గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 2/నవీనాంధ్ర కవులు
నవీనాంధ్రకవులు
II తిరుపతి వేంకటకవులు
తెలుగుబాసలో నిటీవల మొలకెత్తి, నలుమొగముల నల్లికొని, క్రొత్తపోకడల మించి మెరయు, కవితారంభంపుమొగసాలఁ దిరుపతి వేంకటేశ్వరులు నిలచియున్నారు. ప్రాచీనాంధ్రసారస్వత సారమంతయు లక్ష్యలక్షణ సమన్వితముగ వీరిలో జీర్ణించియుండెను. వర్తమానకాలమున మానవజాతులలో కావ్యకళాదులగూర్చి జరుగుచున్న భావవిపర్యయములు జక్కగ గుర్తించు వివేకము వీరికమఱి యుండెను. ప్రాచీనాంధ్రభాషా సంప్రదాయముల నూతనకాలోవిచితవిషయముల కుపకరింపజేసి, ప్రాచీనలక్షణమర్యాదల నవీనాదర్శములకు జతపఱచి, కావ్యములయొక్కయు, లక్షణగ్రంధముల యొక్కయు, పరస్పర సంబంధముల గుట్టుమట్టుల గమనించి, స్వతంత్రించి, క్రొత్తపోకడల మించి దారిజూపెడి మేటిగంటిమి వీరి కొప్పుచుండెను. స్వతంత్రించి మొదలిడిన కావ్యవైఖరుల దిగంతముల వ్యాపింపజేసి, భావిప్రయత్నములకు వలయు నుత్సాహోద్వేగముల నుత్పత్తిజేయదగు ఆత్మవిశ్వాసము, ఔదార్యము, పట్టుదల, వాదోత్సాహము, ధైర్యము వీరియందుండెను. ఆంధ్రకవితోపాసకుల భూత వర్తనూన భావిజీవితగతులు వీరి జీవనములో గోచరింపు, నవ్యాంధ్ర కావ్యరీతులు వీరి మానసారామనిబంధముల బలుతెరువుల వెలయ తిరుపతి వేంకటేశ్వరు లీనాఁటి తెలుగుపోకడల నాయకులై, నేతిలై, సూత్రధారులై యుగకర్తలై వెలుగుతున్నారు.
వీరి జీవితాంశములు తెలుగువారెల్ల పెరుంగుదురు గాన వాని నీయెడ విస్తరించము. ప్రాచీన గురుశిష్యసంప్రదాయముల నేటివరకు నిలుపుచు, నిరుపమశిష్యవాత్సల్యమునను, పరహితాపేక్షచేతను, వేలకొలది శిష్యులు సంపాదించి, సత్స్నేహధర్మములచే నిలుపుకొనజాలు సత్పురుషులు, చమూనాధులకుండు ఆశ్రితపక్షపాతము, నిరాఘూట ప్రచారము, నిర్భయ సమరోత్సాహము గల్గి వీరకరుణారసముల కాలవాలమయి, శాపానుగ్రహశక్తు లొప్పుచు, నాయకస్వరూపమును నిండువెలుగున బ్రకటింప గల ధీమంతులు. వీరు నిరంతర కావ్యరసోపాసకులు. ప్రాచీనకవులయెడను, తమ కావ్యములపట్లను, ఆరనియుత్సాహ ముత్పత్తిజేయగల తన్మయత్వము వీరి కలవడెను. ప్రాచీన కావ్య సాంఘిక మర్యాదలందు గౌరవముంచుచు, వాని ననవసరముగ నిర్హేతుకముగ ఖండింపక, ప్రాతవని పొడువెట్టక, వాని శృంఖలముల జిక్కికొనక, సమయోచితముగ నుపయోగించుచు స్వతంత్ర జీవితసూత్రముల నేర్పరచగలిగియుండిరి. ఇందుచే వీరు ప్రాచీన నవీన మర్యాదావలంబకులగు నాంధ్రభాషా సేవకు అందరివిశ్వాసమునకు గుదురైరి. వీరి యాదార్యము, బాలకవులయెడ జూపెడి వాత్సల్యప్రోత్సాహములు, మాటలసొబగు, స్నేహధర్మములు వీరిప్రతిభ నెల్లెడల జాటినవి.
