Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/భక్తాగ్రేసరులు

వికీసోర్స్ నుండి

భక్తాగ్రేసరులు

ఈ సంచి యందు వేరొకచో బ్రకటించిన చిత్రపటమున ఆంధ్రదేశమందలి సుప్రసిద్ధ భక్తాగ్రేసరులు నల్వురు కనుపరచబడిరి. వారలగు గూర్చి సంగ్రహముగనిట వ్రాయుదుము. వీరు వెలనాటిశాఖీయులైన వైదిక బ్రాహ్మణులు. హరితసగోత్రికులు.

మొదటివారు బ్రహ్మశ్రీ బలజపల్లి రామమూర్తి శాస్త్రిగారు. వీరి పూర్వికులు కృష్ణాతీర వాసులు. అయినను వీరు మాత్రము గంజాంమండలమందలి శ్రీకాకుళమునందును, ఇప్పుడు గోదావరిమండలమున కాకినాడయందును తెరచుగ నుందురు. బాల్యము నందు కొలదిగ నిగ్లీషువిద్య నభ్యసించి యటుపిమ్మట కాశీనగరమునకుపోయి సంస్కృతమున గొంతపాండిత్యమును సంపాదించి, ప్రస్థానత్రయ పఠనమును జేసి, వేదాంత శాస్త్రమున అనేక రహస్యములను దెలిసికొనిరి. వీరికి శ్రీభాగవత రామాయణాది గ్రంధములయందు విశేషాభిమానము గలదు. బహ్వన్ద్రహృదయులు. భగవన్నామోచ్చారణమాత్రముననే నరులు కలియుగమున తలంతురును నమ్మకముగల వారు. ఎచటికి బోయినను బహుజనుల నాకర్షించి, వారికి భగవన్నామోచ్చారణ మాహాత్మ్యమును బోధించి వారిచే హరిభజనమును జేయింతురు. "గోవింద రాంరాం గోపాల హరిహరి” యుటయందు వీరికెక్కుడు ప్రీతి. అందుచే వీరు "గోవిండ రాంరాం గారు" అను నామమున జనులకు డెలియబడుచు కాకినాడ ప్రాంతములయందున్నారు. వీరి దర్శనమే భక్తినిగలంగ జేయునని వేరుగ జెప్పనక్కర లేదు.

రెండవవారు బ్రహ్మశ్రీ ముప్పి సూర్యనారాయణ శాస్త్రిగారు. వీరు వెలనాటిశాఖీయులగు వైదికబ్రాహ్మణులు. హరితసగోత్రీకులు. పూర్వపు గోదావరీమండలయిన గోస్తనీతిరమున "ఉండి" సమీపవాస్తవ్యులు. వీరు గొప్పఉపాసకులు. చిన్నతనముననే కాశికిబోయి గంగాతీరమున తపస్సు జేసి, కొంతకాలమునకు నీదేశమునకు మరలివచ్చిరి. వీరు సర్వదా భగవంతుని దీనబంధువని యారాధించెదరు. "దీనబంధూ!" అని దేవుని బిలుచుచుందురు. వీరి తండ్రిగారు గాయత్రీ మంత్రానుస్థానమును విశేషించి చేసినవారు. కానీ వారిని "గాయత్రీమాత" గారని జనులు పిలుతురు. వీరును “దీనబంధు" వను ప్రసిద్ధనామమున దెలియబడుచు గోదావరీమండలమున నున్నవారు.

