గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/భారతీయుల నాటక లక్షణము
భారతీయుల నాటక లక్షణము
కొంతకాలమునుండి భారతీయ నాటకములను గూర్చిన విమర్శనములు స్వదేశ, విదేశ భాషలయందెల్ల వెలసినవి. సంస్కృతనాటకా దర్శమును పరిశీలించి, విషాదనాటకములు లేకపోవుటను గూర్చి చర్చించి, ఉన్న విషాద, మంగళ, మిశ్రనాటకములను నిరసించిన వ్యాసములు మన ఆంధ్రమునగూడ కలవు. అప్రతిమానముగఁ జిత్రింపఁ బడిన రసవంతములగు కాళిదాస, భాసనాటకములను మెచ్చుకొనుచు పాశ్చాత్యవిద్వాంసులు, కాళిదాసుఁడీ విషయమున షేక్సుపియరురు మించినాడని వ్రాసినారు. విషాద నాటకములు లేకపోవుట కొఱతేయెకాని మనకున్న మిశ్రనాటకములను విషాదములుగు చేయలేదని కవిని నిందించుట పొరపాటు. ఆదియొక ఆదర్శము. ఇది యొక ఆదర్శము అది పాశ్చాత్యులది. ఇది మన భారతీయులది. మన భారతీయనాటకాదర్శములనుగూర్చియు, నాటక వాఙ్మయ పరిణామమునుగూర్చియు పండిత టి. ఎల్. వాస్వానీ గారు బాగుగ చర్చించియున్నారు. మన విమర్శకులకొరకు ఆయన వ్యాసమును అనువదించెదను.
ప్రద్దేశములెల్ల నున్నతినొందిన కాలమున, భరత ఖండమున పండితసభలు జరుగుచుండెను. వీనికి భూపతులు, రాజులు, భాషాభిమానులు నధ్యక్షులుగ నుండిరి. ఈ సభలయందు గొప్పగొప్ప కవుల కృతులు పరీక్షింపఁబడి, చర్చింపబడి, గౌరవింపబడు చుండెడివి. ఈసభలును నితర విశేషములును పెద్దలలో గలిసిపోయినవి. హిందూదేశపు అభివృద్ధి, నాగరికము క్షీణించినవిధ మొకదీనచారిత్రము. భారతీయ ప్రపంచము గ్రహణమునందువలె నీడలోకప్పఁబడి, తీరని రాత్రియందు మునిగిపోయిన చారిత్రము దుఃఖకరము. ఆనడికిరేయినుండి భారతీయులు మెల్లమెల్లన మేల్కొనుచున్నారు. ఈక్షణమున దేశములో నలుదిక్కులను శ్రుతిస్మృతులలోని సదాచారమున నెలకొనిన సత్యమును వెల్లడించుసత్కార్యమునకు విద్వాంసులును, పండితులును గడంగినారు. భారతీయశయములు పాశ్చాత్యదేశములలో గౌరవింపఁబడుచున్నవి. ప్రద్దేశపువేదాంతము కేవలము కల్పనాచాతుర్యముగ నెంచబడుటలేదు. మధ్యధరా సముద్రతీరముననే నాగరికతరంగము లంతరించినవును హెగెల్ నిద్దాంత మిప్పుడు గౌరవింపఁబడుటలేదు. డాక్టరు పి.సి.రాయిగారు చేసిన పరిశ్రమవలన నైరోపాదేశమును తరువాత కనిపెట్టఁబడిన ప్రకృతి శాస్త్ర విషయములు కొన్ని, చాలకాలము క్రిందటనె భారతీయు లెఱిఁగియుండిరని తెలియుచున్నది. "హిందూదేశపు ప్రకృతిశాస్త్ర" మని డాక్టరు బి.ఎస్.సీలుగారు వ్రాసిన గ్రంధము నూతన పరిశ్రమలను ప్రోత్సహించుచున్నది. ఐగోపాఖండపు గ్రంథకర్త యొకడు న్యాయశాస్త్రవిషయమును గూర్చి వ్రాయుచు, రోము దేశపుధర్మశాస్త్రములోని వ్యక్తిసిద్ధాంతమును విమర్శించి నెగ్గిన సమితి సిర్థతమే సరియగునదనియు, సమితి కొక ఆత్మకలదని భారతీయులు నిరూపించియుండిరనియు వ్రాసియున్నాడు.
