Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 4/ఆంధ్ర కవితాకళ—తదితర మనోజ్ఞకళలు

​

ఆంధ్ర కవితాకళ - తదితర మనెఙ్ఞకళలు

(శ్రీ విజయనగరకవిముడలి వార్షికోత్సవ సందర్భమున సభాధ్యక్షత వహించిన

ఆచంట వేంకటరాయస్వాఖ్యాయనశర్మగారి యుపన్యాసము)

వాపీకూ పతటా కాడులయందలి జలము భాగీరధీ జలబిందు సంపర్కమునఁ బావనమగు తీరునను, ఘృతాభీఘోర సంస్కారమువలన ద్యవ్యములు పవిత్రములగు వడువునను గీర్వాణభాషాసంపర్కపశమున నాంధ్రభాష పవిత్ర మగుచున్నది. మఱియును లోకవ్యవహారమున కనుకూలించుతీరును సర్వదా మన మపయోగపఱచుకొను వెండినాణములను ముద్రించునపుడు ముమ్మఁదు స్వల్యా౦శము సువర్ణమును రజతములోఁ గలిపి కరగించి నాణియములను గొట్టుదురు, అప్పుడుగాని వాని కనుకూలమగు పటుత్వము లభింపదు. అట్లే గీర్వాణభాషాసంపర్కములేశమాత్రమయిన లేనియెడల నాంధ్రభాషకు బాటవము గలుగనేరదు. ఇదియునుగాక సంస్కృత భాషాసారస్వతము మనకుఁ బిత్రార్జిత ద్రవ్యము కావున దానికి హాని గలుగకుఁడ భద్రపరచి యుంచుకొని కాపాడుచు నభివృద్ధిఁ జేసికొనుచు సమయానుసారముగా నవసరము గలుగునపుడు దానినుండి స్వల్పమాత్రము గ్రహించి వినియోగ పఱచికొనవలసియుండును. మనకుఁ గేవలము స్వార్జిత ద్రవ్యమువంటి యాంధ్ర భాషా సారస్వతమునో దర్వినియోగము మాత్రము చేయక సమంచిత మార్గమున యధేచ్ఛముగా వినియోగపఱచుకొనుటకు మనకు స్వాతంత్య్రము గలదు. కాఁబట్టి యాంధ్రకవితావిషయికమగు నీయుపన్యాసప్రారంభమున మంగళాచరణమునకుంబోలె రెండుమూఁడు విషయములను మాత్రము సంస్కృత భాషాసారస్వతము నుండి గ్రహించి వినియోగించి పిమ్మట సమస్తమును గేవలాంధ్ర భాషాసారస్వతము నుండియే యధేచ్ఛముగా వినియోగపరిచెదను. అక్కడక్కడ భాషాంతర పండిత సంప్రదాయ ములను గూడ నుదహరించి చర్చించుటయు విజ్ఞానాభివర్ధకమగుటవలన వానిని గూడ స్వీకరించి వినియోగించుచున్నాను.

కాళిదాస మహాకవి యభిజ్ఞానశాకుంతలమునందు,

"రమ్యాణి వీక్ష్య, మధురాంశ్చ నిశమ్య శబ్దా౯
పర్యుత్సుకీ భవతి యత్సుఖితోపి జఁతుః
తచ్చేతసా స్మృరతి నూన మబోధపూర్వం
భావస్థిరాణి జననాంతర సౌహృదాని”

అని చెప్పియున్నాఁడు. రమ్యములగు వస్తువులను వీక్షించునప్పుడును మధురములగు శబ్దములు నాకర్జించునప్పుడును హాయిగా సుఖపడునది యైనను జీవజంతు వుత్కంఠను జెందుటకలదు. అట్టి కళవళపాటనునది (యేవో యెఱుకపడక) భావమును స్థిరముగా నాటుకొని యు౦డు జన్మాంతర సంస్కారవాసనలు తలంపునఁబడుటవలన గలుగును, అని దీని తాత్పర్యము. వేదశాస్త్రములయందుఁ బ్రామాణ్య బుద్ధిగల యర్హసంతతి వారమగు మనము జన్మాంతర స్మృతిసంస్కర సిద్దాంతము నంగీకరింతుము. ఈవిషయమును భగవానుఁడగు పతంజలి మహర్షి యోగదర్శినమున, బి) వాను(పెను

"తత స్తద్విపాకానుగుణానా మేవాభివ్యక్తి ర్వాస నానా౦"
"జాతిదేశకాలన్యసహితానా మ ప్యానంతార్యం"