3

మూడవవారు కృష్ణా గోదావరీ మండలములయందు సుప్రసిద్దులగు బ్రహ్మశ్రీ మల్లాది వెంకటసుబ్బారాయ శాస్త్రిగారు. వెలనాటిశాఖీయులగు వైదికబ్రాహ్మఱులు, హరితసగోత్రికులు. వీరి తండ్రిగారు గుంటూరు నందు చాలకాలము నివసించియుండిరి. తండ్రిగారు ఆంధ్రగీర్వాణములయందు పురాణములను జెప్పుచు శ్రోతలచే బహుగౌరవమున బోషింపబడుచుండెడివారు. వీరాంధ్రమున ననేక గ్రంథములజదివి, పెద్దలవలన ననేక రహస్యార్థములనుగ్రహించినవారు. భక్తివీరికి చిన్నతనమునుండియు నున్న సహజతత్త్వము. వీరి పినతండ్రిగారి పలన కొన్ని యోగరహస్యములను గ్రహించినవారు. కొలది కాలముమాత్రము రిజిస్ట్రేషను డిపార్టుమెటునందు ఉద్యగమున నుండిరి. అనంతరము తమకాలము నంతటిని హరిసేవయందు వినియోగించుచు సంతతభగవన్నామ సంకీర్తనము గావించుచు స్వార్జితపితురార్జిత ద్రవ్యము నంతటిని శ్రీమంగళగిరి లక్ష్మీనృసింహస్వామి వారి కర్పించితిరి. అందుచేత వీరికి "శ్రీహరిదాసు” అను నామము వాడుకలోనికివచ్చెను. వీరి యాజమాన్యమున రమారమి మాటయెనిమిది హరిభజన సప్తాహములయిన నెయుండవచ్చును. వీరిగురువులు భద్రాచలపమీపమున నరణ్యమధ్యమందొక గుహయం దుందురని పెద్దలవలన దెలిసికొని వారిని దర్శించి వారివలన నుపదేశమునొంది కృతార్డులు కాదలచి యాయరణ్యమునకు పోయిరి. ఆట కొన్నిదినములు దిరుగ, ఒకనాటి మధ్యాహ్నమున నొక గొల్ల వాడొక దుత్త పెరుగును, యింకొక దుత్త పాలును దీసికొని యొక గుహద్వారమునకున్న నొకపృక్షమునకుగట్టి వెడలంచుండెను. ఇవి యెవరికొర కిచెట గట్టితివనియడుగ నాగోల్లడివి "ఆత్మారామసదాశివ సద్గురువు” లకొరకనియె. వీరే తనగురువులని తెలిసికొని శ్రీహరిదాసు గారచట వేచియుండి, మధ్యాహ్నసమయమున నా వృక్షసమీపమునకు వచ్చిన మహాపురుషుని సమీపించి వారిపాదకమలములకు వందనములర్పించి తనను శిష్యునిగా పరిగ్ర హించి కటాక్షించవలయునని ప్రార్థించెను. అంత నా యోగిపుంగవుడు మరల నొక సంవత్సరమాగీ రమ్మనియె. అటులనే శ్రీహరిదాసు గారు మరుసటివర్షమున నాగురువరుల దర్శించి యుపదేశమునందుకొనితదాది వారియుపదేశానుసరణమున సంతతము స్వయముగ భగవన్నామ సంకీర్తనమును జేయుచు నితరులచే జేయించుచు, నామమాహాత్మ్యమును బ్రకటింపుచు చరించుచుండిరి, భగవన్నామముచే కొన్ని మహిమములు గలుగునని వీరి జీవితమున కొన్ని నిదర్శనముల జూపించిరి. ఒక చోట వర్షము గురుపించిరి. ఒక చోట యాత్రికులకఁదరకు నాకసమున దివ్య తేజోవిరాజమానమూర్తులగు శ్రీ సీతారామచంద్రుల జూపించిరి. నీరి కన్న దానమును జేసి, భూతతృప్తి జేయుటయందతి ప్రీతి. అందుచే వీరు గృహస్థాశ్రమమున కాకినాడయం దున్నప్పుడనేక సమారాధనముల జేయుచుండెడి వారు. అనంతరమందు భార్యావియోగమయిన తరువాత బెజవాడ నింద్రకీలాద్రిపైనున్న శ్రీకనకదుర్గాంబాదేవి సన్నిధిని తపమాచరించి శ్రీదేవి యనుగ్రహదత్తకాషాయవస్త్రధారులై తరువును, ధనమును, మనమును శ్రీహరి కర్పణము జేసిరి. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గాలయ సమీపమున నున్నకోనేటి సోపానాదులు, శ్రీమంగళగిరి లక్ష్మీనృసింహస్వామి వారియాలయ విమానములగు బంగారు శిఖరములు, శ్రీ స్వామివారి గోపురవిమానములగు సుమారు ముప్పదివేల రూప్యముల విలువగల పదునొకండు బంగారుశిఖరములు శ్రీ భద్రాద్రికిబోవు మార్గమున ములకలపల్లియను గ్రామమున చైత్రమాస శుక్ల పక్షమందలి యన్న సత్రము, వల్ల భాపురమునగల శ్రీ రామనామధర్మసత్రము మొదలగునవి శ్రీహరిదాసుగారి కైఁగ్యములలో గొన్నియని చెప్పవచ్చును. ఇపుడు మిగులవైభవమున, శ్రీసూరి మార్కందేయశాస్త్రి గారిచే నడుపబడుచున్న శ్రీ ఆగిరిపల్లి వేదశాస్త్ర పాఠశాలకు శ్రీహరిదాసుగారు ప్రారంభమున చేయూత నిచ్చినవారు. ఆనంతరమున వీరు తురీయా శ్రమమును స్వీకరించి కొలది కాలము శ్రీభూమానఁదతీర్ధులను నామమున యద్వైతబ్రహ్మానందము ననుభవించి రెండువవత్సరముల క్రిందట శ్రీమఁగళగిరియందే సిద్ధినొందిరి. వీరి జీవిత మాదర్శప్రాయము. ఇందు బ్రహ్మచర్యమవిప్లుతనిష్టాయుతము. గార్హస్థా మానవరతాన్నదానాయుతము. వానప్రస్థ మపూర్వ హారికైకారోపేతము. తురీయాశ్రమ మంతరను భవిత బ్రహ్మానందరసయుక్తము.

నాలవవారు గంగా భగీరధీసమానురాలైన శ్రీకైవారంబాలాంబగారు. ఈమె తేలగాణ్యశాఖీయులగు వైదిక బ్రాహ్మణి. ఈమె భర్తగారు మంగళగిరియం దుందువారు. ఆయన మరణించిన తరువాత నీమె శ్రీ మంగళాద్రిపై కొంతకాలము తపమాచరించి, శ్రీహరి యను గ్రహమును వడసి, శ్రీహరి సేవయే తనకు కర్తవ్యమని నిశ్చయించి శ్రీహరిప్రీతికై మంగళగిరి క్షేత్రమున ననవరతము నన్నదానమును జేయుచుఁదురు. కులమును గోత్రము నడుగదు; అన్నాతురులందరును దనర్హులనియె యెంచి తృప్తి బరచును వారువీరనిక యన్ని జాతులజనులకు నీమెయే మంగళగిరి క్షేత్రమం దాదరించి యన్నము బెట్టు తల్లియని చెప్పవచ్చును. ప్రతి ముక్కోటియేకాదశికి వీరియింట అథనుమొక యయిదువేలమందియైన భుజింతురు. ప్రతి ఫాల్గుణ శు౹ పూర్ణిమకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవములు జరుగు సమయమున, వీరియిల్లే పెండ్లియిల్లు. పదిరోజులు ప్రతి పగలు రాత్రియు కొన్నివేలమంది యిట భుజింతురు. వీరు జేయుయాదరమునకు మేరలేదు. గోదావరీమండలమున గన్నవరమున నన్నదానమునకు ప్రసిద్ధులగు శ్రీమతి డొక్కా సీతమ్మగా గనువా రొకరుండెడివారు. వారి కీర్తి దిగంతవిశ్రాంతము. వారి తరువాత నన్నదానమునకు పేరుజెప్పవలసినవారు శ్రీ బాలాబగారనియే చెప్పవలయును, శ్రీహరియే శరణ్యుడని నమ్మి యాతడే సర్వమయుడని నిశ్చయించి, భూతతృప్తి జేయుటయే శ్రీహరిసేవయని ప్రవర్తించువారల జీవితమెట్లుండునో మంగళగిరి శ్రీ బాలాంబగారి యింటికిపోయి ఫాల్గుణ శుద్ధ పంచమి మొదలు పూర్ణిమ వరకు నటనుండిన చెక్కగ బోధపడగలదు. ఓంతత్సిత్ల్.

- చెరుకుపల్లి బుచ్చిరామయ్య


భక్తాగ్రేసరులు