Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/శ్రీ రామారాయ గ్రంథాలయము - పమిడిపాడు

​

శ్రీరామారాయ గ్రంథాలయము - పమిడిపాడు

పమిడిపాడునందు జరిగిన గ్రంథాలయ సభలను శ్రీ రామారాయ గ్రంథాలయ సభ్యులే జయప్రదముగా నిర్వహించిరి. శ్రీ రాఘవరావుగారు దీని కధ్యక్షులు. వీరి అధ్యక్షతక్రింద ఈగ్రంథాలయ సభ్యులు చేసిన సేవ ఆద్వితీయము. ఊరేగింపుతో భజనలను జేసిరి. ప్రతినిధులకును ప్రేక్షకులకున్న దినమంతయు సేవజేసియుండియు అలసట జెందక రెండు రాత్రులయందు పాదుకాపట్టాభిషేక, పాండవోద్యోగ నాటకములను ప్రదర్శించియు ఒకనాటి రాత్రి కత్తిసామును ప్రదర్శించియు ప్రతినిధులకు కానందమును కలుగ జేసిరి. ఈగ్రంథాలయము ఆంధ్రదేశమునకంతకును ఆదర్శప్రాయమై వెలయుచున్నది .