శ్లో౹ కేచిత్ శ్రీపతి వేంక టేశ్వరకవి దృష్ట్వాధ శుశ్రూష
యా | కేచిత్ కేచిదమిత్రతా ముపగ తాః కేచిత్పరి
శ్వాంతికే ! అభ్యస్యంతి శతావధాన కలనాం కీర్తిం
లభంతే ధనం | తస్మా దాధుని కావధానిగురుతో
హేతూ గురూ సంశ్రయే ||
వీరి యుత్సాహప్రోత్సాహ తన్మయత్వముల కాంతిచే నెందరో భాషాసేవకులై సరసకావ్యముల గూర్చగలిగిరి. తిరుపతి వేంకటేశ్వరులు గుణగ్రాహులు, పరాభిప్రాయమును సహించువారలు, వినయసంపన్నులు. పెద్దబింకములదారు లెరుగక నందరితో కలసిమెలసి సంచరించు నిండుకుండలు. అయినను వలసినచో వెఱ్ఱి మొఱ్ఱి బడాయిల నణగద్రొక్కవలసినచో, పండిత వాదప్రహారముల నణగద్రొక్కనవలయుచో, వీరి మానస మిట్లుఁడెను.
శా౹ "మాకన్నన్ మహనీయు లైనకవు లీక్ష్మామండలి౯
లేకపో ! రీకాలంబున యుష్మదీయ కవితాద్వీపంబు
ముంపంగ నస్త్రోక శ్రీక మదీయదివ్యకవితాతుంగార్భటీ
ఘోరగం। గాకల్లోలవతీ ప్రవాహభర వేగ ప్రక్రియల్ చాలవే"
తాము స్వతంత్రించి బూనిన నూత్నకవితామార్గముల నిలచి నిలుపగల యహంకారము, పూనిక ఉత్సాహము నైజసత్వమున దీపింప, తిరుపతి వేంకటేశ్వరులు నవీనాఁధ్రకవితాపురోగాములై విలసిల్లిరి.
తిరుపతికవులు తెలుగుకవిత్వమును ప్రభుపోషణమునుండి తప్పించి, ప్రజాపోషణమున జేర్చి, కవుల స్వాతంత్య్రమును, కావ్యముల పరమైశ్వర్యవిభూతిని నెలకొలిపియున్నారు, రాజుల దర్శించి, సంపన్నుల జూచి, "సన్మానము లంది బహుమానములన్ గ్రహీయించిరే” గాని, కావ్యలక్ష్మీవిలాసముల నరస్తవమునకుపయోగింపలేదు. నానారాజ సందర్శనమునందగుపడు చర్యలన్నియు, "జయంతితే సుకృతినో రససిద్దాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం" బను నార్యోక్తి జాటుచు, "ధరణీశులు మ్రొక్కగ నిక్కి నా" మను నిర్లక్ష్యమానస స్వాతంత్య్రమును, సూచించుచుఁడును. అంతకుమున్ను రాజాశ్రితులగు తెలుగుకవులు తామల్లినపొత్తముల రేడులకందించు వేడుకఁ బెద్దప్రొద్దు లోపికతో రేనిచూపుల గాచి యుండి, తిరుపతి వేంకటేశ్వరులు విజయనగరమున, నభినవభోజుడోయన సరస గుణసాంద్రుడై, సకలకళాసంపన్నుడై. కవికల్పవల్లియై వెలుగొందు ఆనందగజపతీంద్రుని గనుంగొని "ఎందరి జూచెనేని వరియింపదు మాకవితా కుమారి.......తటాలున దీనిఁ బరిగ్రహింపుమా” యని హెచ్చరించి, వసుమతీశులు కూడ కావ్య సామ్రాజ్యవైభవంబులు పరమాత్కృష్ట్యమును అంగీకరింపవలయుగారవ మేర్పరచిరి.
