసంపాదనముపై, లలితకశాసంపోషణముపై విస్తరింపసాగెను. 1911 లో భారతమాత, తెలుగుసీమల నాంధ్రమాతయై వెలిసెను. ఆంధ్ర, కృష్ణ మానవసేవ, దేశమాత మున్నగు పత్రికలు, ఆంధ్రభారతి మొదలగు మాసపత్రికలు ఉదయించి ఆంధ్రసారస్వతసంపోషణ మవశ్యకర్తవ్యముగ నెంచి తెలుగుదేశములోని సుధీయుల వెతగి వారిరచనల ప్రచురింపదొడగెను. ఇందు ముఖ్యముగా నాంధ్ర భారతిని నెలకొల్పి యవల దానినె గ్రంథాలయ సర్వస్వముగ నడిపించుచున్న అయ్యంకి వెంకటరమణయ్య యొక్క స్వాభిప్రాయిరాహిత్యమునకును, యనూనదేశసేవాభిలాషకును, కార్యర్యాహక సామర్థ్యమునకును, చొక్కఁపు చూపులకును, లేనగవులకును, అందరి నాదరించి పూనికతో నేర్పుమై తిప్పు జాణతమునకును మెచ్చి, తెలుగ సీమల నవీన భావోద్రేకమును జిందాడు బాలకవులెల్లరు తమతమ కల్పనల వారి కందించి, తెలుగు బాసకు వన్నె లిడుచుండిరి. కృష్ణాపత్రికాధిపుడు ముట్నూరి కృష్ణారాయడు నవ్యకవుల నెంతయు ప్రోత్సహించు చుండెను. వీరును, ఆంధ్ర సంచికలును, 1912 లగాయతు తెలుగు కవిత్వము నెంతయు ప్రోత్సహించి నవీనాంధ్రకావ్యవైఖరుల నేర్పరచినవి. అందు ముఖ్యముగా నాంధ్ర భారతి, తదనుసారి గ్రంథాలయ సర్వస్వము, మనము విమర్శింప బోయెడి వెంకటశర్మ, సుబ్బారావు, గు| అప్పారావు మున్నగువారిని ముందునకు వచ్చి యసమాన భాషా సేవ యెనర్చియున్నది. వంగీయ "modern Review" ను అనుకరించి మనసారస్వతవిజృంభణ మేర్పడలేదు. వంగీయులే కాలప్రభావమున తమరీతుల గైకొనిరో, ఆంధ్రులాకాలోపదేశముల నందుకొనియే విస్తరిల్లుచున్నారు,కాలమే. యీశ్వరసంకల్పమే సర్వ ప్రయత్నములకు మూలకారణము. అనుకరణము కాదు. ఈ తత్మమే నా విమర్శనలన్నిటియందును గోరించును. విమర్శిన్నావైఖిరియు, కూర్పుయు కాలస్వరూపవిజ్ఞానమున నమర్చబడి యుండుట నా చదువవారు లెల్ల జరిగినదే. "విత్తవయోరూప విద్యాబలైశ్వర్య జన్మకర్మంబుల” నేర్పడు మన పౌరుషములన్నియు కాలానుకూల్యతలేక, నీశ్వరసంకల్పసాహాయ్య మమరక, నడుగంటి నామరూపము లెరుగకుండును. కాలమనుమాలింప నీశ్వరుడు ధర్మప్రకటనౌత్సాహమును మనల నావేశించి, దుమికింప నానావిషయములందు మాతృస్వరూపనిర్ణయి మొనర్పగలుగు చున్నాము.
వెంకటశర్మ రచించిన ఖండకావ్యములు, పద్యావళులు, గీతమాలికలు, పాటలు, 1911-33 వరకు బ్రచురింపబడిన తెలుగు, వార, దైనిక, మాసపత్రిక లనేకములందు గాననగును. ఈతని పదములు సులలితముగ చక్కనిధారతో విన సొంపుగనుండి వ్యాకరణదోషములు కాని గ్రామ్యప్రయోగదీక్ష గాని లేక సుభోధకముగ నుండును. తిరుపతి వెంకటేశ్వరుల పదజాలము వాడుకదైనపడు కొన్నిపట్ల పేలవముగను, విష్యతుల్యముగను ఉండును. భారతాంగీకారమొప్పిన నొప్పు గాక! రాయప్రోలు సుబ్బరావు గారిని మాధుర్యమున నేకవి తీసిపోవు కాని అన్యమయిన సులభములు .............. మమర గూర్చినట్లుండును. శైలిలో వెంటశర్మ తెలుగు గురజాడ అప్పారావుగారి సారళ్యమును, అంతకన్న తక్కువ ప్రయత్న సంపాదిత లక్షణములును గల్గియుండును. ..... అను పద్యావళి యందళి పదజాల మపారమాధుర్య నెప్పమున్నది. పద్యములకూర్పు కొన్నితావుల పోతనధోరణితోను, మరికొన్నిట తిరుపతికవుల ధారా సారళ్యములను గోచరించును. పోతనఫక్కీలో నీరెండు పద్యములు:
| క. | కేళీవనముల యందును | |
(ఇందిందిరము 1911)
| క. | మృగములవలె ఖగములవలె | |
(ధారాధరము)
| శా. | దేశంబే భవనంబు సోదరులు నీ | |
దేశానందిక రా! ...(పీఠికాపురాధీశ్వరుడు 1912) అను పద్దెము తిరుపతికవుల పోకడల సూచించి చున్నది. వృత్తము లల్లుటలో నీతని ధార యీనాటి భావకవుల కన్న నెక్కుడు ప్రబంధ వైఖరుల నొప్పుచున్నది.