​స్మృతిసంస్కారయో రేకరూపత్వాత్"

“తాసా మనాదిత్వ మంశిషోనిత్యత్వాత్"

అను మూఁడుసూత్రములమూలముని సిద్ధాంతీకరించి యున్నాఁడు. "కర్మవిపాకానుగుణముగా సంస్కారములు వ్యక్తములగును. స్మృతి సంస్కారము లేక రూపముగలవి గనుక జాతిదేశకాలవ్యవహితములయినను వాని కానంతర్యము గులుగును. మహామోహ రూపమగు నవిద్యయనాది గావున స్మృతిసంస్కారములకుఁ గూడ ననాదిత్వము” అని యాసూత్ర సిద్ధాంతము. గీర్వాణ సారస్వతమునుండి యీ మాత్రము గ్రహించి వినియోగపఱచు కొనుచున్నాను.

కాళిగా సమహాకవి రచించిన శ్లోకములోని పూర్వార్థము సమగ్రముగాఁ బ్రస్తుతోపన్యాసవిషయముతో సంబంధము గలిగియున్నది. ఉత్తరార్థమైనను గేవలమ ప్రస్తుత ప్రశంస కాకపోవుటయే కాక యుపన్యాస విషయముతోఁ గొంత సంబంధము గలిగియున్నది. కాఁబట్టి ముందు ముందు సరిపెట్టుకొనఁదగియుండును.

సర్ మానియర్ విలియమ్సు మహాశయుఁ డీశ్లోకమును:

"Not seldom in our happy hours of ease, When thought is still, the sight of some fair form, Or mournful fall of music breathing low. Will stir strange fancies, thrilling all the soul. With a mysterious sadness, and a sense Of vague yet earnest longing, can it be That the dim memory of events long past, Or friendships formed in other states of being; And fits like a passing shadow the spirit?"

అని యింగ్లీషు భాషలోనికి మార్చి దాని తాత్పర్యము నారీతిని వ్యక్తీకరించెను. మఱియు నాతఁడు కాళిదాసును గుఱించియు నభిజ్ఞానశాకుంతలమును గూర్చియు:

"No one can read this act (IV th) nor indeed any act of the play without being struck with the raciness and elevation of its author's genius, the exuberance and glow of his fancy, his ardent love of the beautiful. his deep sympathy with a true and nature's loveliest scenes, his profound knowledge of the human heart, his delicate appreciation of its most refined feel us his familiarity with its conflicting sentiments and emotions', అనివాసెను, కాళిదాసమూల శ్లోకములో పూర్వార్థమును పిర్ మోళియకు విలియమ్సుగారి యభిప్రాయము లోని 'his ardent love of the beautiful' అను మాటలను మనసున గీల్కొల్పి సమయము వచ్చునపు డనఁగా మఱియొకగడియకు స్మరింతురు గాక! ఏమనిననవి ప్రకృతి విషయములో సంపూర్ణ సంబంధము గలిగియుండును. తక్కిన భాగములను గొంత సంబంధము గలిగియే యుండుకు కావున నవియును పిస్మరణీయములు గావు.

మన ప్రాచీనులు లోక సంగ్రహము కొఱకనేకములగు విద్యలను గళలను మనకుఁ బ్రసాదించియున్నారు. విద్యలలోఁ బ్రథానములు పడునాలుగని కొందఱును, ముప్పది రెండనికొందఱును, ఏఁబదియారని కొందఱును, జెప్పుదరు. ప్రధానకళలు మాత్ర మఱువదినాలుగని యందరు సంగీకరింతురు. విద్యలను గూర్చిన చర్చ మనకిప్పుడవసరము లేకపోయినను గళలలోఁ గొన్ని విద్యామూలకములగుట చేత: విద్యాప్రశంసయుఁ జేయవలసివచ్చినది. విద్యలలో ధనుర్వేద గాఁధర్వ వేదములు పరిగణిఁపఁబడినవి. మల్లయుద్ధ వ్యూహరచనాదులు ధనుర్వేదములోని కళలు, నృత్తగీతవాద్యాదులు గాంధర్వవేదకళలు. కాఁబట్టి ఇంక మనము విద్యాప్రశంస నటుంచి కేవలకళావిషయమును మాత్రమే విచారింతెము.