తిరుపతికవులు కావ్యసాధనమే మోక్ష సాధనమని విశ్వసించి, నిర్మలవిశుద్ధ రసానుభవమున నుత్తమగతుల జింద సుద్యోగింతురు. శ్రోత్రియమగు జీవనముకాని, వైదికాచార సంపత్తులు కాని, దేవతోపాసనకాని, పరతత్త్వమును, పురాణగాధలను పరివని బేర్కొనుటకాని, కవుల నిత్యసాధనగ వీరంగీకరింపరు. “శృంఖలాతృణీకరణమందు” కావ్యకలనానుకూలముగు మానసమే, రసాత్మకనుగు నీశ్వరోపాసనయే మోక్ష కారణమగునని జెప్పియున్నారు. ఇందువలన తిరుపతికవుల కుపాసితదేవి లేదన రాదు. వెంకటశాస్త్రి సహజగాంభీర్యముతో, "అస్మదుపాస్య, అమ్మహోదార చరిత్ర యియ్యెడల దారచియింపకపోదు సాయమున్" అని నిత్యము నమ్ముచుండెను. తిరుపతిసింగపు హృదయాంతరాళము, భీముని మానసమువలె, కోమలవినయలాలిత్య మొప్పుచు " హేయంబైన సభాపరాభవము రానీకమ్మ కాత్యాయనీ,” యంచు జాలి పలుకుల నమ్మను గొలుచుచుండెను. గురుజనఁబులగూర్చి వీరి కపరిమితవిశ్వాసముండెను. ఈ కృతజ్ఞతయే వీరి భక్తవర్గమును గూర్చగలిగినది. “వారింగన్న కవీశ్వరుండయిన, నెవ్వాడైన” గురుద్రోహ మొనరింపగూడదనియే వీరి యభిమతము. ప్రాచీన హైందవాచారములపట్ల పహేతుకమైన యభిమానముంచి నిలవదీయుచు, పాశ్చాత్య సంపర్కమున నేర్పడిన సంఘ సంస్కరణాభిలాషను నిగ్రహించుచు, జాతీయధర్మ ప్రతిస్థాపనలందు మాన్యత నేర్పరచుచుండిరి.
తిరుపతికపులు ఖండకావ్యములకు దారి జూపిరి. భారతభాగవతాది మహాపురాణములు రచించుటకు వలయు లోకానుగ్రహదీక్షయు, తపస్సంపత్తియు, రససిద్ధియు తిక్కన పోతనాదులు కొప్పియుండెను. ఆంధ్రకవితాపితామహుని మనుచరిత్ర యేగ్పడుకాలమునకే తెలుగుకవులపస కొంత చెడినదని జెప్పవచ్చును. పెద్దన మూడాశ్వాసముల బూరించినంతనే కాస్యవైఖరి మారినది. తరువాత కార్యకర్తలు ప్రబంధములలో నష్టాదశవర్ణనల నింపి, కావ్యమును ఖండచిత్రముల సంపుటముగ నోనర్చిరి. ఇవియు చేసుకూరివాని యనంతరము రసరూప సౌందర్యములు వీడినవి. సామర్థ్యమెట్లున్నను తిరుపతికవులకు ముందు బేరొందిన వీరేశలింగకవిగూడ, “శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన నైషధము” రచియించెను. తిరుపతికవులవధానకవిత్వమును జనరంజకముగ నొనర్చి, సుళువగు సరసమగు, లక్ష్మణ సహితమగు భాషలో సమస్తవిషయము లను, నానా సందర్భములను, సుబోధకముగ ముద్దలొలుక బలుకుచుండిరి. అవధానములందును ప్రస్తావనలందును వీరు వచించిన కావ్యవైఖరులు ఆశుకవిత్వ సాగళ్య మొప్పీయు, నందచందములు తొల్లిటి మేటికవుల కల్పనలకు వెనుదీయక తెలుగుపద్యములు నతిశీఘ్రముగ నతిలాఘవముగ నల్లు తెరవుల గిల్పించెను. తిరుపతి వేంకటేశ్వరుల మానసప్రభావమున సర్వజనాంగీకారమంది మాన్యతవహించిన యవధానకవిత్వము, ఇతివృత్తమఁదును, భాషాప్రయోగమందును, విషయ స్వాతంత్య్రమందును ఖండకావ్యముల మూలమై, నవ్యాంధ్రకవితా స్రవంతికియారని బిచ్చమిడిన దాయెను. వాడుక తెలుగు నెంతయు మనోహరముగ నుపయోగించి యల్ప సంస్కారులగు బాలకవులపాలిటి 'దైవమై, తారకమంత్ర ముపదేశించిన ప్రొడ లీతిరుపతికవులు.