| క. | సుకుమారీమణు లెందరెందరో మహా | |
(ఆంధ్రప్రబోధము, 1922)
పద్యముల యల్లికలో చక్కని సహ్రస్ర వాహ ముప్పునవి పెరిగిచకలు దండకములు కలవు. అందునిక కాపురాధీశునిగూర్చి చెప్పిన
| క. | పుట్టినాడువుకదా ! భువనప్రసిద్ధమై | |
శ్రీనాథాధుల సీససిద్ధిని దెల్పుచున్నది. వెంకటశర్మ మంజరీత్వపద, గీతమాలిక మున్నగు నవీన ఛందోమార్గముల యత్నించియున్నాడు. కాని గీతమాలికలు పాదాంతమున నాగుచు వెంకట పార్వతీశ్వరులవానిబోలి పద ప్రవర్షమున కుపకరించుచు, తరువాతి భావకవులు లక్ష్మీ కాంతిము, రామిరెడ్డి మున్నగువారివలె గద్యకావ్యలక్షణసాదృశ్య మొప్పుకున్నవి. 1912 లో కోకిలను బలుకరించుచు, గీతమాలికలో
నిఖిలజనులకుఁ గడుగూర్చు నీడజఁబ
నిత్యమును బచ్చిగానుండు నీగృహంబు,
......................................
మధురగానంబు వినుచు దన్మయుడ నగుదు.
ఈరీతిగనుండి గీతమాలిక లీనాడు ఒప్పుచున్న గద్యసారశ్యసిద్ధి వెంకటశర్మ కేర్పడలేదు. ఈతని తమ్ముడు పురుషోత్తము రచించిన “యూర్పుపాట" లో నద్భుతవన్య పరిజ్ఞానము, పదమాధుర్యము ఏర్పడినవి కాని, ఆదియు వెంకట పార్వతీశ్వరుల ఆగుడుపోకడనే కల్గియున్నది. ఇంతగు వెంకటశర్మ దీర్ఘ భావోపన్యాసకుడు కాడు. పద్దెములలో భావస్ఫురణ వెలుబరచువాడు. స్వానుభావమున గోచరిం కాని, కవి సమయముల నుండి కాని, యిత డెరిఁగిన ప్రకృతిస్వభావమును తలపోయుచు, తలపులు తళుకులీన నల్లనల్లన జల్పించు చింతాపరుడు, రసాస్వాది. ఈతని ప్రకృతిసంబోధనలు కొన్ని కవిసమయముల ననుసరించి యుండుటచే, పూర్వకవుల చిత్రవైఖరులు ఈతని స్వభావభావ కవిత్వమందును ఖండ కావ్యములందును గోచరించును. ఈనాటి గీతమాలిక లొల్లు భావకవు లందరు ఏదోకొంచెము రూపకల్పన, కొంచెము వర్ణన గావించి తమభావమందదివరకే సిద్ధముగనున్న భావోపన్యాసమును విస్తరింతురు; అనగా వారి యుపన్యాసమునకు మాలికాదియందలి రూపకల్పన కేవలము వాహకమై నిదర్శనమై నిమిత్తకాగణమై బాగియున్నది. వెంకటశర్మ సావకాశముగ పురుగతితోను ఫలుగురితోను మాట్లాడి వారి మంచిచెడ్డలను సుఖదుఖములను వృద్దభాంధవునిబోలి యూరయు చుండెను. ఈ కారణమున నీతోడు గీతపద్యములో రచియించిన ఖండకావ్యములే నిజమానస సంచారానువర్తులై యీతని ప్రతిభ నేర్పరచుచున్నవి. గీతపద్దెములందు సులభతరమైన భాషలో ప్రకృతిని సంబోధించి స్వభావకవిత్వమునకు దారిజూసి, తరువాతి గీతమాలికలకు పునాదుల నేర్పరచిన గౌరవము వెంకటశర్మకు ఒప్పియున్నది. ఇతనే ఖండకావ్యయుల తండ్రి. తిరుపతి వేంకటేశ్వరులు భాషా ప్రయోగమందు సౌలభ్యము, సారళ్యము ఏర్పరచిరే కాని, అల్పవిషయముల కావ్యసామాగ్రిగ నలవరచిరే కాని ఖండకావ్యములకు వలయు సాధన సామాగ్రి గూర్చిరేకాని, ఖండకావ్యముల సవీనస్వరూపమంతయు గ్రహించి, భావగీతములు యుద్దేశ్యములు పాటించి, రచించిన డ్రష్ట, మార్గదర్శి, తొల్లిటి తెలుగుకవి, మంగిపూడి వెంకటశర్మయే యని చెప్పవచ్చును.
