గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/పశ్చిమగోదావరిమండల గ్రంథాలయ సభ
పశ్చిమ గోదావరిమండల గ్రంథాలయ సభ
౧౯౨౩ సం౹ ఏప్రియల్ నెల ౧౯-వ తేది మధ్యాహ్నమున భీరువరంగ్రామమున ప్రథమ పశ్చిమ గోదావరిమండల గ్రంథాలయ ప్రతినిధుల సభ సమావేశమైనది. కోపల్లె, సరిపల్లె, గునుపూడి, కుముదవల్లి, ఆకువీడు, నిడమర్రు, రాయకుదురు, పోలమూరు, వీరవాసరం, గోపవరం, కొవ్వూరు, పాలకొల్లు, నర్సాపురం మున్నగు గ్రామముల గ్రంథాలయములనుండి ప్రతినిధులు విచ్చేసిరి.
ప్రధమమున దైవప్రార్థన జరిగిన పిమ్మట ఆహ్వాన సంఘాధ్యక్షులగు నిడమర్తి లక్ష్మీనారాయణగారు ఈ క్రింద వివరించిన ప్రకారము స్వాగతోపన్యాసమును జదివిరి.
ఆహ్వాన సంఘాధ్యక్షుని యుపన్యాసము
ఈ గ్రంథాలయ మహాజనసభను యీపురంబునకు ఆహ్వానించి ఈసభ జయప్రదముగా జరుపుటకు ఆనేక వ్యయప్రయాసల కోర్చి కార్యనిర్వహణ మొచ్చినట్టియు, గ్రంథాలయోద్యభివృద్ధికి పాటుబడి కార్యదీక్షతో పని చేసినట్టియు నా సోదర సభ్యులలో అందు ముఖ్యమగ గ్రంథాలయోద్యమమునందు స్వార్థత్యాగము, కార్యదీక్ష, అంతర్ముఖత్వము కలిగి చిరకాలము అనగా, 26 సం౹ లనుండి ఎడతెగని కార్య దీక్షతో విచ్ఛిత్తులేకుండగా పనిచేసి యీతాలూకా ప్రజలకేగాక యిక్కాలములందు ఆంధ్రదేశమునకు యీ ఉద్యమము నందు ఆదర్శప్రాయులని కీర్తించతగిన శ్రీయుతులు భూపతిరాజు తీరుపతిరాజుగారు ఉండగా ఏవిధమైన కార్యము చేయక నిర్ధరకుడనైయున్న నేను యీస్థానమున గూర్చుండి యేమేమో చెప్పుటకు మనసొప్పక యిక్కార్యమునకు శ్రీ తిరుపతిరాజుగారే తగియుందురు గాని నేను అనర్హుడనని మనవిచేసినప్పటికి నాయందుగల అవ్యాజవాత్సల్యముచే నా సోదర సభ్యులు నన్నే నియమించినందున యిందుల కంగీకరించితిని.
గ్రంథాలయములు — (సరస్వతీ భవనములు)
భగవంతునిచే సృజింపబడు సమస్తజీవరాసులకు ఆహార, నిద్ర, మైధున భాషలు, సమాసమైనప్పటికి అందు మానవజాతి అగ్రగణ్యముగా పరిగణింపబడుటకు నాధారమైన యుక్త ఆయుక్త వివేచనాజ్ఞానము పొందుటకు కారణమైన జాతీయవిద్యకు నిలయములైన గ్రంథరాజముల యొక్క పఠనీయముచే మానవ ఐహిక ఆధ్యాత్మిక విజ్ఞానము నభివృద్ధినొందిచు సరస్వతీనిలయభవనములే గ్రంథాలయము లనంబరగు. దేశాభివృద్ధికి అవసరమగు సమస్త ఉద్యమములలో గ్రంథాలయోద్యమము పునాదియనియును, అట్టిపునాది దిట్టము లేనినాడు ఏయుద్యమము సభివృద్ధినొందుట కష్టమనియు మనవి చేయుచున్నాను.
జాతీయవిద్య
ఇప్పటి మన ప్రభుత్వాధీన నియమితివిద్య అన్యభాషా సాంప్రదాయ ప్రాధాన్యమై సామాన్యముగ మూడువంతులు మన శాస్త్రములయందు నీచముగా పేర్కొనబడిన సేవకావృత్తికిమాత్రమే ఉపయోగపడు చున్నది. కాని జాతీయవిద్యోద్బోధకమైన గుణసంప్రదాయము కలిగి మానవ ఆత్మాభివృద్ధికి అవసరమగు స్వాతంత్య్ర ప్రియత్వము, ఆత్మగౌరవము, నీతి, సత్యము, ధర్మము, స్వార్థత్యాగము, జాతీయత మొదలగు సద్గుణోద్బోధ చేసి దేశాభినృద్దికి తోడ్పడకపోవుటయేగాక, ఆత్మగౌరవమును. జాతీయతను నశింపచేయుటచే అట్టి జాతీయ విద్యాభివృద్ధికి గ్రంథాలయములే ముఖ్యాధారములని చెప్పనొప్పు.
కార్యనిర్వహణము
మన దురదృష్టముచే మన దేశమునుండి తొలిగిపోయిన ఐకమత్యము, దేశభక్తి, కార్యనిర్వహణశక్తి, ప్రపంచజ్ఞానానుభవములు, రాజకీయ జానము, తిరిగి అలవడి దేశము నబివృద్ధినొందించుటకు గ్రంథాలయములే ఎక్కువగా ఉపయోగపడగలవని 1911 సంవత్సరమునుండి 1920 సంవత్సరమువరకు దెశీయమహాజనసభ వారు శానించిన కార్యములు చేయుటలోను జాతీయవిద్యాబివృద్ధికిగాని, యితర దేశసంబంధమైన కార్యములకు ధనము సమకూర్చి సహాయము చేయుటయందుగాని, ప్రజలు దేశీయమహాజనసభాకార్యములయందు పాల్గొని జంకుగొంకు లేక పనిచేయుటకు భోధించుటయందుగాని గ్రంథాలయసంఘములు చేసినపనులు తార్కాణమై యున్నవి.
స్త్రీజాతృభివృద్ధి
మనలను కనిపెంచి జన్యాదినుండియు మనకు సద్దుణోద్బోనచేసి మనలను జ్ఞానదాయగులకుగా పెంపొందిుచియు వారుగూడ మనవిలె దేశసేవచేసియు దేశాభివృద్దికి తోడ్పడతగిన స్త్రీజాతి మూర్ఖనిద్రావస్థలోనున్నంశ కాలము మనముపొందు యభివృద్ధి మేడిపండువంటిదై అనిష్టమునకు కారణమగును గాన పూర్వయొకప్పుడు విద్యాతిలకములై, పాతివ్రత్యము, మమోనిగ్రహము, భక్తి, సచ్ఛీలము. శౌర్యము, గాంభీర్యము, ఆత్మసమర్పణశక్తి, శాంతి మొదలగు గుణసంప్రదాయ ప్రవర్తనచే ప్రపంచాదర్శప్రాయమైన అద్వితీయచరిత్రను గడించి మనదేశమునుగు, జాతికి, మహోత్కృష్టకీర్తిని గడించి కాలయోగముచే అజ్ఞానదశలోనున్న స్త్రీజాతి తిరిగి పూర్వదశకు రావలెనన్న, పూర్వము ప్రపంచాదర్శపాయలై విరాజిల్లే మృతజీవినులైన, సీత, సావిత్రి, దమయంతి, ద్రౌపది మొదలగు మహాపతివ్రతలచరిత్రల పఠనీయమే ముఖ్యాధారమని మనవిచేయుచున్నారు. అట్టి చరిత్ర జ్ఞానము స్త్రీలోకము పొందుటకు గ్రంథాలయములు తప్ప వేరొకసాధనము గానిప్పంపదు.
జనసామాన్య విజ్ఞానాభివృద్ధి
ప్రపంచమునందు సమస్తవిషయములలోను అభివృద్ధిజెంది నవనాగరికాగ్రగణ్యములని ప్రసిద్ధిజెందిన జర్మనీ. అమెరికా, మొదలగు పాశ్చాత్యదేశములు కూడ గ్రంథాలయోద్యమమువలనే సమస్తవిషయవిజ్ఞానము నొందినట్లును జనసామాన్యముయొక్క విజ్ఞానాభివృద్దికికూడ గ్రంథాలయములే ఎక్కువ ఉపయోగపడినట్లును కన్పట్టుతున్నది. ప్రస్తుత కాలమనందు మన దేశమొత్తములో, బరోడాదేశప్రజలు, ప్రపంచజ్ఞానానుభవముగలవారై విజ్ఞానదాయకులై యుండుటకు కారణము ప్రజాప్రభున్యాయముతో ప్రజల బిడ్డవోలె పరిగణించుచు ప్రజలు విజ్ఞానవంతులైనపుడే తమ రాజరికము జానదాయమై కీర్తినొందునని గ్రహించి వారు నెలకొల్పిన గ్రంథాలయోద్యమమే ముఖ్యధారమై యున్నది. అయితే యీ ఉద్యమము మహనీయులగు మహారాజాగారి పోషణ కలిగియుండుటచే ఎక్కవ అభివృద్ధినొంది యున్నదని చెప్పుటయందతిశయోక్తి లేదు. గ్రంథాలయోద్యమము నందు ప్రస్తుతము యీ దేశమునందు బరోడారాజ్యమే ఆదర్శప్రాయమైయున్నది.
