గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/గౌతమీ గ్రంథాలయము
గౌతమీ గ్రంథాలయము
రాజమహేంద్రవరము
ఈ గ్రంథాలయము యొక్క 1921-1922 పఁవత్సరము కార్యనివేదిక ముందుగా మా కఁదచేసినందుకు కార్యనిర్వాహకుల కెంతయు కృతిజులము. ఈ నివేదికనుబట్టి గడచిన సంవత్సరమున సభ్యులు 300 అయ్యుండ, ఈ సంవత్సరమున 229 సభ్యులున్నట్లును, , చదువరులసంఖ్య క్రిందటి సంవత్సరమునను, ఈ సంవ్సరములను సగటున ప్రతి దినము 75 అయినట్లును, సంస్కృత తాంధ్రగ్రంధములు గడచినవత్సరమున 7789 యుండి, ఈ సంవత్సరము 8000 యున్నట్లును, ఆంగ్లేయగ్రంధములు పూర్వ సంవత్సరమున 3381 యుఁడ, ఈ సంవత్సరమున 4979 యున్నట్లును, దాళపత్రగ్రంథములు గతసంవత్సరమందువలెనే 301 యున్నట్లును తెలియుచున్నది. ఆదాయవ్యయపట్టిక యందు నియమింపబడిన ప్రకారము రు 50/లకు పుస్తకములు మొదట ధనము లేక పోవుటచేత గొనలేకపోయినను, రెండవ ప్రతిగల ప్రొతపుస్తకముల నమ్మి నూతన గ్రంథములు భాండాగారమునకు చేర్చబడినవి. సరియైన గ్రంథనామావళి ప్రస్తావన సంవత్సరమున తయారుచేయబడినది. స్థానిక పురపాలక సంఘమువారు రు 500/లు గ్రంథాలయమున
కిచ్చుట కుద్యమించినను దొంతరము వారంగీకరించరైరి. కావున మామూలు రు 100 లు మాత్రమే ఇచ్చిరి. ఈ గ్రంథాలయపాలకులు తమ యౌన్నత్యముచే ఆంధ్రదేశమునుండియు, తదితర భారత రాష్ట్రముల నుండియు, ఖుండాంతరములనుండియు కూడ ఎక్కువ సంఖ్యగల అమూల్య గ్రంథములను సేకరించిది. ఇది యంతయు డము కార్యనిర్వాకుల కార్యదీక్షను వేనుళ్ళ చాటుచున్నది. ఈ గ్రంథాలయము తొలురోల్త శ్రీ వీరేశలింగ గ్రంథాలయమును పేరుతో ప్రారంభమై పిమ్మట సర్వజన గ్రంథాలయమను పేరుదాల్చి, తుదకు పసురాయగ్రంథలయముతో సమ్మేళనము పొంది, ప్రస్తుతము గౌతమి గ్రంథాలయమను నామము ధరించి, ఆంధ్ర మండలమున కంతకు వన్నెతెచ్చుచున్నది. ఈగ్రంథాలయ పక్షమన పూర్వమున బహుమతీపరీక్షలు కరపత్రములు ప్రచురణ మొదలగు విద్యాభివృద్దికరమగు పనులుగూడ జరుగుచుండెను. ఇప్పుడు ఆశాఖలు అంతరించినట్లు కనపడును. పురపాలక సంఘమువారును, అమెరిక౯ మిష౯సంఘమువారును ధర్మపఠన మందిరముల స్థాపించిన హేతువుచేత, పత్రికా పఠనమునుకు ఈ గ్రంథాలయ మంత ప్రాముఖ్యత నిచ్చటలేదు. ఇచ్చట నొకవిషయము చెప్పవలసియున్నది. పౌర గ్రంథాలయముల యొద్దకు వెదకుకొనివచ్చువారలకే గ్రంధములను అందచేయుట మాత్రమే వాని విధికాదు. నరులను ఉచితసాధనములమూలమున నాకర్షించి వారలకు గ్రంధపఠన యందభిరుచి కలుగచేయుట పౌరగ్రంథాలయముల ముఖ్యకర్తవ్యము. ఇందుకొఱకే అమెరికా ఖండమున గ్రంథాలయములను, వానియందలి పుస్తకముల పేర్లను, ఉపయోగమును సర్వజనులకు తెలుపుటకొరకై ఆనేకసాధనముల నవలంవించెదరు. పేరుపొందిన "క్లబ్బు" లకు గ్రంథాలయములవారు తమమందిరములో కొన్నిగదులను అరువున కిచ్చెదరు. విద్యార్థులు సెలవుదినములలో విహారము కొరకై ఇతర పట్టణములకు వెళ్ళినపుడు వాళ్లతో గ్రంథాలయమునుండి ప్రతినిధులు పంపబడుదురు. వీరు ఆవిద్యార్థులకు విశ్రాంతి సమయములయందు తమ గ్రంథాలయములన గూర్చి ప్రశంసించి అందువారికి అభిమానముకల్గి అండలిగ్రంథములను చదువునట్లుగా చేసెదరు. మనదేశమందు పత్రికాపఠనముకూడ పౌరగ్రంథాలయములలో చేర్చియుంచుటకు ముఖ్యకారణము స్వతంత్రముగా గ్రంధపఠనమంద దబిరుచి లేనివారినికూడ పౌరగ్రంథాలయముల కాకర్షించి వారికి గ్రంథపఠనమంద దబిరుచి కలుగి చేయుటకేయని చెప్పవచ్చును. కావున పత్రికా పఠనమును గౌతమీ గ్రంథాలయమున యఁతిరింప చేయుటవలన గ్రంథాలయకు యొక్క యుసయోగము కొంతవరకు తగ్గగలదని మా నమ్మకము.
కేవల గ్రంథాలయముగా యోచించినచో ఆంధ్రదేశమున పుస్తకముల సంఖ్యనుబట్టి ఈ గ్రంథాలయ మర్వితీయమని చెప్పితీరవలెను. ఈసంస్థాపన ప్రారంభమై ఇప్పటికి 20 సం॥ రములు మించినను, దినదినాభివృద్ధిగా నుండుటయు మిక్కిలి కొనియాడతగిన విషయము, మరియొక విషయము. పురపాలక సంఘమువారు తాము పత్రికాపఠనమందిరముపై వెచ్చించుచున్న సొమ్ము గౌతమీ గ్రంథాలయమున కిచ్చి ఆకార్యము వీరి యాజమాన్యమున నడుపుట వారి విధ్యుక్తధర్మము. గ్రంథాలయపాలకులను పురపాలకపఠన మఁదిరమును తమయాజమాన్యము క్రిందకు వెచ్చుకొనుటకు తగుకృషి జరుపవలసియున్నది. ఏలయన మనదేశప్రభుత్వము ప్రజాయత్తమైనపుడు ఇప్పటి పౌరగ్రంథాలయములు, పురపాలక సంఘముల పరిపాలనకు వదలవలసి యుండును. అప్పుడు ప్రభుత్వమును, ప్రజలును ఐక్యమును పొందెదరు. కావున ప్రభుత్వమునకు మించిన కార్యములు ప్రజలు చేయవలసినవి యుండవు. ఈయన్ని సందర్భములను బట్టియు స్థానిక పురపాలక సంఘమువారు ప్రస్తుతము చూపునున్న ప్రోత్సాహము కంటే ఎక్కువ సహాయమును గౌతమీ గ్రంథాలయమున కిచ్చెదరని నమ్ముచున్నాము. మరియు గౌతమీ గ్రంథాలయ కార్యనిర్వాహకులకు వినయపూర్వకముగ మే మొక మనవి చేయుచున్నాము. ఈ గ్రంథాలయ యొక్క ఉపయోగము కేవల స్థానికముగనే యుండుటకంటె ఆంధ్రదేశ మంకంతకును దీనివలన ప్రయోజనము కలువట్లుచేయుట గ్రంథాలయాధికారుల విధ్యుక్తధర్మము. ఆంధ్రదేశమున గ్రంధముల సఖ్యను బట్టి ఈ గ్రంథాలయము అగ్రస్థానము నలంకరించియున్న హేతువును బట్టి ఆంధ్రగ్రంధ విభజనను (Bibliography) వీరు సమగ్రముగా ఆధునిక పద్ధతుల నవలంబించి చేయించి ప్రచురించుట ముఖ్యము. వెంటనే చేయవలసినపని ఇదివరకే ఈగ్రంథాలయమువారు తమవద్దనున్న ఆంధ్రనామాపళి (Catalogue) ని తయారు చేయించి ప్రచురించి యున్నారు. అందువలన ఏవిషయమును గూర్చి ఎన్నెన్ని గ్రంధములు ప్రచురిపబడియున్నదియు, ఆవి యెక్కడెక్కడ దొరుకునదియు, వానిని రచించిన గ్రంధకర్త యెవరైనదియు, స్పష్టముగా తెలియదు. పాశ్చాత్య దేశభాషలలో ఈ గ్రంథవిభజన ప్రత్యేకశాస్త్రముగా అభివృద్ధి పొందినది. కావున ఈగ్రంథాలయమువారు ఈ కొరతను ఆంధ్రభాషకు తొలగించుటకు మిక్కిలి ప్రార్తించుచున్నాను. ఆట్లు ఆంధ్రగ్రంధ విభజనమును ప్రచురించినచో ఆంధ్ర వాఙ్మయాభివృద్ధి కరతలామలకముగ గోచరమై గ్రంధకర్తలకును, పరిశోధకులకును మిక్కిలి ఉపకరించును.