గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 2/ఆంధ్ర గ్ర౦థాలయోద్యమము
ఆంధ్ర గ్రంథాలయోద్యమము
ఇరువదవ శతాబ్దముతో నూతనశక్తి యాంధ్రుల నావహించినది. ఈనూతనశక్తి దేశోపయోగమునకై వినియోగ పడునట్లు చేయుట మనవిధి. జనసామాన్యము విద్యావంతులు కావలెను. అందుకు మాతృభాషయే పరమసాధనము. మాతృభాషను పెంపొందించుటకు గ్రంథాలయమే మంచిపొధనము. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము స్వయంసహాయముపై నెక్కువ యాధారపడియున్నది. ఉద్యమాభిలాషులు కార్యశూరులు కాని వాకుర్శలుగారుగారు. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ చరిత్రను మూడుభాగములుగ విభజింపవచ్చును. మొదటి భాగము 1897 సం॥తో ప్రారంభనుయి 1914 సం॥తో నంతమొందెను. ఆంధ్రగ్రంథాలయములందు ప్రాచీనములు రెండు. మొదటీదగు తంజావూరు పుస్తక భాండాగారము ఆంధ్రనాయకులచే 17వ శతాబ్దమున స్థాపింపబడి ఆమూల్యములగు 8 లక్షల గ్రంథములను కలిగియున్నది. రెండవదియగు చెన్నపురి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారము బ్రౌనుదొరగారి ప్రోత్సాహమున దొరతనము వారిచే డెబ్బదివత్సరములక్రిందట స్థాపింపబడినది. కాని మన దురదృష్టమోయన రెండు గ్రంథాలయములును ఆంధ్రదేశమునకు వెలుపల నున్నవి. ఈ రెండు గ్రంథాలయములందునూ పూర్వకవి విరచితములగు ముద్రితా ముద్రితగ్రంధము లనేక ములున్నవి.
ఆంధ్ర దేశమున ధర్మగ్రంథాలయముల స్థాపనకు పూర్వము క్లబ్బులని వ్యవహరింపబడు కొన్ని సంఘములు అచట బయలుదేరినవి. ఈ సంఘములు సాంఘికుల వినోదపరచుటకు మాత్రమే యుపకరించుచుండును. నియందు యితరులకు ప్రవేశములేదు. 1897 సం॥లో మొట్టమొదట నవీనధర్మగ్రంథాలయము ఆంధ్రదేశమున సాపింపబడినది. భీమవరము తాలూకా కుముదవల్లిలో వెలసియున్న వీరేశలింగకవి సమాజము స్థాపింపబడినదీవత్సరముననే. ఈసమాజము డైరక్టరుల పరిపాలన క్రింద నున్నది. ఈ సంఘమునకు స్వంతభవన మున్నది. ఈ గ్రంథాలయమున ననుబంధముగా మతధార్మికశాఖ లున్నవి. రాజమహేంద్రవరమున 1900 సం.రములో శ్రీయుత నాళను కృష్ణారావుగారిచే నొకథర్మ గ్రంథాలయము సాపింపబడినది. ఇపుడా గ్రంథాలయము గౌతమీ గ్రంథాలయమనుపేరు బరుగుచున్నది. ఈ గ్రంథాలయమున నిపుడు సుమారు పదిహేను వేల సంస్కృతాంధ్రాంగ్లేయ గ్రంథములు కలవు. ఆంధ్రగ్రంథాలయములలో గ్రంధసంఖ్యయఁదు దీనినే మిన్నయని చెప్పవచ్చును. ఈసంఘ మీదివరలో ననేకమార్గముల ప్రజాసేవ చేసియున్నది. స్వంతి భవనమును నిర్మించుటకు నిర్వాహకులు తగు ప్రయత్న మొనరించుచున్నారు.
1911 సం.రము నుండియు ధర్మగ్రంథాలయములు దేశమందంతటను వెలయుటకు ప్రారంభమైనవి. ఆంధ్రసారస్వతమునకు నూతన వికాసములగు గ్రంథమాలలు, మాసపత్రికలు స్థాపింపబడి ఈ యుద్యమమునకు దోహదమొసగినది. విశాఖపట్నమున ఆర్షపుస్తక భాండా గారమును, హైదరాబాదు నగరమున ఆంధ్రభాషాభివర్ణనీ సమాజయ స్థాపింపబడినది. గ్రామములలోకూడ కొన్ని గ్రంథాలయములు బయలు దేరినవి. గ్రంథాలయనిర్వాహకులు గ్రఁధసహయమున జనుల విద్యావంతులు జేయుయే పత్రికాపఠనమందిరముల నెలకొల్పియు, రాత్రిపాఠశాలలు పెట్టియు, పురాణపఠనము నేర్పిఱచియు, పోటీపరీక్షలు జరిపి బహుమానముల నొసంగుచు ననేకవిధముల విద్యాదానము చేయబడంగిరి.
1914 సంస్థతో నీయుద్యమము యొక్క రెండవ భాగము మొదలిడి 1918 సంవత్సరములముతో సంతమొందెను. ఈ అయిదు సంవత్సరములలోను ధర్మగ్రంథాలయోద్యమమునకు నామరూపము లేర్పడినవి. 1914 సంవత్సరములన బెజవాడ రామమోహన ధర్మగ్రంథాలయమువారికి గ్రంథాలయమహాసభ జరుపవలెనని యిచ్చి వొడమినది. తత్ఫలితముగ ఏప్రియల్ 10 తేదీని ఆనగరమున ప్రథమ ఆంధ్రదేశ గ్రంథాలయమహాసభ బ్ర చిలకమర్తి లక్ష్మీనృసింహము పంతులు గారి యధ్యక్షతక్రింద సమావేళమయినది. ఆసభకు పలు ప్రదేశములనుండి 163 గ్రంథాలయములవారు విచ్చేసిరి. ఆమహాసభలో ఆంధ్రదేశమంతటను ధర్మగ్రంథాలయముల స్టాపించుటకును స్థాపించినవానిని పెంపొందించుటకును ఆంధ్రదేశగ్రంథాలయసంఘ మను శాశ్వతసంఘము సాపించుటకు తీర్మానింపబడినది. ఈ సంఘ కార్యస్థానము బెజవాడ రామమోహన గ్రంథాలయమునం దుండుటకును సంఘపక్షమున నొకపత్రికను ప్రచురించుటకును ఆంధ్రగ్రంథ విభజనపట్టికను తయారుచేయుటకును, మాజికులాంతరు కొనఁటకును, సంచారకార్యదర్శిని ఏర్పాటు చేయుటకునుకూడ నాసభయందే తీర్మానింపబడినది. అది మొదలు ఏటేట రాజమహేంద్రవరము, నెల్లూరు, బారువ, విశాఖపట్టణము, చెన్నపురి, మహానంది గ్రామములలో గ్రంథాలయసభలు జరుగుచు వచ్చినవి. ఈసంఘ కార్యదర్శులగు మ అయ్యంకి వెంకటరమణయ్య గారు వ్యయప్రయాసకలకోర్చి, తమ స్వంతపనులను గూడకొని 1914, 1915 సంవత్సరములలో అనేక గ్రంథాలయముల దర్శించి తగు సలహాల నోసంగీయుండిరి. వారు ప్రతి మఁడలసభ కరిగి గ్రంథాలయగుల తీర్మానమును ఆమోదిఁపజేయుచుండిరి. అందువలన కొన్ని నూతన గ్రంథాలయమలు సాపింపబడినవి. మండలసంఘములు వెలసినవి. ఆంధ్రగ్రంథాలయముల చరిత్ర సమగ్రముగా ప్రకటింప బడినది.
1916 సం|న గ్రంథాలయ సర్వస్వమను పత్రిక పక్రటించుటకు ప్రారంభించిరి. ఈపత్రిక ఉద్యమనిర్వాహకులకు చాల సహయమొనర్చు చున్నవిషయము నిర్వివాదాంశ్రము. ఈ పత్రిక వలన ప్రతివత్సరము నష్టము వచ్చినను భరించి సజీవముగానుంచిన కార్యదర్శి గారి పట్టుదల నెంతయు కొనియాడ వచ్చును. ఈ సంఘమువారు ఆంధ్రదేశమున నేగాక ఇతర స్వదేశ సంస్థానములందును తమయుద్య మము వ్యాపించుటకు తగుకృషి సలిపియుండిరి. కార్యదర్శిగారు 1917 సం బరోడానగరమున జరిగిన గ్రంథాలయ ప్రదర్శనము చూచివచ్చి ఆంధ్రదేశమునను అట్టి ప్రదర్శనమును సమకూర్చుచున్నారు. గ్రంథాలయమునకు వలయు స్వపరికరములును అందు ప్రదర్శింపబడును. ఆప్రదర్శనము ప్రతియాంధ్రుడును చూచి తీరవలసినది. 1918 సంవత్సరములన విశాఖపురియందు అయిదవ గ్రంథాలయ మహాసభ సమకూడినది. ఆసభయందు బెజవాడ రామమోహన ధర్మగ్రంథాలయమును ఆంధ్రదేశమునకు కేంద్ర గ్రంథాలయముగా పరిగణించుటకు తీర్మానింపబదినది. రామమోహన గ్రంథాలయమునకు విశాలమగుస్థలమును పండ్రెండువేలరూప్యముల విలవియగు స్వంతభవనమును కలవు. 1918 వ సం। రాంతములకు గ్రంథాలయముల సంఖ్య 475 475 వరకు బెరిగెను. 15 గ్రంథాలయములు స్వంత భవనములనిర్మించుకొనినవి. కేంద్రగంథాలయ స్థాపనానంతరము మఁడల గ్రంథాలయములు స్థాపింపవలెనను నభిలాష యుద్యమ నాయకులకు జనించినది ఆ సమయమున శ్రీయుత వావిళ్ల వేంకటేశ్వర్లు గారు తమ యుదారభావమును వెల్లడించిరి. ఆంధ్రదేశమున స్థాపింపబడు ప్రతిమండల గ్రంథాలయమునకును తమచే ప్రకటింపబడిన 600 రూప్యముల విలువగల గ్రంథములపెట్టునుచితముగా నిచ్చుటకు వాగ్దానము చేసి. ముందు ప్రశటింపబోవువానినిగూడ తా మొసగుటరు అభ్యంతరము లేదనిరి. కొందరు కవులును వారిమార్గము ననుసరించిరి.
1919 సం| తో మూడవభాగ మారంభమయినది. ఈవత్సరమున నూతనగ్రంథాలయములు, మండలసంఘములు స్థాపింపబడినవి. నవంబరు నెలలో చెన్ననగరమున ఆంధ్రగ్రంథాలయ మహాసభ జరిగినది. ఆ సమయముననే అఖిలభారత గ్రంథాలయసభ సమావేశ పరుపబడినది. ఈవత్సరమున ప్రత్యేక వ్యక్తులవలన గ్రంథాలయోద్యమమును తెల్పు రెండు చిన్నపొత్తములు ప్రకటింపబడినవి. వానిలో శ్రీ నూరి నృసింహశాస్త్రిగారు ఆంగ్లమున ప్రచురించి గ్రంథము ఉత్తమమయినది. ఆగ్రంథ ప్రచురణమువలన యితిర రాష్ట్రములవారికి మన యుద్యమప్రాశస్యము గ్రహించుటకు వీలుకలిగినది. 1919 సం|| రాంతమునకు గ్రంథాలయముల సంఖ్య 586 వఱకు వృద్ధి నొందినది. 1920 సం౹ నీ సంఘపక్షమున ప్రచారకులను తయారుచేయుటకు పాఠశాల యేర్పరుపబడెను. ప్రతి దర్మగ్రంథాలయ మునకును సద్గ్రంథములను తక్కువవెలకు లభింపజేయుటకు ముద్రాశాల స్థాపించుట యవసరమని తోచి, కార్యదర్శిగారు చాల ప్రయత్న మొనరంచిరిగాని దైవమనుకూలింపడయ్యను. మహానందిలో సభ సమావేశమయినది. పిమ్మట దేశమంతయు రాజకీయో ద్యమముతో నిండిపోయినది. ఇతర ఉద్యమములు తలయెత్తుటకు వీలుకలిగినది గాదు. అందువలన, గ్రంథాలయోద్యమము మందగించినది. పలువురు గ్రంథాలయనేవకులు శ్రీకృష్ణజన్మస్థానము నలంకరించరి. శ్రీయుత అయ్యంకి వేంకటరమణయ్యగారు తమయారోగ్యమును కోల్పోయియుండిరి. తిరిగి యిపుడు ఆరోగ్యవంతులై యున్నారు. రాజకీయరంగమును నిర్మాణభాగము సాగుచున్నది. గ్రంథాలయోద్యమము తరిగిన తొల్లిటి యుత్కృష్టతను బొందవచ్చును. ఈ మూడు సంవత్సరములలోను కొన్ని గ్రంథాలయములు నశించినవి. ప్రస్తుతము రమారమి 600 గ్రంథాలయము లుండవచ్చును. కార్యదర్శిగారు గ్రంథాలయసర్వస్వమును మాసపత్రికగా ప్రకటించుటకు ప్రారంభించినారు. మ॥ వెలిదండి శ్రీనివాసరావుగారిచే ప్రారంభింపబడిన గ్రంథవిభజన శ్రీయుత కాశీనాథుని నాగేశ్వరరావు గారు పూర్తి చేయించుచున్నారు. కావ్యనిధి చెలికాని లత్సారావు గారు గ్రంథాలయవార్షకోత్సివసంచికలను ప్రకటించుకున్నారు. కృష్ణా మండలమునకు మండలగ్రంథాలయము మొన్ననే స్థాపింపబడింది. గుంటూరుమండలమున గ్రంథాలయమహాసభ సమకూడనున్నది. ఆంధ్రదేశమునకూడ స్వార్థత్యాగులు బయలు వెడులుచున్నారు. కార్నేజివంటి కోటీశ్వరులును, గైక్వారువంటి విద్యాభిమానులును లేరని నిరుత్సాహపడకుడు. ప్రతిపల్లెయందును ధర్మగ్రంథాలయస్థాపన గావింపుడు. విద్యవెదజెల్లి జనసామాన్యము యొక్క యజ్ఞానమును పారద్రోలుడు. మన మేరూపమున నీశ్వరుని ధ్యానింతుమో యురూపముననే ఆయన మనకు దర్శన మిచ్చితీరును.
“శ్లో॥ యోయోయాం యాం తనుం భక్తః
శ్రద్ధ యార్చితు మిచ్ఛతి
తస్య తస్యా చాలం శ్రద్ధాం
తా మేవ విదధామ్యహమ్|
౼ యాతగిరి లక్ష్మీవెంకటరమణ
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse