గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/నవీనాంధ్రకవులు
నవీనాంధ్ర కవులు
వాల్మీకిమహాకవి కరుణాంతరంగుడు. నేలగూలిన పిట్టకైవగచి మొదటి పద్యము నుచ్చరించెను. రామగుణానురక్తుడై యుప్పొంగి రామకథామృత ముత్పత్తిజేసెను. "శ్లోకత్వమా పద్యత తస్య శోకం". నానాదేశముల ఆదికవులు ప్రకృతి సౌందర్య మవలోకించియు, మహాపురుషుల వీరోదారగుణ గౌరవంబును మెచ్చియు, అందున జనించు రసభావ నిరంకుశావేశమును పట్టజాలక, వాగ్రూపమున వెల్లడింప దొల్లిటి పద్దెపొత్తము లేర్పడినవి. వీరు చూచినవియు, అనుభవించినవియు వీరి సంభావనాప్రభావమున వన్నెచిన్నెలు దాల్చి, వీరి వినిర్మలాంత కరుణారంగంబున జగద్విస్తీర్ణసత్వమును జెంది యాదికావ్యములన శోభిల్లుచున్నవి. రసావేశ చోదితంబులుగాన వీరికృతులు సామాన్యముగ గేయ మాధుర్యమొప్పారు లలితిపద పుంజములతో గూర్పబడినవి. వీరికల్పనాసంచారములు కావ్యలక్షణములై తరువాతకవుల బాగోగులకు హేతువులై పరిణమించెను.
కవులావల, రాజానుగ్రహమువడసి, ధనికులగొలిచి, వందిజనఁబులై యేలికల వేడుకుకొరకును, మెప్పుకొరకును, లక్షణబద్దమైన ప్రబంధముల నేర్పరిపసాగిరి. కొంద రచ్చటచ్చట బరమేశ్వరుని లీలాఁరసస్వరూపములు నభి నందించుచు, భవబంధవిమోచన నెూ ఒకడు రసభావోద్వేగమున నాత్మసంతృప్తికై పద్యములల్లుచుండెను. దేవభావతి యీగితిలో నస్తమించెను. యూరపుఖండమున నిట్టివాఙ్మయవ్యవస్థ 1770 వరకుండెనని చెప్పవచ్చును.
దరిమిలాస యూరపులో స్వభావకవిత్వ మనదగునది (Nature Poetry) యుదయించి, స్వవిషయముల గుణరూపభేదముల బాటింపక, కావ్యోచితేతివృత్తముగ నంగీకరింపుచు ప్రకృతియందును, మానవజఁతుస్వభావము లందును గోచరించు పరతత్త్వ మూహింపుచుండెను. కావ్యము, నిబద్దమర్యాదులైన ప్రభువులకుగాని, యపారగుణాలంకృతుడైన పరమేశ్వరునకుగాని, సంబోధిఁపు తెరువులడప్పి జన సామాన్యమును జూచుచుండెను. ఇందుచే కవులిష్టము చొప్పున స్వతంత్రసంచారశీలురై కావ్యముల గాధీరూపముల బలురీతుల విస్తరించిరి. స్వభావ వర్ణనము వెల్లగ దివ్యజ్ఞానసూచికమై "సర్వము౯ అతని దివ్యకళామయమఁచు” నూహింపసాగెను. ఆనిర్వాచ్యనిర్మలానఁద సంశోభితంబగు (Mystic Poetry) కావ్యప్రయత్నములు పాశ్చాత్యమతసాఁఘిక సాంప్ర గాయములలో వికసింప నవాకశము గానక, యూరపు భూభాగవాసులంద రీనాడు హైదవ కవితా మృతబిందువుల రుచిగొని యానందించుచున్నారు. రవీంద్రు డీపాశ్చాత్యభావదాహము నపనయించి విశ్వవిఖ్యాతుడై యున్నాడు.
పౌరాణికులఁదగు మొదటికవులు ప్రకృతియందను, మానవనైజమందునుగల గొప్పవిశేషముల బాటింపు చుండిరి. ప్రబంధరచకులగు మధ్యకాలపు కైతగాండ్రు ఏదో ఒక ఐశ్వర్యవిభూతినొప్పుగాధను జిత్రింపుచుండిరి. వీరు వాఙ్మయచిత్రకారులు. ఆధునికులగు స్వభావ నిరూపకులు అన్నివిషయములు కావ్యో చితికల్పనార్హములుగు సంగీకరింపుచున్నారు. నానాదేశముల పద్యవాఙ్మయచిరిత్ర మీవిధి వికాసమొందియున్నది. మహావీరుడు, సామ్రాట్, పిల్లాజమీదారుడు, వరక్తకుడు సామాన్యమానవుడు కాలక్రమమున మానవసఁఘ నేతలై వ్యక్తి ప్రభావమంతరించి, సంఘప్రభావ మున్నతజెందు చుండ నా కాలధర్మముల ననుసరించి కవితారీతులు వేర్వేరుదారుల ననుసరించినవి. ఏ కాలమున నేరీతికావ్యము లేర్పడిఁను, మానవులకవి రెండువిధముల నుపకరించు చున్నవి. నీతివర్తనమువలన లాభములదెలుపుచ్చునని నీతినాశనకారణమని యేర్పరచుచు, నున్నతమైన, సుందరమైన, పవిత్రమైన జీవనాదర్శలక్ష్యముల నిర్ణయించుచు సుఖావహమగు పరహీతవ్రతము నెల్లకావ్యములు వెలకొల్పుచుండును. తరువాత ౼ నీశ్వరాంశము జగన్మయ మనియు, వాని లీలాసంకల్పఫలములై నానావిధములగు పెద్ద చిన్నలు, సుగుణదర్గుణములు, గలఁగునియు నిదర్శించి, సర్వభూతముల యందనకంప ముదయింపజేసి, మానవనైజమును స్వార్థ సంపాదనావ్యభిచారదోషముల నుండి మఱలించి పరమేశ్వరుని యనూనవైభవ స్వభావముల కచ్చేరువఁందజేసి భక్తివిశ్వాసభరితులుగ నొనర్చు సామర్థ్య మెల్లకావ్యములుంగలదు.
కాలక్రమమున కవులు, పౌరాణికులు, ప్రాబఁధకులు, స్వాభావికులు, దివ్యజ్ఞానసూచకులు ఆని చెప్పయున్నాము. నిజముగా నిధి ఆయాకాలముల సామాన్యకావ్యలక్షణమును సూచించునేగాని, యెల్లకాలములలో నన్నివిధములగుకవు లుండి, తమతమ ఇంద్రియ వికాసమును, మేథాసంపత్తిని, ఆత్మసంస్కారమును అనుసరించి, రసభావసఁస్ఫుగణముల నందుచుందురు. కవులలో గొందఱు ద్రష్టలై, కాజ్ఞులై నగ్మనిర్దేశములజేయ నోపియున్నారు. కొందరు యోగులై ప్రకృతీవిలాసప్రచారముందదొకమహాద్భత శిల్ప నైపుణ్యమును, ధర్మసామ్యతను, దివ్య సంకల్పమును జూచుచుందురు. వీరు స్వభావమును నేర్పఱచి వర్ణించియు గుణరూపాతీలవైన తత్వమునె యుద్బోధిఁ పుచుందరు. స్వభావకవులు ప్రత్యక్షము నభి నందించుచు తాము చూచిన, అనుభవించిన, విషయములను యథార్థముగ జిత్రించుచున్నారు. ఆలంకారకులైన ప్రబంధకవులు తమ ప్రత్యక్ష రసభావానుభవములను, విశ్వాసలోకనములను మేధావీధుల విస్తరించి, వన్నెచిన్నెల నొనగూర్చి, స్వభావ సందర్భముల కొకభావవై చిత్రమును గల్పించి, పౌరాణిక ప్రతిభ లేకున్నను, సామాన్యాతీతమైన జేసి, పదవుృతి సౌష్ఠవింబుల జతపఱచి యందమగు, లలితరసోద్దిపకంబగు, కార్యము నమర్చుచున్నారు. ఇక భావవులనువారు (Lyrical Poets) స్వభావాషలోని ప్రేతములైన సూక్ష్మాంశముల దలపోయుచు రసస్మృప్తి గరిపించుచుందురు. పౌరాణిక ప్రాంబంధిక స్వాభావిక కవులు మువ్వురియందు పైచెప్పిన గుణవిశేషములు వేర్వేరు ప్రభావములతో నెక్కవతక్కవగ జేరి పురికోల్పచుచుండును. అందరు గుణరూప ధర్మపరిమితిగల ప్రపంచమును జ్ఞానేంద్రియ మనోబుద్ధ్యహంకారపరిమితమైన తమ మేధస్సులతో ననలోకింపంపు చుందురు. అందరు ప్రకృతీయ దలిరూపమును భావమును రసమును జూచుచుండురుకాని వినిలో నొక్కొక్కటి యొక్కొక్కజాతికవి కెక్కువ యానంద మదయింపజేసి దానికెక్కువ ప్రాముఖ్యత నొసంగ నుత్సాహషఱచును. నిజగా కావ్యవాఙ్మయపు ప్రధానతత్వములో ప్రాచీనము మధ్యమము ఆధనికము అనుభేదములు లేనేలేవు. కాలవ్యవస్థమే కాదు; దేశవ్యవస్థయు కావ్యమునకులేదా? కావ్యము లందు గోచరించు భెదములన్నియు కావ్యలయోగమునకు గాని కావ్యకారణమునకుగాని చెందినవికావు. ఇతి వృత్తము దేశకాలముల ననుసరించి మారు చుండుటను కవులమనీష వివిధముగనుటను కావ్యభేదము లమరు చున్నవి.
ఆంధ్రవాఙ్మయమున నిలిచియున్న మొదటిమహాకావ్య సంకల్పము భారతాంధ్రీకరణము. “అస్మదీయవంశమునఁ బ్రసిద్ధులై విమలసర్గణ శోభితులైన పాండవోత్తములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమెంతయు౯" అని రాజనరేంద్రు డానతీయ తదాస్థాన విద్వత్కవీంద్రు డాపని జేపట్టి తనపోషకున కంకితముగా గొంతవరకు నిర్వహించెను. తిక్కన ఇష్టదేవతార్పితముగ దైవసంకల్పప్రేరితుడై యాకార్యమును గడతేర్చి కైవల్యమొందెను. వీరువురి సాంప్రదాయములే ఇరు వదియవశతాబ్దమువరకు ఆంధ్రకవుల సంకల్పకారణములై యున్నవి. తెలుగు కావ్యములు రాజమహేంద్ర సామ్రాజ్యవైభవంబున మొలకెత్తి, రెడ్లపెంపున బల్లవించి, ధనికులప్రాపకములో విస్తరించి, విద్యానగర భూధవాదరణ బుష్పించి, సరిసామోదశోభితయు లైచిత్ర కాంతుల జెన్నొంది, కావేరీ సలిలశీతలానిలంబున ఫలించి, పిల్లదొరల యల్పోపహారమున బ్రాణధారణమొనర్చి, యల్లనల్లన నాంగ్లనాగరక శోభావిరాజితంబులగు రాణ్మహేంద్ర చెన్నప్పపురముల నాశ్రయించి, నూతనవసంత విలాససంపదలనొప్పి, ప్రజాసామ్రాజ్యపోషితయై పలుతెరంగుల బేరొందియున్నది. నన్నయ మొదలు తిరుపతి వేంకటేశ్వరులపరకు ఆంధ్రవాఙ్మయతరంగిణి రాచపట్టుల జుట్టి తిరుగుచుండెను. ఒక చిన్న పాయ పోతనాదులు నివసించు దివ్యారామములపొంత బారుచు, శతకకవుల యార్షోద్యకంబుల దడపుచు నెండు, వరదాలెరుంగని ప్రచ్ఛన్న సంచార మొనర్చుచున్నది. రాజకవిగానీ, భాగవత కావ్యకర్తగాని, లౌకిక పరిజ్ఞానము లేనిదే, భావోద్రేక మొందనిదే, రసానుభవము జేందనిదే, ప్రకృతి వైచిత్య్రాములు జూచి సంతసింపనిదే, సకలజనామోదకంబగు కావ్యకల్పనలు చేయజాలడు. కాని "కావ్యలయశసేఽఒగ్ధకృతే వ్యవహారవిదేశివేతరక్షత యే” అరునట్లు ఆంధ్రకావ్యారంభమున నుండి 1908 వరకు ఆంధ్రకవులు ధర్మనిర్దేశమో, ప్రభుసంతోషణమో, ధనాసక్తియో, మోక్షకామమో పేరువాసియో ప్రేరేపింప లోకోత్తరకావ్యయత్నముల గొనసాగించిరి. కాని, ఇందున నొక్కడేనియు జగద్వ్యాప్తమగు భూతదయతో మానవసంఘమును బ్రేమించుచు ప్రకృతి సాహచర్యమున రసభావపరవశులై కావ్యముల నుచ్ఛరించినవారగుపడుట యరుదు.
పోతన, తిక్కన, సూరన మున్నగుకొందరి కల్పనలు చూచినచో, సంస్కృత కావ్యములు వర్ణనాపఠనమేకాక అత్యధికమైన లౌకికజ్ఞానము, మానసప్రచారసాంప్రదాయాభ్నిజ్ఞత, రసౌచిత్యము, స్వభావాభివర్ణనము గోచరించును. వీరు నిజముగా కొంతచూచియు, అనుభవించియు, మిక్కిలిసంభావించియు, ప్రకృతిస్వభావముల రుచికరముగ నభివర్ణించియున్నారుగాని, దానినెల్ల కావ్యోద్దేశ్యమునకు లోబరచి యందలి సూక్ష్మాంశముగ రచించి యున్నారు. మరియు నీశ్వరాంశము జగద్వ్యాప్తముగ నంగీకరించియు, భూతకాలపు సామాన్యరసవ్యవస్థ నెరింగియు మానవునె ప్రథానాంగముగ సంగ్రహించి కావ్యగాధల గల్పించియున్నారుగాని, మానవేతరమగు భూతజాలమున కెట్టిభావవ్యక్తినిగాని రసానుభవశక్తిని యాపాదించియుండలేదు. ప్రకృతి మానవమానసంబున రసోద్దీపన మొనర్చునదిగ సఁగీకరింపబడినది. అందుకే ఋతువర్ణనాదులు "మీపొదలచాటున లేడు గదమ్మ చెప్పరేరి" యని సంబోధించుటకూడ కాననగు. కాని ప్రకృతివలన జబా జేమియురాద. ప్రకృతీతో సంభాషించుచు, దానిభావవ్యక్తి నభివర్ణించుపోకడలు 1907 వత్సర ప్రభృతి తెలుగు సారస్వతమునబొడకట్టినవి. ఈవ్యాసమాలికలో ప్రధానాంశముగ నీ స్వభావకావ్యవైచిత్య్రమే విమర్శింపబడును.
తొల్లిటి యాంధ్రకవులు పౌరాణికులు. వీరుగీర్వాణ సాహిత్యపారంగతులు శ్రుతి స్మృతి పురాణేతిహాస ప్రపంచసంచారకులు; రాజ్యకార్యదురంధరులు; పరమలౌకికులు. నన్నయ్యమొదలు విద్యానగర కవితావిర్భావ మహౌన్నత్యము వఱకునుగల తెలుగుకవులు సంస్కృతపాండితీథురీణులైన లౌకికులు. తిక్కన, కవిసార్వభౌముఁడు, ప్రబంధపరమేశ్వరుడు, పోతినామాత్యుడు పాండిత్యమునకు లౌకికపరిజ్ఞాన వెక్కుడుగ జతపఱచి, కల్పనాచమత్కృతి వలన, ప్రబంధములయొక్కయు, ఆధునికనాటకములయొక్కయు, బీజాంకురముల నేర్పఱచియుండిరి. విద్యానగర కవితావిర్భావసందర్భమున 16వశతాబ్దమున వన్నెకెక్కిన పెద్దన, తిమ్మన, రామకృషులు పాండిత్యసంపదలకొన్న రసానుభవ మెక్కువగ గలిగి యుండిరి. ఆకాలముననే బ్రాహ్మణేతరుడు కవితాశక్తి ప్రకటింప మొదలిడెను. పింగళిసూరన (17వ శతాబ్దము) కర్నాటక సామ్రాజ్యవినాశావంతరము రసవ త్రబంధనాటకముల నల్లుతరి, లౌకికానుభవము, భావసౌష్టవము, కధౌచిత్యము ఎక్కువగ పరిగణింపబడుచు, తెలుగుప్రబంధములు స్వాతంత్య్రవికాసపణతులై, సంస్కృతాలంకారలక్షణములకు దూరమై సహజాంధ్ర ప్రతిభావిరాజితములై యుండెకు. ఇప్పటివఱకును ఆంధ్రకవిశేఖరులందరు లౌకిక బ్రాహ్మణులే. తంజాపురి యాంధ్రకవితాలవాలమైనపట్టునను, (18వ శతాబ్దము) పింగళి సూరనార్యుని వెనుకను, తెలుగుకవులు తెలుగుప్రబంధములను తెలుగులక్షణ గ్రంధములను అవలోకించి ముఖ్యముగా భట్టుమూర్తి కవితారీతులననుకరించి కావ్యముల గూర్చుచుండిరి. ఈకాలములో చాతుర్వర్ణ్య లెక్కుడుగ కవితారంగమున వాసికెక్కిన ఆనాటి నాంధ్ర భారతీ నిద్రావిశ్రాంతినొందునప్పుడు, పళ్ళెటూళ్ళ, పేరెన్నికలేని నియోగులు శతృకల్పనలను కొన్నిసందర్భములలో రసవంతమైన కావ్యములను జేయుచు గుప్తయశోనిధులై మరగుపడియుండిరి. భట్రాజులు శ్రీపదంబుల నాశ్రయించుచు, తెలుగుప్రబంధములు రసవత్భావ గాంభీర్యమును వెల్లడింపక, శ్లేషాదిబంధకవితా తెరఁగుల నలుదేశల మ్రోగించుచు, భాస్కరదానశీలమును గీర్తించుచు తలమార్చినపద్యములతో మెప్పించి మెప్పులవడయుచుండిరి, ఈగతి నాంధ్రభారతి 1840 సంవత్సరము వఱకు నధోగతిజెండి యుండెను.
ఇంతలో 19వ శతాబ్దారంభమువరకు గోలకొండ నెల్లూరు ఆర్కాటు నవాబులు యాధీనముననున్న యావదాంధ్రదేశము విచ్ఛిన్న మాయెను. బేరారు మధ్యపరగణాల యాంధ్రులు మహారాష్ట్ర పరిపాలనమున జేరిరి. గుంతకల్ – బెంగులూరు రైలులకు పడమటనున్న తెలుగుసీమలు హైదనరల్లీకిలోబడి క్రమముగ మహీసుర రాజ్యభాగమున జేరను. చెన్నపురి - బెంగుళూరు లైనునకు దక్షిణముననున్న యాంధ్రభూములు, మతసాంప్రదాయములచేతను వైష్ణవప్రపత్తిచేతను తమిళనాగరిక ప్రభాక్రాంములై తెలుగుతత్వముల వీడేను. దత్తమండలములు సైనికసంరక్షణము కోరి కాంగ్లేములకియబడెను. (1805) ఈ ప్రాంతములలో మొగలాయిపక్షమున నానగొంది, గద్వాల, వనపర్తి సంస్థానములు నిలిచియుండెను. దత్తమండలములు వర్షాధారమున పండునవిగానను, చాలభాగ మరణ్యములతో నిండి సేవ్యానర్హముగనుండుగావునను, క్షామకంటకము లచ్చట దఱచు తలజూపుటను, పండితిపోషకులగు సంస్థానములు లేనందులను, దత్తమండలము లొకప్పు డాంధ్రవిద్యానటీ వృత్తిరంగస్థలంబులై చెన్నొందియుండియు, గ్రమముగ బ్రాహ్మణ తిభాదరిద్రమునకు పాలైనవి. పోషకులులేరు. క్షేత్రారామములకు వలయు నీటి వసతులులేవు - బ్రాహ్మణాగ్రహారములు లేవు — పండితులు లేరు. దత్తమండలముల దౌర్భాగ్య మాంగ్లయే విద్యాప్రతిష్ఠాపకుల గాని, ప్రభువులగాని యాకర్షింపకుండెను. ఇంతలో తంజాపురినుండి చెన్నపురికిని, చెన్నపురినుండి ముంబాయికిని రైలుమార్గము లేర్పడెను. తంజాపురీ ప్రాంతమునగల హైందవసాంప్రదాయ దుర్గమ దుర్గంబుల భేదించు కొరకు, క్రైస్తవమిషనరీ లచ్చట 19వ శతాబ్దారంభమున నాంగ్లవిద్యాలయముల నేర్పరచిరి. ఊద్యోగవశమున దాక్షిణాత్యులు చెన్నై పరిసరములన్నియు నాక్రమించి వాని నాంద్రేతరమొనర్చిరి. వీరు లాకారణముననే అయోమార్గావకాశమున దత్తమండలముల కెగబ్రాకి కడప, బళ్ళారి, కర్నూలు ప్రాంతములు తమనాగరిక సత్వమల వెదజల్లి యచ్చట స్థిరవాసులైరి. మరియు నా ప్రాంతములుత్తరముననుండి మహారాష్ట్ర పౌరసీకప్రవాసుల యావాసములాయెను. ఆంధ్రవిద్యాపీఠములు లేవు. ఆంగ్లవిద్యావ్యాపనము తక్కువ. అరవపారశీక నాగరకతా విజృంభణమెక్కువ. బ్రాహ్మణప్రవత్తి కొదువ. ఇందుచే నాయెడ నాంధ్రజాతీయ సహజకావ్యోదయము లేకుండెను. ఇటీవలమాత్రము అరవ, కర్ణాట, పారసీక, మరాటీ సాంప్రదాయానుసారముగ నాటకములల్లు ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుగారు అచ్చోట జనియించిరి. దత్తమండలములలో జాతి సాంకర్య మెక్కువగనుంటచే, థియాసఫీ కునికిపట్టయి, మిగిలిన భారతభావ విన్యాసతిగఁగోద్వేగమును జెందక, భవక్తితో శృంగారములతో గూడిన పురాణగ్రంధరచనారంగమై యున్నది.
నెల్లూరు చిత్తూరు ప్రాంతములు వైష్ణవ సాంప్రదాయమునను, రయిళ్ళ యంటుబాటునను, చెన్నపురియరవల విలాసభూములై యాంధ్రత్వమును గోలుపోయెను.
19వ శతాబ్దారంభమున నాంగ్లేయులుత్తర సర్కారులకు నిజాంవలన కవులుకొనిరి. ఆగౌతమీతటవ్యాప్తిమయిన కళింగరాజ్యవిభూతిని బద్మనాభరణకూటంబున పసజెంపి, యాభాగమంతయు గైవశము జేసికొనిరి. సువర్ణముఖమొదలు నాగావళివర కాంగ్లేయ ప్రభుత్వ మేర్పడెను. కాళహస్తి, వెంకటగిరి, నూజవీడు, పిఠాపురం, పెద్దాపురం, బొబ్బిలి సంస్థానములలో వెలమదొరలును, విజయనగరములో పూసపాటి క్షత్రియులను సామాన్య వైభవోపేతులై స్వాతంత్య్రరహితులయిన భూస్వాములయిరి. తెల్లదొరలు బలిగ్రహణ సౌకర్యమును కనేక చిల్లర జమీదారుల నుత్పత్తిజేసిరి. పీనాకినీ గౌతమి కృష్ణవేణీ మహావాహినులేగాక, తూర్పుకొండల సెలయేళ్ల సంఖ్యాకములు సాగరాభిముఖులై పారుకతన, ప్రాగాఁధ్రభూభాగము ఫలసస్యశోభావిభాసితమై బ్రాహ్మణావాసములతో నిండియుండెను. ఈ ప్రాంతముల వైదికులలో సంస్కృత పాఁడితీప్రాచుర్య మధికముగ నుండెను. పల్లెటీకరణాలకుటుంబములలో నూతన కావ్యోత్పత్తి వాసిగ లేకున్నను, తిక్కన పోతినాదులు కవిలేలమరియుండెను. 1840 దరిమిలాన ఆంగ్లశిల్పకులు గౌతమీ, కృష్ణవేణీ పినాకీనుల కానకట్టలేర్పరచి, దేశమును క్షామరహీతముగ నొనర్చిరి. దక్షిణాదిన 19వ శతాబ్దారంభమున నేర్పడిన యాంగ్లవిద్యావకాశము ప్రాగాంధ్రమాభాగమున 1850 వరకును ఏర్పడలేదు. ఇందుకుతోడు చెన్నెపురి - కలకత్తాలబండి ఆకాలముననే యుండినయెడల తయారైన తమిళులు మనదేశమంతయు నాక్రమించి, తెలుగుతెలివిని దునుమాడియుందురు. ఆంధ్రమాతకడుపు చలువచే నీబండి 1900 వరకు నేర్పడలేదు. ఇంతలో 1850 లో నేర్పడిన ప్రవేశ పాఠశాలలలో రాజమహేంద్రవరము, విజయనగరం, బందరు లోనివి సుమారు 1875 కు కళాశాలలాయెను. కలకత్తా నుండి వాల్తేరునకు, అచ్చటనుండి రాజమహేంద్రవరమునకు, బండి ముందుగాపడెను. మరియు స్టీమర్లపై బందరు, కాకినాడ, విశాఖపట్టరేవులనుండి కలకత్తాకు రాకపోకలుండెను, ప్రాగాంధ్రభాగ మదివరికే మహమ్మదీయ, కళింగ, మగాటీ, పరా, సాంగ్లేయసైన్యముల దాడులకాటపట్టయి, వివిధమత ప్రచారముల, కాలవాలమయి, మహాసామ్రాజ్యములు గాని, మతికూటములుగాని లేక, పిల్ల రాజులతో, చిల్లరదేవుళ్లతోగూడి పరాధికారదౌర్జన్యములకు లోనై యున్నందున, నీ ప్రాంతములలో మత, భావ, సాంఘిక, రాజకీయవిషయములలో స్వాతంత్య్రము, అధికారితిరస్కరణము సంపూర్ణముగ నలవడియుండెను. ఇంతీయగాక, నల్పస్యక్తు లనేకు దేశెముఖమున బనిసేయుచు మహాకార్యముల నిర్వహించు ధైర్యస్థైర్యములు, వ్రతనిష్ట ఇచ్చట నేర్పడినవి. తొల్లి ద్రవిడ, కర్ణాట మరాట, మహమ్మదీయ, కలింగ నాగరికతాంశముల కాటపట్టయిన ప్రాగాంధ్రభూభాగము, రైళ్ళకూడలిచే 19వ శతాబ్దానంతరమును, 20వ దానియారంభమునను, వంగ, మరాటి, భావవాహినీ సంపోషితం బాయెను. బ్రహ్మసమాజము, సంఘసంస్కరణము స్వదేశోద్యమము స్వరాజ్యాభిలాష, జాతీయవిద్య, యహింసావ్రతము మున్నగు నవీనభావతరంగములు ఫలవంతమయిన, సంద్విశాలమయిన, బ్రాహ్మణతపస్సంపన్నమయిన, బల, , దీసమన్వితమయిన యీప్రాగాంధ్రభాగమున జెలరేగినవి. చెన్నపురైలు 1900 వరకు రాకుండుటచే నాంధ్రసత్త్వము తమిళితంత్రముల నుండి కాపాడబడుటయేగాక ఆంధ్రవ్యక్తు లిచ్చిట స్వతంత్ర భావప్రకాశమొంది చెన్నపురి నావహించు శిక్షాలలోద్వేగముల నేర్పరచినది.
తీఁజాపురి సంస్థానప్రభావా సమయము మొదలు 1840 వరకు తెలుగుకవిత్వము పండితేతరులయిన వారి యాధీనమున నుండెనని చెప్పియున్నాను. అసమయమున ఈనాంకమీషనుత్తర సర్కారులు బశీలించి, యచ్చట సంస్కృతి సాంప్రదాయానుగతమగు విద్యా ప్రచారవావకాశముల జాలవరకు నేలగిలిపెను. స్వత త్రిజీవులైన పండితకుటుంబము లనేకములు జీవమోపాధికై, ప్రభువులమో, ఆంగ్లపాఠశాల లానో ఆశ్రయిఁపవలసివచ్చెను. ఇంతలో కాళహస్తి గుండి బొబ్బిలివరకు వ్యాపించిన సంస్థానమాలిక నూతన ప్రభుత్వాధికారులతో కుదిరి, స్వస్థులై, విభవోపేతులై పడితసత్కారము జేయనోపి యుండెను. అచ్చటచ్చట తెల్లదొరలచే స్థాపింబడిన పాఠశాలలకు పండితు లవసరమాయిరి. ఇట్లు ప్రభుసేవలోను, పాఠశాలలలోను జేరినపండితులలో ననేకులు వైదికులు వైష్ణవులుండిరి. వీరందరు గీర్వాణసాహితీ సాంప్రదాయాభిజ్ఞులు. అదివరకు వైదికులు, వైష్ణవులు వేదశాస్త్రము లభ్యసింపుచు, తెలుగు కవిత్వముమ నిరసించుచుఁడిరి. లౌకికులయిన నియోగులు, వందిజీవులైన భట్రాజులు దీని మన్నింపుచుండిరి. ప్రభుసేవా సందర్భమున శుభాది కార్యములలో బండితులు ప్రభువుల కర్థమగు తెలుగున కవిత్వవైఖరుల బ్రకటింపవలసెను. పాఠశాలలలోని పఁడితులు తెలుగు కావ్యముల బోధింపుచు, నాంధ్రకవితాధునీ, మధురాలాపముల మోహమునకావ్యకంఠు లాయిరి. ఇట్టి పండితకవుల ప్రచార మాంధ్రదేశములో 1840 మొదలు 1895 వరకును జరిగిన శతాబ్ధాధ౯మున నుండెనని చెప్పవచ్చును. గోపీనాధం, వెంకటకవి, శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి, మండపాక పార్వతీశ్వరకవి, కోరాడ రామచంద్రశాస్త్రి, మాడభూషి వేంకటాచారి, పేరి కాశీనాధశాస్త్రి మున్నగు పెద్దలీ వర్గమున జేరినవారే. వీరు సంస్కృత సాహిత్య సాంప్రదాయములు జక్కగ గుర్తించి, సూరనార్యుని యనంతరము తెలుగు కవిత్వమున కేర్పడిన పాండితీదారిద్యమును దీర్చిరిగాని, వీరి కవితాప్రయత్నములు లౌకికజ్ణాక రహితములై, పొండితీప్రాగల్భ్య దూషితములై, కులవ్రమాగత నైపుణ్యములేమిచే నింపుదప్పియున్నవి. ఆంధ్రకవిత్వమునకు విశుద్ధతను, వ్యాకరణాలంకార సౌష్టవమును జేకూర్చి, దేవభారతీ ప్రతిభను మరల నీపండితకవుల కూర్చియిచ్చిరి. ఈసాంప్రదాయములతో సంస్కృతాంధ్రపాండితీగరిమ సాంపాదించి, శుద్ధవైదికులయ్యును సరసకవితాసామ్రాజ్యసింహాసనారూఢులయిన విద్వత్కవు లనేకు లిప్పటికిని జీవించియున్నారు. ఆనఁద గజసతీంద్రుని యాస్థానకవు లిట్టివారలే. పండితకవులు కాల (1845-1895) మెట్టెటులో చెల్లుచుండ, నప్పటికే కృష్ణా గోదావరీ విశాఖపట్టణమండలములలో వ్యాపించుచున్న యాఁగ్ల విద్యాలయములలో కొంచెమింగ్లీషు నభ్యసించి, కొంత తెలుగు, కొంత సంస్కృతము చక్కగనేర్చి, ఆంగ్ల, నాగరక సాంప్రదాయములను, ఆంధ్రగీర్వాణ విజ్ఞానమును జతపంచి, యాంగ్ల విద్యాలయములలో పండితులై, నవీనభారత భావోస్మేష మెరిఁగిన తెలుగుకవులు, వైదికినియోగు లిరుతెగల వారు (1885 మొదలు 1905) వరకును, ఆంధ్రసార స్వతవివర్ధకులై యశము గాంచిరి. వీరేశలింగము,వసురాయడు, వేంకటరత్నము, వేంకటరాయశాస్త్రి, వావిలుకొలను సుబ్బారావు, కృష్ణమూర్తిశాస్త్రి మున్నగు వారొకచెంప సంస్కృతనాటకాదుల దెనిగించియు నొక చెంప నాంగ్లనాటక కావ్యఫణతుల ననుకరించియ, గొన్నియెడల నాంధ్రకవి సింహముల పోకడల నాశ్రయంచియు, తెలుగుకవిత్వమునకు విపుల సంచార మేర్పరచిరి. ఇట్టివిద్యా సాంప్రదాయములేక, కవులనేక తావుల నాంగ్ల సంస్కృతిరీతుల నాటకములను, గద్య ప్రబంధములను, విమర్శనలను, భాషాంతరీకరణములను జేయుచు వచ్చిరి. 1885-1905 తెలుగు సారస్వతమున, ననుకారకయుగము. అందలి ప్రముఖులు భాషాంతరీ కరణమందను, అనుకరణమందును బ్రజ్ఞావంతులై, తెలుగుబాస కెటులైన నుపకరించువేడుకతో బాటుపడిరి. భాషాసేవయే ఈకవుల కావ్య ప్రయత్నముల కారణమును ఫలమును, వీరు భావోన్మాదులై, జగద్రొష్టులై, రసానుభవప్రభావమున కవిత లేర్పరుపలేదు. పాండిత్యమున, విశుద్ధతలో పఁడితకవుల కోడిపోవుదురు. భావసౌష్టవమున కవితోదేశ్యనిర్వహణమున, తరువాతి జాతీయకవుల పోకడలు వీరి కేర్పడలేదు.
పండిత్కవులును, అనుకరణకవులును, వారి సంస్కార సంబంధమున, ఆంధ్రకవిత్వపు చతుర్ధరంగమునకు జెందినటులు నన్నయ —యఱ్ఱాప్రగడవరకు మొదటిసీది ౼ పైద్దన వరకు రెండవది ౼ సూరనవరకు మూడవది ౼ తిరుపతి వెంకటేశ్వరులవరకు నాల్గవది. : ఆవల నవీనాంధ్ర కవితావిర్భావ మహోత్సవరంగమునకు తిరుపతి వెంకటేశ్వరులు సూత్రధారులై యున్నారు.
1905–1922 వరకున్న కవితాపటవాహకులు చాల వరకు ఆంగ్లవిద్యాసంపూర్ణులే. వీరు ఆంధ్రగీర్వాణముల నల్పముగ నభ్యసించి, వెనుకటికంగాభినేతల సహాయసంపదలవడసి, ముద్రణాయంత్ర సాహాయ్యమున సులభమైన నానాకాలముల ఆంధ్ర సారస్వత మనుభవించి, జాతీయభావోద్వేగ పారవశ్యమునను, ప్రజాపోషణలో నానాదెసల విస్తరిల్లు వాఙ్మయవివర్ధమోపాయ ప్రోత్సాహమునను, విదేశసారస్వతాభిజ్ఞతను, వంగభావోత్సాహ సంపర్కమునను, ఆంధ్రోద్యమోజ్వలిత మాతృసేవాపరత్వమునను, గ్రావ్యకళాలలిత సాహిత్యరూపాభీమానమునను, సత్కౌవ్యవిమర్శనాపఠన సంజాత నూతనాభిప్రాయప్రాబల్యమునను దేశములో తామరతంపరలై వొడము సాంఘిక రాజకీయవిపర్యయముల వేడిమిచేతను, ప్రకృతి నవలోకించి, భూతజాలముతో నిష్ఠగోష్ఠుల నెరపి, యానందించు కుతూహలమునను బలుతెరంగుల, రసభావ పుష్పాలంకృతములైన పద్దెముల వ్రాయుచున్నారు. వీరితో నాంధ్ర వాఙ్మయమున, స్వభావకవిత్వము ఆరంభమైనది. వీరిలో భానుమూర్తిగారు, మంగిపూడి వేంకటశర్మ, రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరావు, సెట్టి లక్ష్మీనరసింహము మున్నగువారనేకులు గలరు. వీరు పూర్వులవలే పెద్ద కావ్యములు దలపెట్టక, తమ రసావేశమును, అనుభూతివిషయములను, భావోన్మాదమును చిన్నపద్యావళులలో వెల్లడింతురు. ఇట్టి ప్రయత్నముల విమర్శించుచు, వీరికవితారీతులకును, నానాకాలముల ఆంధ్రసారస్వతిమునకునుగల సామ్యభేదముల నరయుచు, నధునాతన భాషాప్రపంచసంచలనమున వీరి నియతస్థానమును జూపుచు, నాంధ్రకవితా ప్రయత్నముల కవశ్యమార్గముల సూచించుటయే “ఆనవీనాంధ్ర కవు" లను ఈవ్యాసమాలిక యుద్దేశ్యము.
నవీనాంధ్రకవులలో పైజెప్పినవారుకాక, శుద్ధాంధ్ర సంస్కృత పొండిత్యముగలిగియు, 1885-1922 వరకును దేశములో వ్యాపించుచున్న భావప్రవాహమును గుర్తెరిగి దేశకాలోచితరీతుల సరసకవితామాధుర్య సౌందర్యమొప్పారు, కవిశేఖరు లనేకులు గలరు. వీరికి నవీన భావములు కర్ణాకర్ణికలగుటచే వానిస్వయంవ్యక్తియంతగ దోపక, నవీనభావబానిసత్వము నంగీకరింపక, లౌకికపరిజ్ఞానమును, నవీన భావసూచనలను, తమ పాండితీయంత్రమున శిక్షించి, అనుభవసారమును సంగ్రహించి, నిరుష్టభాషామర్యాదలతో సరసముగ జెప్పు నీతరగతివారిలో తిరుపతి వెంకటేశ్వరు అగ్రగణ్యులు. వీరివెనుక, కాశీ కృష్ణాచారి, పురాణం సూర్యనారాయణ తీర్థులు, మున్నగువార నేకులు సరసకవితా సామ్రాజ్యసంపన్ను లీకాల మున గలరు. వీరినికూడ నవీనాంధ్రకవులలో జేర్చి ప్రత్యేకముగ నొక్కొకరియొక్క గాని, ఒక విధమగు కవులు గుంపును గాని, యొక్కొకవ్యాసములో బేర్కొని విమర్శించెదరు.
1905-22 వరకు జరిగిన భాషోద్ధారకావహములో సుమారు 200 కవులు సందర్భపద్యావళుల బ్రకటించి యున్నారు. వీరిలో ప్రధానముగ దారిత్రొక్కిన కవితా మార్గదర్శుల నెనిమిది ప్రత్యేక వ్యాసములలో విమర్శించి, చిల్లరకవుల కొకవ్యాసమొసంగి, భావికవిత్వమున కొకటియు, నవీనికవితాప్రయత్న సమన్వయమునకు రెండును సమర్పింపదలచినాను. ఈవ్యాసములు ముగియులోపలనే నవీనాంధ్ర కవిత్వసారమును, పుస్తకముగా ముద్రించెదము.
ఈ వ్యాసమాలికకు పండ్రెండు సంచికలలో వర్ష వ్యాప్తప్రోత్సాహ మొసగినందులకు గ్రంధాలయ సర్వస్వపత్రికాధిపతుల కెంతయు కృతజ్ఞుడను. ఆంధ్రసోదరులకు నావిధివిహితోపకారముగావించి యుత్తమగతుల నరయు నాపాలిటి కీపత్రికాప్రోత్సాహమే పదివేలు విలువ.
౼ పురాణం సూరిశాస్త్రి