Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/ఎనిమిదవ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ

​

ఎనిమిదవ ఆంధ్రదేశ గ్రంధాలయ ప్రతినిధుల మహాసభ

మహానందిలో సభ కూడిన పిదప తిరిగి సభకూడుటకు ఆలస్యమైనది. ఇంద వలన గ్రంథాలయోవ్యమాభిమానులు యందు కొంత నిరుత్సాహము కల్గినది. తుదకు పమిడిపాడులో ఈ సభ కూడినది. ఈ సభను సమావేశపర్చుటయందు ముఖ్యులు శ్రీయుత బెల్లంకొండ రాఘవరావుగారు. మా చదువరులలో శ్రీరాఘవరావు గారిని ఎరుగనివారుండరని తెలంచెదము. పిన్నవయస్కులై పితృపితా మహార్జితమగు ఐశ్వర్యముతో తులతూగుచుండియు, నీరుపమాన దేశాభిమానులై, నిరంతరభాషాసేవాపరితంత్రులై ఆంధ్ర దేశమం దుద్భవించుచున్న అన్నిసదుద్యమములకు పెట్టనికోటయై శ్రీరాఘవరావుగారు వెదల్లుచున్నారు. ఇట్టి ఊదారవంతుని, ఇట్టి యశః కాముని, ఇట్టి భాషాకోవిదుని యాతిథ్యము నందుటకై ఆంధ్రదేశము యొక్క నలుదెసల నుండి సభకు ప్రతినిధు లేతెంచిరి. 35 గ్రంథాలయముల నుండి 75 మంది ప్రతినిధులు వచ్చిరి. ఇందు పదిమంది స్త్రీలు, పమిడిపాడు రాఘవరావుగారి అగ్రహారము చిరకాలమునుండియు పండితులు నివాసగ్రామము. పిన్నవయస్సులోనే, తమ వైదుష్యముచే దిగంతవిశ్రాంత కీర్తినిగని నిర్యాణమునందిన శ్రీ బెల్లంకొండ రామారావుగారి జన్మస్థానము. ఇప్పటికిని ఈ గ్రామముని సంస్కృత పాఠశాలయు, గ్రంథాలయమును గలవు.

ఈ అగ్రహారిమఁదలి ప్రజలు కూడ దేశహితైక కార్యముల పాల్గొనుట కలవాటు పడిన వారగుటచే వారందరును ప్రతినిధులకు సౌకర్యముల నొనగూర్చుటయందు మిక్కిలి సహయులైరి.

నగరసంకీర్తతో సభాకార్యములు ప్రారంభమాయెను. సభాధ్యక్షులు శ్రీయుతి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రామదాసు గారిని గుంటూరు మండల గ్రంథాలయ సభాధ్యక్షతకు ఎన్నుకొనబడిన సుప్రసిద్ద ఆంధ్రదేశ సేవకులగు కుప్పా శ్రీరామశర్మగారిని నిరుపమాన దేశసేవాపరాయణులగు శ్రీయుత ఉన్నవ లక్ష్మీనారాయణగారిని, తురగ శకటారూఢులుగ జేసి గ్రామవీధుల ఉత్సవముతో నూరేగింపు జరపిరి. గ్రంథాలయ భజనశాఖవారు భజన చేయుచును, బాలశాఖవారు కోలాటము వేయుచును ఉత్సవమునకు వన్నెదెచ్చిరి,

పిమ్మట సభ సమావేశమైనది. రాఘవరావుగారు సభ్యులకు మృదుమధురవాక్యములతో నాహ్వానమొసంగిరి. పిమ్మట సూరి వెంకటనరసింహశాస్త్రిగారు అధ్యక్షని ఎన్నుకొనుచు తీర్మాన ముపపాదించిరి. శ్రీయుత కోలవెన్ను రామకోటేశ్వరరావు గారును, పి. వరహాలుగారును తీర్మానమును బలపరుప అధ్యక్షులు శ్రీయుత ఆంధ్రరత్న బిరుదాంకితులు తమపదవి నధిష్ఠించిరి. అధ్యక్షకో పన్యాసము ఆనాటి రాత్రికి ఏర్పాటు చేయబడినది. అంతటితో ఉదయపు సభ ముగిసినది. మధ్యాహ్నము గుంటూరు మండల గ్రంథాలయసభ శ్రీయుతి కుప్పా శ్రీరాముశర్మగారి యధ్యక్షతక్రింద ప్రారంభమైనది. నాటిదినము రాత్రి 9 గంటలు మొదలు ²½ గంటల వరకు అధ్యక్షుని యుపన్యాసము జరిగినది.