గ్రంథాలయోద్యమము మనదేశమునకు క్రొత్తదిగాదు
ఇట్టి గ్రంథాలయోధ్యమము మనదేశమున క్రొత్తదిగాక అనేకశతాబ్దముల క్రిందటనే ప్రారంభింపబడి ఉత్కృష్టత గాంచునటుల 17 వ శతాబ్దమున తంజావూరు నందు ఆంధులచే స్థాపింపబడి 8 లక్షల గ్రంథుములతో విరాజిల్లుచున్న గ్రంథాలయము వలనను 19వ శతాబ్ద మున బ్రౌ౯ దొరగారి ప్రోత్సాహముచే దొరతనమువారిచే చెన్నపురియందు స్థాపింపపడిన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమువలనను విశదమగును. అయితే సదరు గ్రంథాలయములు ఆంధ్ర దేశమునకు వెలుపలనుండుటచే సమస్థ ఆంధ్రజయోపయోగము కాకుండుట విచారకరము.
ఈ కాలమునందుగూడ సవీన గ్రంథాలయోద్యమ స్థాపనకు ప్రాతిపదిక మన ఆంధ్రదేశమై యీభీమవరం తాలూకాయని చెప్పుకొనుటకు కుముదవల్లి గ్రామములో 1897 సం॥ స్థాపింపబడి విచ్ఛిన్నమునోంద కుండ నేటివరకు శ్రీ వీరేశలింగకవిసమాజమను పేరుతో శ్రీయుతులు భూపతిరాజు తిరుపతి రాజుగారు మొదలు కార్యనిర్వాహకుల కృషిచే గృహము శాశ్వతముగా జరుగుటకు వలయుధనముతో యభివృద్ధినొందియున్న గ్రంథాలయమును 1900 సం॥రమునందు శ్రీయుత నాళం కృష్ణారావుగారు మొదలగువారిచే రాజమహేంద్రవర పట్టణమున శ్రీ వీరేశలింగముగారి పేరున స్థాపింపబడి కారణా తరములచే నేడు గౌతమీ గ్రంథాలయముని వాడబడుచున్న గ్రంథాలయును నిదర్శనములై యున్నవి. ఈ సందర్భమున వారు చేసిన కార్యదీక్షాపరత్వముతో కూడిన దేశసేవకు శ్రీయుతులు భూపతిరాజు తిరుపతి రాజుగారు వందనీయులై ఆంధ్ర దేశమునకు ఆదర్శప్రాయులై యున్నరు.
నూతన అభివృద్ధి
1911-14 సం॥ నుండియు వివిధ ప్రదేశముల ధర్మగ్రంథాలయస్థాపన కాబడి అవి అభివృద్ధి నొందుటకును శాశ్వతుగా నిలుచుటకును తగుకృషి చేయుటకై ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము స్థాపింపపడి అనేక కష్టనష్టములకొనర్చి త్యాగదీక్షలతో దేశసేవానిరతులై శ్రీ ముత అయ్యంకి వెంకట రమణయ్యపంతులు“గారు పాటుబడుటచే 1920 సం॥ వరకు గొప్పయభివృద్ధి అయినపని జరిగింది. ఈ విషయమునందు పంతులుగా రాంధ్ర దేశకృతజ్ఞతకు పాత్రులును, వందనీయులును అయియున్నారు.
దర్మిలారు వెంకటరమణయ్య పంతులు గాలికి కలిగిన యిబ్బదులచేతను, ఆరోగ్యవిహీనముచేతను, యీ దేశములోకల రాజీకీయ సంచలనములో ప్రజలు మునిగి యుండుటచేతను, పట్టణములయందు పనిజరుగుచునన్నను పల్లెటూడ్లయందు గ్రంథాలయోద్యమము నామమాత్రాదశిష్టమై యుండుటకడు విచారకరము. దేశాభివృద్ధికి అవసరమైన సమస్త ఉద్యమములకు పునాదియైన గ్రంథాలయోద్యమము అభివృద్ధికలిగి స్దిరపడియుండినగాని దేశాభివృద్ధియనెడి మేడ కూలి అనర్ధకము వాటిల్లును. యిట్టి అనర్థము దేశ నాయకులు యీఉద్యమమునందు జోక్యము కలుగచేసుకొని, పనిచేసినయెడల తొలగును. యిప్పుడు అయ్యంకి వెంకటరమణయ్య పంతులుగారు ఆరోగ్యవంతులై యుఁడుటచే యీఉద్యమము తిరిగి త్వరలో అభివృద్ధి నొందునని ఆశ వొడముచున్నది.
దేశాభివృద్ధినికోరు ప్రతివారును గ్రంథాలయోద్యమాభివృద్దికి తోడ్పడి తెలూకా సంఘములను, సంచార కార్యదర్శులను నియమించి ఇదివరలో స్టాపింపబడి నామమాత్రావశిష్టమైన గ్రంథాలయములను పునరబివృద్ధి తెచ్చియు నూతన గ్రంథాలయముల స్థాపించియు అవసరమగు సర్వకార్యముల నొనర్చి ఉద్యమాభివృద్ధి నొందించుట యవసరమని విన్నవించుకొనుచున్నాను.
ఈ మహాజనులు ఎండవేడిమికి గాడ్పులకు ప్రయా .. శ్రమలకుఓర్చి యిక్కడకు దయచేసినందుకు వారికి కృతిజ్ఞుడనై ఆహ్వానసంఘము వారిలోపమును సైచి సభను జయప్రదముగా జరుపుటకును అనంతరము ఈ ఉద్యమాభివృద్ధికి సర్వవిధముల తోడ్పడి దేశాసేవాపరాయణు లై పనిచేసే కీర్తి గడించుటకును యీ సభాసదులను విదేయతతో కోరుచు సభ్యులకును సంఘాధ్యక్షునకును అనేక కృతజ్ఞతావందనము లాచరించుచు విరమించుచున్నాను.
అధ్యక్షుని ఉపన్యాసము
ఆహ్వానసంఘాధ్యక్షుని యుపన్యాస మైనపిమ్మట అధ్యక్షులగు శ్రీ కొండిపర్తివీరభద్రాచార్యులుగారు లేచి తమ యుపన్యాసమును ఈ క్రింది విధముగా జదివిరి:౼
వర్తమానకాలము భారతభూమికి యుగసంధి సమయముగ నున్నది. ప్రపంచమంతటికినిగూడ నిది యుగసంధికాలమే యగును. నానా దేశములందును పశుబలమునకును ఆత్మబలమునకును పోరాటము జరుగుచున్నది. పశుబలయునాకును మంతరించి ఆత్మబలయుగోదయము గానున్నది. ఈపోరాటము యూరపునందు దవానలముమాడ్కి ప్రజ్వరిల్లినది. లోకమునంతటికిని వ్యాపించినది. సకలదేశములకును మధ్య యురపు కేంద్రసంగ్రామక్షేత్ర మైనది. జర్మను యుద్ధమనునది ప్రపంచ యుద్ధమే. యురపు ఖండాగ్నేయ భాగమున నీయగ్ని రగులుచునేయున్నది. జర్మనీ యందును కీల లడగి యొకంత నివురుగప్పినదే గాని యగ్ని చల్లారలేదు. కాలపురుషుడు మహారౌద్రమూ మూర్తయై యీ ఘోరసంగ్రామమును నడుపుచున్నాడు. ఒక యుగసంప్రదాయమును మార్చి వేరొక యుగ సంప్రదాయమును బ్రవేశపెట్టుతఱిని భగవంతుడు ఇట్టి విలయములను గల్పించుచుఁడును. పశుబలసంప్రదాయము సమస్త జాతుల స్వత్వములను హరించినది. మహాపవిత్రోద్యమములకు వినియోగింపడవలసిన విజ్ఞానసంపదయంతయు లోకమున పశుబలమును జెంపు చేసినది. అది ముగ్గినది; రాలుటకు కాలమువచ్చినది. ప్రపంచమందలి శాస్త్ర వేత్తలందఱు తమ గ్రంధాలయములకు, ప్రయోగశాలలను మారణయంత్రనిర్మాణమున కుపయోగించిరి. వాని నన్నింటిని బ్రయోగించరి. అది భస్మాసురుని వర్గ మైనది. దీర్ఘతపముచేసి యీవరమును సంపాదించిన రాజలోకము దాని మూలముననే హలిమగుచున్నది.
ప్రపంచ పునర్నిర్మాణముకొఱకు అమ్మ బలసంప్రదాయము ప్రతిష్ఠితము గావలసియున్నది. ఈ తత్వమును ఉపదేశించుటకు భారత భూమికిమాత్రమే అర్హతగలదు. పశు బలము వృష్టి ప్రేరితమైనది; స్వార్థమే గమ్యముగా గలది. లోకములో దాను కేంద్రబిందు వైనిలిచి, సర్వమునకును గళ్ళెముతగిల్చి, తంతువులను దాను వహింపజూచును. స్వాతంత్రము ప్రకృతిలక్షణము. దీని నరకట్టు యత్నమొలకు భంగపాటు తప్పదు. ఆత్మబలమునకు సమదృష్టి గలదు. సమస్తమును దనయందే చూచును. ఒకరనిగాదని ఒకరినినిర్జించి, తాను స్వార్థముగా పొందునదిలేదు. సర్వముసకును స్వాతంత్య్రము నంగీకరించును. తాను సదా స్వతంత్రము సనుభవించుచునే యుండును. ఆత్మవత్సర్వభూతాని యనుధర్మము నుగ్గుబాలతో గ్రోలిన భారతభూమియే యీధర్మమును బోధించగలను. భారత భూమియే గురుపీఠము నధిష్ఠించి ఆహింసావ్రతమును లోకమునకు బోధించగలదు. ఈ వ్రతకల్పము భారతనని మఱపునకు వచ్చినది. చిరకాలము పరాదీనత యందుగుందియుంటచే విస్మరించింది. ఇప్పుడు దానికొఱపై తిన పుస్తకములను దిరుగ వేయవలసిన కాల మాసన్నమైనది. ఆమె పుస్తకములన్నియు జెల్లా చెదరై అందందుబడి యున్నవి. వానిని వెదకి బ్రోగుచేసికొనవలయును. శ్రీ వివేకానందస్వామి, యీ సంఘటనను తనివివేక చక్షవునజూచి, ముప్పది వత్సరములకు బూర్వమే, జ్యోతిషము చెప్పియున్నాడు. అచిరకాలములో ఆధ్యాత్మిక బోధకై ప్రపంచము భారతభూమి నాశ్రయించుడని తెలిపియున్నాడు. భారతీయులు తమ దీర్ఘ నిద్రను, దమంతదాము విడువరేరి, లోకమే బలాత్కరించి నిద్ర మేల్కొలుపునని ముక్తకంఠముతో బలిసియున్నాడు. ఇప్పుడాసమయ మేతెంచినది. ఘన
_ D తరతత్వార్థములగూర్చి, పాఠములు చెప్పుటకు గ్రంథపరిశోధన యవసరము. కల్లబొల్లిమాటలు లుపకరింపవు. తదనుగుణ్యముగ నీగ్రంథాలయోద్యమము తలయెత్తినది. సరియైన కాలమున బయలు వెడలినది. లోకగురువులను సిద్ధము చేయుట కేంద్ర గ్రంథాలయములకు దప్పని విధి.
పశుబలము స్వార్థప్రేరిత మైనది. ఏ వ్యష్టినారుడో, సంఘమో, జాతీయో, స్వార్థసాధనకై పూనినకార్యములను పలువురసహకారము పొండుకొఱకు, సమిష్టి కార్యముగను, లోకోదణకర్మగను బ్రకటించి మోసగించును. తనకు ఫలమును బంచుకొనుతరణి మోసములు తెల్లమగును. యాంపునందలి వ్యష్టిజాతులు తమతమ స్వార్ధముకొఱకై రణమును సాగించి, దానిని లోకశాంతి స్థాపనప్రయత్నిముగ బ్రదర్శించి, యనేకుషల నందు బ్రవేశ పెట్టెను. తుదకు జర్మనీ నిర్జింపబడినది. విజయులు లాభముల బంచుకొనవలసివచ్చినది. ప్రతిజాతీయు తనపచ్చనే జూచుకొనుచు, మిత్రిమండలిని నుపేక్షింపసాగెను. పరస్పరభేదభావములతో గొట్టుకొనుచుండిరి. రణసీనుల జచ్చినవారిని, మందుగుండుసామానుల వ్యయమును, నష్టపరిహారపు మొత్తములను, రాజ్యలాభములను, లెక్కవేసినంతమాత్రాననే ఈయుద్ధచరిత్రను మనము తెలిసికొనినవారముగాము. వినీ యన్నింటికిని వెనుకనున్న సైతికపరివర్తమును గమనించవలయును. దానిని ప్రపంచమునకు జూటపలయును. పశుబల ప్రయోగము క్షుద్రమనియు, వ్యర్థమనియు మనము లోకమునకు బోధించవలయును.
మనము లోకమునకు ఆత్మమహిమను బోధింపవలయును. మానవధర్మము నుపదేశింపవలయును. ఇది వ్యష్టిధర్మముగాదు, సమిష్టిధర్మము. విశ్వజనీనధర్మము! దీనివలన నొకదృష్టి, లేక యొకసంఘము, ఒక్కజాతి మాత్రమెగాక ప్రపంచమంతయు తరించ వలయును. ఆగురుపీఠము దిష్టిచుటకు మనము తరిబీదును పొందవలయును. భారతసంప్రదాయము ననుసరించి ఆ తరిబీ దుండును. అందుకొరకు ఎందెందు విజ్ఞానలేశములున్నవో, వెదకి వాని నన్నింటిని సంపుటీకరించవలయును. ఇందు ప్రకృతి శాస్త్రములు, రాజనీతి, అర్ధనీతి, శిల్పశాస్త్రములు, మానసిక శాస్త్రములు; చిత్రకళలు, ఆధ్యాత్మికతత్వదర్శనములు ఇవి యవి యన నేల, సమస్తవిజ్ఞానమును, భారతి సంప్రదాయమును, ప్రకటించుటకై యుపయోగించుకొనవలయును. దానివికాసమున కనుగుణ్య మగువిషయము లున్నయెడ నన్యులనుండియు స్వీకరించి పెంపొందించవలయును. ఈపని గ్రంథాలయోద్యమము ద్వారమున జక్కగ నెఱవేరగలదు.
పూర్వకాలమున, గ్రంథములు ముద్రితములై యుండని కతమున, విద్యార్థులు పలుకష్టములు పొందుచు వచ్చిరి. వేల వేలుగ్రంథములు తాటియాకులలో వ్రాయబడి, రామబాణములకును, వల్మీకములకును, నెఱయై యుండెను. ఆట్టి స్థితిలోను మనపూర్వులనేక కష్టముల కోర్చి చాల గ్రంథములను రక్షించి, మన కిడియున్నారు. వారనేకములగు గ్రంథాలయములను రక్షించి, నిలిపి, పోషించి యున్నారు. మఱియు భిన్నభిన్న సంఘములవారు మెతిం గల్పించుకొని, సోదరి భావముతో మేలంగుటకై, తమ తమ సంప్రదాయములకు పామరస్యమును గుదుర్చుకొనుచు వచ్చిరి. గ్రంథాలయము లిందుకు మిగుల నుపకరింపుచు వచ్చినవి. అష్టాదశపురాణములు, మహాభారతము శ్రీ వ్యాసులవారు రచించె నందురు. దీని యర్థమేమి? ఈ పుస్తకములందు శైలి, భాష, భావములు, మతివిశ్వాసములు, తత్వపరిభాష, వీనియందనేక భేదములు గాన్పించు చున్నవి. ఒక్కొక్క పుస్తకము నందే యిట్టి భేధములు చాల గాన్పించుచున్నవి. పరస్పరనలు, విరుద్దాంశములును జూపట్టుచున్నవి. అనేక దేశముల వర్ణనలు, వివిధజాతుల ఆచార్యవ్యవహారములు, మతధర్మములు, యీ గ్రంథములందిమిడియున్నవి. ఇవి యొకచో నాదరపూర్వకముగ బేర్కొనబడినవి. వేరొకచో క్షుద్రములుగ ఖందించబడినవి. పూర్వగ్రంధపరిశోధనాధురీణలు దీనికనేక కారణముల దెలుపుచున్నారు. అందొకటే బేర్కొనదను.
ప్రస్తుతము నాలుగవశతాబ్దమునాటికి భారత దేశము భిన్న భిన్న జాతులకు నిలయమైయున్నది. వారి భాషలు, వేషములు, ఆచారములు, నీతిధర్మములు నన్నియు భిన్నములుగ నుండియున్నవి. దిగ్విజయముల గాంచి, వీరి నందఱిని దమవశముజేసికొనిన మహారాజులు వీరి నందణిని శాంత చిత్తులుగజేసి, పరస్పరానురాగముతో సోదరుల భంగి జీవించునటుల జేయుటకై యనేక ప్రయత్నముల గావించి, వ్యర్థమనోరధులై విసిగి వేసాగిరి.
ఉజ్జయిని ప్రభుడగు విక్రమాదిత్యుడు ప్రజలస్థితి గాంచి ఖిన్నుడగుచుండెను. ఈతడు విద్యావంతుడు, పండితాభిమాని, ప్రజానురంజకుడు. ప్రజలందు మైత్రి గొలుపుటకు తనకంటే పూర్వులు చేసిన ప్రయత్నములను వివేకదృష్టితో విమర్శించెను. ఉపొయాంతరమును గని పెట్టుటకై కృతనిశ్చయుడయ్యెను. తన రాజ్యము నందును, నితర రాజ్యములందును గల పండితవర్యులను, విజ్ఞాననిధులను, వ్యవహారదక్షులను, ప్రజాప్రతినిధులను రాపించెను. పరస్పరభేదములు, విద్వేషములు నందఱికిని దుఃఖహేతువులే యనియు, అందఱును సహిష్ణుత గలిగి మిత్రత్వమున మెలగుట, సర్వప్రజకును నానందదాయక మనియు, అట్టి సమరసభావమును గూర్చు నుపాయము నరయుడనియు వేడుకొనెను. ఎవరును తమ ప్రత్యేక లక్షణములకు, వ్యక్తిప్రతిభను, బోనాడుకొన నవసరములేదు. అప్రధానాంశములను, ప్రధానాంశములను నిర్ణయించుకొని మొదటివానిని సడలించుట కొడంబడుచు రెండవవానికి సమన్వయమును గూర్చుకొనుడని కోరెను. ఈ మహాకార్యమును నిర్వహించుకొరకు, వారినందఱను నొక్క గ్రంథాలయముచెంత సమావేశము చేయ నిశ్చయించెను. వారికే గ్రంధము కావలయునన్నను అందుగడలోనుండు తావుకావలయును. మధుర, ఆయోధ్య, పాటలీపుత్రము, తామ్రలిస్తే, కపిలవస్తు, రాజగృహా, వారణాశి, తక్షశిల, ఉజ్జయిని మొదలగు ననేక నగరములందు పెద్ద పెద్ద గ్రంథాలయములు కలవు. వానిలో కొన్నింట భౌద్ధధర్మగ్రంధములు, కొన్నింటవైష్ణవ సంప్రదాయ గ్రంధములు, మణికొన్నింట శైవమత గ్రంధములు, ముఖ్యముగా జేర్పబడియున్నవి. ఇట్టలనుట చేత వానియందు తదితర గ్రంధములు లేపనుటగాదు. పైవానికి ప్రాధాన్యము నిచ్చిరని తెలియ వచ్చుచున్నది. కాశీనగరమున అన్ని సంప్రదాయములకు సంబంధించిన గ్రంథములు చేర్చి పెట్టబడియుండుటచేత, విక్రమార్కుడా పండిత సభను కాశీయందు సమావేశపఱచెను. ఆనాటిపండితులు సామాన్యులుగారు. విద్యాసాగరులే యనడగును. వారందరిలో డల్లీలో వ్యాసుడు మేటియై యొప్పి, సభాధ్యక్షపదవిని నిలుపబడియెను.
వ్యాసులవారి ఆధిపత్యమున మహాసభలో సన్ని పక్షములవారును, తమ తమ సంప్రదాయములగూర్చి వివరింపుచు, నుపన్యాసముల నొసగిరి. ఈ యుపన్యాసములు పరమతసహిష్ణుతగలిగి, తమ సంప్రదాయమహిమను బ్రకటించునావిగనే యుండెను గాని పరమత దూషణ మాత్రములేదు. ఇట్లు చాలదినములు గడచిన పిమ్మట, పండితులు తమలోదాము సంప్రదింపులు నడిపి ప్రథానాప్రధానముల నిర్ణ యించుకొనిరి. సమరిసభావిమునకు మార్గమేన్పరచుకొని, తుదకు ఎవరిసంప్రదాయమునకు వారు ప్రాముఖ్యతనిచ్చుచు, గ్రంధముల వ్రాయుటకు గడంగిరి. ఆ గ్రంథములన్నియు సిద్ధమైనపిమ్మట, వాని నన్నింటిని వ్యాసులవారే ప్రధాన సంపాదకుడుగ నుండి కొలది సవరణలతో బ్రకటించిరి.
కేవలము పై వివరించబడినరీతినే కార్యక్రమమంతయు జరిగినను లేకున్నను ఆపంథాననుసరించి గ్రంథరచన జరిగేనని యొప్పుకొన వచ్చును. ఈమహత్కార్యముసకు వారణాశిగ్రంథాలయము మహోపకారియయ్యెను.
ఐదు ఏడు శతాబ్దములందు చీనా దేశీయులగు హియాను, హ్యూంత్సాగు అను నిద్దరు బౌద్ధయాత్రికులు, బౌద్ధధర్మమనుగూర్చి, దాని జన్మభూమియగు, భారత దేశముని పరిశోధనలు చేయుటకై వచ్చియుండిరి. వారు పెక్కుతావులందు గ్రంథాలయములను జూచియుండిరి. మఱియు వాని గూర్చి తమ యాత్రాచరిత్రలందు వ్రాసి యుండిరి. వీరు గాంచిన పుస్తకాగారములందు బౌద్ధధర్మగ్రంథములేగాక, దానికి విరుద్ధమని తలపబడుచున్న హిందూమత గ్రంథములును జేర్చబడియుఁడెను. హిందువుల గ్రంథాలయములందు భౌద్ధమత గ్రంధములు గాన వచ్చినవి. మఱియొక విశేషమేమన బౌద్ధారామము లందు వేలకొలది విద్యాభ్యాసము చేయు బ్రహ్మచారులును, వారికి నుపదేశములు గావించు గురువులును, సమిష్టికుటుంబనీతి ననుసరించి, జీవింపుచుండిరి. ఈ అధ్యాపకులలో జాలముంది బౌద్ధసన్యాసు అయినను కొంతమంది బ్రాహ్మణపండితులును నుండి తమ బాహ్మణధర్మమును నిరాఘాటముగ బోధింపుచుండిరి! ఆనాటి పండితవరులు ప్రధానా ప్రధానాంశముల వివక్షణ చేయగల్గిరనియు ప్రథానాంశములందు సమన్వయసాధనను గాంచెగల్గిరనియు, పరమతసహిష్ణుత గలవారనియు తెల్ల మగుచున్నది. ఫాహియారు బ్రాహ్మణపండితులతో ననేకపర్యాయములు వాదనలు గావించినట్లును, వారికడ హిందూధర్మమును గూర్చి చక్కగ నేర్చుకొనినట్లును, ఆయన తెలుపు చున్నాడు. ఇటువంటి సంప్రదాయసమన్వయమునకు గ్రంథాలయములు మిగులు నుపకరిఁపగలవని వేరుగ జెప్పనక్కఱ యుఁడదు. ఇందుకోఱుకు గ్రంథాలయపాలకులు సంకుచిత భావములతోమత గ్రంథముల సేకరించక, విశాల భావములతో వర్తించవలయును. పూర్వము మన గ్రంథాలయములలో వేలకొలది గ్రంధము లుండెడివి. వివిధమత ధర్మసంప్రదాయములు దెచ్పినవిగ నుండెడివి. ఫాహియాను ఒక్క తామ్రలిప్తియందున్న గ్రంథముల పరిశోధించి, వానిలో గొన్నింటికి మాత్రము ప్రతుల వ్రాసికొనటకు రెండేండ్లు పట్టిందట. ముద్రణ సౌకర్యములు లేని యాకాలమున నిట్టి గ్రంథాలయములకై పుస్తకముల వ్రాయించుట, తాటియాకులలో వ్రాయించిన వానిని రక్షించుట, యే రకమున కారకము ఏర్చిపెట్టుట, ఎంతటి తెలివితేటల గోరునో విచారించుడు. మఱియు నిటువంటిశ్రమ తామభిమానించుకొనిన గ్రంథముల సేకరించి రక్షించుటయందేగాక, తదితర గ్రంథముల గూర్చియు దీనికొనబడియెను. వేలకొలది గ్రంథము లితర భాషలలోనివి సంపాదించి, వానిని భాషాంతరీకరించి, తమ గ్రంథాలయములం దుంచిరి. నిరాఘాటముగ వాని నండఱును పరదేశీయులు, పరమతస్తులు సయితము, ఉపయోగించుకొనుటకు సౌకర్యముల నొసగుచు వచ్చిరి. కాశీ మున్నగు ప్రదేశము లందలి పుస్తకాగారములలో దేశమునంతటి నుండి పండితులు వ్రాసిన యుద్ధగ్రంధముల ప్రతులుండెడివి. మఱియు విదేశపండితుల గ్రంథములును, వాని భాషాఁతరీకరణములును జలగ నుండెను.
భారతీయులలోని, వివిధజాతులవారికిని, మైత్రి గుదర్చలేకున్నను, విద్వేషములచేత పరస్పరము బాధించు కొనకుండ నిక్కాలమున దమ యుత్తమరాజనీతి కాపాడుచున్నదని మన దొరతనమువారు మిగుల నాడంబరముతోడ జెప్పుకొనుచున్నారు. కాని ప్రత్యక్షముగా ధర్మసమన్వయమునకై ప్రయత్నించక, తన విలక్షణమగు మత నీతి చేత సర్వమును ఖండంన మొనర్చుచు, నిరసింపుచు, విద్వేషముల గల్పించుటకే తోడ్పడుచుండిరనిసను సల్యదూరము గాదు. పూర్వపురాజులును, పండితవరులును వివిధసంప్రదాయ సమన్వయమునకై ప్రబల ప్రయత్నిముల గావించి, సిద్ధసంకల్పులైరి. అప్పటి విదేశీయయాత్రికుల గ్రంథుములే సాక్ష్యమిచ్చుచున్నవి. గ్రంథాలయములను, వార్షిక మహాసభలును, పుష్కరాదిమహాపర్వదినములందలి సమావేశములును, సత్యద్భులీల జాతీయినిర్మాణమున దోడ్పడియున్నవి.
ఈ సందర్భముగా మహమ్మదీయ పాలకులగూర్చి యొక్క విషయము చెప్పవలసియున్నది. మన చరిత్రకారులు మన దేశముమీదికి దండెత్తి వచ్చిన మహమ్మదీయులలో మొదటి తెగలవారు గావించిన దుర్నయములను అతిశయోక్తులతో వర్ణించి వారిని కేవలము రాక్షసులనుగ బ్రదర్శించియుండిరి. మహమ్మదీయులు భారతభూమిలో స్థిరనివాసములు నేర్పఱచుకొని భారతీమాతకు దత్తులై యొప్పుటకు పూర్వము వారు దౌర్జన్యముల గావించిననుటకు సత్యమును మానవస్వాభావిక కార్యమునై యున్నది. దానిని మన మీనాడంతిగా పాటింపజనదు. సంగ్రామ కాలములందు మన దేవాలయముల పడగొట్టి గ్రంథాలయములను దగులబెట్టిరని మహమ్మదీయుల నిక్కాలమునకు చూషించుట తగదు. అన్యమత సంప్రదాయములు గలవారిగుటచేత వారు గావించినది అస్వాభావిక కార్యము గాదు. సమమత సుప్రదాయములతో మనుచున్న ఆంగ్లేయులును, పరాసులును పూర్ణసభ్యత సంపాదించిన లోకగురువులమని చెప్పుకొను నిక్కాలమున జర్మనీ, ఆస్ట్రేలియాలయందు చర్చి భవనములను, గ్రంథాలయములను, పురమందిరములను నెన్నేని ధ్వంసము చేసి యుండలేదా? కాని మోగలు చక్రవర్తులు హిందూమత గ్రంధములను వ్రాయించి అనువదింపజేసి పండితులను గౌరవించి యాదరించింని యిప్పుడిప్పుడు చరిత్రిపరిశోధకులు దెలుపుచున్నారు. వారివలన మనకు సంఘటిలిన కీడులకంటె మేలులే హెచ్చుగ నున్నవనియు, హిందువులలోని వివిధశాఖాంతరులు పరస్పరము గావించుకొనిన బాధలకంటే హెచ్చుగా గావించుకొనిన బాధలకంటే హెచ్చుగా గావించలేదనియు గ్రహించి మన దురభిప్రాయముల మార్చుకొందుముగాక!
ఒక్క విగ్రహమునే వేర్వేరు తావులనుండి చూచిన యెడల వేర్వేరు భావములు ఆ విగ్రహమునందు బ్రదర్శితము లగుచుండును. అటులనే దృక్పథమును బట్టి చరిత్రలును, భిన్న భావములను బ్రచారము చేయుచుండును. మనము మన చరిత్రమును పాశ్చాత్యుల వలన నేర్చుకొనుచుంటిమి. మన దృక్పథమే గాక, మన దృష్టియు మారి పోయినది. పాశ్చాత్యులకు మన చరిత్ర తెలియదు. సంప్రదాయ భేదము చేత వారు తెలిసికొనను లేరు; ప్రయత్నము చేసినవారును గారు. కాని, వారతసాహసులు! భారతజాతికి యనునదే పూర్వచరిత్రయే లేదనిరి. మీదు మిక్కిలి భారతజాతి యనునదే లేదనిరి. మన పురాణములను ఇతిహాసములను అర్థరహితములగు వెఱ్ఱి వ్రాత అనిరి.
చరిత్రరచన జాతీయాదర్శముల ననుసరించి నడుచును. భారతీయుల యాదర్శము ఆధ్యాత్మికము. పాశ్చాత్యుల యాదర్శము ఐహికము. తినుట, తిరుగుట, నిద్రించూట సయితము ఆధ్యాత్మికదృష్టితో మనచే జూడబడు చున్నవి. వీనివలన ప్రపంచమున సాధింపగల కార్యములకు విలువగట్టి, పాశ్చాత్యులు వీనిని ఆర్థికదృష్టితో జూతురు. కూలినాలి చేసికొనువారికి జీవనోపాధికై విరామము లేక పాటుపడవలసిన స్థితి యింగ్లాండున నిప్పుడు గల్గినడని చెప్పుచు, ఒక అర్థశాస్త్రజ్ఞుడు వారిని మానవజీవులునుగా జాలిపడుటకు మారుగా, ఆర్థికరీత్యా గణితము వేసి, వారియలసటవలన, వారు వ్యుత్పత్తిచేయు వస్తు జాల మెంతతగ్గినదో, ఎంత నాణ్యము క్షీణించినదో వారు త్వరగా సశక్తులై పనిపాటులు మానినందువలన వారిజీవనభారమును జాతి ఎంత భరింపవలయునో, అన్నింటిని పౌనులు, షిల్లింగులు, పెన్నీలలో గణితము వేసి, ఆ నష్టమును దప్పించుకొనుటకై స్వజాతీయులు వీరికి దారిజూపవలసిన విధిగలవారగుచుండిరని వాదించినాడు. పాశ్చాత్యులు చరిత్రలను వ్రాసినను ఈదృష్టితోడనే వ్రాసిరి. మన గ్రంధములలో సామాన్యగృహకృత్య విషయములును, సాంఘికవిషయములును, రాజకీయవిప్లవములను, ప్రజల నైతికస్థితిలో నెట్లు పరివర్తనమును గల్గించుచున్నవో దెలుపబడురీతిని కధ లల్లబడియున్నవి. మిగులు సస్వాభావికములను గూడ ఇతిహాసములలో జొన్ని నీతిధర్మమును బ్రకటించుటయే ప్రధానముగ వ్రాసిరి. ఈకథల సంభవములుగను, అస్వాభావికముగను, పాశ్చాత్యదృష్టికిని, పాశ్చాత్య సులోచనములదాల్చిన మనకును, గాన్పించుచున్నవనుట నిజము. ఆగ్రంధకర్తల యాదర్శమును పాటించి, వాని నుపయోగించుకొంటి మేని, లాభమును పొందగలము. ఇందుకు భారత సంప్రదాయభీమానము, విచక్షణజ్ఞానము, ప్రరమతసహనము చాలనవసరములు. పాశ్చాత్యు లీసద్గుణములను మనగ్రంథముల పరిశోధించుపట్ల జూపరైరి. భారత జాతికెద్దియు స్వరూపమే లేదనియు, ఏకొంచమైన నున్నచోనది ప్రాకృత వికార స్వరూపమనియు బోధించిరి. వారి పాదములకడ, విద్యనేర్పన భారత విద్వహ్మణులు భారతప్రాచీన గ్రంథపరిశోధనము “ఊకదఁపు " అని హేళన సాగించిరి. ఒక ఎం.ఏ. గారు (తక్కుంగల విషయములలో మహాపూజనీయుడే) మన వాఙ్మయమును బరిశీలించుటఁగూర్చి పలుకుచు "న జీవితము చాల విలువగలది. కండ్లయెదుటి సత్యస్వరూపమును విడిచి ఆనిశ్చయమును, క్షుద్రమును, భ్రాంతిహేతువు నగు ప్రాచీన భారతి జాతిస్వరూపమును గూర్చి విచారణ పెట్టుకొని వ్యర్థముగ నాజీవితమును వ్యయము చేయజాల” ననెను.
కాబట్టి హైందవ సంప్రదాయదృష్టితో భారత చరిత్రను వ్రాయుట చరిత్రను ఎంతయావశ్యకమో, ఎంతటి మహత్కార్యమో యూహించ వచ్చును. నూటి కార్గురు మాత్రమె సంతకములు చేయుపాటి విద్వన్మణులనుండి వీరిలో వేయింటి కొక్కడైనను పూర్వగంధపరిశోధన కర్తమా విద్యయు, నభిమానము లేకయుండ, ఎందరు మనచరిత్రను పరిశోధించి వివేకదృష్టితో వ్రాయఱును కొనువారు లభింతురో, యోజనసేయుడు. గ్రంథాలయ పాలకులు తమగ్రంధములు జదువువారి వైఖరులగనిపెట్టుచు, తగిన వారిని గుర్తించి ప్రోత్సహించ వలసియున్నది.
యూరపు అమెరికాలచరిత్ర మహానగరములందును ఘనతర కర్మాగారములందును, విశ్వవిద్యాలయములందును, రాచకీయ కార్యాలయములందును లభించును. కాని భారత దేశపు చరిత్ర గ్రామములందున్నది. గ్రామములందున్న దేవాలయములలోను, మసీదులలోనూ, సత్రములందును, ధర్మారామములందును, గ్రామస్తులు జెప్పుకొను పిట్టకధలలోనూ, పల్లెలవారి విచిత్రములగు నాచారములలోనూ జీర్ణమై యున్నది. క్షేత్రపురాణము లందున్నది. వీనినిగూర్చి గ్రామస్థులు చెప్పుకోను గాధల నన్నింటిని బ్రోగుచేయవలసియున్నది. అవి వివిధములుగను, పరస్పర విరుద్దములుగను, అస్వాభావికములుగను నుండును. కాని వాని యన్నింటను, సరమునందలి సుత్రమువలె, నైతికాదర్శములు, సంప్రదాయాచారములు వివేకదృష్టికి గోచరములగుచుండును. వాని ననుసరించి వ్రాసిన జాలును, పాశ్చాత్యదృష్టితో జీవితచరిత్రలను తేదిల వారిగ వ్రాయుట యనవసరము. రణక్షేత్రములందు విహారము గావించిన గణనాయకులజీవితములను, నధికారములను, యోధులసంఖ్యను ఖచితముగ నిర్ణయించిజూచుట యనవసరము; రాజశాసనముల నిర్మాతలను, వాని తారీకులకు సరిగ దేల్చుట యనవసరము. పైవానివలన ప్రజల సుఖదుఃఖములు, , సంఘాచారములు, ఆముష్మిక భావములు ఎటులమారెనో తెలిపిన జాలును. మహాభక్తుల జీవిత చరిత్రలు విద్దూర్యరముగా నున్నను, వారిబోధలవలన గల్గిన భావపరిణామమును సూచించిన జాలును.
