గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/దేశీయ మహాజనసభ — గ్రంథాలయోద్యమము
దేశీయ మహాజనసభ — గ్రంథాలయోద్యమము
(దర్భంగ సంస్థాన గ్రంథాలయాధిపతియగు యస్.సి. గుహథాకూరుగారిచే వ్రాయబడినది)
ఈ పంవత్సరము అశ్లీల భారత జాతీయోపసంఘము వారు శాసనసభల బహిష్కారమును గూర్చి ఎక్కువ యోచన జేయుచున్నారు. అట్టి సందర్భమున నిర్మాణ కార్యవిధానమునుగూర్చి సూచనచేయుట అప్రస్తుత ప్రశంసగా కానవచ్చును. శాసన సభాబహిష్కారమునకు విముఖులుగానున్న వారి యభిప్రాయమును లోతుకుదిరి పరిశీలించినచో — బెజవాడ, ఢిల్లీ, బార్డోలీ కార్యవిధాసముల ననుసరించి దేశములో తగుకట్టుబాట్లు జరుగక పోవుటయే, యిటిఆలోచనలు పుట్టుటకు కారణమని మనకు తోపకపోదు.
దైవానుగ్రహమువలనను వర్తమాన కాలమున తదంశాసంభూతులై భూభాగమున భగవల్లీలను ప్రదర్శించుచున్న మహాత్మా గాఁధియొక్క ఉపదేశప్రాబల్యము చేతను ఆసేతుహిమాచలప్యంతము ఆత్మనివేదనతత్వము తీవ్రముగ వ్యాపించినది. దేశీయమహాజనసభ కాలాను గుణ్యముగ తమశక్తిని వినియోగించి దేశముకొరకై ఆత్మసమర్పణ చేసి కష్టములపాలైన యెందరో మహాపురుషులయొక్కయు, యికముందు గూడ నట్టి సదుడ్యమమునకు సంసిద్ధులుగానున్న పావనచారిత్రులయొక్క యుశక్తియుక్తులనన్నిటిని దేశాభ్యుదయమునకై వినియోగపరచుటకు వారివారి స్వభావానుసారము గలిగిన మార్గముల నశ్వేషించి నిరూపణ చేయవలసియున్నది. అందులో జాతీయవిద్య ముఖ్యమైనది. ఇందునుగూర్చి అక్కడక్కడ త్యాగశీలురగు గురువర్యులు వీలగునంత వరకు కృషిసల్పుచున్నారు. ఖద్దరు వ్యాపకమునకైగూడ నిట్టికృషి కొంతవరకు జరుగుచున్నది. కాని సర్వజనసామాన్యమగునటుల నీ రెండు విషయములందు కూడ కృషి జరుగుచున్నదని చెప్పుట సాహసము. ప్రస్తుతము నిర్మాణవిధానమున జరుగుచున్న కృషి యీరెండు విషయములలోనే నని సామాన్యముగా చెప్పవచ్చును. జనసామాన్యమందు విజ్ఞానము వ్యాపింప చేయుటకు మనము ముఖ్యముగ కృషి చేయవలసియున్నది. ఇందుకొరకై పల్లెలయందు గ్రంధాలయములను స్థాపించవలెను. అందు సామాన్యలు చదువుకొనుటకును పండితులు కూడ చదువ దగినట్టియు గ్రంథములను సేకరింగవలెను. అక్షరజ్ఞానములేనివారి కుపయోగించునట్లు సాయంత్రమున కేవల సంభాషణమూలముననె జ్ఞానోదయము కలిగించుటకు ప్రయత్నించవలెను.
ఎక్కువ ప్రాధాన్యమువహించిన విషయములను గూర్చి కృషిచేయుటమాని, యితరవిషయములపై మన దృష్టిని యెంత కొంచెమైనను ప్రసరింపచేయుటకు తగుసావకాశ మున్నదాయని ప్రశ్న చేయవచ్చును. ప్రతి కాంగ్రెసు సభకును అనుబంధముగ ఒక గ్రంథాలయమును స్థాపించినచో నిర్మాణ కార్యక్రమము, అందు ముఖ్యముగా ఖద్దరు వ్యాపకముగూడ దేశముందెక్కువ చేయవచ్చునని పై ప్రశ్నకు జవాబియ్యవచ్చును. అనుభనమువలన యీవిషయము తప్పక రూఢిపడును.
ఇపుడు ముఖ్యముగ చెప్పవలసిన విషయమేమునగా కాంగ్రెసునకు తగిన గ్రంథాలయ మొకటి స్థాపించవలెను. ౧ం, ౧౨ కంటే యెక్కువసంఖ్యగల గ్రంథములు లేని జిల్లా కాంగ్రెసు సంఘములెన్నియో గలవు. రాష్ట్రీయ కాంగ్రెసుసంఘముల స్థితిగూడ నిట్లే యున్నది. ఇక ఆఖిలభారతజాతీయోపసంఘము దేశమంతయు తిరుగునది గావున అసంఘమునకు అనుబంధముగ గ్రంథాలయము వేరుగలేదని చెప్పుట అనవసరము. ఆఖిలభారతజాతీయోపసంఘమును స్థాపించి నిర్వసించుట ఒక కష్టమైన పనిగాదు. దీనికి ధనసంపత్తికుడా నవసరము లేదు. పాశ్చాత్య దేశములందు స్టాపింపబడియున్న మహోత్కృష్టములగు జాతీయపౌరగ్రంథాలయము లందలి గ్రంధములన్నియు మూల్యమునకు కొన్నవి గావు. ఆయాదేశములలో అమలులోనున్న కాపీరైటు చట్టమునుబట్టి ప్రతిగ్రంథము యొక్క ప్రకాశకులును కొన్ని గ్రంధములను జాతీయగ్రంథాలయములకు యిచ్చితీరవలెను. ఈవిధముగా అసంఖ్యాకములగు గ్రంధములు ఆయాగ్రంథాలయములకు సేకరింపబడినవి. అమెరికా సంయుక్తరాష్ట్రములు కాంగ్రెసు లైబ్రరీయును, కలకత్తా ఇంపీరియలు లైబ్రరీయును, బరోడా కేంద్రగ్రంథాలయమును యిట్లేర్పడినవే. మన దేశమందుకూడ అట్టిమార్గమునే అనుకరించ వచ్చును. మనదేశమున, ప్రచురింపబడు అన్ని గ్రంథములకు ఒక్కొకపుస్తకమునకు మూడుగ్రంధములు ఆయాపుస్తకములను ప్రకాశింపచేయువారు ఏజిల్లా యందుందుగో జిల్లాకాంగ్రెసుసంఘమునకు పంపునట్లుగా దేశీయమహాజనసభ దొక తీర్మానమును చేయవలెను, ఆమూడు గ్రంధములలో ఒకటి జిల్లాసంఘమువారు తమ గ్రంథాలయమందుంచుకొని, రెండవదానిని రాష్ట్రీయకాంగ్రెసు సంఘమునకును, మరియొక దానిని అఖిలభారతజాతీయోపసంఘమునకు పంపవచ్చును.
ఈమార్గము నవలంబించినచో కేదల జిల్లా, రాష్ట్రీయ, అఖిల భారత గ్రంథాలయములే గాక ప్రతిపట్టణ మందును, పల్లెయందు దును గ్రంథాలయములు స్థాపితమై తన్మూలమున జాతీయాభ్యుదయము పొందగలము.
గ్రంథాలయోద్యమమున కృషి చేయు సోదరుల కొక మనవి. కట్టుబాటులుండినగాని యేపనియును నిష్కర్హగ జరుగనేరదు. ఇందుకొరకై భారతదేశమందంతటను గ్రంథాలయోద్యమమున కృషి సలుపు ప్రముఖులందరు చేరి యొకసంఘము నేర్పడుట అవసరము. పంజాబు విశ్వవిద్యాలయము వారి యాజమాన్యముక్రింద దొరతనము వారట్టి సంఘ మొకదాని నేర్పరచటకు ప్రయత్నించిరి. అసంఘ మొకటిరెండు సమావేశములు జరిపిన పిదప దేశమున నెట్టిఉపకారమును చేయకయే నశించినది. గ్రంథాలయోద్యమాభిమానులగు భారతీయులందరు చేరి జాతీయసూత్రముల ననుసరించి జాతీయాధికారముక్రింద భారత గ్రంథాగారసంఘము పేరుతో దొరతనము వారిజోక్యమేమియులేకుండా సంఘ మొకదానిని స్థాపించుట ఆవశ్య కర్తవ్యము.