Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/గ్రంథాలయములు (పద్యములు)

వికీసోర్స్ నుండి

గ్రంథాలయములు

శ్రీ భారతిసతి స్థిరనివాసంబున

కాలవాలములు గ్రంథాలయములు

అజ్ఞానతిమిరంబు హరియింప విమల వి

ద్యావిలాసములు గ్రంథాలయములం

సాంఘికమతఃహస్యములెల్ల డెల్పు స

ధర్మాలయములు గ్రంథాలయములు

జాతీయ గౌరవాస్పదనిరాటంక శు

భాదర్శకములు గ్రంథాలయములు


తే. ఇట్టి గ్రంథాలయోద్యమ మెల్లగతుల
విస్తరింపగ భాషాభివృద్ధిగాంచి
భారతీయులు తొల్లింటిభంగి మెరియ
విన్నవించెద నీచిన్ని నిన్నపంబు|


సీ| మన పూర్వవిజ్ఞానఖని విరాజిలుటకు

గ్రంథాలయములే సత్కారణములు

మన సనాతనధర్మమహిమోన్నతికి సదా

గ్రంథాలయములె సత్కారణములు

మన సహోదరుల, సన్మార్గాకాభివృద్ధికి

గ్రంథాలయములె సత్కారణములు

మన దేశ మైకమత్యనిరూఢి గనుటకు

గ్రంథాలయములె సత్కారణములు


తే! ఇట్టి గ్రంథాలయోద్యమ మెల్లగతుల
విస్తరింపగ భాషాభివృద్ధిగాంచి
భారతీయులు తొల్లింటిభంగి మెరియ
విన్నవించెద నీచిన్ని విన్నపంబు!

— ఏనుగు తిమ్మకవి