ఈపని కంతకును స్థానిక గాథలను, క్షేత్రమహిమలును మూలాధారముగ నుండును. ఈ కథాజాలము నెక్కడివారక్కడ రచింపజేసి ప్రకటించినయెడల సులభముగ పనిజరుగును. గ్రంథాలయముల నిర్వహించు వారి కార్యమును నిర్వహించగలరు. సామాన్యముగా ఉన్నతపాఠశాలలో విద్యగఱచు బాలురు శలవు దినములలో తమ విశ్రాంతికాలము నందు కుపయోగించిన మహోపకారమును జేయగలరు. వారు తమగ్రామస్థులు జెప్పుకొను కథలను తమకువచ్చి భాషలోనే వ్రాయవచ్చును. ఇట్టివానిలో సుత్తమమైనవానిని రచించిన బాలురకు చిన్న చిన్న బహుమానములనిచ్చి ప్రోత్సహించివచ్చును. ఇందువలన వారికి ఆనందమును, నుత్సాహమును, దేశసేవగావించిన పుణ్యమును లభింపగి గలవు. గ్రామములందు ప్రాథమిక పాఠ శాలల యుపాధ్యాయులు గూడ కథలను వ్రాసి యీగలరు. వీరిని సత్కరించుట యనేక భంగుల నుపకార కార్యమగును.
ఇటుల చేయుటవలన, మనదృషి గ్రామములపై కేంద్రీకరణమునంది, విశాలతరదేశాభిమానము సంకుచితమగునని కొందఱు భావింపవచ్చును. అటుల నెన్నడును జరగదు. భారతదేశమంతయు మహాపురుషుల యొక్కయు, అవతారములయొక్కయు, భక్తుల యొక్కయు జన్మనిర్యాణక్షేత్రములతోడను, మఠములుతోడను, మసీదులతోడను, బౌదస్తూపములతోడను పవిత్రీభూతమై సర్వమతముల వాడి చేతిను పూజిఁపబడుతున్నది. అందందు జరుగు తిరుణాళ్లు, పుష్కరతీర్థనిధులు, ఉత్సవములు, వేడుకలు నందఱిని నాకర్షించుచున్నవి. భారతమాతయొక్క అఖండ దివ్య మంగళ స్వరూపము ఆనుదినమున ధ్యానింపబడుచునే యున్నది. సప్తఐదులను, సప్తకుల పర్వతములను, శైవతీర్ణములకు, వైష్ణవ తీర్థములను మున్నగువానిని ధ్యానము చేయుట మనకాచారమైనది. వీనిని ప్రతి పాఠశాలయందును విద్యార్థులచే బఠించిపించి, చిత్రవర్ణములతో గోడలమీద లిఖించియుంచి, వాని మహిమలను బోధింపుచు నుండ వచ్చును. ఆటుల భారతిభూమి యొక్క సర్వాంగములును మహాపవిత్రిములేయను నుపదేశములను ఉగ్గుపాలతో పసివారికీ గ్రోలనిచ్చిన యెడల ఇంక దేశాభిమానము సంకుచితమై పోవునను భయమనవసరము. అనుదినమును స్నానములు గావించుపట్ల,
"గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి,
నర్మదా సింధుకావేరి జలేస్మిన్ సన్నిధిం కురు”
ఆనుచు బఠించు మనము దేశారాధనను మఱచెద మా? గ్రామాభిమానము, దేశాభిమానమునకు బునాదియై స్థిరముగ నడుపును.
వారమునకో పక్షమునతో ఒక్కసారి గ్రామమందలి బాలబాలికల నందఱను, గ్రంథాలయము చెంత జేర్చి వారికి మంచిమంచి బొమ్మల జూపుచు, వీరుల చరిత్రములను, మహాభక్తలకథలను, పతివ్రతిల పావనజీవితములను, వివిధ క్షేత్రిమహిమలను తడవ కొక చిన్నకథగా గూర్చి బోధింపవచ్చును. తుద కొకకీర్తనాయో, పద్యమో భారతమాత గూర్చి పఠింపించి, జేజేధ్వనులతో వారి నలరింపవలయును. పీలునుబట్టి వారికి పంచదారయో, కొబ్బరియో, బెల్లమో, పప్పులో పంచి పెట్టవచ్చును. ఇందుకు రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంధముల గాధలదెలుపు చిత్రపటములును, తదితర చారిత్రంశ బోధకములగు పటములను, ధనమున్నచో మాజికులాంతరును, ప్రతి గ్రంథాలయమునందు నుంచవలయును. కధకులు లభించినప్పుడెల్ల బాలనాగమ్మకధ, బ్రహ్మనాయునికధ, బొబ్బిలికథ ఇటువంటి వానిని చెప్పించుచుండవలయును. గ్రామ పాఠశాలలందు పర్వదినములందు ఉత్సవములు జరుపుచుఁడవలయును. ఆ యుపాధ్యాయులకు కధలు చెప్పు నేర్పును గల్గించవలయును. సామాన్యప్రజలప్పుడు గ్రంథాలయముల నభిమానించు కొని సహాయము నొనర్పగలరు.
మనిలో ప్రతివాడును తన సంఘమునకును, విశ్వమానవకోటికిని ఋణస్టుడైయుండును. తానెంతటి ధీశాలియైనను, ధనాథ్యుడైనను, బలసపన్నుడైనను, ఈఋణమును దప్పించుకొనజాలడు. విశ్వమానవకోటి, తరతరములనుండి సంపాదించిన జ్ఞానపుంజము మనలో జీర్ణమైయున్నది. దానిఫలమును మనము తెలియకుండనే యనుభవించుచున్నాము. చిన్న యుదాహరణచే విశదము చేసెదను. ఒకడు ఒక్క ముద్ద అన్నము దీనినప్పుడెల్ల విశ్వమానవకోటికి ఋణస్థుడగుచున్నాడు. నరుడు ప్రొకృతజివియై పుడమిని జన్మించినది మొదలు, క్రమక్రముముగా క్షద్ర జంతుజాలమును, ఆకలములను, కాయక సరులను, దుంపలను దిని, ఆహారద్రవ్యములను సేకరించి పెటుకొనుట నేర్చి, వానిని వ్యుత్పత్తి చేయువిధమును గనిపెట్టి యిప్పటికి వ్యవసాయశాస్త్రమును గొంతవఱకు పూర్ణతకు దెచ్చెను. ఆ విజ్ఞానమంతయు మనముతిను మెతుకునఁదు నున్నది. ఆవిజ్ఞానరాసియం దొకొక్క కణమును జేర్చినవాడెల్ల నా కుపదేశకుడే, నా కుపకృతి యొనర్చినవాడే, నాకు దాతయె. ఇట్లు దలపోసినయెడల, నే నెంతమందికి ఋణస్థుడనైతిమో గణించుటకే నా జీవిత కాలము జాలదు. ఈ ఋణముతీరు నుపాయద్ధి మెద్ది? ఈ విశ్వమానవకోటిలో నాజాతి యొక యంతర్భాగమైయున్నది. కావున, నే నీజాతికి సేవజేసి, నా శక్తి యుక్తుల వినియోగించి విశ్వమానవజాతి కూర్చిపెట్టిన జ్ఞానగాసి కొక నూతనకణమును జేర్చి, నా స్వజాతి బాల బాలికల విజ్ఞాన విస్ఫురణమున నొకింత సహకారము సలిపి, ఇతరు లార్జించిపెట్టిన జ్ఞానామృతము నొకింత ఈ చిన్నవారలకు బంచిపెట్టి, కృతకృత్యుడ గాజనును. తాము స్వయముగ విద్యాధికులగు వారి కీఋణము గురుతరముగ నున్నది. తమ సమకాలికులు ప్రత్యక్షముగను, పరోక్షముగను బోషింపుతున్న పాఠశాలలలో విద్యగణ చుచున్నారు. వీరిలో నెవరును దాముగడించిన విద్యకు దగిన ప్రతిఫలమును జీతములరూపమున నిచ్చివేసితిమని వక్కాణింపజాలరు. అయినను ఈ కాలపు విద్యావంతులు కేవలము కుక్షింభరులును, స్వకుటుంబసేవకులును మాత్రముగనుండి, యితరులసేవ విధిగా చేయవలసినవారని గ్రహించునంతటి విశాలహృదయలు గాకున్నారు. ఇతరులు చెమటతోడ్చి, కష్టపడి, తమకై పాటుపడుట, తమ ఘనతకు తార్కాణమనుకొనుచున్నారేగాని, తమ ఋణభారమందువలన పెరుగుచున్నదని గుర్తించజాలకునన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించి, దేశసేవయందు దింపఁగును. వీరివలన పరిశోధనల చేయించి చరిత్రలను, ప్రకృతిశాస్త్రములను, యంత్రనిర్మాణ శాస్త్రములను, సులభమగు భాషలో వ్రాయింపించవలయును. అన్యభాషలందున్న వాని ననువదించునటుల చేయవలయును. వీరి విజ్ఞానమును స్వలాభమునకే యుపయోగించట అధర్మమనియు నొక్కి చెప్పి వాదించుడు. వీలు ననుసరించి లోకోపకార కార్యములకు దిగినవారిని సత్కరించి ప్రోత్సహించుడు. వారికి వలయు గ్రంథముల నరసి సంపాదించి పెట్టుడు.
వర్తమానకాలమునందుకంటే, భారతదేశమును, పూర్వము చదువరులు హెచ్చుగ నున్న మాట నిజమే, అందువలన ప్రజలందఱును గ్రంథపఠనము చేయగల్గియుండిరని భావించరాదు. పూర్వకాలపు చదువరులు విద్యావంతులయి యితరులు చదువరులు గాకున్నను, వారిని గూడ విద్యావంతులుగ నొనర్చుచుండిరి. చదువులకు ఫలము గ్రంథపఠనము, వ్యాసరచనము, ఉపన్యాసము లిచ్చుటయునని యిప్పటివారు భ్రమించుచున్నట్లు లున్నది. చదువుల్నేర్చిన దానికి ఫలము భగవంతుని మార్గముల నరసి, అనగా లోకవృత్తమును గమనించి, తదను గుణ్యముగ దాను వర్తించుటయు నితరులనువిషయ లను, వర్తింప జేయుటయు ననిమఱపదగదు. ఈరీతిగా విచారించిన యెడల మన యిండ్లలోనున్న ముసలమ్మలు భాగవతాది గ్రంథములలోని విషయములను, దాము దెలిసికొని, యితరులకు దెలుపగలిగియుండిరి. మన గ్రాడ్యుయేటులకాశక్తి లేదయ్యె. జాతీయసంప్రదాయ సిద్ధమగు విద్యముసలమ్మలకున్నను గ్రాడ్యుయేటులకు లేకుంట శోచనీయము. ఙ్ఞానప్రచారమున కుపకరించని చదువులను విద్య యనదగదు. జ్ఞానప్రచారమును చదువులు రెండునులభించిన పరమోత్తమముమము. ఒక వేళ చదువులు లభించకున్నను జ్ఞానప్రచారమున్నచో సంతసించి వలసినదే. ప్రస్తుత స్థితిలో మనదేశమున నూటికి నలుగురైనను ధారాళముగ వ్రాయను జదువను శక్తులగువారు లేరు. జనాభాలెక్కలలోని చదువరుల సంఖ్యలను నమ్ముకొనదగదు. కొందఱు దక్కతుచేయుటను మాత్రమేనేర్చి పరువుపోవునకు కారణముతో చదువు నెఱుందుమని జనాభాగణితిలో వ్రాయించుకొందురు.
మఱియు ఈ చదువులు ఙ్ఞానార్జనమునకు ఙ్ఞాన ప్రచారమునకుగాని కొఱగావు. మనదేశమున నిప్పుడు గ్రాడ్యుయేటు లున్నారు. బిరుదాంకితులున్నారు. జాతీయవిద్యకోక స్వరూపమును సూచించుదనగా దానికి శక్తులుగాక యున్నారు. కావున ఆ చదువుల పద్దతిని నమ్ముకొనక జ్ఞానప్రచారములకు గడంగవలయును. గ్రంథాలయము లీజ్ఞానప్రచారమునకు జాలగ నుపయోగించ గలవు. గ్రంథాలయ సభ్యులు ప్రజలతో గలిసి మెలిసి, దిరుగుచు కథలమూలమునను, ఉపన్యాసములు మూలమునను, ఇష్టాగోష్టివలనను, సంభాషణమూలమునను విజ్ఞానమును ప్రచారము గావించగలరు. ముప్పదేండ్ల నుండి గ్రాడ్యుయేట్లు, లాయరులు చేయజాలని జ్ఞాన ప్రచారమును గాంధిగారు మూడుమాసములలో చేయగల్గిరి. ఆ ప్రచారము సత్యద్భుతిలీల జరిపినది. సామాన్యవిద్యావంతులే గాని గ్రాడ్యుయేటులు గారు. విషయమును సానుతాపముతో గ్రహించుట, ఆదరణ పూర్వకముగా నితరులకు దెలుపుట ఙ్ఞానప్రచారమునకు . ముఖ్యసాధనములు. పదేండ్లు పాఠము చెప్పినదానికంటే రాజకీయ సమస్య నొక్కదానిని మనసున పట్టించుటకు, పదిమందినిజేర్చి యొక్క హరికధయో, ఒక్క చిత్రకథయో ఆల్లి దానిని హృధ్యమగు తేలికభాషలో త్రుటికాలములో బోధించనగును. దీనికొక్కడు తెలిసిన వాడున్నంజాలును. వినువారందఱు అక్షరజ్ఞానము లేనివారైనను సరియే. ఈ కాలపు పరిస్థితుల ననుసరించి యీ పద్దతి నాచరణలో బెట్టవలయునేగాని, బేలతనమున చెదువులు లేవేయని దిగులొంది గూర్చుండరాదు. ప్రతి సాయంత్రమును ఆంధ్రపత్రికలోని ముఖ్యవిషయములును వీధులలో విశాలమైన చోట నిలుచుండి బిగఱగ చదవుఓయో, లేక వానిగూర్చి ముచ్చరించుటో విధిగా బూనిన యెడల గ్రంథాలయకూటము మహోపకారము చేసినదగును. కేవలము పత్రికాపఠనము చేయువారికే యుపయోగపడు పఠనమందిరములం పూర్ణ ప్రయోజనకరములు గావనుటకు సండియములేదు. గ్రంథాలయమునందలి అలుమారులలో చాల పొత్తము లున్నను, వార్తాపత్రికలు విశేషముగ నచ్చక బల్లలపై నలంకరించినను, అనుదిన మనేకులు హాజరై పుస్తకమున సంతకము లిడినను, వీని లెక్కలు గ్రంథాలయపు ప్రయోజనమును నిరూపింపజాలవని మనవి చేయుచున్నాను. నేను వివరించిన విషయములు కేవలము ధనసహాయము లేక జరుగునవి కాకున్నను, ఎంతధనము చిక్కిన వంతటితోనే జరుగున్నవై యున్నవి. ధనము చాలగలేదనియు, గ్రంధములు కొద్దిగ నున్నవనియు గ్రంథాలయభవనము కుదురలేదనియు సంకోచించి ప్రారంభమే లేకయుఁడుట యనవసరము. ఉత్సాహవంతులగు లగు యువకులున్నంజాలును. చాల ప్రచారము గావింశివచ్చును. పెద్ద పెద్ద పుస్తకములు కొనుట, ఉత్తమ గ్రంధములు బ్రకటించుట, విశాలతరభవనముల నిర్మించుట విశేషధనము చేకూర్చికొలదిని గావించదగిన కార్యములు. ఆకార్యములు నిర్వహించు విధానములు, నుపాయములు ధనము తోడనే రాగలవు. ఇది లాభము కొలది గ్రంథాలయములకే లభింపగలదు. వర్తమానకాలమున నెవరిస్థితికి దగినటులవారు కార్యక్రమమును నడుపవలసి యున్నది. ఇతరులతో పోటీలు పెట్టుకొనుట, వొకరితో వంతు బెట్టుకొని యన్యులకై వేచియుఁడుట, తగదు. ప్రతివాడును నావిధిని నేను చేయగలిగినంతమట్టకు ప్రయత్నలోపము లేకుండ నిర్వహించితినా?' యని ప్రశ్నించుకొనవలయును. వాని యంతరాత్మ నడిపినటుల నడువ వలయును.
కేంద్రగ్రంథాలయములకు గ్రంధములు సేకరించు నుపాయమొకటి దర్భాంగ గ్రంథాలయ పాలకులగు ఎస్.సి.గుహాఠాకూరుగారు తెలిపియుండిరి. యూరపు అమెరికాలలో ప్రతిదేశమునను సామ్రాజ్యగ్రంథాలయములు గలవు. వానికి ఆయా సామ్రాజ్యములలోని గ్రంధకర్త లందరును, తాము ప్రకటించిన ప్రతిపుస్తకమునకును రెండు ప్రతులు ఉచితముగ నొసగవలయునను శాసనము గలదు. ఆటుల ధనవ్రయము లేకయే చాలగ్రంధములు లభింపుచున్నవి. మనకు నటువంటి శాసనముగలదు. కాని యీశాసనమువలన భారతిదేశమున బ్రకటిత మాగ్రంథములన్నియు లండను గ్రంథభాండాగారమునకు లభింప చున్నవి. మన భారత ప్రభుత్వమువారు నొక గ్రంథాలయమును నటులనే నిలిపిరి. కాని దానియుపయోగము ప్రజలకు లభించుటలేదు. అఖిల భారత కాంగ్రెసు సంఘము వారొక గ్రంథాలయమును నెలకొలిపిన బాగుండును. కాని వారి కొక స్థిర కార్యాలయము లేదు. వర్తమానకాలమున ప్రతిరాష్ట్రీయ కాంగ్రెసు సంఘమును ప్రతిజిల్లా కాంగ్రెసు సంఘమును కేంద్ర గ్రంథాలయముల స్థాపించుట మంచిది. పుస్తకమొకటి ముద్రణముకాగానే, గ్రంధకర్తలు మూడేసి పుస్తకములను దేశమాత కర్పణము చేయవలయును. ఒకటి గ్రంథకర్త గ్రామమునను, లేక సమీప గ్రామమున నున్న గ్రంథాలయమునకును, రెండవదానిని జిల్లా గ్రంథాలయమునకును, మూడవదానిని రాష్ట్రీయ గ్రంథాలయమునకును బంపునియమమును బ్రచారములోనికి దేవలయును. అచిరకాలములో స్వల్పవ్యయముతో కేంద్ర గ్రంథాలయములను బలపఱచ గల్గుదుము. అన్నింటికిని ప్రధానాంశము విజ్ఞానప్రచారము! దీనిని గావించుటయే గ్రంధాలయములకు పరమగమ్యముగ నుండ వలయును.
ఆర్యవరులారా! నే నీయుపన్యాసమున తెలిపిన యంశములేవియు మీకు కొత్తవిగావు. కాని నన్నిక్కడ మీరు నిలిపిన కారణమున జెప్పవలసి చెప్పితిని. కొఱతల దీర్చుభారము మొదటనే మీపై నిడియుంటిని. సాదర భావముతో నానుడు లాలకించిన మీకు మఱోకసారి నమస్కరించెదను.
అధ్యక్షుని యుపన్యాసము ముగింపబడినపిమ్మట వివిధ గ్రామములనుండివచ్చిన గ్రంథాలయప్రతినిధులు తమ యనుభవములనుగూర్చి విపులముగా జెప్పిరి.
అనంతరము ఈ క్రిందివారు గ్రంథాలయముల యావశ్యకతను గూర్చి గంభీరోపన్యాసముల నిచ్చిరి:
- ౧ అయ్యదేవర కాళేశ్వరరావుగారు::
- ౨ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు::
- ౩ కౌతా శ్రీరామశాస్త్రి) గారు::
పిమ్మట ఈదిగువ తీర్మానములు జేయబడినవి:౼
తీర్మానములు
1. (క) ఈమండలమందు గ్రంథాలయోద్యమమును వ్యాపింపజేయుటకు పశ్చిమగోదావరి మండల గ్రంథాలయసంఘమును స్థాపించుటకు తీర్మానించుచున్నారు.
(చ) ఈ సంఘమునకు ఈ క్రిందివారిని కార్యనిర్వాహనులుగా ఎన్నుకోవడమైనది:
- అధ్యక్షులు:-భూపతిరాజు తిరుపతిరాజు గారు::
- కార్యదర్శులు:—నిడమర్తి లక్ష్మీనారాయణగారు, భమిడిపాటి సూర్యనారాయణ గారు:: కార్యనిర్వాహకవర్గము:౼క్రొవ్వడి మల్లేశ్వరరావుగారు, ఆడివి బాపిరిరాజుగారు, యేలూరిపాటి రామభద్రచయనులుగారు, సాగి వేంకటనరసింహరాజుగారు, శివుడు శివరావుగారు, దంతలూరు నారాయణ రాజుగారు.
ఉపపాదక్షులు:౼ అడివి బాపిరాజుగారు.
ఆమోదకులు:—ఆత్మూరి గోవిందాచార్యులు గారు
II. కాంగ్రెసు ప్రచారముతోబాటు గ్రంథాలయ ప్రచారము జరుపుటకును, అవసరమగునో తగు ధనసహాయము చేయుటకును తాలూకా జిల్లా కాంగ్రెసు సంఘములను ఈ సభవారు కోరుచున్నారు.
ఉపపాదక్షులు:౼ అ. రామలింగంగారు
ఆమోదక్షులు:౼ శివుడు శివరావుగారు
పిమ్మట అధక్షునకు వందనములతో సభ ముగిసింది.
వాత్స్యాయనుని కామసూత్రములు. తఱుచుగ పరప్రశ్యయ నేయబుద్ధిగలది. ఆన'గా యుక్తాయు క్తవిచారణమును 7 నీ కార్యాకార్య బుద్ధినిగాని సత్యాసత్యాన్వేషణమును గాని చేయకయే యన్నం తిమా ఎవ్వరి యొక్కరు—ఏదో యొకటి న—శిరి సావహించి నడచుకొనునట్టిదిగానే యుండు నేగా ని స్వోపజ్ఞతను గనఁబఱచి పరీక్షించి యుపాదేయతినో అనుపాదేయతనో నిర్దారణము చేసికొనునట్టిదిగా నుండ దని భావము. ఇటిసితిలో చిరకాలమునుండియును ఆ ముష్మికపథానువస్తి విమును ప్రోది సేయదలచుకొన్న పెద్ద లం — స్వప్న సమర్ధకమునకో పరపక్ష గూరీకర ముణన కో— కామము ధగ్మోపఘాతికమనియును దున్నీతి పేర కమనియును సర్వథా అనుపాడేయము గహ్యము అని యును నుపన్యసించుటయేగాక తదువసంధిక ములగు కా మసూత్రాదిగ్రంధములయెడ సైతము ఆ నీలితను అధర్మ CP ఆరోపించుచు వచ్చుచున్నారు. ప్రస్తుత మీ వ్యాసమునందు కామసూత్రములు పెనారు చెప్పుచున్న ట్లుగ లోక మన కవినీతిని ఆధర్మలను ప్రకటించునట్ వై నదియును కానిదియును కామసూత్రిమ లెంతవఱకు లోక స్థితికి ప్రతిష్ఠంభతను వహించుచున్నదియును మున్నగునవి చ ర్చింపఁబడును. ఇఁక కృత త్రేతా ద్వాపరాజయుగయు గాం తరములకథ లెట్లున్నను ప్రస్తుతము మనకు లభించుచున్న ఆర్య సాహిత్య మునఁదు త్రాపి తా యీకమగు పురు షార్థమును బోధించు మన సంస్కృతి వాఙ్మయమునందు వాత్స్యాయనుని కామసూత్రములు అత్యంతము ప్రాచీ నములును ఆద్యములును నే యున్నవి. కేవలమును ఆధ్య త్వపురాతనత్వములు మాత్రమేగాక ఆఁ' కుముందు ఆర్య సంఘము అనుభవించిన నాగరకతా. పైవముకూడ ఆతి వేలముగా నీకామసూత్రములందు ప్రతిపాదింపబడుచు నే యుఁడును, ఇదియుగూడ నీవ్యాసను చర్చింపదలచిన 0 విషయములలో నొక్కటి. కామశాస్త్రాధ్యయనము సంఘమును జనసామాన్యమును అవినీతికి పాల్పడజేయు శని కొండఱు ప్రాబ్లంసత్వు అందుకు కాని నిజమును పరి కించెద మేని అపనీయమనది కేవలము ఒక్క వసూత్రు యొక్క నైజగుణ మెన్నటికిని గాదు. ఆయ్యారి దేశ కాల సాత్యాగుల ఉపకోని ప్రజా a - నాను సంంచియును C విశేషము . నేను సంంచయును మాత్రమే ప్రత్యేకతినొఁడే బయువడు మూడురు. కనుక నే వేఁకటాధ్వరియఁతిటీ పండితుఁడు – 5 స్ప్రే శత్రుజయాయ వైజజరుణా దృఢ తేదెన చేప్పితోహృతి నిజం వపు య లేని తాపరా ధీతకః – అని ప్రశ్ని: పవలసివచ్చినది. కాని వాత్స్యా - మమతాను రచిం చిన a. కామసూ ప్రేగులను సితి నిబుధం హేశువులనుగా పేర్కొనుచున్నాడు. అనగా లోకము యొక్క సంస్థితిని చెక్క ఒఱచి లోకయాత్రా నిర్వహణ మొనర్చఁ గోరు త్రిష్ణా కారులకు మార్గదర్శక - మలనుగా సూచించుచున్నాడని భావము. కామసూత్ర అఃబంధికము అనుటలో వాత్స్యాయనమహః యొక్క 'యద్ధ పాయమేమియో మనము తెలిసికొన్ని ముం చాలుఁగు ఈ పరిగ్రాహ్యా గ్రాహ్యశం కాపిశాచి ముదూడ తొలగిపోవగలను. కృత్యవిరాణమును సుకర మగును. ప్రాయశః ఆ`్యజనతే ఆముష్మిక వ్యగ్రహృదయ. కనుకనే సర్వాకాల సర్వావస్థలయందము ప్రతి పనియు ఆముష్మిక్మన కవి గూరమై ఐహికమును అత్యంతమును ఆవశ్యకముగ నుండునట్లుగా వారేప్ప ఱచుచు వచ్చి . ప్రాచీనులగు ఆభ్యులలో ఐహికాముష్మిక సాధన ములగు పురుషార్థములను నిర్వచించుటలో మతి భేదము గలదు. ధర్మము అర్థము కామము మోక్షము అని పురు పా ముం నాలుగు. ఈ నాలిగింటిలో నాలవదియగు