Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 4/ఆంగ్లేయులు-గ్రంథాలయోద్యమము

​

ఆంగ్లేయులు - గ్రంథాలయోద్యమము

మన దేశమునం దింతవరకు బరోడా రాజ్యమునందు తప్ప, గ్రంథాలయోద్యమము ప్రజలచే సృష్టింపబడి, పోషింపబడి, ప్రోద్బల పరుపబడుచున్నది. ప్రతి “సంస్థ” యు ప్రభుత్వమునుండియే వచ్చిన, ప్రజలస్వతంత్ర వ్యక్తిత్వము సృష్టి నైపుణ్యత విజృంభించుటకు వీలుండదు. పైనుండివచ్చిన “సంస్థ" లెచ్చటను ఏకాలము నందును ప్రజల సహకారము ప్రజల బాధ్యతాయుత వ్యక్తిత్వమును కల్గియుండనిచో, జనుల కెక్కువ లాభకారులు కాకుఁడుటయేకాక, అనేక కష్టములకు దుర్మార్గములకు కారణభూతులై యున్నవి. ఎక్కువ దూరము పోకినే మనకీ సిద్ధాంతియు నిరూపించుటకు జర్మనీ దేశము సాక్ష్యమిచ్చుచున్నది. అచ్చట ప్రతి సంస్థయ ప్రభుత్వముచే స్థాపితమగుట, ప్రతికార్యము ప్రభుత్వము చేయుట, అందువలన ప్రజలు తమ వ్యక్తిత్వమును మరచి ఎల్లవిషయములకు ఉద్యోగుల సాయమపేక్షంచుట జరుగుటవలన అనేక కష్టములు నండుటయు, ప్రజల స్వతంత్రస్వభావము మరుగుపడుటయు, తద్వారా యుద్దాదిపర్యపసానములు కల్గుట సంభవించేను.

కాని ప్రభుత్వము దుర్మార్గమైనది. ప్రభుత్వము చేనే “సంస్థ” ను పరీక్షింపచేయరాదు. అంతయు ప్రజలనుండియే రావలయుననుటయు మంచిది కాదు. ప్రభుత్వముచే ప్రజాధీనమైనంతవరకు ప్రజల సంయుక్తి వ్యక్తిత్వమును తెల్పునంతవరకు అయ్యది ఎల్లవిషయములందు అవసరమై లాభకరమై యున్నది. ప్రభుత్వము ఒక “ సంస్థ” గదా! అన్ని సంస్థలకంటే అయ్యది "పెద్దది”. అందువలన తదితర “సంస్థలు” చేయలేని కార్యముల కొన్నిటినయ్యది చేయగలదు. ఇతర సంస్థలకు సాయ మనేక విధులు చేయగలదు. కాని ప్రజాపరిపాలన ప్రజల శక్తి సామర్థ్యముల ప్రయోజకత్వము, చిన్ని చిన్ని “సంస్థల" యందు కన్పడునట్లు ప్రభుత్వమునందు కన్పడ జాలవు కనుక అంతవరకు అనగా ప్రజల వ్యక్తిత్త్వమును ప్రకటించునంతవరకు, ప్రజలకు స్వరాజ్యశక్తి నొసంగుటలో యుపాధ్యాయిగా నుండువరకు ప్రత్యేక "సంస్ట" యెక్కువ యుపయోగకారి.

కాన ప్రభుత్వయాజమాన్యము క్రింద ప్రభుత్వ సాయముతో స్వతంత్రముగల ప్రత్యేక “సంస్థలు” ప్రజల సహకారమువలన యేర్పడుట, తద్వారా అన్ని పనులు నెరవేరుట ఎల్లప్పుడు ప్రజల భావిభాగ్యమునకు అవసరము.

ఇట్టి రెండు విధములైన "సంస్థలను" పరస్పర మైత్రితో మెలంగునట్లుచేసి స్వపరిపాలనాసూత్రము నెల్లసంస్థలయం దుపయోగించి, ప్రజల గొప్పతనమును ​జూపెట్టగలిగిన దేశములలో ఇంగ్లండు అగ్రగణ్యస్థానమాక్రమించుచున్నది. మన ప్రధాన విషయమునకు పోవుటకు పూర్వము ఈ “సూత్ర" రహస్యమును గమనించు టత్యవసరము. కనుక ఇంతిదనుక విస్తరముగ వ్రాయవలసి వచ్చెను.