వెంకటశర్మ దేశాభ్యుదయముకొరకు అనేక పాటల రచించినాడు. తెలుగుజనులలో పాటలమూలమున, వారి కలవడిన ఆంధ్ర భాషానైజ మొప్పారు పేలుకొలుపులు, దసరాపదములు, జోలిపాటలు మున్నగుదానిలో జాతీయభావమును, దేశభక్తిని, సాంఘిక స్థితులను విశేషముగ వ్యాపింపజేసెను. ఆధునికమతస్వరూపము నెట్లుచూచెనో, భావికవిత్యలక్షణము లెట్లూహించెనో, అటులనే తెలుగుబాస భక్తి శృంగార రసముల కనువైనదనియు, పాటఫణకులే, మాత్రాకవిత్వమే ఆంధ్రనైజమనియు గుర్తించి రచించిన వివేకి, లోతుచూపుల ప్రొఢమైన పిప్పరకవి! వెంకటశర్మజాతీయగీతము లాంద్రవనిలో నెల్లెడలబ్రాకి “మాకీ తెల్లదొరతనము వద్దూ" అనుపాటకుమాత్రమే జంకియున్నవి. పాటలలో గ్రామ్య వైఖరులనే అవలంబించెరు.
“అవునోయి ఆంధ్రుడా! అవునోయి నీవు
అన్నిటికి ఎగిరెగిరి అలసియున్నావు
శారదానిలయంబు చాటించినావు
-జోలిపాట.
అందారు బిడ్డాలు హిందమ్మ తల్లీకి
అందారు ఒక్కాటై సక్కంగఉండాలి”
-మాలపాట.
ఇందులో క్రియావిభక్తి ప్రదములందు వాడుక ప్రయోగమే గాక మాత్రాసంపోషణార్ధముకూడా పదభ్రంశ మేర్పరచబడినది.
ఈ విధమున వెంకటశర్మ నవీనకావ్యవైఖరుల నన్నిటిని ముందుగా నూహించి దారిద్రొక్కినవాడు. ముందుగా దారిదోక్కిన గౌరనము, విశేషముగ వ్రాసినరచనాసంపత్తి, ఎట్టి విదేశపరభాషా పరిచయములేక స్వతంత్య్రముగ నిన్నివిధములు కనిపెట్టినతెలివి, చక్కని పద్యములనందమగు పదములతో గూర్చిన జాణతనము, ఈతని యందీకరింపక తప్పదు. ఇన్నిటిలో మొదటివాడగుటచే నవీనాంధ్ర ఖండకావ్యముల తండ్రియనియు, ప్రథానద్రష్టయనియు చెప్పియున్నాము. కాని ఈతనిని అరుసరించి భావకవిత్వము ఏర్పడలేదు. ఇప్పటి భావకవు లయినవారు ఒక చెంప తిరుపతికవుల యాదర్శములను, ఒక చెంప ఆంగ్లవంగీయ సారస్వతరూపములను స్వీకరించుచు, కాల స్వభావమును అనుపరించి వ్రాయదొడగిరి. వెంకటశర్మ అలవరచిన సులలితపవజాలము అప్పటికే సుప్రసిద్ధులయిన తిరుపతికవుల విఖ్యాతకల్పనలందు లభ్యవైనవి. వెంకటశర్మపోయిన భావకవిగ్వరీతులు ఆంగ్లసారస్వతమునుఁడి మన భావకవులు గరచుచుండిరి. ఈ కారణముల చేత నవీనాంధ్ర భావకవులు వెంకటశ్మ సాంప్రదాయ మనువర్తించిన శిష్యగణ బుగ పెంచదగ కున్నది. కాని స్వతంత్య్రముగ, నాధునిక కావ్యలక్షణములను, రీతులను, మతో పాసనలను గుర్తించి, తొల్లిరచించి యుండుటచే నీకవితావర్భావమునకు వెంకటశర్మ మూలపురుషుడు కాకపోయినను, తొల్లిటి స్వతంత్ర నిర్మాతయనియు, మహాద్రష్టయనియు మాత్రము గౌరవించుట పేరును సంశ్రయించరు.
వెంకటశర్మ నిర్మించిన ఖండకావ్యము లైదు ప్రదానశీర్షికల క్రింద జేరుచున్నవి:
- (1) గీతములు
- (2) దేశభక్తి, జాతీయత, మాతృభూమి మొదలగు వానిని గూర్చిన శాశ్వత భావసంపత్తికల పద్యావళులు;
- (3) తాత్కాలికోద్యమములు, సభలు, ప్రస్తాపనలు, వర్తమాన చరిత్రమును పద్యరూపమున ప్రకటించునవి;
- (4) జాతీయవిద్య, సంఘ సంస్కరణము, వితంతూద్వాహము, పంచమోద్దరణము మున్నగు వ్యవహారసమస్యలకు కేలూతనిచ్చుటకై, యనుకంప ముదయించునట్లు గూర్పబడినవి;
- (5) విశ్వస్వరూపనురు విమర్శించుచు భూతమయుడైన యీశ్వరుని గుర్తించి, కరణారస పూరితంబులగు భావకావ్యములు;
ఇందుననే కొన్ని నీతిబోధకము గువికూడా చేరియున్నవి.
- (1) గీతము విషయమై భాషాలక్షణను విమర్శించిన పట్ల చెప్పియున్నాను, మేలుకొలుపు, జోలిపాట మున్నెగునవి తెలుగులో ప్రథాన గౌరవమంది యంతటను వ్యాపించి యున్నవి. దీనిమూలముని ఆంధ్ర ఉద్యమగునును దేశాభి మానమునకును జనసామాన్యమున విశేషవ్యాప్తి కల్గింది. ఒక విధముగా వెంకటశర్మ జాతీయ గీతములలో తెలుగు వారల దేశారాధన మంత్రములైనవి. కొన్ని గీతములలో
నాంధుల లోపములు వెలిబుచ్చినను, భావి సౌభాగ్యమందు నమ్మకము, కాలపరిణామమున మేలేర్పడునను విశ్వాసము వీరి కవిత్వమందగుపడును. వెన్నాప్రకడ భానుముర్తి గారివలె విపరీత మహోన్నత సిద్ధియం దాళయులేదు. పింగళి లక్ష్మీకాంతమువలె కాలమును, దైవమును నిరీక్షించి, మేలొందు మనియెడి దైవపరత్వమును లేవు. వెంకటశర్మ వీరిరువురినడుము నాలోచించు చుండును. గీతములన్నియు దేశాభ్యుదయమునకు సంబంధించి,
- "లెండు భారత ధీరులారా!" యన్న సమరోత్సాహరంజకములై యుండును.
- (2) జన్మభూమియే మిన్నాయనియు తనకును మాతృభూమిని ఎద్దియో యొక ఇంద్రజాలిక తంత్రబంధమున్నదనియు చెప్పుచు 1912 లో నిట్లు వ్రాసియున్నాడు. ఇందలి పోకడలు గోల్డస్మిత్ మహాకవి ఆల్పగిరీశిఖరము నుండి సోదరునకు వ్రాసిన,
- "Wherever I roam whatever realms to see
- My heart untraveled fondly turns to thee"
పంక్తులస్మరీయింప జేయుచున్నది.
మంజరీ ద్విపద
"చెలగి నేను విదేశసీమలయందు
బహుసుందరోద్యాన వనముల యందు
దీరైన కాసార తీరంబులందు తీరిమ్ములఁ దు
స్వర్ణ నిర్మిత దివ్యసౌధమ్ములందు
చెలువురాణించు పచ్చిక పట్టులందు
సరిలేని పూర్తి మాచంద్రికలందు
విహరించుచున్నాను, వే వేగమునకు
నాజన్మభూమికి నన్ను గొంపోవ
వాయువునకు నేను స్వాగతం బిడుదు"
ఇందు మాత్రూపాసన మిక్కిలి భావోద్వేగమున గావింపబడియున్నది. ఇటులనే సర్ వాల్టరు స్కాటు రచించిన:
Breathes there the man with soul so dead
Who never to himself hath said
This is my own my native land!
.............................
.... ........................
... ...the wretch... ........
.......shall go down ........
To the vile dust from whence he sprung
unwept unhonoured and unsung.
అనే పద్యమునకు భాషాంతరీకరణమా యనునట్లు 1912 ఆంధ్రభారతిలో,
'నాస్వకీయం బిది నాజన్మభూమి
యిది యంచు మనసా నెన్నడు గాని
యొకసారి తిరిపోసి యుల్లముప్పొంగ
హర్షింపనట్టి హతాత్ముండు కలడె..........
మునుపు తా నెందుండిపుట్టేమో యట్టి
దుమ్ములోపలికిని దుఃఖంబడకె
కీర్తింపబడకె శ్లాఘింపగా బడకె
గౌరవిఁపబడకె క్రమ్మరఁబోవు”
వీనిని బోల్చిచూచిన స్కాటు వాక్యముల అనుకరణ మనియే స్పష్టముగును. కాని వెంకటశర్మ గారే వినిని స్వతంత్రించి వ్రాసిన, దేశమాతపై వీరికిగల యనూనాభిమానము స్పష్టమగును.
(3) ఉద్యమముల పట్లను వర్తమాన చరిత్రాంశములను తేటగ నిర్వచిందురు. స్త్రీనే ముందుండుగులిడ పురుషుల వెనుదీయుదురను పద్యరాజమును ధారప్రశంసలో పేర్కొని యున్నాను. ప్రస్తావకపద్యములలో పీఠికాపురాధీశునిగూర్చి నిదర్శనము లుదాహరించితిమి. గాంధీ యుద్యమమునుగూర్చి 1922లో వ్రాసిన పద్యమందుద్యమసారమంతయు విస్వష్టముగా బద్యరూపమన నిర్వచింపబడియున్నది:
మ. కసి యెన్నఁడును బూనరా దెదిరిపైఁ
గారుణ్యమున్ వీడరా
దసురుల్ వోయెడు వేళనైనఁ గపటో
ద్యోగఁబు గారాదు ఏ
సకి లేదంచును వీడగూడదు దయా
సత్యాది శౌచంబు లీ
యసీధారావ్రతిమందు ముఖ్యములు మీ
రవ్వాని బాటింపుడీ.
ఇందీ కవియొక్క నిర్వచనశక్తియు భాషాస్వాధీనత, సంస్కృతలక్షణము లొప్పుచున్నవి.