ఉ| “వేసవి డగ్గ రాయె మిము ♦ వీడుటకున్ మనసొగ్గదా
యె మా | వాసము దూరమాయె పర ♦ వాసమదేట్టు
లొ భారమాయె మా | కోసము తల్లిదండ్రులది ♦ గో
ఇదిగో నని చూచుటాయె వి | శ్వాసమెలర్పగా సెల
వొసంగినఁ బోయెదమయ్య భూవరా!”
అను పద్దెములందును కామేశ్వరీశతకమందును, శనిగ్రహమందును, అవధానప్రస్తాపన కల్పనలందును తిరుపతి వేంకటేశ్వరులు బింకాననడచిన ముద్దుపోకడ లాధుని కాంధ్రకవితావిర్భావమహారంభమున కాధారములైనవి. ప్రస్తావనలో వీరి సమయస్ఫూర్తి, తిరుపతిశాస్త్రి కాకినాడ రైలునిలయమున నుండగా శృంగభంగమును బ్రచురించినవార్త విని, యచ్చెరువంది చెప్పిన పద్యరాజమే వేనోళ్ళ జాటుచున్నది.
ఉ॥ చుక్కలు రాలలేదు రవిసోములపోకడ మారలేదు న
ల్దిక్కులు కూలలేదు జలధిద్వలనం బుబుకం లేదు నే
డక్కట రామకృష్ణకవు లక్ష్భకులేగతి జేయనేర్తు రా
ధిక్కృత వైరి వేంకటసుధీశ్వరమాళికి శృంగభంగము౯
తిరుపతికవుల లేత కైతలు, నవ్య వైఖరుల దెలుప వెంకటశాస్త్రి మందస్మితావలోకనకళాసంపర్కమున నాంధ్రభాషామాధుర్యమనివార్య మోహపాశముల వెదజల్ల నెందరో ఆవధానులై, నాటకకర్తలై, కావ్యకలనా వైదుష్యమును సంపాదించియున్నారు.
తిరుపతికవులు లాంధ్రగీర్వాణ భాషాలక్షణములం దసమానపాండిత్యము నొప్పుచున్నను, సుప్రయోగదక్షులయ్యును, పూర్వకవుల గుట్టుమట్టుల నెరిగి యీగతి వచించిరి:
క॥ వ్యాకరణ మొక్కతోవ మహాకవు లోకత్రోప కోశమఖల మ్మొకత్రో, వై కనుపట్టెడి నీ భాషాకావ్యమ్ములను దఱుచు చదివినకొలఁది౯”. “తెలుగునకున్న వ్యాకరణదీపసు చిన్నది. భారతాదులలో యతిభ్రంశాదిదోషములుగలవి యొకదోషము కాదు. భారతాదులలో లేని పదములు నవనీకలవె? అందుచే నిది గ్రామ్యమనియు, దేశ్యమనియు పెనగశక్యంబె?" మున్నగువాక్యములతో తమ కావ్యనియమముల బేర్కొనియున్నారు. వాడుక పదములను సందర్భోచితముగ నందముగువాడి తమకావ్యముల కసమానజీవకళలను గూర్చియిచ్చిరి. "కూటికి గుడ్డకై పరులకొంపకు జేం” ౼ ఎంత బాగుంది? ౼ పద్యమల్లుటలో వీరివృత్తములు సైతము షేక్స్పిపియర్ గీతముల వైఖరిలో సరళముగ భావానుకూలమగు సంభాషణారీతుల గద్యమువలె రపస్ఫురితములై దుముకుచుండును. వ్యాకరణ లక్షణములు బాటింపక వాడుక తెలుగుపోకడల రసవత్పద్యరత్నముల జూపుటయేగాక, గద్యపద్దతుల సమీపించు పద్యవైఖరుల నేర్పరచి, భావి కావ్యారంభములకు దారి జూపిరి. దేవీ భాగవతములో దేవపురోహితుడు చంద్రునివాకిట నిలబడి యరచినయర పెంతగద్యనైజ మొప్పుచున్నదో చూడుడు!
ఉ॥ ఔర! దురాత్మ యెంతటి దురాచరణం బోడగట్టి
నావురా! దారను జూడ నేగునను ద్వారమునం దొకఁ
డాగువాఁడె? నా నీరజనేత్రి నాయతివ నీకు స్వ
తంత్రమె? నాకుదూరమే?