ఇంగ్లండునందు నూటికి దెబ్బదిమందికంటే హెచ్చుగా ప్రజలు పట్టణనములందు నివసించుచున్నారు. ప్రతి పట్టణము అచ్చటి "మునిసిపాలిటి" వలన పరిపాలింపబడుచున్నది. పట్టణవాసులందరును ఓటరులై స్త్రీ, పురుషులు సభ్యులగుటకు యోగ్యవైయున్నారు. ఇట్టి ప్రజాప్రభుత్వము క్రింద ప్రతిపట్టణము తన “మునిసిపాలిటీని” కల్గియున్నది.

ప్రతి "మునిసిపాలిటి" తన పట్టణమునందు విస్తీర్ణము సనుసరించి ప్రతివార్డునందు ఒక్క గ్రంథాలయమును స్థాపించియున్నది. గొప్ప పట్టణమగుచో వార్డునకు రెండు మూడు గ్రంథాలయములుండును. ప్రథానగ్రంథాలయము మరొక్కటియుండును. సాధారణముగా వార్డు గ్రంథాలయము లన్నియు ప్రధాన గ్రంథాలయశాఖలై యుండి చదువరులయిష్టము ననుసరించి ప్రతివారము కొన్ని గ్రంధముల ప్రధాన గ్రంథాలయము నుండి తెప్పించు చుండును. ప్రథాన గ్రంథాలయమునకు అనుబంధముగ "మ్యూజియము” లేక “సర్వవస్తు పదర్శన శాల” యేర్పరుపబడి యుండును. ఇందువలన ప్రజలు గ్రంథముల నుండియే కాక “మ్యూజియము” నుండియు ఆనేక విషయముల తీర్చుకొనుటకు సాధ్యముమగు చున్నది. ఈ రెండు భాగములకు తోడుగా ప్రత్యేకముగ "వార్తాపత్రికాశాఖ" యుండను. ఈశాఖయఁదు అన్నిపత్రికలు అందరికి అందచేయబడును.

వార్తాపత్రికల చదువుటకు "సర్వవస్తు ప్రదర్శన శాల" ను చూచుటకు, ఏ "రుసుము" ఏ "నియమము" లేక ఎల్లరు పోవచ్చును. కాని గ్రంధముల నప్పు తెచ్చుటకు ముందు ప్రతిపట్టణ వాసియు దరఖాస్తు చేసి గ్రంథాలయాధి కారి యనుమతి ముందుగా పొందవలయును. అంతట గ్రంథుముల నుచితముగా “నప్పు” తెచ్చుకొనుటకు సాధ్యమగును. ప్రతి చదువరి తనకు తోచిన క్రొత్త "గ్రంధము” ను తెప్పించ వలయునని సలహాయివ్వవచ్చును.

ఇట్టి “గ్రంథాలయములు" పరిపాలించు వారెవరు? "మునిసిపాలిటి" ప్రభుత్వము, "మునిసిపాలిటి" గ్రంథాలయ కమిటీ నొక్క దాని నేర్పరచి దానియందు "మునిసిపాలిటి" సభ్యులు మెంబరులుగా నియమింపబడుదురు. ఈకమిటి " గ్రంథాలయముల" పరిపాలించుట, “సలహా చేయబడిన గ్రంథముల” తెప్పించవలయునా లేదా యని చర్చించుట —— యను పనులు నెరవేర్చి ప్రజాభిప్రాయము "మునిసిపాలిటి" ప్రభుత్వమునందు తెలిసి కార్యరూపమునఁ బెట్టుమందురు. ఇచ్చిట పట్టణ వారులందరు చదువరులనియు వారిందరు మునిసిపల్ సభ్యుల నెన్నుకొనుటలో గ్రంథాలయ విషయముల నాలోచ్చితురనియు అందువలన “"మునిసిపాలిటి" ప్రభుత్వము "గ్రంథాలయముగూర్చి ప్రజాభిప్రాయసుకు నెరవేర్చుననిము తలంపబడుచున్నది.

