గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/స్వప్నకావ్యము
స్వరూపం
స్వప్న కావ్యము
చం. జలదము లాకసంబునఁ బ్రశాంతని నాదముతోడఁ జేయు గ
ర్జలువిని, యింద్రగోపములు సంకులపంకములందు మందలీ
లల జనువింతఁ గాఁచుచు విలాసముగాఁ జరియింప, జ్యేష్ఠపు౯
దొలుకరిసంజ, నెమ్మదిఁ గుతూహలము౯ ఘటియించె నెంతయు౯
చం. తడిసిన నేలపైని హిమధాముని యంశుచయంబు బ్రాఁకఁ, గా
ల్నడల జలంబు జిందుచూఁ గెలంకులలోఁ గలయఁపిఁజల్లఁ, గా
రడవులనుండి కాండ్రుమనియార్చుచు బెబ్బులిరాకఁ దెల్ప, న
గ్గడియ ప్రమాదమున భయము గబ్పన జేసెను బాటసారికి౯
తే.గీ. జలదయవనికచాటున చందమామ|యొంటరిగఁ గాలబద్దుఁడె యుంటఁ జేసి
కాంతి ని సంద్రమగుచుఁ బ్రాఁకఁగఁ దొడంగె తఱిపివెన్నెల భూనభోంతరమునొఱసి
కం. ఫలభారంబున వంగక | చలనఁబును విడచి సహజ శాంతివిలాసా
కలితంబుగ ధరణిరుహ | ములు నిద్రా సౌఖ్యమందు మునుఁగఁగసాగె౯|