కాలము కడచినకొలదియు, అవ్యక్తముగ మూసికొని యున్న భారతీయులజ్ఞానము, జీవమును వ్యక్తమగుచున్నది. జీవనవేదమునకు, జ్ఞానజ్యోతికి పురాతనార్యులె మనకన్న దగ్గరగనుండిరి. వారు మనకున్న పవిత్రులు, నిష్కపటులు, శిశువువలె నిర్మలులు. అందువలననే వారు సత్యతత్వము నెఱుఁగఁగలిగిరి. కళాతత్వములను బాగుగ తెలిసికొనిరి. నాటకమునందు జాలనిపుణులైరి. ఇచ్చట భారతీయనాటకాషాయమును, నాటక వాఙ్మయము యొక్క పిలువయు, దానిప్రాశస్త్యమును, యధాశక్తిని దెలుపఁబడును. భారతీయ నాటకము హైందవ బౌద్ధ నాటకము. మహమ్మదీయులు హిందూదేశమునకు చేసి యుపకృతి చాలకలదు. వారి చిత్రకళలు, శిల్పము, భావగీతములు — హఫీజుకవనము, మాసనాలీ చిత్రికలిత ౼ వారి యుత్సాహశక్తి, వారిఏకేశ్వరారాధనము భారతీయ భావమున ప్రతిఫలించెను. భారతీయజీవనమును కొంతమార్పు చెందించినవి. కాని మహమ్మదీయులు నాటకకళను తీసికొనిరాలేదు. పారసీకులకు, అరబ్బులకు, మొగలులకుజాతీయనాటక రంగస్థలములులేవు.
కొంత కాలము క్రిందట భరతఖండము గ్రీసుదేశము నుండి నాటకమును గ్రహించెనని యూహింపఁబడెను. సంస్కృతమునఁ దెరకు “యవనిక” అని పేరుండుట నాటకములకు మూలస్థానము యవనభూమి ౼ గ్రీసని తలంచిరి. ఈమాటకు యవనులచే చేయఁబడిన గుడ్డయని అర్థము చేయవచ్చు ననుమాటను మనవారు మఱచిరి. హిందూ దేశాధీశ్వరులకొలువున సేవకురాండ్రు యవను లుండిరని పుస్తకములం దుండుటయు నొక కారణముగ చూపఁబడెను. ఆయన నిది ఆకాలమున నీరెండుదేశములకును రాకపోకలు కలపనిమాత్రమె తెలుపును. ఈసంగతి బౌద్ధునిసిద్ధాంతములవలన పైతాగర సుసిద్ధాంతము లుద్బవించేనని నిర్నయించిన జర్మను పండితుల కుపయోగకారి, భరత ఖండమునకును, యవనదేశమునకును సంబంధముండుట నిజమేకాని యివి యొండొరుల ననుకరించేననుట తప్పు. బుద్ధికుశలత యనుచుకరింపదు; అనుకర్షిరించును. షేక్సఫీయకు వెనీసువర్తకుడను నాటక మిటలీనాటకపు టనుకరణముకాదు. గతే (Goethe) ఇఫిజినియా, యురిపిడీసు సనుకరింపలేదు. భరతఖండము గ్రీసుననుక సనుకరింపలేదు. గ్రీసుననుక భరతఖండము ననుకరింపలేదు. తనయోగ్యత ననుసరించియె, ఇదొక్కొకటియు నొక్కొకవిధమగు వాఙ్మయమును కల్పించుకొనినవి. బాగుగ గమనించిన కొలదిని గ్రీకులవిద్యుక్త నాటకమునకును, భారతీయుల చిత్రనాటకమునకును భేదములు కాన్పించును. హిందువుల నాటకము గ్రీకులఐక్యతల (Unities) శుద్ధవిషాదమును గమనింపలేదు. వీరియాధునికకల్పనాధిక్యత