వాగింద్రియవ్యాపార ప్రదర్శనయోగ్యమైనది విద్యయనియు మూగ్రివాఁడయినను నిర్వర్తింపగలది కళయనియును సామాన్య లక్షణము. కాని యీలక్షణము నిరుద్ధష్టముగాఁ గనబడదు. కళలకు మనలోఁగ్రియలనియును నామాంతరము గలదు. అరువదినాలుగుకళలలో ననేకములు కేవల కార్మికములును బారిశ్రామికములను నయి జీవయాత్ర కనుకూలపడుచున్నవి. వాని నటు౦డనిచ్చి సుప్రసిద్ధములను, సముత్కృష్టములును మనోరంజకములునునగు నతిప్రధానకళలను మాత్రమే విమర్శింతము. వీనినే మనోజ్ఞకళలని (Fine arts) యందురు. పశ్చిమఖండ పండితులు మనోజ్ఞకళావిమర్శనమును సమగ్రముగా దెలుపు శాస్త్రమును రచించికొనిరి. అరి మనోజ్ఞవస్తూమీమాంస యనఁబడును. (Aesthetics The science or philosophy of the beautiful, of taste or of the fine ats) శిల్పకళ (Architecture), మృద్దారులోహశిలాక్రియ కలాపమును (Sculpture),చిత్రలేఖనము (Painting),గానకళ (Music) కవిత్యము(Poetry) అను నియెదను మనోజ్ఞకళలు (Fine arts) అని వారును మనమును నంగీకరింతుము. మన ప్రాచీనులు మృద్దారులోహశిలాక్రియ కలాపమును వేర్వేఱుకళలు క్రి౦ద విభాగిచియున్నను వాని నన్నిటిని బ్రధానకళయగు శిల్ప కళలోనే చేర్చుకొనుటవలన మనోజ్ఞకళలు నాలుగేయని మనవారి యభిప్రాయము. ఈమనోఙ్ఞకశలలో నగా ​కవిత్వములు శ్రోత్రేంద్రియ గ్రాహ్యములును దక్కినవి నేత్రేంద్రియగ్రాహ్యములును గాఁబట్టి శ్రవ్యకళలు (Arts of the ear), దృశ్యకళలు (Arts of the eye) అని పేర్కొనబడుచున్నవి. ఇట్లే గాన కవిత్వములు వాగింద్రియ ప్రాధాన్యములగుటవలన వాచ్యకళలు (Speaking arts) అనియుఁ దక్కినవి రూపనిర్మాణ ప్రాధాన్యములగుటం జేసి నిర్మితికళలం (Shaping arts) అనియును జెప్పుదురు. మఱియును దేశకాలప్రాధాన్యమును బట్టి గాన కవిత్వములు 'కాలిక కళలు (Arts of time), తక్కినవి విదేశికకళలు (Arts of space) అనియును బేర్కొనఁబడుచున్నవి. ఇంతియ కాక గాన కవిత్వములు వాచికకళలు (Vocal arts) మిగిలినవి కాయికకళలు (Manual arts) అనియును జెప్పుదురు.

ప్రధానములగు నీకళలం నేత్రశ్రోత్రగోచరములయి తద్వారమున మనసున కెక్కి మనోజ్ఞములగును. కాఁబట్టి దృశ్య శ్రవ్య భేదమును వాచిక కాయిక భేదమును మాత్రమఁగీకరించి సామాన్యధర్మమగు మమోజ్ఞతను సుస్పష్టముగాఁ బేర్కొనకుండుట న్యాయముగాదని యెంచెనోయనఁ గాళిదాసమహాకవి “రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దా౯” అనియంతటితోఁ జాలింపక “పర్యుత్సుకీ భవతి" అనియు “చేతసాస్మరతి” అనియు మానసికత్వమునుగూడ వివరించియున్నాఁడు.

కాళిదాసవిరచితమగు శ్లోకమును సర్ మోనియర్ విలియమ్సు గారి ప్రశంసావాక్యములను స్మరింపఁదగిన సమయమిదియే. మమోజ్ఞకళలు నేత్రశ్రోత్రగ్రాహ్యములైతద్వారమున మనోజ్ఞత నలవరచుటయేకాక విలక్షణమగు పర్యుత్సుకతను గూడఁ గలిగించుటయుం గలదని కాళిదాసాదుల యభిప్రాయమని తోచుచున్నది. పశ్చిమఖ౦డ పండితుల యభిప్రాయ మివిషయమునఁ దెలిసికొనదగి యుండును. లోకములోని సమస్తవైచిత్య్రములను బ్రదర్శించునది ప్రకృతి (Nature). మనుష్యున కిఁద్రియ గోచరములగుచుండు వైచిత్యములను మాత్రము ప్రదర్శించునది కశ (Art). కాఁబట్టి కళాప్రదర్శనమునకు బ్రాగ్భావన (Premeditation) పరమావశ్యకము. ప్రకృతికీ నియమము లేదుగదా? కళాప్రదర్శకమునఁ బ్రదర్శనకును దదితరుల కును నానందానుభవము గలుగుచున్నను నిర్మమత్వము (Dis-interestedness) మాత్రము మనోజ్ఞకళలకుఁ బ్రథానగుణము. ఎట్లనినః- కవితాగానములయందుఁ గాని నాటకాదులయందుఁ గాని ప్రదర్శింపఁబడునను రాగము (Love)కృత్రిమమేకాక యనురాగాభినయము మాత్రమే యగును, అది యందఱితి సొమ్మే కాని యొక్కరిది కానేరదు. యధార్థాను రాగము (True love) ప్రకృతి ధర్మము. ఇట్లే తక్కిన విషయములును.