సర్కార్ లీపద్ధతితో సంతృప్తిపడుట లేదు. ఈ విధమైన “మధ్యస్థపు ప్రభుత్వము” సరియగునది కాదనియు ఎల్లప్పుడు చదువుచున్న చదువరుల చేతనే సరాసరి "గ్రంథాలయ పరిపాలనాధికారులు" నేర్చుకొనుట స్వరాజ్యసూత్రానుసారముగ నుండుననియు పల్కుచున్నారు. కాని ప్రజలందరు గ్రంథాలయమునకు ధనమిచ్చునప్పుడు చదువరులు మాత్రమే ఓటరులైన ధనము గూర్చి విచారించువారు లేరనియు అందరిని ఓటరుల చేసిన అశ్రద్ధ ఎన్నికలందు చూపి నిరుపయోగల నెన్నుకొని గ్రంథాలయముల పాడుచేసెదరనియు అనుభజ్ఞులు తెల్పుచున్నారు.

ఇట్లు ప్రతి పట్టణము నందు "స్థానిక ప్రభుత్వ గ్రంథాలయములు, సర్వవస్తుప్రదర్శన శాల" లుండుటయే కాక "సంచార గ్రంథాలయములు” ప్రత్యేకముగ నున్నవి. పెద్ద “పత్రికాలయములకు” ప్రతి గ్రంథకర్త తనగ్రంధముల విమర్శనకు నుచితముగా పంపును. కాన “పత్రికాలయములకు” నందు "గొప్ప గ్రంథాలయము" లేర్పడుచుండును. కొంత రుసుము చెల్లించుచో ఎల్ల ప్రదేశములవారు సభ్యులై ఈ గ్రంధములందు జదువ సాధ్యమగును.

మతిప్రచారకులు తమ మతమున కుపయోగించు గ్రంధములతో "సంచార గ్రంథాలయముల" స్థాపించి ప్రజలకు సాయము చేయుదురు. ప్రజలయందు విద్యాభిలాష హెచ్చుచుండుటచే కొందరు “వ్యాపారులు" గొప్ప గ్రంథాలయముల స్థాపించి రుసుముపై సభ్యుల జేర్చు కొని వారందరికి గ్రంథముల నప్పిచ్చుచున్నారు. ఈ వ్యాపారము క్రమముగా హెచ్చుచున్నది.

ఇంగ్లీషువారు వారి “క్లబ్బు" లను అనగా "సాంఘిక సంపర్కముపై యేర్పడు సంఘములను హెచ్చుగా ప్రేమింతును. సాధారణముగా ప్రతివాడు. ఏదో యొక "క్లబ్బు” నందు సభ్యుడై యుండుడు. ప్రతి "క్లబ్బు” నందు ఒక్క గ్రంథాలయము తప్పక యుండును, ఇందు మూలనున చదువరులకు పొత్తములు లభించుట చులకన. ​ఈక్లబ్బు లన్ని టీయందు 'విమర్శనా సంఘం' ముండును. అందువలన ఇయ్యది గ్రంథాలయమునకు చాల తోడ్పాటొ సఁగుచు ఎక్కువమందిని చదువునట్లు చేయుటకు తోడ్పడుచున్నది. అప్పుడప్పుడు ఈ "క్లబ్బు" లఁదు పోటీలు కల్గి ఎక్కువ గ్రంథములుగల గ్రంథాలయమునకు బహుమతులో సంగబడుటచే ఎక్కువ ప్రోత్సాహము కల్గుచున్నది.

అమితబీదలైన పనివారికి ఇంకను చులకనగ నుండు నట్లు చేయుట అవసరము, వారు "క్లబ్బులకు” చందా చెల్లింపలేదు. "సంచారగ్రంథాలయములకు " రుసుము చెల్లింపలేరు. కాని వారు సారాయి దుకాణములకు వెళ్ళుట, డబ్బు ఖ్చడుట, కాలము వృథాచేయుట సామాన్యము. కనుక ఆదుకాణములందు “పత్రికలును, పుస్తకములు” గల భాగ మేర్పరచుట మంచిదని కనిపెట్టబడినది. అప్పుడే కొన్ని దుకాణములందు "గ్రంధాలయములు" బయలుదేరినవి. కొన్నిటిని స్వయముగా చూచిసమీదట ఉపయోగ కారిగా నున్నవని తట్టినది.

"పనివారి విద్యాసంఘము ” వారు సంచార గ్రంథాలయము నేర్పరచి తమ విద్యార్థులకు పుస్తకముల నప్పిచ్చుచున్నారు.

ఇవియన్నియు నిట్లు సాధ్యమగుటకు కారణమేమి? పోస్టు చాల చౌకగనుండి ప్రతి గ్రామమునకు అనుదినము పోస్టుండి ప్రతివారు చదువుకొన్నవారై యుండుటవలన త్వరలో పత్తనమునుండి గ్రంధము నప్పుగా తెప్పించి చదివి తిరిగిపంపుటకు పలనుపడుచున్నది. సారాయిదుకాణములో గ్రంధాలయము ముండుటవలన లాభము హెచ్చగానున్నది. అన్నిటికంటే డంబముగా యఱవక వ్యాపారబుద్దితో లాభముగనున్న పరులనెల్ల చేయుస్వభావము తోడెనది. ఇంతవరకు వివిధతరగతి గ్రంథాలయ ములగూర్చి క్లుప్తముగ జూచితిమి. కాని పరిపాలన మెట్లున్నది? సంచార గ్రంథాలయములఁదు చదువరుల కేమి యధికారము లేదు. క్లబ్ గ్రంధాలయములందు సభ్యులందరు సర్వాధికారులై యున్నారు.

సంస్కారలు ఈగ్రంథాలయము లన్నిటి పైనను ప్రభుత్వయాజమాన్యముండుట గత్యమని వీనికి మునిసిపలు గ్రంథాలయములకు సఖ్యత పరస్పర సహాయముండు టవపరమనియు సంచారగ్రం థాలయములను లాభముకై యేర్పరచు వర్తకుల రూపుమాపి వానినే స్థానిక ప్రభుత్వము స్థాపించుట మేలనియు “పత్రికాలయ గ్రంథాలయములకు హెచ్చుసాయ మిచ్చుట" లాభ మరియు పల్కు చున్నారు.

మన దేశమునందున్నట్లు ప్రత్యేక గ్రంథాలయోద్యమమిచ్చటలేదు. అందువలన పరదేశస్థులు గ్రంథాలయము లిచ్చట తక్కువస్థానమునం దున్నవని తలంచున్నారు. కాని వారు భ్రమపడుచున్నారు. గ్రంథాలయము లేని యూరురు, పత్తనము లేనేలేదు. పైగా గ్రంథాలయ ప్రభుత్వమనే యుపయోగకరమగు విషయసులు బయల్పరచుచున్నది. స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధు లనేకప్రదేశములందు నా కెంతియో శ్రద్ధతో, గ్రంథాలయముల గూర్చిచూప, అనేక విషయముల గ్రహీంప వీలైనది.

నేను మనదేశమునందున్నప్పుడు గ్రంథాలయోద్యమమునం దెక్కవ శ్రద్ధిడి కొన్ని గ్రంథాలయముల స్థాపించు వారితో పని చేసియుంటి. ఇచ్చట చూచినమీదట తలంచునదియేమి? ప్రధాన ప్రభుత్వము సంచార గ్రంథాలయముల నేర్పరచుట - స్థానిక ప్రభుత్వ సంస్థణ “గ్రంథాలయముల వస్తు, పదర్శనశాలల" నేర్పరచుట - పత్రికాలయములు సంచార గ్రంధాలయముల నేర్పరచుట-లాభకరమని ఇప్పుడున్న గ్రంథాలయములపై ప్రభుత్వము సూపరివిజను పెట్టి ధనసాయ మిచ్చుట మఖ్యము. కాని పరిపాలన యందు సభ్యులకు సర్వస్వతంత్ర ముండుటావసరము.

-జి. రంగనాయకులు,

ఆక్సఫర్డు నగరము

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse