గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/గుంటూరు మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ.
గుంటూరు మండల గ్రంథాలయ ప్రతినిథుల మహాసభ
ఈసభగూడ ఆంధ్రదేశ గ్రంథాలయ సభతోపాటు పమిడిపాడు గ్రామమున జరిగినది. అధ్యక్షులు అనంత వరవాస్తవ్యులును స్వగ్రామమున ఎక్కువ ద్రవ్యము వెచ్చించి గ్రంథాలయ భవన నిర్మాణము చేసినవారును, సహాయనిరాకరణోద్యమమున అతిరధులై నిల్చి తత్సలముగా ఒక సంవత్సర కాలము శ్రీకృష్ణజన్మ స్థానము నలంకరించి కొద్ది కాలము క్రిందటనే తిరిగివచ్చిన శ్రీయుత కుప్పా శ్రీరామశర్మగారు, వీరి యుపన్యాసము కేవల అనుభవపూరితము. వారి గ్రామమునకు గ్రంథాలయము చేసిన ఉపకారమును పూసగ్రుచ్చినట్లు ఇట్లు సెలవిచ్చిరి: గ్రంథాలయమూలమున ప్రజలు విద్యావంతులైరి. అందు ముఖ్యముగా స్త్రీలు భాగవత భారతాదుల స్వయముగా చదువుకొని యానందము నందుచున్నారు. ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము, స్వతంత్రేచ్ఛ ప్రజలయందు తీవ్రముగ వ్యాపించినది. ఇందుకు ఫలితముగ 23 గ్రామస్థులు గైదుకు వెళ్ళియున్నారు. ఇంకను వెళ్ళుటకు సంసిద్ధులుగా నున్నారు. గ్రామముఁనుండి కోర్టులకు వెళ్లు వ్యాజ్యములు చాల తక్కువైనవి. బాలురకును, బాలికలకును గ్రామస్థులే పాఠశాలల నేర్పర్చిరి.
ఈసభయందు రాబోవు సంవత్సరమున మండల మందంతటను ఉద్యమము దట్టముగా వ్యాపించుటకు తగిన కార్యవిధానము చర్చించబడి తీర్మానింపబడినది.