Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/ఆంధ్ర గ్రంథాలయోద్యమము: సింహావలోకనము

​

ఆంధ్ర గ్రంథాలయోద్యమము: సింహావలోకనము

భారతదేశాభ్యుదయనుకొఱకు ఎన్నియో యుధ్యమము లుద్బవించుచున్నవి. ఎన్నియో అంతరించుచున్నవి. కొన్నిమాత్రమే దినదినాభివృద్ధిని గాంచునున్నవి. మన ఆంధ్రగ్రంథాలయోద్యమము ఇప్పటికి రాను రాను ముప్పది సంవత్సరములక్రిందట ప్రారంభమైనదని చెప్పవచ్చును. గడచిన పదునైదు సంవత్సరములనుండి తీవ్రముగా పనిచేయుచున్నది. ఈ కాలమందు ఈయుద్యమ పక్షమున జరిగిన కృషిని సింహావలోకనముగ పరీక్షించి ఈయుద్యమ మిదివరలో దేశోద్ధరణ కెట్టిలాభనష్టములు కల్గాచేసినదియు, ప్రస్తుత దేశకాలపాత్రములనుబట్టి భావికాలమున దేశసేవ చేయగల్గిన శక్తులిందేమైనను నిగూఢమైయున్నదియు మన మిటితరి నిర్ణయించుకొనుట ముఖ్యావశ్యకము. మనదేశమెన్నియోవిధముల దురవస్థయందున్నది. ప్రజల ఆయువు క్షీణించినది. దరిద్రదేవత దేశమంతటను దాండవమాడుచున్నది. ప్రజలు భిన్నభిన్న జాతులుగా చీలిపోయి అంతఃకలహములతో ఒకరితో నొకరికి ఐకమత్యము లేక చీకాకుగా నుండియున్నారు. ఆత్మవిశ్వాసము, స్వయంసహాయతత్వము ప్రజలయఁదు సంపూర్ణముగా నశించినవి. స్వధర్మమును పూర్ణముగా త్యజించి పరధర్మవ్యామోహమున ప్రజణ చిక్కపోయిరి. ప్రజలకళాకౌశల్యము, విద్యాసంపన్నత ప్రజలశక్తుల వికాసమున కుపకరించక యున్నవి. ఈలోపముల నన్నిటిని నివారణ చేయుటకు స్వరాజ్యము ఒక్కటియే పరమసాధనమని అందరును అంగీకరించి యున్నారు. ఈస్వరాజ్యమును స్థాపించుట ఎట్లు. కొందరు బ్రిటిషు ప్రభుత్వము వారు మనలను స్వరాజ్యముకొరకై తయారుచేయుచున్నారనియు, మెట్లవరుసను మనకు ఈపదవిని లంభీంపచేసెదరనియు, ఈతరిబీదు చేయుటకును, ఈ స్వరాజ్యసిద్ధికిని, స్వాధనము నూతనముగా ఏర్పడిన శాసనసభలే ననియును చెప్పుచున్నారు. మీరి మతమున తగిన ప్రతినిధులను ఎన్నుకొని శాసనసభలకు పంపి వారు తమవిధులను సక్రమముగా నిర్వహించునట్లు చేయించగల శక్తి ప్రజలయందు విజృంభించుటయే స్వరాజ్యస్థాపనము. ఇందుకొరకై ప్రజలువిద్యావంతులు కావలెను. ప్రజలయందు ఐకమత్య ముండవలెను. వారు తమవిధులకు, బాధ్యతలను బాగుగా గుర్తెరుగవలెను. పరిపాలనాశక్తి ప్రజలకలడవలెను. మరియోక మతమువారు “ప్రజలు తమ స్వశక్తివలన స్వరాజ్యము సంపాదించవలసినదే గాని బ్రిటిషు ప్రభుత్వమువారు భారతీయులకు నిజమగు స్వరాజ్యము దాసపూర్వకముగా నిచ్చుట కల్ల. ఆట్లు ఇచ్చినను అది భారతీయులు నిల్పుకొనజాలరు. కావున ప్రజలు తమ ఆత్మశక్తిని విజృంపచేసి చేసి స్వరాజ్యమును సంపాదించుకొనవలయు” నని చెప్పుచున్నారు. ఈ రెండు మతముల వారికిని ప్రాప్యమొకటే అయినను దృక్పథము భిన్నము. ఏది ఎట్లున్నను ఈ స్వరాజ్య సౌధనిర్మాణముకొరకు ప్రజలు ప్రప్రథమమున చేయవలిసిన కృషిని గూర్చి మాత్రము స్వదేశీయులేమి, విదేశీయులేమి, అసహాయవాదులేమి, మితవాదులేమి అందరును ఏకగ్రీవముగనే చెప్పుచున్నారు. ఆ యభిప్రాయములను కొన్నిటి నిచ్చట వివరించెదము.

సర్ జా౯లారెన్సు అను ఆంగ్లేయాధికారి 1864 సంవత్సరములో యిట్లు వ్రాసియున్నాడు “ప్రతిగ్రామసంఘమును ఒక్క ప్రజాస్వామిక సంస్థాపనము. ఇది చిరకాలమునుండి వచ్చుచున్నది. బ్రిటిషుగవర్నమెంటువారు తమ బాధ్యతను నిర్వహించుకొనుటకు దేశపరిపాలన ఎంత ఎక్కువవరకు వదలుటకు వీలుండుమో అంతవరకును ప్రజలపరము చేయవలెను”.

ప్రభుత్వమువారిచే నియమింపబడిన అధికార విభజన సంఘము వారు తమ నివేదికయందు ఇట్లు చెప్పియున్నారు:౼ "స్థానిక స్వపరిపాలన గ్రామపంచాయతీలు ప్రతి గ్రామ మందును స్థాపించుట మూలముగా పల్లెటూండ్లలో ప్రారంభించవలెను”. గయా దేశీయమహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీయుత బ్రజకిషోరుప్రసాదుగారు తమ ఉపన్యాసముని ఇట్లు చెప్పియున్నారు:౼ "దేశమును కట్టుబాట్లలోకి తెమ్ము, పల్లెటూండ్లకుపొండు. ఆక్కడి ప్రజలతో పని చేయుడు, ప్రజాసేవ ఎట్లు చేయవలయునో వారికి బోధింపుడు. గ్రామసంఘములకు పునాదిగా స్థాపింపుడు, వాని పైన అఖిల భారత జాతీయ ఉపసంఘము వరకును స్వరాజ్యసౌధమును సోపాన పరంపరగా నిర్మాణముచేయుడు. వీనినన్నిటిని సజీవముగా నుండునట్లును, నిరంతర కృషి చేయుచుండునట్లును, శక్తివంతములుగా నుండునట్లును చేయుడు”. “మొన్నటి దేశీయ మహాజనసభాధ్యక్షులగు శ్రీయుత చిత్తరంజనదాసుగారు ఇట్లు తమ అధ్యక్షోపన్యాసముని సెలవిచ్చియున్నారు:౼ "రాష్ట్రీయ స్వపరిపాలన కంటెను, సామ్రాజ్య బాధ్యతాయుత ప్రభుత్వము కంటెను కూడ పల్లెటూండ్లను కట్టుదిట్టములకు లోనగునట్లుచేసి వానిని స్వపంపాలకములుగా చేయుటయే ఎక్కువ అవసరమగుపని. ఈ ​రెంటిలో దేనిని ఎక్కువ వాంఛించెదవని ఎవరైన నన్నడిగినచో నేను పల్లెటుండ్ల స్వపరిపాలనయందే నాకభిమతము కలదని లిస్సంశయముగా చెప్పెదరు". ఈస్టానిక పరిపాలనగల పల్లెటూండ్లలో అనోన్యసంబంధ మెట్లుండపలెనను నంశమును గూర్చి శ్రీయత దాసుగా రిట్లు చెప్పేయండిరి:౼"ఈపల్లెటూఁడ్ల సంఘములన్నియు సహకారసూత్రము మూలముగా ఆన్యోవ్యసంబంధము కల్గియుండ వలేను. *** స్టానిక సంఘములు నిజమైన అధికారములు కల్గియుండి భారతీయ ప్రభుత్వము తగిన కట్టుదిట్టములకు లోబడిన పైతనిఖీ కనుక్కొనునపుడే నిజమగు స్వరాజ్యము స్థాపితమైనదను”.

వీరందరు చెప్పినియంశములనన్నిటిని కల్పిచూచినచో ఈ క్రింది యంశములు తేలుచున్నవి. స్వరాజ్యసౌధ నిర్మాణముకు పల్లెటూరు పునాది. కావున పల్లెటూళ్ళను, ప్రజాస్వామికములుగా చేసి వీలైనంతవరకు స్వతంత్రము గాను, స్వయంసహాయకముగా నుండుట్లును చేయవలెను. ప్రజలకు విద్యార్థి వృద్ధిచేయవలెను. ఈఫలము సిద్ధించుటకు ఆంధ్ర గ్రంథాలయోద్యమ మిదివర కెట్టి కృషి చేసియున్నది? ఇంక ముందుమి చేయగల్గియున్నది?

ఈ యుధ్యమ మందలి ముఖ్యసూత్రము బ్రిటిష్ ప్రభుత్వముతో మనదేశమున వ్యాపించిన పట్టణమందలి వ్యామోహమును తగ్గించి పల్లెటూండ్లపై ప్రజలదృష్టిని తిరిగిమరల్చుట. అందువలననే మన గ్రంథాలయము ఎక్కువ పల్లెటూండ్లయందు స్థాపింపబడినవి. రెండవ విషయమున ప్రజలను విద్యావంతులుగా చేయట. ఈయుద్యమము యొక్క ముఖ్యోద్దేశమే విద్యావ్యాప్తి. బ్రిటిష్ ప్రభుత్వము వారు మనఅంశము అమలులోకి తెచ్చిన విద్యాపద్ధతివలన నిర్మూలమైన సిద్దాంతములును కొన్నిటిని పునరుద్ధరణ చేయుటకు మన మీఉద్యమము మూలమున కృషిసల్పితమి. విద్యయనగా సకల దక్షరక్ష మూలముననే లభింపతగినది కాదనియు, అన్ని ఇంద్రియముల మూలమునను మనస్సును, బుద్దిని వికాసమును ఏదురించి కార్యామంతయు విద్యయందే చేయున్నపనియు, తిరిగి మనము దేశమునకు చాటి ఈసిద్దాంతమును వీలగువరకు అమలులోకి కూడ దెచ్చితిమి. గ్రంథాలయములయందు గ్రంధములను భద్రపరచి చదువరుల కందచేయుటయె యీ గ్రంధాలయముల పరమార్ధముగా నెలకొక గ్రంధాలయముల పక్షమున మహాపురు... జరుపుచున్నాము. నాటకములు లాడించుచున్నాము. సేవసమితులను స్థాపించుచున్నాము. విమోదకరమగునట్టియు,జ్ఞానదాయకమై నట్టియు ఆటలను పిల్లలచే నాడించుచున్నాము. వ్యాయామములను గ్రంథాలయముల వారభివృద్ధికి తెచ్చుచున్నారు. తాత్కాలిక పాఠశాలల నేర్పర్చి ముఖ్యమగు విషయములలో యువకులకు విద్య నొసగుచున్నాము. జంగము కథలను జెప్పించుచున్నాము. పురాణపఠనము చేయించుచున్నాము. ఇట్లు జ్ఞానదాయకమగు పురాతన, అధునాతన మార్గముల నన్నిటిని నన్వేషించి ఆయాసాధనములమూలమున ప్రజలయందు జ్ఞానము వ్యాప్తినొందించుటకు ఆంధ్రగ్రంథాలయములు సమకట్టి యున్నవి. ఇటికృషియే మనము ముందునగూడ తీవ్రముగ చేసినచో విద్యావ్యాపకము చేయుటయందు గ్రంథాలయములు ఉచితస్థానము నాక్రమించుననుట నిస్సంశయము.

ఇక పల్లెటూండ్లను కట్టదిట్టములలోకి తెచ్చుటకు మనయుధ్యము మెట్టికృషి చేసినదియు, చేయగల్గినదియు విచారింతము. మన గ్రంథాలయము లన్నియు ప్రజాస్వామిక పద్ధతుల నుసరించియే పరిపాలింపబడుచున్నవి. అచ్చట పేదలకును, భాగ్యవంతులకును బేధములేదు. కుల, మత, జాతి వివక్షత లేదు. కార్యనిర్వాహరులు ప్రతిసంవత్సరమును ఎన్నుకొనబడవలయును. ఇట్లు విలయు . ప్రజాస్వామికతత్వము ఈ గ్రంథాలయముల మూలమున దేశమున వ్యాప్తి చెందుచున్నది. మరియొక్క విషయము. వివిధమగు ఆర్థిక సంపత్తి కల్గినట్టియు, జాతి, మత, కుల విచక్షణలేకను సర్వజనులకు ఏకముఖముకు ఆకర్శించుటకు పౌరగ్రంధాలయమునకు గల సామర్థ్యమము మరియేఇతర సంపాదనకును లేదు. అందువలన ప్రజాస్వామిక సంస్థాపనలు పల్లెటూండ్లలో వ్యాప్తిచెదవలేనన్న ముఖ్యముగా వెంటనే అవలందింప వలసినపని గ్రంథాలయముల స్థాపనయే. కావున యుద్యమము దేశమందు నెలకొల్పబడి స్వరాజ్య సౌధ నిర్మాణమునకు సన్నిహితసాధన మేర్పడును. సంఘములయందు అన్యోన్యబంధమేర్పడి మండల సంస్థలును, రాష్టీయ సంస్థలును, అఖిలభారతీయసమస్థయు నిర్మాణమగుటకుకూడా మన ఆంధ్ర గ్రంధాలయాద్యమము కొంతవరకు సఫలమగు కృషిని జరిపినది. పల్లెటూండ్లగ్రంధాలయములు కొన్నిచేరి తాలూకా సంఘగ్రంధాలయములు లేర్పడినవి. ఏర్పడుచున్నవి. ఈ తాలూకా సంఘగ్రంధాలయములపై మండలగ్రంధాలయసంఘము లేర్పడినవి. ఇవియన్నియు చేరి మన ఆంధ్రరాష్ట్రయ గ్రంధాలయసంఘ మేర్పడినవి. ఆఖిలభారత దేశమందున్న ​యన్ని రాష్ట్రములయందును రాష్ట్రీయసంఘములు నిర్మాణమై ఆయారాష్ట్రయందు గ్రంథాలయోద్యమ వ్యాప్తి నోంచుటకును తన యుద్యమపక్షమును మద్రాసులో అరవఆంధ్రగ్రంథాలయ ప్రతినిధుల సభతో పాటు ఆఖిలభారత గ్రంథాలయ ప్రతినిధులసభ కూడ సమావేశము చేసితిమి. అందుకు ఫలితముగ “అఖిల భారత పౌరగ్రంధాలయసంఘము" నిర్మాణమాయెను. ఈ అన్నిసంఘము లకును గల ఆనోన్యసంబంధము సహకారసూత్రమూలమున నేర్పడియున్నదిగాని కేంద్రీకరణము వలన కాదు. ఈసిద్ధాంతమునే శ్రీయుత దానుగారు తమ ఆధ్యకోపన్యాసమున విపులముగా విమర్శించి స్థాపించియున్నారు.

కావున భారతస్వరాజ్య సౌధనిర్మాణమునకు గ్రంథాలయోద్యమము సాక్షాత్సాధనము. దేశీయులెల్లరు ఈయుద్యమముకు చేపట్టి దేశమంతటను వ్యాప్తినొంద్రించవలెను. ప్రతి పట్టణమందును, పల్లెటూండ్లయందును గ్రంథాలయ సంఘములు స్థాపించవలెను. వినివలన కలుగు యుపయోగము అచ్చటిప్రజలందరికి లభించుటకు దగిన సాధనముల నవేషించి సశ్వేషించి అదిస్థానమును దేవలేను. ఏకప్రాంతమందలి గ్రంథాలయములన్నియు సంయుక్త విధానామాసారముగ సంఘములుగా తేవలెను. ఇట్లు తాలూకా, మండల, రాష్ట్రీయ, అఖిల భారత గ్రంధాలయసంఘముగా లేర్పడి దేశమంతను ఉద్యమమును వ్యాప్తి నోందించవలెను. ప్రజలు అట్లుచేసినతో విద్యావంతులును, ధనవంతులను, స్వయంసహాయ ఆత్మగౌరములతో నిండియున్నవారలును అగుదురు. భారతీయులు జాతీయవ్వక్తిత్వమును కాపాడుకొని తమవిధుక్తధర్మమును నెరవేర్చుచు తిరిగి ప్రపంచమంతటను ఉపదేష్టలగుట నిస్సంశయము.


కథ-కలాపము వేదపరిషత్తు. భారతజాతీయనిర్మాణనుందు జాతీయవిద్య అగ్ర స్థానము నలంకరించుచున్నది. ఈవిషయమునకు జాతీయ మహాసభయందు; తగిన ప్రాముఖ్యతి నిచ్చటలేదు. అయి నము దేశమున ఇందుని గూర్చి తగినకృషి జరుగుచుండుట మిక్కిలి సంతోషావహము, తక్షశిల, ధాన్యకటక, వలం ద, మధిర, కాంచీపురము మొదలగు విశ్వవిద్యాలయ ములు పూర్వకాలమందు వర్దిల్లియుఁడి ఆధునిక కాలపు విశ్వవిద్యాలయయులకు మించిన వైభవము కల్గియున్నమాట నిజమే. కాని శుఖ్యముగా పూర్వకాలమున విద్యాభ్యా పము జరిగినది గురువులయాశ్రహములయ డిస్. ఇ మర్యా ద ఇప్పటికిని మనవేశమున సంపూర్ణముగా నశించలేదు. కీర్తి శేషులగు చర్ల బ్రహ్మన్న శాస్త్రి గారు, భాగవకుల హశాస్త్రులుగార్లపఁటి గొప్ప నిర్వాసులు తమయిం డ్ల నే విద్యాలయములు గా మార్చి విద్యార్థులకు అన్నగాన ముచేసి విద్యగరపుచుండిరి. ఇప్పటికిని సోదమును, శాస్త్ర ములును పజీవసులుగా మన్ననన్నా. ఈవిద్యలు గురుకులా శ్రమములయుదు విద్యా విద్యార్థు లభ్యసించుచుండుట చేత నే. కావున సనాతనధర్మమును పునరుజ్జీవముచేసి దేశాభ్యుద యము పొఁడవలె:న్న ఈశాస్త్ర పండితులను, వేడపాడ కులను, ఏపాఠశాలలకోనీడ్చి అచ్చట విద్యార్థులకు విద్యా ว S زیت భ్యాసము చేయవలయునని రోగుటకన్న వారిండ్ల దగ్గర నే వారుండి విద్యార్థులకు విద్యాదానము చేయుటకు అగిరి వీళ్ళను కల్పించుట ఎక్కువ విద్యాభివృద్ధికి హేకు వగుగ. మనయాంధ్ర దేశమున ఈమార్గము ననుసరించి విద్యాధి వని చేయుటకు తగిన సావకాశము కలను. మొన్న ఒకి ఏకాదశికి గోదావరీ మగు కొవ్వూరు పట్టణమున ఆంధ్రగీర్వాణ విద్యాలయ సంఘ మువారి యాజమాన్యము క్రింద పెద్ద వేదశాస్త్ర పరిషత్తు జరిగినది. ఆసభకు రమారమి మూడునఁదలు పైగా సం డితులుకు ఒక ఎ బదిమంది విద్యార్థులను వచ్చియుండి, పశ్చి వారి సంపించి a కారముగ పరీక్ష చేసి ఉమిగులు వాంక పారితోషికముల నిచ్చిరి. అచ్చటకు విచ్చేసిన విద్వాంసులందరును వయస్సు వ ఎంత పెద్దవారైనను, శైశవ మందు అభ్యాసము చేసిన విద్యలో ఏభాగమ మరుపు సఖా గమఁదంచుకొనట చూచి నప్పుడు ఆననిక విద్యాః ధాఃమూలమున విద్య సభ్య ప్రతిఃగ్యావంత మును పద్వపుకుద్యాపకుల సించిన యాధిక్యము సుగీకరింకాకతప్పదు. వేదమంకము, తార్కా వ్యాకరణశాస్త్రములందును పశిక్షలు జరిగినవి. విద్యను పరీక్ష, లేర్పాటుకాబడి కలిగాని అనివార్య కార גי