ఇంతటితో నీచర్చను జాలించి మనోజ్ఞకళలకుఁ గల పరస్పర సంబంధమును విచారింతము.

దృశ్యకళలను శిల్పచిత్ర లేఖనములకు రూపరేఖావిలాసములు (Line; light and shade and colour) ప్రధానములు. మనలో రూపము (Light aud shade ) మొదటిది. రేఖ (Line) రెండవది. పశ్చిమఖండు పండితులలోఁ బ్రాచీనుల మతమున రేఖ (Line) మొదటిది. రూపము (Light and shade) రెండవది. వారిలోని యాధునికులు గొందరు నుసతో నేకీభవించుచున్నారు. వఱికొండరు రేఖ (Line) ను బూర్తిగాఁ బరిత్యజించి రూపవిలాసములను మాత్రమే గ్రహించుచున్నారు.

మఱియును శిల్పకళాప్రదర్శనమునకు వ్యక్తిపరిమాణమునుబట్టి పొడుగురు, వెడల్పును, లోతు, దళసరులును (Length, breadth thickness or depth) ఇమిడియండఁదగిన స్థలము (Space) కావలసియుండును. చిత్రలేఖన కళాప్రదర్శనముని కన్ననో పొడుగు వెడల్పు మాత్రమే యిమిడియుండఁదగిన సరళ ప్రదేశము (Plane Surface) కావలయును, ఈరెండు కళలయందును సేదో యొక్క కాలమును నేదోయొక్క ప్రదేశమునుమాత్రమే సుస్థిరముగఁ బ్రదర్శింపబడును. శిల్పకళయందు దూర స్థితములగు సజాతీయ విజాతీయ పదార్థముల ప్రదర్శనము సాధ్యముగాదు. చిత్రలేఖన కళయందు మాత్రము దవ్వు దూరములతో నిమిత్తము లేక దృష్టిపథమునఁ బడఁదగిన సకల వైచిత్య్రములును బ్రదర్శింప సాధ్యపడును. మరియును రూప రేఖావిలాసము లన్నింటితోఁ గాని కొన్నింటితోఁ గాని చిత్రలేఖనమున వస్త్రుపదర్శనము మమోజ్ఞముగాఁ గావింపవచ్చును. శిల్పకళయం దది వీలు పడదు.

ఇంక దేశికములగు కళలనుండి కాలికములగు కళలకు దిగి చూతము. అతిగంబీరమగు నంతరాళమునుండి యగాధమగు కాలసముద్రములోనికిఁ జెఁగున దాటుట దుష్కర కార్యమని తోఁచకమానదు. కాని దేశకాలములు రెండును నీరక్షిరన్యాయమునఁ గలసి మెలసి యుండుటవలన నొకదానినుండి యింకొకదానిని జేరఁబోవుట మిక్కిలి సులభకార్యమని తలంపఁదగును.

దృశ్యకళలచేఁ బ్రదర్శింపననువుపడని వైచిత్య్రములను శ్రవ్యకళలను గాన కవిత్వములు ప్రదర్శింపఁగలవు. వానికి దేశకాల నిర్బంధములు లేవు. కాని కవిత్వ సంబంధములేని సేవల నాదాత్మకమగు గానమునకు మాత్రమంతటి ప్రజ్ఞలేదు. కావున శిల్ప చిత్రలేఖన గాన కళలు ​ప్రదర్శిచు సకల వైచిత్య్రములను గవితాకళయొక్కటే ప్రదర్శింపగల సామర్థ్యము గలది. కాఁబట్టి మమోజ్ఞ కళ లన్నిటిలోను సర్వోత్కృష్టమగునది కవితాకశయని యంగీకరింపవలసి యుఁడును.


ఇప్పటికిఁ బ్రస్తుతాంశముని కందుబాటు దూరమునకు వచ్చితిమి.

ఏకైక భాషాకత్వప్రశంస ప్రసక్తించునప్పుడు తోడోన దానిని జర్చిఁపఁబూనుటకన్నాఁ బ్రప్రథమమునఁ గవిత్వసామాన్యమును జర్చించి చూచుకొని పిమ్మట విశేషమను జర్చించుకొనుట సమంజసపద్ధతి. కాఁబట్టి కవితయన నేమో తొలుత విమర్శింతము.

చేతినాచేతన ప్రకృతి వైచిత్య్రముల నన్నింటినిగాని కొన్నింటికిగాని విన నింపయిన నియమక్రమపద్ధతిని బ్రయోగింపఁబడు శబ్దజాలముచే ననుకరించుట వలనఁగాని యూక్రోశించుటవలనఁ గాని భావోద్రేకమును వ్యక్తీకరించుటయు విజృంభింపఁ జేయటయుఁ గాలిక కళయగు కవిత యనఁబడును. (Poetry is a time art of which the business is to express and arouse emotion by imitating or evoking of all or any of the phenomena of life and the nature by means of words arranged with musical regularity) పశ్చిమఖండ పండితులు నిర్వచించుచున్నారు. వీరి మతమున బద్యరూపముగా నుండునదియే కవితగాని గద్యరూపముగా నుండునది కవితగాదు. ఫ్రెంచి పండితులు కొందఱుమాత్రము గద్యము, పద్యము, గద్యము గూడఁ గవిత్వమని యంగీకరింతురు. మనలో గిద్యము, పద్యము, పదమును గూడ కవితయే,

కవితాప్రభావము నిరుపమానము. కవితాశక్తి నిరంకుశము. వాగ్రూపమున వ్యక్తపఱుపఁదగిన సకలపదార్థములను, సకల ధర్మములను, సకల వైచిత్య్రములను వేయేల సచరాచరంబగు లోకమునందలి సకల విషయములను మనఃఫలకమున నైపుణ్యముతోఁ జిత్రించి ప్రత్యక్షముసేయు సామర్థ్యము గలది కవిత. పరంపారారూపమైన కార్యకారణ ప్రణాళిక, జడ చేతనముల వివిధ వైచిత్య్రములు, నానావిధదశాంతర్దశలు, కాలసూత్రమునకు లోఁబడు వివిధపరిణామములు, వివిధావస్థలు, వివిధ భావములు కవితాకళకు లొంగినట్లు తక్కిన యేకళకును లొంగవు. భాషయందలి లోపముచేత భావవ్యక్తీకరణమున కనుకూలమగు శబ్దజాలము లభింపకపోయినను, ఉన్నవానితోనే సమగ్రముగా భావమును వ్యక్తీకరించు శక్తియుఁ గవితకుఁ గలదని చెప్పనగును.

ఇంతవరకుఁ దెలుపఁబడిన సంప్రదాయసిద్ధములగు విషయములన్నియు నాంధ్రభాషా కవిత్వమునకును నవ్వయి౦చును.

కావ్యప్రబంధరూపముగు సారస్వతమునందుఁ గవింతాను గొంతమాటాడి పాత్ర వర్గముచేఁ గొంత మాటాడించునది యొకతెగ. పాత్ర వర్గమును నోరెత్తనీయక కవియే మాటాడునది యింకొక తెగ. కవి, తాను పెదవిగదపక పాత్ర వర్గము చేతనే మాటాడించునది మఱియొక తెగ. దీనినే రూపకమందురు. ఆంధ్రమున మొదటి రెండు తెగలకావ్యములే చిరకాలమునుండి లభించుచున్నవి. మూఁడవతెగ యిప్పుడిప్పుడు పొడసూపుచున్నది. భావిదశ యెట్లుండునో చెప్పఁజాలము. ఏమనినఁ బ్రకృతమునఁ బ్రచలితములగు నాంధ్రనాటకాదిరూపకములను జూడఁగా నిరుత్సాహము గలుగుచున్నది. తెలిఁగింపఁబడిన సంస్కృత రూపకములు నటుఁడనిచ్చి క్రొత్తగా రచింపఁబడుచున్న తెలుగురూపకములను గొన్నింటిని బరిశిలించితమేని వానిని రూపకములని పేర్కొనుటకే యనువుపడదు. గిద్యపద్యాత్మకమగు కణోపకధనమాత్రమెల్ల రూపక మనవలసివచ్చుచున్నది. వివక్షితార్థ ప్రతి పాదనము గాని యితివృత్తవిస్తరముగాని చదుత్కారిత్వముగాని వానియందు స్ఫుటముగాఁ బొడకట్టదు. ఈరీతి దృశ్యప్రబంధముల వలన నాంధ్రరూపక సారస్వతిము వన్నెకెక్కఁజాలదు.


ఇప్పుడు వివరించినా భేదములు గల యాంధ్ర సాంస్వతమునందలి కవిత్యకళకు శిల్పచిత్రలేఖనగాన కళలతోఁ గల సంబంధమును మనమేతీరున సమన్వయము చేసికొనఁగలమో యోజింతము. ఈపని తలపెట్టునప్పుడు ముందుగాఁ గవికిని గవిత్వమునకును లోకమునకును గలసంబంధమును దెలిసికొనవలసియుఁడును గావున సంగ్రహముగా విన్నవించుచున్నాను.

చందూరుఁ డభ్రమల్ దిపము
సైకతముల్ వదులు న్నగంబులు౯
గందరముల్ గొలంకులు స
నంబులు మున్నగు రమ్యవస్తువుల్
జెందుఁ గృతార్ధత౯ గవుల
చేతనె; వారును లోకవిశ్రుతిం
గందురు వానిచే; నిదియె
కాదె యొసఁగుట పుచ్చుకొఁడియు౯
కవితయొనర్చి సంతతము
గానము సేయుచు దానితోడదే
భువనమటంచుఁ దెల్పుమగ
మొల్కయొకం డరుదయ్యె నేని వై

​

భవము దొలంగిలోకమొక
భంగి నిరర్ధకమా నసందగు౯
గవియును గాఁడతఁడితర
గాథలు వేలకొలంది 'సెప్పిన౯౹౹

కావుననే,

మలయ సమీరణంబొలయ
మంజులకుఁజవనా౦తసీమలన్
మలయుచు గంధబంధుర సు
మప్రకరంబులఁ గాంచి సొక్కుచు౯
జలసరో విహారములు
సల్పుచు వెన్నెలలందు నిబంచు౯
గలకలలాడు లోకమును
గాంచి కవీంద్రులు మిన్నకుందురే౹౹

అని యీతీరును గవనమును వెల్లివిరియించు సుకవులపలుకు లెట్టివన్న:

చలువగల వెన్నెలల చెలంవునకు సౌరభము
గిలిగినను — సౌరభముఁ జలువయుఁ దలిర్పం౹౹
బొలు పెసఁగు కప్పురపుఁ బలుకులకుఁ గోమలత
నెలకొనిన — సౌరభముఁ జలువపసయుం గో॥
మలతయును గలిగి జగముల మిగుల బె౦పె
సఁగు మలయపవనంపుఁ గొదమలకు మధురత్వఁ౹౹
బలవడిన — నీడు మఱి కలదనగవచ్చుఁగడు వెల
యఁగల (యా) సుకవి పలుకులకు నెంచ౯౹౹

అని పింగళి సూరకవి చెప్పియున్నాడు. ఇటత్యంతస్తవనీయమగు నాఁధ్రకవిత్వము సహజమార్దవమాధుర్యములు గలిగి యమృత ధారాసంపాతబునం బోలె మనలఁ దనియించను. అవ్యక్తమధురమగు గానామృతమునకు సువ్యక్తమధుగమగు నా౦ధ్రకవితా మృతము తోడ్పడి యాంధ్రలోకమును నిరంతరానందామృతిమహాసముద్రతరంగములలో నౌలలాడించుచున్నది. అవ్యక్తమధురమై కేవల నాదైకరూపమగు గానమునే రామరాజభూషణుడు,

“వీనులవిందై యమృతపు|సోనలపొందై యమం
దసుమచలదళినీ। గానము క్రందె యాస్వన ౹ మానం
ద బ్రహ్మమైన"

దని వచించెను.

రసోచితమగు సాహిత్య సంపదగల కవితను గలస్వనముతో సమ్మేళన మొనరించునప్పుడు మనకు గానకళాప్రభావము సువ్యక్తమగును. ఆయానందము నిరుపమానము. సంగీత సాహిత్యముల సమగౌరవము “ సకలామోదకతాళవృత్తగతుల” ను మమోహరముగా మనకవులు విశదపఱచియున్నారు.

శిల్పకళా నైపుణ్యమును బ్రత్యక్షముగాఁ జూపించు శిల్పకారులకున్న సుకవులు తమ కవితానైపుణిచే మనకు దానిని దేశాఁతర కాలాంతరములయందు మనోగోచరము గావించుచున్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశవిగ్రహము మనకెక్కడఁ గావలసిన నక్కడ, ఎప్పుడు గావలసిన నప్పుడు మమోగోచరమగునట్లు పింగళి సూరకవి.

"మృదుపదాంబుజములు, మెఱుఁగుటం దెలు
పైడి దుప్పటియును, మొలముప్పిడియును। మణి
మేఖలయు, బొడ్డుమానికంబున, వైజయంతియు,
నురమునవలరు సిరియు వరద హస్తము, కటి వర్తి రి
లుకేలు, శంఖము చక్రమును దాల్చు కరయుగంబు ౹
తారహారంబులు, చారుకంఠంబు, నిద్దపుఁ జెక్కులును
నవ్వుదళుకు పసలు | మకరకుండలములును,
దామరలఁ దెగడు|కన్నులు, మమోజ్జనాసయుఁ,
లికిబొమలు | ము తియపునామమును రత్నముకు
టవరము | సెసఁగఁగనుపట్టు శ్రీ వేంకటేశ్వు"
జూపుచున్నాఁడు. మఱియు నాతండు,


"కుటిలకదా! యెలుంగుదువె
గొబ్బున నేఁజని కొల్వుకూట మొ
క్కటి కడనున్కి యారయక
కట్టెదుట౯ బటికంపుగోడఁ బ్ర
స్ఫుటముగ దానియందు హరిఁ
జూచుచు మ్రొక్కగ వెన్కనుండి య
ట్టెటు మొగమంచునవ్వె సభ
యెల్లను దన్మణిభిత్తి యున్నదే?"

అని యడిగి శిల్పకళాచాతుర్యమును బ్రత్యక్షము సేయుచున్నాఁడు.

కవి స్వయముగాఁ దనకళానైపుణ్యమును మాటలతోఁ జెప్పి విగ్రహమును నిర్మింపుమని శిల్పకారునిఁ, జిత్తరువును వ్రాయుమని చిత్రకారునిఁ బ్రోత్సాహము చేయుచున్నాడో యన,

"మెఱుఁగారు ముఁజియు ♦ మేనికోమలికంబు,
గడుదిటగుణముగు ♦ ల్కెడు మొగఁబు|పసుపుగో
చులయొప్పు ♦ బ్రహ్మ తేజంబును, జారుకృష్ణాజిన
ధారణంబు| తళుకు జన్నిదము మే ♦ ధావి బొట్టును
జిన్నిపట్టవర్ధనమును జొట్టితడుపు | మొలవంక యుం
గరం ♦ బుల సొంపు, దండపుగోలయు, సన్నపు ♦ వే
లుసిగయు। నొప్పుబ్రహ్మచారి ♦ యొకఁ డేగుదెంచెఁ
బుస్తకము గొంచుమిగుల ♦ సంభ్రమము"


అని యొక బ్రహ్మచారిని మాటలతో మనకుఁ జూపించుచున్నాఁడు. ​నేర్పరియగు చిత్రకారుడు చిత్రించిన చిత్తరువును జూచీ చూడఁగానే విద్యాగంధ మెఱుంగని పామరజనులైనను బాలికా బాలకులైనను దాని మామోజ్ఞతఁ జప్పున గ్రహించి యొ క నొక విధమగు నానందము ననుభవింతురు. కవియిగు నాతిఁడో తనయానందమును బట్ట జాలక మనోభావమును గవిత్వరూపమున వెల్లడి చేయును. ఒక జవ్యనిచిత్తరువురు జూచి యొకకవి మనస్సు నిలవ బెట్టుకోనఁజాలక,

“పలుకక పల్క చుగతిఁ ♦ బాడక పాడినరీతిఁ
దేనియల్ | చిలంకఁగ నవ్వకే సగిన లీలఁగనుంగొను
చున్న నాదుక ౹ న్నుల కతిసుందరంబగు మ ♦ నూజ్ఞ
పదునున్న నీ చెలువము గాంచి నేను
పుఁజీత్తరువందునున్న నీ ౹ చెలువుముగాంచి నేను
నొక ♦ చిత్తరువైతిని గాదె కోమలీ"

అని కొనియాడి యంతటితోఁ జాలించక,

"వలుద నిగారపుంబటువు
వట్రువ యబ్రపునిబ్బరంపు గు
బ్బలు తెలినీటిపోల్కిఁ గను
పట్టెడుసన్నని జిల్గుపయ్యెద
స్వెలువడి త్రుళ్ళి పైకుబికె
విలఁటె గోలలకేల చేలముం
గలికిరొ కేలఁగప్పవు—”

అని సిర్గవిడిచి యడిగి చప్పునఁ దెలిపిదెచ్చుకొని “——ఆటు గాదఁటె చిత్తరువందుఁ గోమలీ?” అని సంపుచ్చుకొనెను. ఆహా! చిత్రఖనకళాప్రభావము! విద్వాంసులనయినను విమోహితులను జేయజాలునుగదా!

ల్పకళకన్నఁ జిత్రలేఖనకళ యెక్కువ సౌకర్యముగలదైనను దేశకాలానురోధముచేతను జలాచలవిశేపానురోధముచేతను జిత్రకారుని హస్తలాఘవ మొక్కొక్కప్పుడు కట్టుపడి పోవుచుండును. దృష్టిగోచరములగు కొన్ని కొన్ని వైచిత్య్రములను లిఖించి చూపఁజాల కుండఁ జిత్రకారునికీ నిర్బంధము గలుగవచ్చునుగాని చిత్రపటమునఁ జూడ ననువుపడని చిత్తరువును మాటలనేర్పున మనకుఁ జూపింపగల కవికిమాత్ర మట్టి నిర్బంధము లేదు. “రవి గాసనిచోఁ గవి గాననేర్చు” నన్నమాట సత్యమేయన వచ్చును.

శ్రీనాధకవి చెప్పినట్లు, “తిటుకున నస్తమించు” రవిని చిత్తరువునఁ జూడ జాలము.

అల్లసాని పెద్దనకవి యనుగ్రహించిన,

“సహసానఖం పచస్తన దత్తపరిరం" భాది సౌఖ్యము లను మీకుఁ జిత్రికారుఁడొసంగలేఁడు.

సర్యజ్ఞ సోమనాథకవి,

"అరచందురు డెందములోఁ
జొరబారి వణుకు తోఁక ♦ చుక్కయ పోలేన్
నరకుం డేసినబాణము
హరినిటలతట౦బునాటి ♦ యల్లనా౯"

అని చూపిన యుపమానోపమేయములను జిత్రకారుఁడు చూపఁజాలఁడు.

మఱియు నాతని యుషాస్వప్నములోని “లోఁగిటికిరానిరూపముఁ గౌఁగ్రిటికి౯ రానిపొందు" జిత్తరువున లభింపనేరవు.

పింగళ సూరకవివలె నేచిత్రకారుఁడును జవ్వనులచేఁ బంతాలాడించుచు నుయ్యాల లూగించుచు నుండఁజాలడు.

బమ్మెర పోతనామాత్యుడు, కడుపొట్టివడుగును గగనమునకెక్కించి సత్యలోకమును దాటింపనెంచఁగా,

“ఇంతింతై పటుఁ డింతయై మఱియుఁ దా
నింతై నభోవీధిపై
నంతై తోయదమండలాభ్రమున క
ల్లంతై ప్రభారాసిపై
సంతై చంద్రుని కంతయై ధృవునిపై
సంతై మహగ్వాటిపై
సంతై సత్యపదోన్నతుండగుచు బ్ర
హ్మాండాఁత సంవర్ధియై]”

పరమేశ్వరు డాతనిమనోరథము నీడేర్చి లోకమున కీపద్యము జదువునపుడెల్లఁ దా నారూపమునఁ బ్రత్యక్షమగుచుండును.

ఇట్లు విమర్శించిచూడఁ గవితాకళ, శిల్పగాన చిత్రలేఖనకళలకన్న మిన్నయని నిరాతంకముగా సిద్ధాంతము సేయఁదగి యుండును. భాషామాధుర్యమునుబట్టి మమోజ్ఞకళావైదగ్ధ్యమును గవితానైపుణిచే లోకమునకుఁ బ్రసాదింపగల సామర్థ్యము మన యాంధ్రభాష కత్యధికముగాఁ గలిగియుండుట మనయదృష్టఫలమని చెప్పనగును. స్వదేశభాషాభిమానముగల సుస్థానాధీశుల సమాదరణము చేతను సత్కపుల సామర్థ్యప్రదర్శనముచేతను మహాజనుల యానుకూల్యముచేతను మనయంధ్రకవిత యాఁ డ శాశ్వతమగు లోకఖ్యాతిని గణించునట్లు పరమేశ్వరుడనుగ్రహించును గాక!


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse