Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/పశ్చిమగోదావరీమఁడల గ్రంథాలయ సభ

​

పశ్చిమగోదావరీమండల గ్రంథాలయసభ

భీమవరం గ్రామమున, ఈ సభ ఏప్రియల్ నెల ౧౯వ తేదీన జరిగినది. ఈసభయొక్క వృత్తాంతమును వేరొకచో గాననగును.

గ్రంథాలయ సభలను ఇతర సభలలో అనుబంధములుగా పెట్టుటవలని నష్టములు ఈ సారిగూడ స్పష్టముగ వ్యక్తీకరింపబడెను. ౧౮వ తేదీన పశ్చిమగోదావరీ మండల రాజకీయ సభ జరిగినది. ఆసభకు పేన వేలు ప్రతినిధులు ప్రేక్షకులు విచ్చేసిరి. ఆసభకు శ్రీ టంగుటూరి ప్రకాశంపంతులుగారు, కాశీనాధుని నాగేశ్వరరావుగారు, దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు, దేశభక్త కొండ వేంకటప్పయ్యగారు మున్నగు ప్రముఖులు విచ్చేన ఉపన్యాపముల నొసంగీయు, తమ దర్శనము చేతనే జనుల నుద్బోధించియు సభజయప్రదమునకు తోడ్పడిరి.

మరుచటిదినమున అనగా ౧౯ వ తేదీన గ్రంథాలయయసభ. ఈసభాసమయమునకు శ్రీ టంగుటూరి ప్రకాశంపంతులుగారు, నా గేశ్వరరావు పంతులుగారు, సుబ్బమ్మమ్మగారు, వేంకటప్పయ్యగారు ఇంకను చిల్లర నాయకులనేకులు వెడలిపోయియుండిరి. ఆనాడు ఉదయమున మండల కాంగ్రెసుసంఘసభ జరిగినది. మధ్యాహ్నమున 3 గంటల వరకు మండల కాంగ్రెసు సంఘ కార్యనిర్వాహక సభ జరిగినది . పిమ్మట గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ ప్రారంభ మైనది.

సభా ప్రారంభపముయమునకు సుమారు ౧౫౦ మంది ప్రతినిధులును ప్రేక్షకులును గలరు. ప్రారంభసమయమున మండల నాయకులగు శ్రీ దండు నారాయణరాజుగారు ఉండి పిమ్మట వెడలిపోయిరి. శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావుగారు ఉత్తరములు వ్రాసికొనుచుండిరి. శ్రీ యామినీపూర్ణతిలకమ్మగారు ప్రథమముని సభ నలంకరించి పిమ్మట నొక వైపున కొందరితో మాట్లాడుకొనుచుండిరి. శ్రీ యర్రమిల్లి మంగయ్యగారును, అయ్యదేవర కాళేశ్వరరావుగారును, ఆత్మకూరి గోవిందరావుగారును సభా వేదిక సమీపముందే చిన్న ప్రయివేటు కాన్ఫరెన్సును సమకూర్చిరి. ఈచిల్లర కాన్ఫరెన్సుల వలన సభాధ్యక్షుని ఉపన్యాసం వినబడక చాలగిల్లంతు జరిగినది.

సభయందు పరియైన సానుభూతి లేకపోయినయెడల తమ బసలకు పోయి విశ్రాంతి గైకొనుట యోగ్యము కాని ఇట్టి చిల్లర కాన్ఫరెన్సులను చేయుచు, సభ యొక్క కార్యక్రమమునకు భంగమును గూడ కలుగ జేయుట. సమంజపముగాలేదు.

దేశ నాయకులకు గ్రంథాలయోద్యమము నెడల ఇంకను తగినంత అభిమానము గలుగకుండుట మిక్కిలి శోచనీయము. గ్రంథాల యోద్యమమునందు పనిజేయు వారందరును యువకులు. ఒకరి అనుగ్రహముగాని, అభిమానముగాని లేనందువలన నిరుత్సాహులగు వారు కారు. కాని నాయకులు ఇట్టి యుద్యమములయెడల తగిన అభిమానము జూపుటవలన ఇంకను ఎక్కువ కార్యకారు లయ్యెదరని పినయముతో మనవిజేయుచున్నాము.

ఇంకొక సంగతి: ౧౮ తేదీన రాజకీయ సభ యొక్క వృత్తాంతమును వ్రాసికొనుటకు మద్రాసునందు ప్రకటింపబడుచున్న “స్వరాజ్య” “హిందూ” పత్రికల విలేఖకులు వచ్చియుండిరి. కాని గ్రంథాలయ సభ ౧౯వ జరుగునప్పటికీ, ఒక్క "హిందూ" పత్రిక విలేఖకుడు మాత్రముండెను.