ఇట్టులే భారతనాటకములందు పలుతావుల గద్య వైఖరు లందమైన పద్దెముల గన్పట్టుచున్నవి. "పెండిలి యాడినన్' పిదప బిడ్డలు పుట్టుట నిశ్చయంబు, నే పెండిలి మానుకొంటి,”……… సేవాధర్మము నూతధర్మమునురాశీ భూతమై యొప్ప వాచావాత్సల్యముజూపె కర్ణు డిటు మాత్సర్యంబు మీ కేల?” “అంచితులైన బందుగుల అందరిముందర జెప్పి నిన్ను మెచ్చించెద, కుంతిచేత రవిచేతనిజం బని నీకు సాక్ష్యమిప్పించెద. ఫల్గుణ ప్రముఖవీరులు గొల్వగ నెల్ల భూమి యేలించెద.. ” గద్య వైఖరే కాదు —— ఉపన్యాస తీవ్రతయు నిందిమిడియున్నది. పదములు వాడుటలోకూడ స్వాతంత్య్ర మెంతయు ద్యోతకమగుచున్నది "ప్రాచీన గురుశిష్యపద్ధతి” లో.
"శా| బెంచీలక్కర లేదు 'గేమ్సు ముదలౌఫీజుల్ వినన్ రావు బొమ్మంచున్ నిర్ధను ద్రోచిపుచ్చరు" మున్నగు నన్య భాషాపద ప్రయోగములు, సువిదితమైనవి ప్రయోగింపబడినవి. నవీనాంధ్ర రచయితలలో కొందరు సువిదితమగు వన్య భాషాపదములకు దురవగాహమగు నాంద్రపదమును గల్పించి వాడెడిదురాచారము నీమహాకవులపోకడ ఖండించుచున్నది.
అల్పవిషయముల నఁదమగువాడుక తెలుగులో గద్యవైఖరులొప్పు పద్యములలో రసభావసౌందర్య ముట్టిపడ జిత్రించుటయే గాక, లౌకిక పరిజ్ఞానమందును, లోకానుభవమందును వీరు మిన్నలైయున్నారు. జార్జి పట్టాభిషేకసమయమున బ్రచురింపబడిన పద్యావళులన్నిటిలో తిరుపతి వెంకటేశ్వరులు సమర్పించ దానియం దాశీర్వచనమునకు తోడు వందివాక్యములకు జోడుగా, రాజకార్యభారప్రశంసయు, ధర్మవిరోధమున గల్గమోపెడి యధికార భ్రష్టతయు నెంతయో లలితవ్యంగ్యరీతుల దెలుపబడినవి. వీరి నాటకములందు, ప్రబంధము లందు, అవధానప్రస్తావనములందు గోచరించు కథాసందర్భములు, సంభాషణ వైఖరులు, అసమానమగు లౌకిక పరిజ్ఞానమును వెల్లడించును. ఉంగరము పోయినప్పుడు వ్రాసినపద్యమెంత నియ్యోగమర్యాదల దూగుచున్నది! సరసాలాపవర్ణనము లందునకూడ పూర్వకవిప్రయుక్తమైన వర్ణనల దలమార్చి వాడక, స్వకీయానుభవమునుండియే గూర్చుచుందురు.
చ| సరసునివైపు వీపు, ఆలచానమొగంబటు గోడవైపు,
ఆసరసుడు కేలుచాపు, నలచానయు చన్నులమీదమో
పు, నాసరసుడు కోర్కెచూపు, నలచానతొడం దొడ
లోనదోపు, నీ వరుసనె తెల్లవారె నొకవైఖరికొక్కని
కొక్క వేశ్యతోన్ |
తిరుపతి వెంకటేశ్వరులు విఖ్యాత కావ్యములందు వారి యనుభవములే, వారి యహంకారపూరిత వాగ్వైభవములే మిక్కిలి యందముగ దోచుచున్నవి. శ్రవణానందము, పాణిగృహీత, గీరతము, వారి యనుభవసారమును దెల్పుచు సహంకారోద్వేగభరితములై యున్నవి. స్వానుభవములను చిత్రించుటలో, సహంకారమును పద్యనాళముల బ్రవహింపజేయుటలో, సామాన్యులు హేయముగ రసవిహీనముగ, మాత్సర్యగర్వపూరితముగ జేయుదురో కాని, సరసరీతులు పదనిగ్రహముతో వెలువరింప జాలరు. తిరుపతికవు లీపని యవలీల నొనర్చిరి. "ఎవ్వారిని లక్ష్యపెట్టక యవారణదిగ్విజయం బొనర్చి ప్రజ్ఞానిధులంచు బేరుగొనినార" మను వాక్యములోని నిజప్రతి భాభివరనమందలి దోషమునెల్ల “నీవలనన్ సరస్వతీ” యని భారతీగుణ పోషణమునకై వినియోగించిరి. గీరతము తాకినవారిభావము లెట్లున్నను, అందలి యహంకృతుల్లిల్ల సద్ధర్మనిర్వహణార్థమై, లోకహితైకకాంక్షతో నుద్దీపితమైన వాస్తవము చదువరులకెల్ల స్ఫురించును. గీరత కవిత్వము నవీనాంధ్ర కావ్యసంకల్పములలోనెల్ల నుత్తమమైనది. మానసకోశమున మెలగుచు, రసభావ పదప్రయోగ వైదుష్యమున దురాచారముల జెండాడు సాగిస్వతిమహారథుల సమరార్భాటము లీ గీరతమున కావ్యవిస్తరత నొందియున్నవి. శ్రవణానందమున, యౌవనవసంతసమాగమమున పులకరించి మొగ్గదొడగిన, కోమలభావకుసుమంబులు, నుధామాధుర్యమినుచు, సౌందర్యరాసులై తెలుగుపదునుల జెన్నొంది యున్నవి. రవీంద్రుడు విజ్ఞానకోశమన జల్పించు దేవోపాసి; తిరుపతి వెఁకటేశ్వరులు మానసరంగమున స్వానుభవముల సహంకారచోదితులై నిరాఘాటముగ, నిశ్శంకముగ, ఘంటాపధముగ మ్రోయించు కావ్యకర్తలు. వంగీయాధునిక మహాకవి సంశయిములప్రోగు; తా నెరుగనిదాని జెప్పజూచెడివాడు. తెలుగుకైతల క్రొత్తమగలు నిశ్శంకముగ, స్వతంత్రించి, మానస వ్యాపారముల నుద్బోధింపగల యాుధ్రస్వభావవిరాజితులు. తిరుపతి కవులు రసభావముల మానసిక విమర్శకులేకాని, యాధ్యాత్మతత్వవిజ్ఞాతలు కారు.
తిరుపతి వెంకటేశ్వరులు రచించిన ఇతర కావ్యములు బుద్ధచరిత్ర మొదలగునవి, తమ స్వానుభవోద్దీపకంబులగు శ్రవణానంద గీరతములకు జంకిపోవుచున్నవి. కాని భారత నాటకములందు వీరు దేశమున కత్యంతోపకార మొనర్చిరి. వ్యాసున కందరాని మెఱపులను భారతకవులు చూపియున్నారు. వీరినిమించి తిరుపతికవులు నాటకముల గూర్చినారు. ఈ నాటకములలో కొన్ని తావుల పేలపిండి కవిత్వమున్నను, అనవసరముగ పద్యములనేకములు జేర్చినను, మంచిపట్టుల దివ్యమైన పద్యములు, రసస్ఫూర్తి, కథావిన్యాసము గన్పట్టుచున్నవి. వీరు భారతములోను ఆంధ్ర గీర్వాణములలో గూలంకషముగ జదివి, వివాదాంశముల జక్కగ బంశీలించి, మానసప్రచార వైదుష్యమున పాత్రపోషణ మతినిపుణత నిర్వహించిరి. భారత నాటకములు వెలువడు కాలమున మన తెలుగు దేశములో దేశీయభావ ముదయించుచుండెను. రసపుత్ర వీరుల గాథలు, శివాజీ మున్నగువారి చరిత్రములు, ఓరుగల్లు విద్యానగరములు వీరప్రతాపములు, తెలుగుచదువరులడెంద మానంద పరుచుచుండెను. అట్టి సందర్భములలో తిరుపతికవులు భారతవీరుల విచిత్ర చరిత్రముల సర్వజనామోదమగు నాటకములుగ జేసి దేశాభ్యుదయుమునకు దోడ్పడిరి. వీరు కొన్ని భారత పాత్రలపట్ల నదివరకు దేశమందుండిన యపోహల రూపుమాపి, వారి నామములకు శాశ్వత కీర్తి నొనగూర్చిరి. వేణీసంహారము మున్నగు నాటకములవలన న్యాయమార్గ మెరుగని కర్ణక్రయంబరు వదంతి మిగుల వ్యాపించియుండెను. తిరుపతికవులు కర్ణుని చారిత్రమును చర్యఅను సహేతుకముగ, న్యాయ్యముగ పోషించి, యీ మహాత్ముని కీర్తిబింబమును నిష్కళంకముగ నొనగూర్చి యున్నారు.
కావ్య నాటకములందు తిరుపతికవు లెట్టిమహానీయసిద్ధినొందిరో, గద్యవిమర్శనమందును, వాదప్రకారములందును అట్టిచక్కని సిద్ధియే పొఁడియున్నారు. గంటూరుసీమ, గీరతములందు గోచరించు వ్యవహారదక్షత చిరాభ్యస్తన్యాయవాదఁగూడ సంతృప్తిపరచుచున్నది. వీరికృతులలో నీశ్వరప్రశంస మిక్కుటముగ. భక్తి పారవశ్యమున గోచరించదు. వీరు లౌకికులు, భాషాసంస్కర్తలు, స్వతంత్ర కావ్య నిర్మాతలు, స్వానుభవాహ్వకార నిరూపకులు, రసికాగ్రగణ్యులు. ఆఁతియే కాని, శాశ్వతలక్షణములు వీరికావ్యములందెంతవరకున్నవో ప్రస్తుత మూహించజాలము. ఏమైనను శ్రవణానందములోని కొన్నిపట్టులు, మిగిలిన గ్రంధములన్నిటిలోని సుభాషితములు తెలుగువారల గారవమందుచు చిరస్మరణీయములై నిలచియుండుననుటకు సంశయములేదు. భాషాభివృద్ధికిని, యాథునికాఁధ్ర సారస్వతవ్యాప్తికిని వీరేశలింగమొకవంకను, తిరుపతికికవులొకవంకను దోడ్పడి, సూత్రధారులై మెలగిరనుటకు సందియముఁడదు. ఆంధ్రసారస్వత చరిత్రములో వీరెల్లపుడు నవీనయుగా రంభకులుగ గౌరవింపబడుదురు. కావ్యనిర్మాతలుగ భావిసంతతు లెట్టి గౌరవమాపాదింతురో కాలగర్భితమై తెలియకున్నది.
తిరుపతికవుల భాషాసేవ మరపుదగిలినను, వారి కావ్యములు ప్రాచీనశల్యోపములై యుపకరింపకున్నను, వారి నిత్యచారిత్రము వారి నిరాఘాటప్రచారము, వారిగాధలు, వారిసుగుణములు తెలుగువారిచే నెల్లపుడు స్మరిఁపబడునని నా నమ్మకము. భోజరాజువలె, అనఁదగజపతివలె,కృష్ణదేవరాయునివలె, వీరును తమ కథలచే మెప్పించుచుఁదరు. తిరుపతికవులు నిర్దిష్ట లక్షణపరిజ్ఞానమునకన్న స్వతంత్ర భాషాప్రయోగ వైదుష్య మెక్కువ వాసికెక్కిననది. వారి కావ్యసిద్ధికన్న, మహోదార జీవితచారిత్ర వెక్కువ గౌరవింపబడు చున్నది. దిగ్విజయములు, అవధానములు, వాదప్రచారములు, సరిసప్రబంధరచనలు, మృదుగఁధీరహస్యోపవ్యాసములకన్న తిరుపతి వెంకటేశ్వరుల లలితమర్యాదలు మిన్నలైనిలిచియున్నవి. పండితసంస్కర్త, రసప్రవక్త, తన వైదుష్యముచేకన్న, కావ్య విజయముల చేకన్న, తన నిత్యాలాప సౌకర్యమాధుస్యమున కాలప్రవాహమున నిలువగలిగియున్నారు. ఆనుటకు తిరుపతి కవులే నిదర్శనములై యాచంద్రతారార్కమగు కీర్తి ననుభవింతురు.
౼ పురాణం సూరిశాస్త్రి
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse