Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 2/శ్రీ రామారాయ గ్రంథాలయము

​

శ్రీరామారాయ గ్రంథాలయము

నర్సారావు పేటతాలూకా పమిడిపాడు అగ్రహారమందున్న శ్రీరామారాయ గ్రంథాలయ ద్వితీయ వార్షికోత్సవము 31-10-22 తేదిన శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి అధ్యక్షత క్రింద జరిగింది. సాయంత్రం 3 గంటలకు మాగ్రంథాలయ భజనశాఖ చేతను మంగళవాద్యములతోను అధ్యక్షుని యెదుర్కొని అర్ఘ్యపాద్యాదుల చేగౌరవించి గ్రంథాలయమునకు తోడ్కొనివచ్చిరి. దైవప్రార్థన జరిగిన పిమ్మట శ్రీ జెల్లఁగొండ రాఘవరావుగారిచే ఉపాదింపబడి, అధ్యక్షులు తమ అసనము నలంకరించి తమ ప్రారంభోపన్యాసమును గావించిరి. అందు ముఖ్యమగు కొన్ని సంగతులను తెలుపుచున్నాను.

గ్రంథాలయము ఒక విద్యావంతులకే కాక విద్యావిహీనంలకుగూడ ఉపయోగపడునాట్లుగా ఉండవలయును. అది యెట్లన, పత్రికలను చదివి దేశీయవార్తలను తెల్పుట, పురాణకథలను తెల్పుట మొదలైనవి. ఇందుఁడు భజనశాఖయందు విద్యావిహీనులనుగూడ చేర్చి కోలాటమును నేర్పి గరుడస్తంభము మొదలైనవి యేర్పాటుచేసిన చాలా బాగుగయుఁడుము. ప్రస్తుతము ఒక చందాలవల్లనే యి గ్రంథాలయమునకు ధనము వచ్చుచున్నట్లున్నది. విద్యావిహీనులయిన రయితులవల్లను ధాన్యమువగయిరాలు ​వసూలు చేసి వారికిని ఇందు భాగము కల్పించి ద్రవ్యమును సమకూర్పవలయును. పిమ్మట గ్రంథాలయావశ్యకతను గూర్చి శ్రీయుత వేమూరి శ్రీరాములుగారును, గ్రంథాలయ తత్వమును గూర్చియు, యీ గ్రంథాలయము జరుగుచున్న విధమును గూర్చియు బ్రహ్మశ్రీ లంకా సుందరరామశాస్త్రులు గారును ఉపన్యసించిరి. తదుపరి గ్రంథాలయ కార్యదర్శియగు శ్రీయులి బెల్లంకొండ హనుమంతరావు గారు యీ క్రింది కార్యనివేదికను చదిపిరి: —

కార్యనివేదిక

సుజ్ఞానజనకంబునకు మూలస్థానంబును ధర్మార్థ కామమోక్ష చాతుర్విధ పురుషార్థప్రదంబును, కామక్రోధాద్యరి షడ్వర్గ దూరీకరణంబును, సర్వజన విద్యాబోధకంబును, దేశీయవార్తాజ్ఞాసదివ్యచక్షువును,సర్వమతబోధికంబును,గాఁధ్యుపదిష్ట అసహాయయోగితత్వవిస్తరీ కరణంబునకు,ఆధారభూతమును, యగు గ్రంథాలయం బత్యవసరమనియెంచి సర్వజనానుమతంబై దత్సహాయంబున రౌద్రి సంవత్సర విజయదశమి భృగువాసరంబున యీ గ్రామంబున నొక గ్రంథాలయంబు స్థాపింపబడియె.

గ్రంథాలయ ప్రకరణోచితంబగు గ్రంథాలయ నామకరణంబు యుక్తంబుగాన కీర్తిశేషులును, న్యాయవేదాంత ధర్మశాస్త్రముల కాకరుండును, అఖండ విద్యాప్రదాతయును, యేతత్పురవాసియు, అస్మద్వంశాభిమృగలాంఛ నుండు నగు శ్రీయుత బెల్లంకొండ రామారావుగారి నామంబుచే యీ గ్రంథాలయం బలరారుట యుక్తమని యెంచి సర్వజనానుమోదితంబై " శ్రీ రామా రాయగ్రంథాలయం” బనుపేర యీ గ్రంథాలయంబు స్థాపితంబై యేతావత్పర్యంతము శోభిల్లుచున్నది.

దుర్మతిసంవత్సర ఆశ్వయుజ బహుళ విదియయందు పల్నాడుతాలూకా అంబాపుర గ్రామవాస్తవ్యులును, ప్రస్తుత మీ గ్రామమందు సంస్కృతవిద్యాప్రబోధకులును యగు బ్రహ్మశ్రీ లంకా సుందరరామశాస్త్రిగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ గావింపబడి యందు సకల జనానుమోదిశంబయి, అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్షుల యెన్నికలు జరుపబడియె.

అధ్యక్షుడు— బెల్లంకొండ రాఘవరావు. కార్యదర్శి — బెల్లంకొండ హనుమంతరావు. ఉపాధ్యక్షుడు —ముత్తరాజు లక్ష్మీనరసింహం గార్లున్నూ నిర్ణయింపబడి ప్రతి శనివారమును యీ గ్రంథాలయ శాఖయగు భజనశాఖచే భజనలు జరుపబడుచున్నవి. యీ గ్రంథాలయమందు బ్రహ్మశ్రీ లంకా సుందర రామశాస్త్రిగారిచే కార్తిక శుద్ధ ౫ మొదలు మార్గశిర పూర్ణిమపర్యంతము జైమినీ భారతమున్నూ, దుర్మతిసంవత్సర మార్గశిర బహుళ ౧౧ మొదలు మాఘ బహుళ సప్తమి పర్యంతము అధ్యాత్మ రామాయణమున్నూ పురాణరూపకముగా చెప్పబడియె. పుష్య శు ౨ (విదియ) రోజున యీగ్రంథాలయమందు సీతాకల్యాణ మహోత్సవమున్నూ జరుపబడియె. మాఘ బ౯ రోజున శ్రీరామపట్టాభిషేక సమారాధనయు జరుపబడియె. శ్రావణబహుళ ౧౧ రోజున యీ గ్రంథాలయపక్షముని తెప్పఉత్సవము జరుపబడియె. భాద్రపద శుద్ధ ఆ రోజుక యీ గ్రంథాలయ నాటకసంఘముల యొక్క ఛాయాపటగ్రహణమున్నూ జరుపబడియె. మార్గశిర శుద్ధ ౧౫ రోజున గతసంవత్సర వార్షికోత్సవమందు ఆమోదింపబడిన శ్రీయుత బెల్లంకొండ సీతారామయ్య గారి స్మారకోత్సవమున్నూ జరుపబడియె.

ఈ గ్రంథాలయమునకు సరుకూర్చిన గ్రంధములు 320. చందాదారులు 10. నిత్యమువచ్చు ప్రేక్షకుల సంఖ్య 2103. రోజునకువచ్చు ప్రేక్షకుల సంఖ్య 7. గ్రంథ గ్రాహకుల సంఖ్య 153. ఈ గ్రంథలయమునకు వచ్చువార్తాపత్రికలు (1) ఆంధ్రపత్రిక (దినపత్రిక) (2) కృష్ణాపత్రిక (3) అభినవ సరస్వతి.

గ్రంథాలయ ఆదాయవ్యయ నిర్ధారక పట్టిక :

ఈరోజున కార్యదర్శి వద్ద నిల్వయున్నది కు7-4-0 లు.

గీర్వాణ వాఙ్మయమున కస్మదాదుల కాద్యగురువులును, పండితోత్తములును, యీ గ్రంథాలయమందు యేవిధమయిన ఆధిపత్యము లేకపోయినను అస్మదాదులవలె శ్రమతీసుకొని యీగ్రంథాలయమును ఉద్ధరించు ​ చున్న బ్రహ్మశ్రీ లంకా ముందరరామశాస్త్రి గారికి యీ సంఘపక్షమున వందనశతకంబు లర్పించుచున్నవాడను.

ఈ గ్రంథాలయమందు యేవిధమయిన పదవి లేకున్నను కడు జాగరూకతతో యీ గ్రంథాలయ భాగమును వహింపుచున్న వారలును, అసహాయయోగ ప్రవర్తకులును యగు శ్రీయుత రాళ్ళబండి వెంకటేశ్వరశర్మ, రంగావఝల రామకోటయ్యగార్లను యెంత్రయో యీ సంఘపక్షముస కొనియాడుచున్నాను.

ఈ గ్రంథాలయమున కుచితముగా గ్రంధములనిచ్చిన వారికి యీసంఘపక్షమున వందనశతకంబు లర్పించుచున్నవాడను.

అనంతరము శ్రీయుత బెల్లంకొండ రాఘవరావుగారు యీగ్రంథాలయవిషయమై చాలాపాటుబడిన బ్రహ్మశ్రీ లంకా సుందరరామశాస్త్రి గారిని శ్లాఘించుచు యీ గ్రంథాలయవిషయమును బోధించిరి. అధ్యక్షుని అంత్యోపన్యాసములోను మంగళవాద్యములతోను సభ ముగిసెను.

ఈ గ్రంథాలయశాఖయగు నాటకశాఖచే ఆరాత్రి శ్రీకృష్ణరాయబారము (పాండవోద్యోగము) కడురమ్యముగా సకలజనాహ్లాదకరముగా ప్రదర్శింపబడెను. మరుసటిదినము అనగా దుందుభి సంవత్సర కార్తికశుద్ధ ౧౨ రోజున తృతీయవార్షిక కార్యనిర్వాహక వర్గయెన్నికలు జరుగుటకై బ్రహ్మశ్రీ లంకా సుందరరామశాస్త్రి గారి అధ్యక్షతిక్రింద సభగావింపబడి యీ క్రిందివిధముగా యెన్నికలు జరిగెను:

అధ్యక్షుడు - బెల్లంకొండ రాఘవరావు, ఉపాధ్యక్షుడు — ముత్తరాజు లక్ష్మీనరసింహం. కార్యదర్శి — బెల్లంకొండ హనుమంతరావు. సహాయ కార్యదర్శి — ముత్తరాజు రంగారావు.

కార్యనిర్వాహక సభ్యులు —— బెల్లంకొండ రామారావు. బెల్లంకొండ జగన్నాధరావు. బెల్లంకొండ నారాయణరావు, కోట రామసుబ్బయ్య.

ఈ గ్రంథాలయపక్షమున హిందీ, రాజ్యాంగతంత్రము, చరిత్ర, వాఙ్మయము మొదలైన విషయములలో క్రమశిక్షణయిచ్చుటకు ఒక జాతీయపాఠశాల స్థాపించుటకై తీర్మానించడమైనది.

- బెల్లకొండ హనుమంతరావు,

కార్యదర్శి

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse