గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/ముద్దుల నాయెంకి, బేల గుండె నాయెంకి
స్వరూపం
ముద్దుల నాయెంకి
న౦డూరి సుబ్బారావు, బి ఏ.
యేడుంటివే యెంకి యేడుంటివే
పూతోం పందిట్లొ
శీతాయి యెల్తుంటె
నీతళ్కు చేపకాన్ని
'నాతల తిరిగిం దోలె! యే!
మామిడి తోటో కెళ్లి
మంచీ పండోటి గోసి
యేటొ గాని నోట్టే స్థె
యిసమై పోయిందోలె యే॥
పొత్తేళ్ళ జొన్నసేలొ
సిత్తరమయి పోతాది
గమ్మైన వోన నొసై
గుండెగిరి పోయెనోలె । యే
బేలగుండెనాయెంకి.
నండూరి సుబ్బారావు, బి.ఏ.
యీరేతి రొక్క తెవు యే మొచ్చినావె?
ఆడు నే చిక్కడే యాడినామమ్మ
యేటి నురగలకెసి యేటి చూస్తావె?
మావోడి మనసట్టె మరుగుతా దమ్మ.
శంద్రవంకలొ నేమి శిత్రమున్నాదె?
వొంక పోగా నె మావో డొస్తడమ్మా.
ఆడు నే నిక్కడే యాడినామమ్మ
మావోడి మనసట్టె మరుగుతాదమ్మా.
ఆవ క పోగా నె ఆడొస్త డమ్మా.