Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/తిలకము

​

తిలకము

౧

కలిమికన్నియ కలికి నుదుటను
కళలుచిమ్మే కనకతిలకమ!
వలపుకృష్ణుని వయసు తేనెకు
పౌత్రమయ్యేతిలకమా!

౨

పార్వతీసతి ఫాలతలమున
గర్వరాగముఁ గ్రక్కుతిలకమ!
ధూర్వహుండగు ధూర్జటికి ధృతి
దూలఁద్రోసిన తిలకమా!

3

పలంకుపడతుక పసుపు నొసటను
మొలక జీవము లొలుకుతిలకమ!
కలసి బ్రహ్మను కంఠ మొత్తగ
కౌగిలించిన తిలకమా!

४

రచ్చకీడిచి రమణిద్రౌపది
కుచ్చెలలుకొని కోకలూడ్చిన
చిచ్చు వలె నా చెలువ మొగమున
విచ్చిమండిన తిలకమా!

౫

నరపైబడి కఱకుకోలల
సరకుసేయక సాహసముతో
నఱకసాగిననాఁటి సత్యా
ననమునంటీన తిలకమా!

౬

వెదదకత్తులు వేటలాడే
కడిగిఘోరపు కదనసీమల
తడిసివీరుల పడుచునెత్తుట
ధన్యమయ్యే తిలకమా!

౭

పరిమళమ్ములు పంతమాడగ
పరువపుఁజిగి పైకిపొంగే
సరసకాముక శయనగృహముల
చక్కబెట్టేతిలకమా!

౮

సిగ్గువలదని చెంప వేయగ
భగ్గు భగ్గను పచ్చివలపును
బిగ్గనిలిపే పెండ్లికూతురు
నిగ్గులే లే తిలకమా!

౯

ఇనుపసంకెల లేసిత్రోసిన
వనజముఖి దేవకిలలాటము
సెనసికంసుని హృదయఫలకము
మొనపగిల్చిన తిలకమా!

౼ రాయప్రోలు సుబ్బారావు