Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధులు మహాసభ, పమిడిపాడు

​

ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ, పమిడిపాడు

1-2-3 తేదీలు మే 1923

౧

ఆంధ్ర దేశాభ్యుదయము కొరకై తమజీవితము నంతను ధారవోసి పిన్ని వియస్సులోనే కీర్తిశేషులైన కోపల్లె హనుమంతరావు పంతులు గా గారి నిర్యాణమువల్ల దేశమునకు కల్గిన తీరనిలోపమునుకు ఈ సభవారు చింతిల్లుచు వారి ఆత్మకు నిత్యశాంతి నొసఁగుటకు పరవేశ్వరుని ప్రార్ధించుచున్నారు.

౨

యాపర్విత్వతమునకు ధర్మోపదేశము గావించి నవతరంచిన శ్రీ గాంధీ మహాత్ములవారు భారతభూమి కొనర్చిన మహదుపకృతుల ప్రశంసించుచు ఆచిరకాలములో వానికి చెఱతప్పించి తిరిగి ధర్మపీఠము నధిష్టింప పరమేశ్వరుడు అనుగ్రహించుగాత యని ఈ సభవారు ప్రార్ధించుచున్నారు.

3

శ్రీమదాంధ్ర గ్రంథాలయ మహోద్యమముయొక్క ప్రథానధర్మము సర్వమత సహనశీలమును, సకలోదార భావప్రపూర్ణములను నిష్పాక్షికములందు నగుసాధనమార్గములను వరత మనుష్ఠించి నిఖిలాంధ్రాభ్యుదయము నిజవ్యక్త్యుత్తేజకముగా పెంపొందింపచేయుటయని సిద్దాంతీకరించుచు, యిందు ముఖ్యముగా,

౧) రసజతను పెంపొందించుట. అనగా సంగీత సాహిత్యాది సర్వకళాపోషణమున్నూ,::
౨) దీనజ పోషణమున్నూ,::
3) నిరంతర ధర్మ వ్యాఖ్యానమున్నూ,::
౪) పరమార్ధము ప్రసాదించు విశిష్టగ్రంథదేవతారాధనమున్నూ ప్రథానలక్ష్యములని యీ సభవారు తీర్మానించుచున్నారు.::
౫) ఏతల్లక్ష్యాత్మకమగు కార్యవిధానమును, యీ దిగువ వివరింపబడిన రీతిని ప్రతి గ్రంథాలయము అనుష్ఠింపవలయునని యీ సభవారు హెచ్చరించుచున్నారు.::

క. ::(౧) పురాతన గ్రంథములను సేకరించుట.::

 ::(౨) ఆయా గ్రామములలోని కళాభిజ్ఞుల వివరములను తెలుసుకొని వారిని సర్వవిధముల ప్రోత్సహించుట.::
 ::(3) స్థానిక విశేషములను తగు పరిశోధన చేసి శిధిలమైన పురాతనకళల చిహ్నములను పునరుద్ధరించుట.::
 ::(౪) యదార్ధమైన స్థలపురాణముల నిర్ణయించుట.::

ఘ. గ్రామమందు నిరాధారులగూర్చి వివరములను తెలుసుకొనియుంచి వారికి చేతిపనులు మొదలగునవి నేర్పియు యితర విధముల వారికి జీవనోపాధుల కల్పించుట.

గ. ప్రతి గ్రంథాలయమందును పరమార్ధమును సర్వప్రాణిసమత్వమును ప్రజలయందు ప్రేమానుబంధమును ఉద్బోధింపగల గ్రంధములను అనగా వేద వేశేదాంగపురాణేతిహాస ధర్మశాస్త్రాది గ్రంథములను, కొరాను, బైబులు, బౌద్దపీఠకాది వేదములను ప్రధానముగా సంగ్రహించి ఒక కథకుని నియమించి ఆయన మూలమును, నిరంతర ధర్మ వ్యాఖ్యానమును గావించుట. ​ఘ. ప్రజాభ్యుదయమునకు, సమిష్టి జరుగదగిన సర్వతో ముఖ్యమైన సేవావిధానమును స్థానిక విశేషముల గ్రహించి నిరంతరము నిర్వహించుట. ఆనగా యిందు వనభోజనములు జరుపుట, ప్రసిద్దపురుషులకు స్వాగతాదుల నర్పించుట, ప్రసిద్ధకళాభిజ్ఞుల సంభావించుట, సమిష్టి కార్యము లిందు ఊహ్యములు.