అధ్యక్షులు తమ సహజమృదుమధుర వాక్యములు సెలవిచ్చిన యుపన్యాసమును ముందు సంచికలో ప్రకటించెదమ. ముఖ్యాంశములను మాత్ర మిచ్చట పొందుపరచుచున్నాము.

చెన్న పట్టణములో అఖిలభారత గ్రంథాలయ మహాసభ జరిగినపుడు గ్రంథాలయములం పాశ్చాత్య సంస్థలనియు, భారతీయ ధారావాహిక పరిజ్ఞానముకు విరుద్ధములనియు నేను నుడివి అందునుగూర్చి చర్చ జరిపితిని.

పిమ్మట గ్రంథాలయోద్యమమును గూర్చి తీవ్రముగ యోచించితిని. గ్రంథాలయములు కేవలము గ్రంథములను పంరక్షించు స్థానము లేయై, అచ్చటనుండు భాండాగారికుడు గ్రంథములను భద్రపరచి, చదువరుల కందిచ్చువాడేయైనచో గ్రంథాలయములు త్యాజ్యములు. ఏలసనగా అధికారి భేదము లేక కోరిన గ్రంథము నెల్ల చదువరికిచ్చినచో ఆ చదువరి అన్ని సందర్భములయందును ఉపయోగమునే పొందడు. ఒకప్పుడు ప్రమాదమునుకూడ పొందును. కావున చదువరికి తగిన గ్రంధమును నిర్ణయించుటకును ఏవిషయమును గూర్చిన జ్ఞానము ఎటెట్లు సంపాదింపవలసినదియు బోధించి చెప్పుటకు తగు కధకుడొకడు ప్రతిగ్రంథాలయమందుండవలెను. అచ్చట సర్వమతి సహిష్ణుతను సర్వభూతిహితీయును బోధించు అన్ని మతముల వారి గ్రంధములను చేర్చియుంచవలెను. లౌకికవిషయములందు ప్రత్యేకమగు గ్రంధ సమూహములను సేకరించవచ్చును గాని వీనికి మొదటి తరగతి గ్రంధములు నివ్వవలసినంత ప్రాముఖ్యత నివ్వ నవసరములేదు. గ్రంథాలయములు జాతియొక్క మును ప్రతిఫలించునవిగా నుండవలెను. సకలశాస్త్రము ​లకును కళలకును సంబంధించు గ్రంధములమాత్రమే నచ్చట భద్రపరచుటయేగాక తత్తత్సానీయులగు శాస్త్రపండితులను, కళా కోవిదులను గ్రంథాలయముల యాజమాన్యమున సమావేశపరిచి వారివైదుష్యమును ప్రజలకు వ్యక్తి కరింపచేయుచు వీలుగునపుడు వారల సత్కరించుచు నుండవలెను. గ్రామమందలి బీదవాండ్రందరియొక్కయు పట్టీని గ్రంథాలయమువారు తయారుచేసి అట్టి జీవనోపాధి కొరకు వృత్తులను కల్పించుచుండవలెను. గ్రామస్తు లందరీయఁదును ఐక్యభావము కల్పించుటకు వనభోజనములు మొదలగు సంస్థలను గ్రంథాలయములు జరుపుచుండవలెను. ఆన్యోన్యస్పర్ధను పుట్టించునట్టిగాని, పెంపుచేయునట్టిగాని ఏవిషయమునందును గ్రంథాలయముల వారు పాల్గొనగూడదు. ఇట్లు ప్రజాహితైక కార్యములనుగూర్చి గ్రంథాలయములు కృషి సలుపుచు జాత్యభ్యుదయమును సర్వజన భ్రాతృత్వమును ఒనగూర్చవలెను.

ఇది యంతయు సభ మొదటి దినమున జరిగినది. రెండవదినము ఉదయమున సభ యంతయు విషయనిర్దయికసభగా నేర్పడి తీర్మానములు చర్చించబడినవి. సాయంత్రము పూర్తిసభలో తీర్మానములు అంగీకారము పొందెను. తీర్మానములన్నియు ఈసంచికయందే వేరొకచో బ్రకటింపబడినవి. అందు ముఖ్యమైంది గ్రంథాలయోద్యమముయొక్క వ్యాప్తిని, ప్రాప్యమును నిర్ణయించునదియై యున్నది. తక్కిన తీర్మానములలో స్వయంసహాయమమీద గ్రంథాలయోద్యమ మాధారపడియుండుటకు గాను ప్రతిసంవత్సరము వినాయక చవితి పండుగ నాడు ఆంధ్రదేశమంతటను భిక్షమెత్తి గ్రంథాలయోద్యమమును నిర్వహించవలేననునది. ఈ తీర్మానము ఉద్యమాభిమాను లెల్లరు ముఖ్యముగా గమనించవలసింది. ఇందును గూర్చి ఇప్పటి నుండియే ప్రయత్నము చేయవలెను. అది ఎట్లనగా కొంత ప్రఖ్యాతినిపొంది పలుకుబడి సంపదించిన గాని ఏయుద్యమమునకును సర్వజనాదర మేర్పడదు. ప్రజాసేవ ఇప్పటినుండియు అకుంఠితముగా గ్రంథాలయములు చేసిన గాని రాబోవు వినాయక చవితి పండుగ నాడు ఈయుద్యమము పేరిట భిక్ష మెత్తుటకు గ్రంధభాండాగారికులకు అధికార మేర్పడదు. ధనము లేనిది ఉద్యమము నడవదు గనుకను, యోగ్యతయుండిన గాని ధనము చేకూరదు గనుకను ఈసభయందు నిర్ణయించిన మార్గములను తదితరమార్గములనుకూడ ననుసరించి నిరంతరము గ్రంథాలయములు కృషి చేయవలసి యున్నది.

గ్రంథాలయములు గ్రంధములతో ముఖ్యముగా పనిగలవిగనుక మాతృభాషయందుత్తమ గ్రంధములు విలువయుండుటకు ఆంధ్రగ్రంథాల యోద్యమము పాటుబడుటకు సహజము. స్వదేశభాషయందు వివిధ విషయిక గ్రంధములను ప్రచురించుటకు ఎన్నియో గ్రంథామాలలు మనదేశమున గడచిన సుమారు ఇరువది సంవత్సరముల నుండియు కృషి చేయుచున్నవి. ఐరోపా ఘోర సంగ్రామ కారణమున కాగితములకు కరువుఏర్పడి తన్మూలమున వీనికి అంతరాయ మేర్పడింది. ఇదియును గాక ఎక్కువ గ్రంధమాలలు కేవలము నవలలు నాటకములను మాత్రమే ప్రచురించుచున్నవి. దేశచరిత్రలు, పరిశోధన గ్రంథములు విమర్శలు మొదలగు విషయములందు ప్రత్యేక సమర్థతనొందిన పండితులచే రచింపబడిన గ్రంథములు వెంటనే ప్రచురింపబడవలెను. దేశనాయకు లెందరో తాము శ్రీకృష్ణజన్మస్థాన మలంకరించి విశ్రాంతి నొందిన కాలమున ఉత్తమమగు గ్రంథములను రచించిరని తెలియుచున్నది. ఈ గ్రంధములను వెంటనే ప్రకటించుటకు తగు ఏర్పాట్లు చేయవలసియున్నది. ఈయంశముల సన్నీటిని గమనించి గ్రంథాలయోద్యమపక్షమున గ్రంథమాల నొకదానిని, పరిశోధనపత్రిక నొకదానిని నిర్వహించుటకు తీర్మానింపబడినది. ఈ కార్యమును నిర్వహించగల విద్యావంతులకు మనదేశమున లోపములేదు. గ్రంధమాలను నిర్వహించుటకు శ్రీయుత కోలవెన్ను రామోటీశ్వరరావుగారును పరిశోధనపత్రికను నిర్వహించుటకు శ్రీయుత ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారును ఆంగీకరించిరి. ద్రవ్యసహాయము మాత్రము కావలెను. అసరసముగు ధరలకు శీఘ్రముగా గ్రంధముల నచ్చొత్తించుటకు ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల స్థాపింపబడియున్నది. కావున ఆంధ్రవిద్వాంసులు గ్రంథములను రచించియు, ధనికులు ద్రవ్య సహాయము చేసియు ఈ తీర్మానము నాచరణలో పెట్టుటకు తగు సహాయము చేయ ప్రార్థితులు, ఆట్లు చేసినచో అచిరకాలమున స్వల్పఖరీదులకు ఆముల్య గ్రంధములు ఆంధ్రజనులకు అందచేయవచ్చును.

కాకినాడలో రాబోవు డిసెంబరులో ఆఖిలభారత గ్రంథాలయ ప్రతినిథుల మహాసభ జరుపుటకు మరియొక తీర్మానము ప్రవర్తించినది. ఇది చాల ముఖ్యము. 1919 సంవత్సరములో చెన్నపట్టణములో మొదటిసభ జరిగినపుడు అందుకు జవాబుదారీ వహించినది ఆంధ్రులే. అయితే రెండవ సభ బరోడా రాజధాని నగమున జరుపబడునని ఆసభాధ్యక్షత వహించిన శ్రీయుత ​జే.ఎన్.కుడల్కరుగారు సెలవిచ్చిరి. కాలగతిచే వారు పిన్నె వయస్సునందే నిర్యాణము నొందిరి. అందుచే ఈవరకు రెండవసభ జరుగ లేదు. మరియొకరీసభను జరుపుదురనుటకు యాధారములు లేవు. ఏలయందురా, మనదేశమున ప్రత్యేకముగా ఉద్యమముగా నిర్మాణమై గ్రంథాలయోద్యమము సమర్థింపబడుచున్నది. బ్రిటిషు ఇండియాలో ఆంధ్రరాష్ట్రమున మాత్రమే. మహారాష్ట్ర దేశమున కొంత కృషి జరుగుచున్నదిగాని ఈసభను అక్కడ కాహ్వానము చేసి నిర్వహింపదగునంత ఉత్సాహ మచ్చట యున్నట్లు గానరాదు. ఇతర గ్రంథాలయములు స్వదేశ సంస్థానములలో నున్నవి. బ్రిటిషు ప్రభుత్వమువారిచే నిర్వహింపబడునవి. వీరు ఈసభను సమావేశము చేయురనుట మాట వేరుగ చెప్పనక్కరలేదు. కావున మరియొక తూరిగూడ ఆంధ్రులే ఈ సభను సమావేశపరచుట యావశ్యకము. కావున ఉద్యమాభిమానులందరు ఇప్పటినుండియే శ్రద్ధవహించి ఈసభను జయప్రదముగా జరుపుటకు ప్రయత్నములు చేయుటకు ప్రార్దితులు. . ఈసభతోపాటు చిత్రికళా ప్రదర్శనను కూడ జరుపుటకు కూడ తీర్మానింపబడినది. ఈపని ఎక్కువ వ్రయప్రయాణనతో గాని సమకూడునది కాదు. ఇందును గూర్చి కూడ ఇప్పటినుండియే ప్రయత్నములు సాగించవలెను.

ఈయేడు సభ అనేక కారణములచే ప్రఖ్యాతిని వహించియున్నది. మొట్టమొదటిది విద్యాధికులని పేరు గన్న ఆంగ్ల విద్యావంతులు ఏపట్టణమందో మూడు దినములముచ్చటగా ఈసభ నిర్వహించక కేవలము ఉద్యమమునందు గాఢమగు విశ్వాసముకల్గిన జానపదులే ఈ సభను సమావేశపరచి నిర్వహించిరి, రెండవ విషయము ఈ సభలో పాల్గొన్న వారిలో కొందరు రాజకీయరంగమున తీవ్రమగు కృషి సల్పుచు దేశాభివృద్ధికొరకు స్వరాజ్యప్రాప్తియే అవశ్యకార్యమని మమోవాక్కాయ కర్మలయందు రూఢిపరచువారయ్యు౦డియు గ్రంథాల యోద్యమమును రాజకీయ వాతావరణమునకు సహజములగు భేదభావములకు లోబర్చకూడదనియు, అన్ని పక్షములకును అన్ని వాదములకును గ్రంథాలయము లతీతముగానుంచి అందరకును సమానమగు ఆదరణ గలదిగా నుండునట్లు ఉద్యమాభిమాను లెల్లపుడును కృషి సల్పుచుండవలెననియు సభయందు సర్వజనులచే యంగీకృతమాయెను.

ఈసభ జరుగుటకు ఆలస్యమైనపుడు ఆంధ్రదేశమున కల్గిన యాందోళనయే ఉద్యమముయొక్క శక్తిని వ్యాప్తిని చెప్పక చెప్పుచున్నది. కేవలము ఈ యుద్యమము యొక్క మహాత్మ్యమును వర్ణించుట తోనే ని చెప్పక ఉద్యమాభిమానులు కాలము వ్యయపుచ్చక ఉద్యమ కార్యములను సక్రమమగు మార్గముల నవలంబించి జరుపుటకు మిక్కిలి ప్రార్థితులు. ఈసభావృత్తాంతమును రాబోవు సంచిక యందు విపులముగా ముద్రించెదము.