గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/విప్రయోగి
స్వరూపం
విప్రయోగి
(షెల్లీ పద్యములు కనువాదము)
కొప్పర్తి నారాయణ, బి.ఎ., ఎల్.టి.
ఊట లన్నియు బ్రవహించు నేటఁ గలియు
సాగరముఁ జేరఁ దుముకు నిర్ఘ రచయంబు
గగనవాయువు లొఁడొఁటిఁ గౌఁగిలించు
హర్ష సంభ్ర మోత్కృష్ట సంఘర్ష మనగ
తనకుఁ దానై బ్రదుక నిలఁ దళముగాదు!
దైవమర్మ ప్రపాలన ధర్మమునను
ఒకటియొక దానితో నైక్య మొందగాను
ఊర్జితముగ నింగలయ కే నుండనేల?
భూధరాగ్రముల్ దివినిక్కి ముద్దుగొనును
పొరలు తరగము లొండొంటిఁ బొందుగాంచు
తోడిసుమముల నిరసించు దుడుకుతనము
కటికుడుపదె పూవులఁ గఠినమూని.
చంద్రికలు వ్రాలిముద్దిడ సంద్రమెగయు
కువలయేశుని కరములఁ గులుకు రేయి
దినకరాశ్లేషమున భువి తేజరిల్లు
ఇట్టి చుంబనాశ్లేషము లేమిలెక్క
ఈవుననుఁ గౌఁగిలించి ముద్దీయకున్న!