చ, నిష్పాక్షికములును, సర్వప్రాణి సమత్వారిలక్ష్య సమన్వితములును నగు సేవాసంఘములను గ్రామములందు నెలకొల్పి సమిష్టి ప్రజాసేవ గావించుట

ఛ. ప్రతిగ్రంథాలయ వార్షిక నివేదికయందు పైవిషయములనుగూర్చి చేసినపనిని విధ్యుక్తముగా తెలుపుచుండుట.

ఉపపాదక్షుడు:౼ కౌల్లంకొండ రాఘవరావుగారు::
ఆమోదకులు:౼ సూరి నరసింహశాస్త్రి గారు::
చిలుకూరి నారాయణరావుగారు::

४

ఈ సంవత్సరపు డిశంబరు నెలలో కాకినాడ పట్టణమున అఖిల భారత దేశగ్రంథాలయ ప్రతినిధుల మహాపభను ఆంధ్రసభ్యతను వ్యక్తీకరించు సర్వతోముఖ పదర్శనసహితముగా సమావేశపరచుటకు ఈసభ వారు తీర్మానించుచు ఈతీర్మానమును ఆచరణలోనికి తెచ్చుటకు ఈ క్రింది వారిని ఉపసంఘముగా నియమించుచున్నారు:

ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ అధికార సభ్యులు: 1.బులుసు సాంబమూర్తిగారు 2.న్యాపతి సుబ్బారావు పంతులుగారు 3.కంచుమర్తి రామచంద్రరావుగారు

ఈ సభ్యులు యితర సభ్యులను చేర్చుటకు అధికారము కిలిగియుండవలెను.

ఉపపాదక్షుడు:౼ సూరి వెంకటనరసింహం గారు::
ఆమోదకులు:౼ యాతగిరి లక్ష్మీవెంకటరమణ గారు::
కోలవెన్ను రామకోటేశ్వరరావుగారు::

౫

ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన పూర్వరచితమైన మూలగ్రంధములను శాసనములను ఆంధ్రభాషయందు ప్రకాసింప చేయుటకు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ పక్షమున "పరిశోధక" పత్రిక నొకటి ప్రకటించుట అవసరమని ఈ సభవారుతీర్మానించుచు, ఈ తీర్మానమును అమలులోకి తెచ్చుటకు, ఈ క్రిందివారిని ఉపసంఘముగా నేర్పరచుచున్నారు:

1. నడింపల్లి జగన్నాధరావుగారు, Convener. 2. చిలుకూరు నారాయణరావు గారు 3. ఉన్నవ లక్ష్మీనారాయణ రావు గారు 4. వేటూరి ప్రభాకరరావు గారు 5. భావరాజు వెంకటకృష్ణారావు గారు 6. పురాణం సూరిశాస్త్రి గారు 7. పెరిభొట్ల వీరయ్యగారు

ఉపపాదక్షుడు:౼శ్రీ యుత ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు ఆమోదకులు:౼చిలుకూరి నారాయణరావు పంతులుగారు.

ఈసంఘమునకు, ఉమ్మిడి పెట్టి, ఉన్నవ లక్ష్మీనారాయణపంతులు గారు.

ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘపక్షమున గ్రంథమాల నొకదానిని స్థాపించి ఆంధ్రవాఙ్మయాభివృద్ధికి అవసరమగు గ్రంధములనన్నిటిని సులభమగు వెలలకు ప్రకటించివలెనని ఈసభ వారు తీర్మానించుచు, వెంటనే ఈతీర్మాంమును ఆచణలోనికి తెచ్చుటకు ఈ క్రింది వారిని ఉపసంఘముగా నియమించుచున్నారు: ఉమ్మడి శెటి: — 1. కోలవెన్ను రామకోటేశ్వరరావుగారు, 2. నడింపల్లి లక్ష్మీనా "సింహారావుగారు, 3. గోపాలుని గ్రామలింగయ్య గారు, 4. గుంటూరు న"సింహారావుగారు, 5. ఉప్పులూరి లక్ష్మీనరసింహదాసు గారు, 6. చెట్టి లక్ష్మీనరసింహాగావు గారు, 7. రావూరి శ్రీశైలపతిగారు.

ఉపపాదక్షుడు:౼ ఉప్పులూరి లక్ష్మీనరసింహదాసుగారు:::
ఆమోదకులు:౼ పాణింగిపల్లి వరహాలుగారు::
కో.రామకోటేశ్వరరావు గారు::

౭

ప్రతివత్సరము వినాయక చవితినాడు భాండాగార సభ్యులెల్లరు ఆయా గ్రామములయందు భిక్షాటన మొనర్చి సమకూడిన సాహిత్య పరికరములను అచ్చటచ్చట యుంచుకొనుటకును ధనమునందు ⅛ వంతును ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు సభవారు పంపవలయునని తీర్మానించుచున్నారు. ​

ఉపపాదకులు:— కాతా శ్రీరామశాస్త్రిగారు
అమోదకులు:— పాతూరి వెంకటేశ్వర్లుగారు, ధూళి పూడి, నాళం మిట్టపల్లిగారు, రెంటచింతల

౮

ప్రతి గ్రంథాలయము వారును వసంతోత్సవమును జరుపవలయు ననియు. అప్పుడు సర్వకళ్యాణము జరిగించి స్వగ్రామమందలి సాహిత్యకోవిదులను శిల్పనిపుణులను బహూకరించవలయునని ఈ సభవారు తీర్మానించుచున్నారు.

ఉపపాదకులు:— శ్రీయుతులు కౌతా శ్రీరామశాస్త్రిగారు
అమోదకులు:— తెలికేపల్లి రామటేశ్వరశాస్త్రిగారు, ప్.ఎన్.శర్మగారు

౯

తిరిగి ఆఁధ్రగ్రంథాలయమహాసభ జరుగు లోపల గ్రంథాలయ సభ్యులను ఈదిగువ నుదహరించిన కార్యముల నిర్వహింపవలయునని ఈ మహాసభ విధించుచున్నది.

ఆయాగ్రామములందలి (1) ధర్మప్రతిష్ఠాపనలు, మొదలగువాని చరిత్రలను వ్రాయుట. (2) ఉత్సవములు మొ. వాని చరిత్ర వ్రాయుట. (3) వివిధజాతులు, మతములు, వారిచరిత్ర, వారివారి ఉత్సవములు — వాటికి సంబంధించిన చరిత్రను విపులముగ వ్రాయుట. (4) ఆగ్రామమందు పురాతన వస్తువుల నుంచి వృత్తాంతము వ్రాయుట. (5) వివిధజాతులు వారికుపకరించు పని ముట్లు వాని నామములు మొదలగువానిని సంగ్రహించుట. (6) నెల కొకమారు కళాసభను గూర్చుట.

ఉపపాదకులు:— కౌతా శ్రీరామశాస్త్రిగారు
అమోదకులు:— కొమాండూరి వేంకటాచార్యలు గారు, వెంటపాడు, ఆళ్వారు గారు, ఒంగోలు

౧౦

రాజమహేంద్రవరములోని గౌతమీ గ్రంథాలయ భవననిర్మాణముకొరకు రూ 6000 లు విరాళము నొసంగిన మ|| రా|| శ్రీ కంచుమర్తి వెంకటరామచంద్రరావు గారికిని బెజవాడ శ్రీరామమోహన ధర్మగ్రంథాలయమునకు రెండవ అంతస్థును కట్టించుచున్న కౌతా సూర్యనారాయణ రావుగారికిని యీ సభవారు కృతజ్ఞతను తెలుపుచున్నారు.

౧౧

కాకీనాడలో జరుగ బోవు కాంగ్రెసు సమావేశ సందర్భమునా, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మొదలగుభక్తులు సంకల్పించిన సప్తాహమునకు ఆంధ్రదేశమునందలి ప్రజలెల్లరును, గ్రంథాలయములను సమస్త విధములు సహాయము చేయవలెనని ఈ సభ వారు హెచ్చరించుచున్నారు.

ఉపపాదకులు:— బెలంకొండ రాఘవరావుగారు
అమోదకులు:— కుప్పా శ్రీరామశర్మగారు, కందాడై వెంకటకృష్ణమాచార్యులుగారు

౧౨

ఆంధ్రవాఙ్మయమునందు ముద్రితమైనట్టియు అముద్రితిమైనట్టియు గ్రంధములను, శాసనములను శాస్త్ర సమ్మతమగు విధానము ననుసరించి వర్గీకరణము చేసి పట్టీల తయారు చేయుటకును, చదువుకి కావలసిన గ్రంధమును వెంటనే సులభముగ లభింప చేసుకొనుటకు తగినట్లు చిహ్నములను గ్రంధముల కిచ్చుటకును గ్రంథ విభజన విధానము నొకదానిని నిరూపణ చేసి ప్రచురించుటకు ఆంధగ్రంథాలయ సంఘమువారిని ఈ సభవారు కోరుచున్నారు.

ఉపపాదకులు:— బెల్లంకొండ రాఘవరావుగారు::
అమోదకులు:— కుప్పా శ్రీరామశర్మగారు::

౧౩

అఖిలభారత దేశీయసామాన్య భాషగా వ్యవహరింపబడు చున్నట్టిన్ని, రాజకీయవ్యవిహారములయందవసరమైనటిన్ని హిందీభాషను త్వరలో ప్రచారమునకు తెచ్చుటకు ఆంధ్రదేశ గ్రంథాలయ సోదరులను యీసభవారు పోత్సహించుచున్నారు.

ఉపపాదకులు:— భా. గోపాలకృష్ణమూర్తిగారు::
అమోదకులు:— వె. సుబ్బారావుగారు::

౧౪

ప్రతిగ్రంథాలయమునుండియు సంవత్సరము కొకసారి అభివృద్ధిసూచినా పట్టిని ఆంధ్రరాష్ట్రీయ గ్రంథాలయస్థాయి సంఘపువారికి పంపుచుండవలయును. ప్రతి గ్రంథాలయమువారును వార్షిక ప్రవేశరుసుము రూ.౪-0-0 లను సదరు సంఘమువారికి చెల్లించు చుండవలయుననియు ఈ సభవారు తీర్మానించుచున్నారు.

గ్రంథాలయ సర్వస్వమును నుచితముగ నట్టి గ్రంథాలయమునకు పంపవలయును. ​

ఉపాదకులు:౼ గర్నెపూడి సీతారామయ్యగారు
ఆమోదకులు:౼ టి. పి. ఆళ్వారుగారు

౧౫

సర్వజన సమాదరణీయమైన ఖద్దరుచేత గ్రంథాలయముల యందుంచబడు గ్రంథములను బైండుకట్టించవలయునని యీసభవారు తీర్మానించుచున్నారు.

ఉపాదకులు:౼ రోడేటి రంగాచార్యుగారు
ఆమోదకులు:౼కాతా శ్రీరామశాస్త్రులుగారు, ఆచ్చుతన్న పిచ్చయ్యశర్మగారు

౧౬

గ్రంథాలయమహోద్యమమందు తీవ్రముగ పనిజరుగుటకుగాను ముగ్గురు కార్యదర్శులు చాల అవసరమని తీర్మానించుచున్నారు.

౧౭

ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు ఈ క్రింది వారిని కార్యనిర్వాహక సభగా ఏర్పాటు చేయడమైనది.

సామాన్యసభకు అధక్షుడు:౼ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు
కార్యనిర్వాహక వర్గ అధ్యక్షులు:౼ సూరి వెంకట నరిసింహశాస్త్రిగారు
ఉపాధ్యక్షులు:— చెలికాని లచ్చారావుగారు
కార్యదర్శులు:—అయ్యంకి వెంకటరమణయ్యగారు, బెలంకొండ రాఘవరావుగారు, పాణంగిపల్లి వరహాలుగారు

ఇతర సభ్యులు:— జిల్లా ౧కి రు 2 లు చొప్పున ఏర్పాటు చేయడమైనది.

గుంటూరు: — ఉన్నవ లక్ష్మీనారాయణగారు, టి. పి. ఆల్వారుగారు, గుంటూరు నరసింహారావుగారు

కృష్ణా:౼ కౌతా శ్రీరామశాస్త్రిగారు, కోలవెన్ను రామకోటేశ్వరరావుగారు, ఆరెకపూడి రామశాస్త్రులుగారు

గోదావరి:— యాతగిరి లక్ష్మీవెంకటరమణగారు, వేపూరి వేణుగోపాలదాసుగారు, ద్రోణంరాజు కామేశ్వరావుగారు

మిగిలిన సభ్యులను ఆయా జిల్లాలవారితో ఆలోచించి, చేర్చుటకు తీర్మానించడమైనది.

౧౮

ఆంధ్రగ్రంథాలయ ప్రెస్ లిమిటెడ్, బెజవాడకు రాబోవు వత్సరమునకు బెల్లంకొండ రాఘవరావు గారిని డైరెక్టరుగా ఎన్నుకోవడమైనది.

౧౯

రాబోవు సభను రాజను హేంద్రవరము, లక్ష్మీనరసాపురం, బెజవాడ గ్రామములయందు జరుపుట కాహ్వానము జరిగినది.

గోదావరిజిల్లా లక్ష్మీనరసాపురం గ్రామమందు జరుపుటకై శ్రీకావ్యనిధి చెలికాని అచ్చారావుగారి ఆహ్వానము అంగీకరింపబడింది.

    1. 48A##'