పూర్తిగ కనబడినది. ఈతరుణమున భారతీయనాటకముల ప్రతిఫలనములనుగూర్చి కొంత చెప్పవలెను, రోము. ఎలిజబెత్తు కాలము నాటి నాటకములయందలి తెలిపిహీనుడును, హాస్యంగాఁడునగు పాత్రమునకు మాతృక మన విదూషకుఁడు. బొమ్మలాటలజన్మస్థానమును గూర్చి వ్రాసిన పిచ్చేలు ఐరోపాదేశములో మధ్యకాలమునఁ గనఁబడు హాస్యగానీమాతృక విదూషకుఁడే యని పలికినాడు. మనమిప్పుడు హిందుదేశమని వాడుచున్న దేశముకన్న నెక్కుడు ప్రదేశముననె మననాటకముల ప్రాశస్త్యము విజృంభించెను. మధ్యఆసియాఖండమున దొరకిన తాళపత్రగ్రంధములు, ఆదేశమున మనచక్రవర్తులగు కుషనులు స్థాపించిన సామ్రాజ్యమునాటికే మనభారతీయ నాటకశిల్పము వృద్ధిజెందేనని తెలుపుచున్నవి. భారతీయులు, ఆరవశతాబ్దము నాటికె, జావాకు వలస కేగిరి. అచటి ఛాయారూపకప్రదర్శనము లీభారతీయనాటక కళాప్రతిబింబలె. బర్మాలో, సయాములో, కాంభోజములో రంగస్థలములఁ జూపఁబడిన నాటకములు, రాముని, బౌద్దుని గూర్చినవె! రామనాటకములు మలయ ద్వీపకల్పములోను, చైనాలోనుకూడ ప్రదర్శింపఁబడెడివి.
భారతీయుల నాటకాదర్శమే దాని ప్రాశస్త్యమునకు గారణము. క్రైస్తవఐరోపాదేశమునకును, రంగస్థలములకును పరస్పరవిరోధము కలిగెను. క్రిస్తోము 'నాటకకళలెల్ల దయ్యమునుండి వచ్చినవి హాసమును, ఉల్లాసమును భగవంతునుండి రావు. దయ్యములనుండియె కలుగును" అనినాడు. రోములో నటకుల నసహ్యించుకొనుచుండిరి. చైనాలో నటకు లైదు తరములవరకును గౌరవపరీక్షలకు బోఁగూడదని శాసింపఁబడెను. భారతీయులన్నమో, నాట్యకళ నొక వేదముగ పరిగణించిరి. దేవతలసూత్రధారుఁడగు భరత ఋషికి సృష్టిలో ఆనందము కొరకు తపస్సుచేసి యోగమున నృత్యశాస్త్రమును బడసిన బ్రహ్మయె బోధించెనని తలంచిరి.
కాళిదాసాది భారతీయకవుల నాటకములు స్వతస్సిదముగ లేవని కొందఱనిరి. ఈవిమర్శనము భవిభూతి పలికినమాటలను జ్ఞప్తికిఁ దెచ్చుచున్నవి. “మమ్ములను విమర్శించువా రేమెఱుఁగుదుకు? కాలమనంతము, లోకము విశాలము. నారుచులె యిష్టము కలవారుండవచ్చును కదా”, ఈ పలుకులకు తరువాత ననేక శతాబ్దములు గడచిన పిదప జర్మనీలో ఘనుడగు గతేకవి జనించి నించి కాళిదాసును శ్లాఘించినాడు. "మీకు సంవత్సరపునూత్నవికాసము, తుదిఫలములు, ఆశ్మకత్యంతోత్సాహమును, ఆనందమును, విందును, పండుగము కావలెన్నచో, భూలోకమును,స్వర్గలోకము నొక్కమాటలో కావలెనన్నచో నేను 'శకుంతల' యని పేర్కొనెదను' అని పలికినాడు.
కాలస్థానముల యైక్యతలను భారతీయనాటకము గమనింపలేదు కాని దీనివలన నది యస్వాభావిక మైనదనఁదగదు. గ్రీసు, ఫ్రాన్సుకవులీ రెంటిని గమనించింకాని, ఎలిజిబెత్తు కాలపుకవులు గమనింపలేదు. జర్మనీదేశపు శిల్పవిమర్శకుడగు 'లెస్సింగు' ఈమైక్యతాశృంఖలలనుండి వదలించుకొనుట లెస్సయనినాడు. షేక్సుపియరు తన నాటకములఁదు వీనిని గమనింపలేదు. స్థాన కాలయైక్యతను గ్రీసువారిసష్టియగుట, భారతీయనాటకము గమనింపకపోవుటె మంచిదయ్యె. ప్రదర్శనాభావయైద్యతలమాత్రము భారతీయనాటకములు బాగుగ గమనించినవి. నాటకకృతికర్తయొక్క కర్మసిద్ధాంతము నాటకము లోని విషయములకెల్ల కారణ కార్యములుగల యొక యైక్యతగా గమనించెను. ప్రతీనాటకమఁదు నొకయంత్రరంగ ముండును. ప్రదర్శన ప్రమాణము సంపూర్ణముగ నుండును.
సాధారణముగ నాటకములు సంతోషాంతములు, కష్టాంతములునని చేయవిభజనము సంస్కృతమునఁ గా రాదు. నాటకము శృంగారసప్రధానమగు సంతోషనాటకము కావచ్చును లేక శృంగార శోకరసమిళితమగు మిశ్ర నాటకము కావచ్చును. ఇది యెన్నడును కేవలము శోకరి సప్రధానమగు విషాదనాటకముగ నుఁడదు. భయానక ప్రదర్శనము భీభతృవిషయములును రంగలస్థములఁ బ్రదర్శి పఁబడకూడదు. ఏలన వానివలన హృదయమును, మనసును నిర్మలములై శాంతినిపొందక యుదేృకము కమునుపొంది సంక్షుభిరములగును. అయినను దఃఖమును, తకుంగల రసములును పూర్తిగ విడువఁబడలేదు. దుఃఖములను ఓర్పుతో నెదిరించవలెనను ధర్మము బోధింపఁబడెను. ఏలనలోకమొక్కటి ధర్మము వలన వ్యవహరిఁపఁబడుచున్నది. అది శుభప్రదమగు “ధర్మ మేవ జయతి” గ్రీకులు విధినిగూర్చి పలుకుదురు. మనవారును విధి చెయిదమును గూర్చి హెచ్చఁతురు. నీవు బెట్టిపుట్టిందే విధియిచ్చును. నీస్వభావమునే విధి ప్రేరేమించును. పరమేశ్వరుని — దేవతల — ప్రభుత్వము నీకర్మము ప్రేరేపణ చేయును. నీవు కషఃఖము అనుభవించినచో నరియు నీ మేలునకే యగును. ఏలన సృష్టి మాయ చిక్కుల కొఱకుకాదు. శాంతికొఱకు. అందువలననె భారతీయ నాటకములు ప్రేమతవిషయికములైనవి. స్పెయిను, గ్రీసు, ఇంగ్లాండు, హిందూదేశములు నాల్గును నాటకములు పుట్టిన స్థానములుగనున్నవి. స్పెయినూ, యింగ్లాండులలో నాటకములు మతములకును. లోకమునకునుగల కలహములో కలిగెను. గ్రీసు దేశములో నాటకము ఉయనీసి యసారాధనమున కలిగెను. ఈ యారాధన మొకప్పుడు క్రైస్తవమతమును పారదోలునంత తీవ్రముగ నుండెను. భారతీయనాటకము గ్రీసు నాటకము వలెనె మతవిషయిక మయ్యెను. జనులను పవిత్రులను జేసి వారికి జ్ఞానమును కలిగించుట దాని ముఖ్యోద్దేశము. అందువలననే, భారతీయనాటకములు శుభప్రదములగు నాంది మొదలు పెట్టి శ్రేయోదాయక మగు భరతివాక్యముతో ముగియును. ఇందలి కథాంశములు మతగ్రంథములనుండి తీసికొనబడును, అమానుష పాత్రములు విచ్చలవిడిగ నున్నవి. ఇది యసహజమును, లోకవిరుద్ధము నగునా? షేక్స్కుసియరే యమానుపపాత్రములను నాటకములందు ఉపయోగింపలేదా? హేమలెట్టులోని దయ్యము నాటకమునందీవింతులఁపును కలిగించుచున్నదా? మానవజీవితమున నమానుషవిషయములు లేవా! హిఁదువుడు మాత్రము మనకంటికి గోచరము కానిలోకమును, మనలోకమును ఒక్కటె సృష్టిలోనివని — మానవుడు దైశములయాజ్ఞాను వర్తియని ౼ నమ్ముటలో తప్పేమి?
భారతీయనాటకములను గూర్చిన యింకొకవిషయము ప్రకృతివర్ణనము. గ్రీకు నాటకకవులును, గతే, స్కిల్లరు, హాస్టమరు మున్నగు గొప్పజర్మనుకవులును, షేక్స్కుసియరును పాత్రపోషణమున జాలచమత్కృతిని చూపినారు. వారు తమదృష్టిని మానవునందె బాగుగ నిలిపిరి. భారతీయనాటకకవి, ప్రకృతి జీవ ప్రదర్శనమునఁదె తన శిల్పనాచాతురని చూపుచున్నాడు. ప్రకృతి యొక్క గురువుగ —ఉద్బోధననాచార్యుఁడుగ నితనికి తోచును, ఆందువలననే నాటకములును ప్రకృతి సౌందర్య పునరుద్భవకాలమున ౼ పకృతిపండుగ లలో— వసంతోత్సవసమయమున ప్రదర్శింపఁబడుచున్నవి. హిందువుల ప్రణయదైవము మన్మధుడు. పుష్పపక్షములుగల బాలవిలు కాడుగ — పంచశరుడుగ - వర్ణింపఁబడినాడు, కాళిదాసుని మహానాటకములలో ప్రకృతి ప్రణయసౌందర్య వర్ణనములుగల భాగములెన్నో కలవు. విక్రమోర్వశీయము యొక్క మొదటియంకము హిమాచలమున ప్రకృతిసౌందర్య వర్ణనముతో మొదలుపెట్టును. ఉత్తరరామ చారిత్రము వనమందె జరిగెను. మేఘ సందేశమున యక్షుడు రత్నగింపై విరహమనుభవించుచు తన సందేశమును మేఘదూతితో పలుకుచున్నాడు. రాముడు తనరాజ్యమునుబాసి సుందరమగు జిత్రకూటమునకు పోయినాడు. శ్రీరామునితో౼యక్షునితో౼నా సౌందర్యము నానందము ననుభవించు భాగ్యము మనకెట్లు కలుగును? వారు కాదు. అరణ్యప్రదేశముల కేగినది – ప్రకృతిసౌందర్య మెఱుఁగక, జనాకీర్ణములగు నగరకూపములఁబడి, తపించుమనమె యరణ్యములబడి యున్నాము.
మన భరతఖండపు బ్రథమ చక్రవర్తి శకుంతలానందనుడగు భరతుడు. పవిత్రివనములో ఋష్యాశ్రమమున బెఱిగెను. మహాకవి కాళిదాసుడే తనయవసానకాలమున సముద్రపుహోరు వినవచ్చు నేకాంతనగముపైన సింహళమున శయనించియుండెని ప్రతీతి. శాకుంతలమున ప్రకృతి సౌందర్యమయము. శకుంతల కాపేరెట్లు కలిగెను? విశ్వామిత్రుడు జితేంద్రియుఁడై ఘోరతపస్సు చేయుచు తనదీక్షను మేనక కొఱకు విడనాడగ నీముద్దుల తనయ కలిగెను. దీనికిఁ బ్రాయశ్చిత్తముగ తీవ్రమగు తపస్సు చేయుటకొరకు మారారణ్యములోనికిఁ బోవుచు నాశిశువును ప్రకృతికి విడచెను. అంతే నీ సౌందర్యరాశిని సుందరములగు శకుంతములు రక్షించినవి. తరువాత నీమెను కణ్వమహాముని తనయాశ్రమమున బెంనుచె. ఆమె చెట్లకు నీరుపోయుచు, పెంపుడు నెమిళ్ళు వాడి యగు రెల్లు మొనలుగుచ్చుకొని బాధనొంద, వానికి సంరక్షణము చేసి వానితో నాడుకొనుచుండెను. ఈమె పతివద్దకు బోవునప్పుడు చిన్న నాటనుండియు సఖులగు మునికన్నియలనుఁడిమాత్రమెగాక, యచ్చటివృక్షముల నుండి, లతలనుండి, పొదలనుఁడియు, పశుపక్ష్యాదులనుండియు ననుజ్ఞగైకొనేను. కన్నుల నశ్రువులు గారుచుండ వీడ్కోనెను. ఆమె పోవుచుండగ పెంపుడు లేళ్ళు, నెమి ళ్లును—ఆమెను వదలలేక చెదరి, దీనముగ చూచుచు తమదుఃఖమును తెలియజేసెను.
భారతీయమహానాటికలెల్ల ప్రకృతిసౌందర్యసమ్మోహరముననె వ్రాయఁబడినవి. అందువలననె యని మనసునుతేజముగా పవిత్రముగ చేయుచున్నవి. ఆయినను ఆత్మత్యాగములేక ఆత్మశుద్ధియు, దుఃఖోపశమనమును గలుగ నేరవు. ఇది లోకధర్మముగ మనకవులు గ్రహించిరి. అందువలన తమ నాటకములలోని పాత్రములయందిది బొగుగ ప్రదర్శించిరి. జీవితసమస్య ఉత్తియోచనలతో గాక త్యాగమువలనను నిష్కామకర్మవలననె పరిష్కరింపఁబడునని మన వారి నిశ్చయము. బ్రహ్మచర్యాశ్రమము స్వీకరింపఁదలంచిన ప్రతివిద్యార్థియు కొంత నిగ్రహమును పాటింపవలసియుండెను. ఇదియే తరువాత నాతడు వానప్రస్థాశ్రమమున జేరునప్పటి ఆత్మత్యాగముగ పరిణమించును. ఇందు ఘనులైన ఋషిపుంగవులు వనములనుండి భూమఁడలవిజయమును చేసిన అలెగ్జాండరునకుగూడ లోఁబడక అతని కాశ్చర్యము కలిగించిరి. వారు ప్రేమమయులు. వారికి విజయభేరులతోడి పనియేమి? వీరిని జూచి రాజాధిరాజు లాశ్చర్యపడి, మెచ్చి, తామును రాజఋషులై యీజీవతత్వమున లీనమగుటలో నాశ్చర్యమేమి?
జర్మనీకవి గతే చిత్రించిన స్త్రీ పాత్రము లద్భుతముగ నున్నవి. కాని మగ్గభావమును ప్రదర్శిచుపట్ల ౼ గుణములలో మన శకుంతల కెనవవిత్తురాయని సందియము కలుగుచున్నది. ఆస్ట్రియాదేశపుకవియొకడు హీరోయను నాటకము వ్రాసినాడు. నాయిక యొకయోగిని. బ్రహ్మచర్యాశ్రమదీక్ష వహించెనుగాని ఆదీక్షకు చాలలేక పోయెను. ప్రణయమహిమకు లోబడిపోయెను. ప్రేమయనగా జీవితమున సుఖ మనుభవించుటగాక కష్టమును నింద్రియనిగ్రహము నాత్మవికాశమున నిగ్రహించిన మన శకుంతల యీమెకన్నా నెంతధన్యురాలు! ఇట్లే యూర్యనియు దుఃఖమునుభవించి పవిత్రురాలయ్యెను. పురూరవుడు నట్ల్ కష్టములనుభవించి పవిత్రుడు కావాలసి వచ్చినది. ఆమెకొఱకు వెదకి వెదకి వనములు నగములు గడచి తుద కామెకౌగిలిని కన్నీటితో పొందెను. లంకా విజయము తరువాత నాంజనేయుడు వానప్రస్తుడుగ జిత్రింపఁబడినాడు. అతనినిగూర్చిన నాటకములందు నిజన్ని వ్యక్తమగుచున్నది. బౌద్దనాటకమగు నాగానందమున సత్పురుషుడగు రాజేంద్రుడు తానే గరుడునకాహారముగఁ బోవ సమకట్టును.
ఈ నాటకములను ప్రదర్శించుటకు మన దేశమున కొందఱు యువకులైన ప్రయత్నింపవలసియున్నది. నవీన నాటకములను వానిమాత్రుకలకు పాశ్చాత్య నాటకములను మనవారు ప్రదర్శప యత్నించుచున్నారు. కాని షేక్సుపియరు జనుల నాకర్షింపఁజాలఁడు. భాషాంతరీకరణములు సాధారణముగ రూపాతకీకరణములగు చుండును. మఱియు షేక్సుపియరు ఐరోపాదేశ వేషభాషలను భావములను జిత్రించినాడు. అతడు, నితరులును తాము చూచిన స్థితిగతులను బాగుగ జిత్రించియుంటనే ఘనులైరి. భారతీయహృదయముల నాకర్శింపవలేనన్న నాటకమును భారతీయజీవితమును భావములను నాగరీకమును చిత్రిుపవలెను. గ్రీసుజాతీయత ననుకరించి రోము దేశపు నాటకములు రోమువారి హృదయము లాకర్షింపలేక పోయేను. మనకు జనసామాన్యముకొఱకు నాటకము లావశ్యకములు. భారతీయ ప్రాచీన నాగరికమును వాఙ్మయమును ప్రదర్శించు జాతీయనాటకములు మనకు గావలెను. భారతీయజనులకు నూతనాదర్శములను నవీనాశయములను ఉత్సాహమును కలిగించుటకును, జాతీయ కళాప్రదర్శనముకొఱకును, రంగస్థలములు కావలెను. మనకు నూతనయాత్రలు భారతకథలు ప్రేమ తత్వజ్ఞానమును స్త్రీపురుషులయందు కలిగించుటకు కావలెను.
ఆంగ్లేయకవియగు షల్లీ తన కవితావివిమర్శనము నట్లు చెప్పినాడు. “కవితకు జీవితాదర్శమునకును గల సంబంధ మితరవిధ వాఙ్మయములందుకన్న నాటకవాఙ్మయము బాగుగ కనబడుచున్నది. ఒక సంఘ మత్యంతనాగరికమయినట్టు లానాటక వాఙ్మయ ప్రాశస్త్యమువలన నెఱుఁగ వచ్చును. కొండొకకాలమున మంచి యుచ్ఛదశలోనుండిన నాట్యకళ దుర్గతికి దిగినగాని నశించిన గాని యాజాతియొక్క జీవమె దగ్గతిలో నున్నడని భావము. ఏలని సంఘదుస్థితి కళాముఖమును పోగొట్టును”. భారతీయ నాటకకళ భారతీయుల నుద్ధరించును. లోకమునకు శ్రేయమును కలిగించును.
నవీనరంగస్థలములు మతమునకు లోఁబడియుండు ఘనాశయములఁ గోల్పోయినవి. నీతియు మతము నాదర్శముగ నుండు సుందరజీవితాథార్థముయొక్క చాతురిని జర్మనీనాటకములు గోల్పోయినవి. ఒక జర్మనీ విమర్శకుఁడె యిట్లనినాడు. “మనదుస్థితికి ఐహిక సుఖాభిలాషులగు సైనికులుకూడ సేవగించుకొనునట్లు తుచ్ఛసుఖమును సంతోషము ప్రధానములుగాగల యథమనాటకములు రచింపబడుచున్నవి. జర్మనీదేశీయులీ దుస్థితి కఁగీకరిఁపకూడదు. ఈవ్యాధిమచ్చలను సుందర జర్మనీ నుండి తొలగిఁపవలెను”. ప్రాన్సులోని సంగతులును బాగుగ లేవు. వివాహములు, విసర్జనములు, కుండగోళకులదాయభాగములు మున్నగు విషయము లీకాలపు నాటకరంగ స్థలములఁ జేర్చిపబడుచున్నవి. “స్ట్రి డ్బర్లు” అనుస్వీడనుకవి “స్వీడనువిధి” యను పొత్తమున వసంతమను కథలో నొక నవోఢచే నేమిపాడించుచున్నాడో జూడుడు! "నా మోములఫలంబే దేశముననున్నది” పాపము! ఐరోపాదేశ మీ ప్రశ్నమును చాలకాలమడిగెను కాని ఐరోపాకంఠస్వరము కర్ణకఠోరముగనున్నది. నాటకలోకమున మదురకంఠనాదము కావలెను. భరతఖండ మీ నాదమును వాయిఁపగలదు. జాతీయతాచారమును తేజము నించుక ప్రోత్సహింపవలెను. ఐహికాశయగులందు స్థావరమైన ఐరోపా నాటకమున మానవునందు దైవాంశము చూపుటకు, మానవజీవితమున కర్మసిద్ధాంతమును ప్రదర్శించుటకు, ప్రకృతిసౌందర్య సందేశమును చెప్పుటకు, దుఃఖానుభవ పరమార్గమును బోధించుటకు, చిత్రిజీవనమునఁ గాక ఆత్మత్యాగముననె ఆనందమునుపొందు ప్రేమతత్వమును తెలుపుటకు, నూతనోద్బోధనమునకు, భారతీయాశయమె ఐరోపావాటకము నుద్ధరింపవలసియున్నది. ఆమోముల ఫలమున్న దేశమేది? నోములపంట భారతీయ హృదయముననె కలదు. సీతాదేవి పుట్టి పెఱిగి దుఃఖము లనుభవించి తరించిన చోటు, శ్రీరాముడు త్యాగముచేసి ప్రేమించినచోటు, శకుంతల ప్రేమతో గానముచేసినచోటునగు నీభరత వర్షమునగల ఋషిపుత్రులు హృదయమును జ్ఞానవక్షవుచేత పశీలించి చూతురుగాక! దేశీయవాజ్యమును కళల నుతేజితములుగ జేసిన యీ సౌందర్యము నించుక చూతురుగాక! ఇది యొక నూతన యుగారంభము. ప్రపంచమున ౼ భరతవర్షమున నూతనశకమున నేమి జరుగుమో చూడవలసి యున్నది.
౼ దిగవల్లి వేంకటశివరావు,
బి.ఏ.బి.ఎల్