(4) వెంకటశర్మ సంఘ సంస్కరణమునకు దోడ్పడుటకై, అబలాపిలాసము, పంచమాలాపము, నిమ్నజాత్యుదరణము, బాలవితంతు విలాపము మున్నగు పద్యావళుల కొన్ని వ్రాసియున్నాడు. వీనియందు పదలాలిత్యమున్నను, అల్లికసాంపులున్నను, పద్యరూపమున జేసిన యుపన్యాసములు, శాస్త్రచర్చలు అనదగియున్నవి. వీరిని వ్రాయుటచే, వెంకటశర్మ కావ్యోచితవస్తువిచక్షణలేనివాడని కొంద రభిప్రాయపడిరి.
1907–23 వరకు పత్రికలలో ప్రచురిఁపబడిన పద్యావళులలో రెండువంతులు లేశోద్యమమునకు, సంఘసంస్కరణమునకు, వర్తమాన చెరితాంశములకు, ఉద్యమప్రస్తావనకు, నాయకస్తవమునకు, మృతస్మృతికిని వినియోగింపబడియున్నవి. సుమారు 200 కవు లీయపార పద్యసముచ్చయము నేర్పరచిరి. ఇది యాంధ్రకవిశ్వమున జేర్పదగినదా? లేదా? అనువిచారణ సవిస్తరముగ జేసి యున్నాము. పదముల సొంపుచేగాని, వృత్తకల్పనచేగాన్ని ధారాసారళ్యముగాని, బాహ్యలక్షణముల వేలిచేగాని కవిత్వ మేర్పడ నేరదని నిశ్చయించితిమి. సద్వర్ణన ముండవలెను. ఈ వర్ణనము భావము నుద్దీపించుచు, రసోదయ మేర్పరచవలెను. రసభావములు, వర్ణింపబడిన విషయమునకు తాత్కాలికముగ జెఁదినను చదువరుల అనుభవము లోనివై విశాలప్రపంచపు సామాన్య అనుభవములలో చేరియందరిని ఆనందపరచ గల్గియుండవలెను. ఇట్టి సభావద్యోతకంబగు వర్ణనముగాని, యూహలు గాని ముఖ్యాంశములై యుండ విద్యపద్య విబేదము లేర్పరచు బాహ్యకావ్యలకుణములు గొడవులై యువకరింప సత్కవిత్యమేర్పడును. అనగా కవిత్వాంశ్రమగునా, కాదా అనునది భూతవర్తమా నాది కాలవిక్షణచే నేర్పడదు. పాత్ర విచక్షణచే నేర్పడదు. వానిని వర్ణించుటయందు తదితరముగ స్ఫురించున ప్రస్తుతభావ సంస్ఫూర్తిని పట్టియుండునని తేల్చితిమి. ధ్వనివ్యంగ్యము కావ్యలక్షణము. అయితే, వర్తమానాభివర్ణనము నిత్యానుభవమున జేరినదగుటచే నీయది కళలయెడ ప్రజలకుఁడవలసిన గౌరపమును ఏర్పరజాలనియు, నాటక పాత్రములు ఈనాటి దుస్తుల గట్టి యాడినచో పేలవముగనుండి యాకర్షింపదనియు, కాలమందును దేశమందును ఆచారములందును వేషమందును ప్రస్తుతస్థితికి దూరమైన గాని కళాంశమునందు ఆదరము లక్ష్యము కుదురవనియు, కళాకావ్య నాటకముల విమర్శకులు కొందరభిప్రాయపడు చున్నారు. ఇందుచేతనే సామాన్యజీవిత పద్ధతులకు భిన్నమైన కవిసమయములు, వృత్తములు, నాటకాభినయములు అవశ్యమయినవి. ఈ కారణమున ఎంతో ఎక్కువ రసభావోద్రేకము గల్పించు పట్లతప్ప, మిగిలిన వర్ధమానవిషయములందును, ఉద్యమప్రచారమందును, సంఘ సంస్కణాశులందును, కావ్యవైఖరుల నుపయోగింపకూడదని తేలుచున్నది. కాని నా కీపట్టున నొక శంకకలిగినది. కవి ఏవిషయమున రసావేశావస్దజెంది, కరుణాను కఁపితుడై వీరభావమున విస్తరించునౌ, ఆసమయమున నాతను పల్కుమాటలే కావ్యములగునని తొల్లి చెప్పియున్నాము. వాల్మీకి చచ్చినపిట్టకై వగచి తొఁటి పద్యము నుచ్చరించినచో, లక్షణవిజ్ఙాత లందరిని గగ్గాని గారవించినచో, వృతజీవియై, నిరంతర కష్టపరంపరల వేగుచుండెడి బాలవితంతువులయెడలను, సాంఘిక దురాచారదుర్విదగ్గులై దుర్భరపాతిత్య ననుభవించు పంచములపట్లను, నిండు మనంబుతో స్వార్థరహితముగ వెలువడు ప్రేమలహరీపద్యంబు లాదరిణీ యంబులు గనెరవా? సంఘము మార్పునొప్పక ..... నించవచ్చును. కాని ఆపంచములు, ఆ బాలవితంతువులు తమయెడల నిట్టి దయార్ద్రబావముల వెల్లడించినవాని మహాకవిగ సంగీకరింపకుందురా? ప్రపంచములో ఏది మాత్రిము సర్వజనానందదాయకముగ నుండగలదు? మనల నుద్దేశించు భారత మాతృస్తవము ఆంగ్లేయులకు కుకవిత్వమైతోచదా? దుర్యోధను డధికారియై యున్న భారతమును చించి ముక్కలు చేయడా? రావణు డవతరించిన రామాయణమును తగుల పెట్టించడా? ప్రతివిషయము, ప్రతీకార్యము కొందరికి ఇష్టప్రదమైనచో మరికోందరకు అనిష్టముగ నుండును. అందుచే రసభావములను, వర్ణనలను విమర్శించుటలో ఎవరిదృష్టిపథమునుండి ఆలోచించివలెను? కవి తన ఇష్టము వచ్చినారీతి రసావేశమేర్పడిన పట్ల, భావోద్రేకముతో వర్ణించును. నా ఉద్దేశ్యము ఆరీతీగా కావ్యసమాధి లభించి వ్రాసిన సమస్తాంశములు కళాసౌష్ఠవ మొప్పుననియే. అట్టి రససమాధి కలుగక పదగణ వై భవంబున నల్లబడిన కావ్యము లేట్టివిషయమును గూర్చిననైనను, పేలవముగనే ఉండును. కాన, వెంకటేశర్మగారు వర్తమాన చరిత్రాంశములను, సంస్కరణప్రణాలికలను పద్యరూపమున వ్రాయుట యొక తప్పుగాదు. కాని బజారులో గ్రామ్యఫణతుల మపన్యాపముల దంచు సామాన్య భావములను, మామూలువాదములను తెలుపుటకు నుత్తమ భావవాహకంబగు కావ్యసామాగ్రుల నుపయోగించ కూడదనియే నాయభిప్రాయము.
వెంకటశర్మ ప్రతిష్ఠయంయంతయు నాతని స్వభావకవిత్వము, ఖండకావ్యములు మీద నాధారపడియున్నది. 1910 సంవత్సరములో “ఆంధ్ర భారతి” యందగుపడిన "“కవికాంచన సమవాద” నుననది తొల్లి నన్నాకర్షించినది. భూతప్రపంచమును దాని యవస్థల నరయుటకు ఆంధ్రకవులు సంబోధించుని దిదియే మొదటిసారి. అంతకుమున్ను తెలుగు కవులు నాయికానాయకుల స్వార్థపయోగమునకై "మల్లియలార మీ పొదలమాటున లేరు గదమ్మ చెప్పరే!" యనురీతుల శులు పికాదుల బలుకబచిరే కాని, వాని సుఖదుఃఖము లారయు భూతదయతో భూతప్రపంచమును సంబోధించియుండలేదు. వెంకటశర్మ "భోగి బాహ్యమయ్యె పూచిన సంపెంగిపొలుపు మధు కరాఁగనలకు,” నానాసూన వితానవాసనల నానందించు సారంగ మేలా నీనొల్ల" దు మొదలగు కవిసమయమలమో ప్రకృతిస్థితినో గైకొని, యొకకవి సంపెంగ పూవు వనితల శిరోజములందును, రాజులకరపీఠమునను నివశించు నౌన్నత్యమును బ్రశంసింప, కాంచనము
"హృదయహృదయ నాడు సంతాపహేతువు
.... ... ... ... ... ... ... ...
వివిధపుష్పరతుల విహ్నంచు రసికుండు
మధుకరుండు నాసవిధకు రాడు”
అని ఎత్తుకొని హృదయ నిర్భేదకరకముగ తన దురవస్థ జెప్పికొనెను. ఎట్టిఔన్నత్య మనుభవించువాని కైనను ఏదియో ఒక దుఃఖకారణముండియే యుండును. ఈలోకమే దుఃఖభాజనము. కవి పూవును పలకరించుట, పూవు తనకష్టములు చెప్పికొనుట, అది విశృతత్వమును సూచించుచు రసోద్దెపకంబుగ నుండుట. "కోవిల" (ఆం. భారతి 1910) లో కోవిలను కొన్ని పద్యములలో సర్వతోముఖముగ నుతించి,
గీ. మేటిర్యజకులమందు జన్మించినావు
పరమహంసల స్నేహంబు వడసినావు
ళుకుసుసంగతి నిత్యంబు జూచినావు
మేలు కోయిల నీజన్మమే తరించే.
ఇంతలో దారిపరభృతత్వమునకు కాక విరోధమును స్మరించి,
గీ. కన్నతల్లియె నీయెడ కరుణమాని
పుట్టినప్పుడే పొరుగింట జెట్టిపోయె
కొన్ని నాళ్లకె నిను బెంచుకొన్నతల్లి
యిల్లు వెడలించె నీ దురదృష్ట మేమొ
పీకమ ... ... ... ... ... .....
క. ఏకాకి నీ వనంబునఁ
గోకిలమా! కొసరి కొసరి కూసెను సుమ్మీ
నీకలకంఠము నోర్వని
కాకులు కడు నిర్ణయములు కలహప్రియముల్
వెంకటశర్మకి కోకిలయందు ఎంతటి సదయాను కంపమా! "ప్రేమ పశ్యతి భయార్యపదేసి” ఆనునట్లున్నదే దే వీని భూత శ్రేయోభిలాష! "ఎకఃకృతీ శకుంతేషు యోగ్యం శక్రాన్నయాచతె” అను న్యాయము నంగీకరించి, వారికమును పొగడియు. ఏకారణము, ఏగుణవిశేషము (మబ్బులో నీరు ద్రావుట) చాతరమునకీ మాధిక్యతను గల్పించుచున్నదయో యజయే దాని లోపముగ నెంచియున్నాడు:
చాతకమా! నీపురాకృతి పాతకంబు
ఫలమొ కాకున్న జాతకఫలమొ యకట!
పడదు నీకింతయు సమస్త ప్రాణులకును
జీననంలైన భూతలజీవనంబు.
ఇది ప్రతిజీవమందు మనము చూచునదే. గుణమే లోపముకూడ నగుచుండును. కొన్ని జంతువుల పర్గణములు కొన్ని దుర్గణములు చెప్పుటలో చీమ (పిపీలికము) నుద్దేశించి, ముందుగా జాగ్రత్తపడుట మేలనుచు,
గీ. గగనతల మభ్రకలుషంబు గాక మున్నె
బాట బురదల పితిపితిల్ బడకమున్నె
తడిసి కొమరైన పుటలు చెడకమున్నె
నూకనుచ్చును వేకువ నోటగరిచి... ...
వచ్చెదవని దాని జాగ్రతకు పంతసించును. "మదు మక్షికము” కూడ ఇట్టిభావమే తెలుపును, “దోమ” తొండమున్నంతమాత్రాన ఏనుగు కానేరదనియు, ఎగుర గిలిగినమాత్రాన ఖగము గానేరదనియు, నీటి యల్ప సంపత్తులకు పొంగి యన్యుల గుర్తిచంపుట తగవు గాదనియు నీతిధ్వంని ప సంబోధించును. “ఖద్యోతము" మిరుగుడుపురుగ తన మెరుపుని జూసి గర్వపడుచుండక
కె. “ణేక్కలు గలవు దాయని
ణిక్కలతోఁ గలసి మెలసి ణేక్కలతో ఇన్
జక్కగ మెణేసెద ననుచు౯
మిక్కిలిగా మిడిసిపడకు మిరుగుడు పురుగా!
కె. చుక్కలు మించును నిన్నా
చుక్కలఁ జద్రండు మించు సూర్యండతని౯
మిక్కిలిమించును తేజున
నిక్కకు ఖద్యాత! ఘనుడనేనని యపుడు౯|
లోకములో మహిమార్ణవంబున కంతములేదు. ‘అతనికంటే ఘనుడు ఆచంటి మల్లన్న' యను న్యాయము నుద్బోంచుచున్నాడు.
"ఇందిందిరము" లేని గొప్పను చెప్పుకొనుచు తిన సర్యాత్కృష్ట్యమునకు సంతసించుచున్నది. భావమే ప్రధానము కాని, ప్రతిజీవుడు త తనస్థితికే, తనజీవితాశముల సంతసింపవచ్చును. భాగ్యము, దారిద్యము, ఆనందము, దుఃఖము అన్నియు మాససస్థితియందే కలవు. తుమ్మెద,
క. నిలయఁబు జలజవిపినము,
మెలఁగుట శ్రీదేవితోడ మేలాహారం
బలరుల తేనియ విద్దయ
కలగానంనట్టి భాగ్యగరిమయుఁ గల౹
నానాగతులను, ఆణిమామహిమాదిలక్షణములను, శాంత భీకర స్వభావములను సర్వవ్యాప్తియు, సర్వశక్తియు, నివియన్నియు నుండ, నంబుదములను స్వభావ పరోపకారదీక్షలను ప్రశంసించుచున్నాడు. "నవాంబుభి?" దురవిలంబి మోఘనా" యనునట్లు,
తే. గ్రీష్మమైనట్టి గ్రీష్మకాలోష్మమునకు
సాలి తూలెడు నీ జంతుజాలమునకు
జల్లదనమును సౌఖ్యంబు సంతిసంబు
గూర్చుపుణ్యాత్ములెవరు? నీకొలది జలది!
తే. ఏరులై పాణెటె నీదానధార లెల్లఁ
జూడజూడఁగ నీయిల్లు శూశ్యమయ్యె
నొడలు గుల్లయ్యె నప్పుల బడలనయ్యె
లే దనెడుమాట నీయొద్దలేదు జలద!
అని మరియు మేఘుములకును, మయూరములకును గల నిరంతర మైత్రి కెఁతయు సంతసించుచు,
ఆ. నింగిపై సదా మెలంగెడు నీకును
నేలపై నటించు నెమలులకును
నేస్తమే మునీదు నేర్పేము? నినుజూతి
తిరియాడు నెమ్మి వారిదంబ!
పింగిలి లక్ష్మి కాంతము "మరాళకిలములో"
"కలహంపంబుర కేటివెళ్లివెఱ్ఱియు వియద్దంగానదీ వీచికాచల దబ్బతమధుభ్రమర జఁజన్నాడమోదక్రియా లలితంబయ్యు తదీయ భోగపరతల్" కాక్షింపక గానసౌకర్యముప్పు కోవిలనేస్త మాసించుచున్నది. అది జాతిభేదమున స్థితిభేదమున సమరజాలదని యభిప్రాయ పడియున్నాడు. వెంకటశర్మ స్నేహమునకును, స్థితి రూపభేదములకును సంబంధము లేదనియు ఎట్టివారికైన స్నేహముండ వచ్చుననియు తలచుచున్నాడు.
1912లో వెంకటశర్మ "లోకల” యను గీతమాలికను ప్రచురించియున్నాడు. అందు ప్రకృతికిని మనకును రసానుకూల్యత గలిగినపుడే, దానిని యనుభవించగలమని చెప్పియున్నాడు. పరిస్థితియంతయు విషయానుకూలముగ నున్నపుడే యానంద ముదయించునని వీని యూహ.
“ఆందమును జిందు మాకంద బృందమపుడు
కెంజిగురుగమితోడ రాజిల్లు చుండునపుడె
సుస్వరసుధారసముగ్రోలి చొక్కగలము”
ఈ భావము వివిధకవులంను వివిధముగ నగుపడు చున్నది. కాళిదాసు, బంకించాటర్జీ ప్రకృతిమానవాన స్థలతో ననుకంపముప్పు వాని సుఖదుఃఖములు ననుసరించి మాటాననిరి. మిల్టన్ మహాకవి, ఆప్యామరణానంతయు గలిగిన వియోగభారమున నందన సౌందర్యమెల్ల వాసన ట్లూహించేను. వర్డ్సత్తు, విక్టరు హ్యూగోలు, విషయమునకును ప్రకృతికని పరస్పరసంబంధ మేమియు లేదనియు, మనస్థితిగతు లెట్లున్నను, ప్రకృతియు వ్యక్తియు స్వతంత్రరససుర్పీతో బ్రవర్తించుననియు నాభిప్రాయ పడిరి. వెంకటశర్మ కోవిల సుస్వరంబునకును, ఆవిహంగమెల్లవేశాల నాశ్రయించి చరించు వసంత సంపదలకును సంతసించి, ఇట్టి పుష్పాంకుల పర్ణశోభితమై, కన్నులనలరజేయు ప్రకృతి సౌందర్యమందును, వీనుల విందోనగు సుస్వరముతో లీనమై నిరంతర రసాస్వాదనానందమున పేక్షించుచున్నాడు. స్వరరూపముల వెలుఁగు భూతప్రపంచ సౌందర్యమున బ్రహ్మానందతన్మయత్వము నొంది సఃఖింపగోరుచున్నాడు.
వెంకటశర్మ ఖండకావ్యములన్నియు నాతని ప్రధమ ప్రయత్నములందే కానుపించినవి. ఇటీవల నాతనిమానసము దేశారాధనము, ఉద్యమ వ్యాపకముపట్ల వర్తించు చున్నది. వెంకటశర్మ తెలుగుకవిత్వమున నిలుపగల నిజప్రతిభాముద్రణము సంపూర్ణమయిన చిహ్నములు కనుపించుచున్నవి. ధారయు, పద్యవైఖరియు నభ్యాసవశమున మెరుగారుచున్నవి. కాని నూత్నవైఖరు లేమియు గాన రాకున్నవి. తెలుగు సారస్వతమున మహా సాధనముల, జిరకాలమే, టెలిసన్ వలెమో, రవీంద్రునివలెనో, గీటీపలెనెూ యావజ్జీవము ప్రతిభాస ముద్రులై, దిసరినాభివృద్ధి గాంచెడి నవనవోన్మేష ప్రభావముతో నిర్మించి యుద్ధరింప ధీయుతు లేర్పడలేదు. ప్రాయశః అట్టివారేర్పడరేమో! మన సారస్వతసౌధము మన కావ్య విన్యాససంస్ఫూర్తి, పలువురుచేరి చెరియొక యంశమును పూరింప, రామవారధివలె, నల్పవ్యక్తుల నిరఁతరకృషిచే నల్పోపహార సమర్పణముచే, నేర్పడు నట్లుగుపడుచున్నది. వెంకటశర్మ ప్రారంభించిన నూత్న కవితాప్రయత్నము అప్పుడే వాని తొల్లిటిరూపణలను వీడి, యన్యుల చేతిలో మాతృవికాసముల నొఁదియున్నవి. ఈవిపరీత విన్యాసావేగమును వెంకటశర్మ అఁదు కానజాలడు. చాలకున్నను నవీనాంధ్ర లోకమున రాజిల్లు దేశాభిమానము, ఆంధ్రప్రతిభా శ్వేషణము, ఆభినవకవిత్వ వైఖరులు వెంకటశర్మ తనమానసవీధులలో స్వతంత్రముగ సూహించి కల్పించిన యాదిరూపముల పరిణామ కుసుమఁబులేయని సంతసించుచు నాటిని నవీనదివ్యాంధ్రకవిత్వ సూత్రధారిగా నెంచిక, స్మరింపక తీరదు.
౼ పురాణం సూరిశాస్త్రి
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse