గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 5/సంచిక 2/ఆర్యుల ఉత్తరధృవ నివాసము
ఆర్యుల ఉత్తరధృవ నివాసము
(శ్రీ బాలగంగాధరతిలక్ ప్రణీతము)
ద్వితీయాధ్యాయము
హిమవద్యుగము హిమవత్ ప్రళయము వచ్చుటకు కారణమేమి?
ఉత్తరధృవ ప్రాంతదేశమొకప్పుడు, యిప్పటివలె మంచుతో ఘనీభవించుకొని పోక, మానవులకు నివాస యోగ్యముగ నుండెననియు, పిమ్మట కొంత కాలమునకు దేశమంతయు మంచుతో అనేక వేలయడుగుల యెత్తు వరకు నిండిపోయినందున, ప్రజలచ్చటనుండి దక్షిణ దేశములకు వచ్చిరనియు భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారణ జేసిరి. ఈవిషయమై ప్రకృతి శాస్త్రవేత్త లందరును సమ్మతించియే యున్నారు. ఒకటిమాత్రమే గాక యిట్టి మంచుయుగములు 4, 5 సంభవించినవని కూడ చెప్పి యున్నారు. ఒక మంచు యుగమునకును, మరియొక మంచుయుగమునకును మధ్య కాలములో శీతోష్ణస్థితి యనుకూలముగ నుండి మంచుయుగములలో మాత్రము భరింపశక్యము కాని శీతలము ప్రబలినట్లును చెప్పుచున్నారు. కాని యేదియెట్లును క్రిందటి మంచు యుగమునకు పూర్వము ఉత్తర ధృవ ప్రాంతములలో మనుష్య సంచారమున్నట్లును, పిమ్మట మంచు యుగమురాగనే వారచ్చట నుండి లేచిపోయినట్లును స్పష్టముగ నిదర్శనములు గలవు. కాదని త్రోసివేయుటకు వీలు లేదు. కాని యీ మంచు యుగములు తటష్టిచుట కేమి హేతువు గలదు? ఈ అధ్యాయములో నీ విషయమై చర్చించెదము. అనేకులనేక యభిప్రాయములను తెలిపియుంటిరి. దీనినన్నిటిని వరుసగా విచారించి చూచెదము.
(1). బహుశః పెనామాభూసంథి యొకప్పుడు సముద్రములో మునిగియుండి యుండవచ్చును. అందువలన “గల్ఫుస్త్రీము” అని యిప్పుడు చెప్పబడు ఉష్ణసముద్ర జలప్రవాహము ఉత్తర దేశముల వైపునకు బోక దక్షిణముగ ప్రవహించుచుండెడిది కాబోలు. ఆ కారణము చేత ఉత్తగధృవప్రాంత దేశములు మంచుతో, ఘనీభవించు కొనిపోయియుండవచ్చును అని కొందరు చెప్పిరి. కాని పెనామాభూసంథి సముద్రములో పూర్వమొకప్పుడు మునిగి యున్నట్లు నిదర్శనము లెంతమాత్రమును లేవు. కానీ యీ సిద్ధాంతమును తోసివేసిరి. (2) మరియొక రింకొక సిద్ధాంతమును బయలు దేర దీసిరి. ఈ భూగోళము యీ బ్రహ్మాండ గోళములో తిరుగుచున్న సమయములలో ఒకప్పుడు బహుశీతల ప్రదేశములగుండను మరియొకప్పుడు ఉష్ణ ప్రదేశముల గుండను సంచారము చేసి యుండవచ్చును. అందువలన ఒకప్పుడు మంచుయుము, మరి యొకప్పుడు సమ శీతోష్ణస్థితియు తటస్పించి యుండ వచ్చును. కాని భూగోళమీవిధముగ తిరిగినదని చెప్పుట కెంత మాత్రమును నిదర్శనములు లేవు. కాన సిద్ధాంతమును కూడ తోసి వేయవలసినదే. (3) ఇక మూడవ సిద్దాంతమును విచారించుదము. భూగోళమునకు కావలసిన ఉష్ణము సూర్యమండలమునుండి వచ్చుచున్నది. ఇది అందరికిని తెలిసిన విషయమే. ఇట్లు సూర్యమండలము నుండివచ్చు ఉష్ణములో హెచ్చుతగ్గులుండి యుండ వచ్చును. ఒకప్పుడు ఉష్ణమధకముగను, మరియొకప్పుడు తక్కువగను సప్లయి అయిన కారణమున యుగములును సమశీతోష్ణ యుగములును తటసించి యుండవచ్చును. కాని యీ సిద్ధాంతమును ఋజువు పరచుట కేమియును ఆధారములు లేవు. కాబట్టి దీనిని కూడ "త్రోసిరా” జన పలసినదే. (4) ఇంకొక సిద్ధాంతమును విచారించెదము. ఈ భూగోళ మొక ఇరుసు మీద తిరుగుచున్నట్టు తిరుగుచున్నదని అందరికిని తెలియును. మొదటనున్న యిరుసు ఆకస్మికముగ మారిపోయి మరి యొక యిరుసు మీద భూమి తిరుగ నారంభించిన యెడల శీతోష్ణష్టితియం దిట్టి మార్పులు కలుగవచ్చును. కాని మొదటి యిరుసు మారిపోయి, రెండవ యిరుసు వచ్చిన యెడల యీ రెండవ యిరుసుతో బాటు, రెండవభూమధ్యరేఖయు, యీ రేఖచుట్టును భూమి యుబ్బినట్లు ఉబ్బుడు ఆకారమును కూడ తటస్థింపవలెను. అట్టి రెండవ ఉబ్బుడు ఆకారమేమియు కానబడదు. కాని దీనిని నమ్ముటకు వీలు లేదు. (5) ఈ భూగోళము మొదట (సూర్యమండలమువలె) మంటలు మండుచున్న అగ్నిగోళమువలె నుండెననియు, పిమ్మట క్రమక్రమముగ చల్లబడి యిప్పుడీ స్థితికి వచ్చెననియు ప్రకృతిశాస్త్రవేత్తలు తలంచుచున్నారు. ఇట్లే భూమి కాలక్రమమున చల్లబడుటలో తక్కిన ప్రదేశములన్నిటికంటే ఉత్తర ధ్రువప్ర్రాంత భాగములు ముందు చల్లారెననియు అట్లు చల్లారుటవలన వృక్షములు,మృగములు, మనుష్యులు మొదలగు ప్రాణికోట్లుద్భవించి యచ్చట వాసయోగ్యత ముగ నుండుటవలన నచ్చట నివసింప సాగెననియు మరి కొందరు చెప్పిరి. ఇది నిజమని మన మొప్పుకొన్నను 4, 5 మంచు యుగములు వరుసగనెట్లు తటస్థింప గలవు. కొంతకాలము మంచుయుగములును మధ్యమధ్య మరికొంత గాలము సమశీతోష్ణ యుగములును తటస్థించు టెట్లు? కనుక యీ సిద్దాంతిమునుకూడ మన మొప్పు కొనజాలము. ఇట్టి సిద్ధాంతముల నన్నిటిని త్రోసివేయగ నింకను మిగిలినవి రెండు సిద్ధాంతములు గలవు. ప్రస్తుతమొక విధముగ నిలిచియున్న వీ రెండు సిద్ధాంతములే. మీ రెండు సిద్ధాంతములను చర్చింపకుండ నాపివేసి ముందు చర్చించెదము.
ఈ సిద్ధాంతము లెట్లున్నను - యీ మంచుయుగము సంభవించుటకు గల కారణము లెట్లున్నను ముంచుయుగములు తటస్థించిన వనుమాట మాత్రము సత్యము. భూగర్భ శాస్త్ర పరిశోధనల వలన నిది ఋజువు చేయబడినది గాన తోసి వేయుటకు వీలు లేదు.
తృతీయాధ్యాయము
[ఉత్తర ధ్రువ ప్రాంత దేశలక్షణములు]
హిమపద్యుగమునకు పూర్వయుగములలో యీ భూమియొక్క పైయాకారము యిప్పటివలె లేక వేరుగ నుండెననియు, అప్పటి భూజలభాగములు వేరుగ నుండెననియు చెప్పియున్నాము. ఈ సిద్ధాంతము భూగర్భశాస్త్ర పరిశోధనలవలన ధృవపరుపబడినది. దీనిని త్రోసివేయుటకిక వీలు కాదు. కనుక పూర్వయుగములలో నుత్తర ధృవమును చుట్టి కొంత భూభాగముండెనని మనము తలంప వచ్చును. ఈ విషయమును కూడ భూగర్భశాస్త్రమే ఋజువు పరుచుచున్నది. ఇప్పుడుత్తరధృవముచుట్టునున్న “నోవాజెంబ్లా” “స్పిట్స్ టల్సుబర్గెన్” మొదలగులంకలన్నియు, పూర్వము సముద్రముపైకి కనుబడుచుడిన భూభాగము మిూది పర్వత శిఖరములనియు, ఆభూభాగము నీటిలో మునిగిపోగా యీ పర్వతశిఖరములు మాత్రము పైకి కనుబడుచు సముద్రము మధ్య లంకలవలెనిలిచి యున్నవనియు భూగర్భశాస్త్రవేత్తలు నిర్ధారణచేసిరి. మరియు చతుర్థయుగమునందంతటను యీ యుత్తర ధృవప్రాంత భూభాగములపై పశుపక్ష్యాదులును నరులను నివసించుచుండినట్లుకూడ భూగర్భశాస్త్ర పరిశోధనలవలన ఋజువైనది. ఇక నిచ్చటి శీతోష్ణస్థితి విషయమై ప్రజలు నివసించుట కనుకూలముగనె యుండెనని రెండవ యధ్యాములో చెప్పియుంటిమి. అచ్చటి శీతోష్ణస్థితి “సంతత వసంతసమయ” మన్నట్లుండెనని కొందరు శాస్త్ర వేత్తలు పలికయున్నారు. ఉత్తరధృవము చుట్టును పూర్వ మొకప్పుడు ప్రజలు నివసించుట కనుకూలమైన శీతోష్ణాది స్థితులుగల భూభాగముండెనని మన మొప్పుకొంటిమి. అంతమాత్రము చేత ఆర్యసంతతివా రాకాలములో నాదేశములలో నివసించుచుండిని మనమెట్లు చెప్పగలము? దీనికై మన వేదములను పరీక్షించి చూడవలెను. ఉత్తరధృవ ప్రాంతదేశలక్షణము లేవైన యీ పూర్వగ్రంధములలోను వారి యాచారములలోను, వారి గాధలలోను కనుపించినయెడల మనవారొకప్పుడచట నివసించియుండి యుండవలెనని మనము నిర్ధారణ పరుపవచ్చును. ఋగ్వేదమునందు కొన్ని కొన్ని చిత్రమైన అంశములును, గాధలును గలవు. వీనికన్నిటికిని చాలభాగ మేదోవిధముగ, అతుకులు పెట్టి ప్రాచీనభాష్యకారులు అర్థమును చెప్పిరి. ఈ యర్థము లెంతమాత్రమును తృప్తికరములు లేవు. అదిగాక, యేవిధముగ విరిచి అతుకులు పెట్టి అర్ధము చెప్పుదమన్నను సాధ్యపడని కొన్ని కొన్ని యంశము లింకను ఋగాదివేదములందు మిగిలియేయున్నవి. పోనీ, యీఋక్కుల యందేమైన పదకాఠిన్యముగాని, అర్థకాఠిన్యముగాని యున్నదేమోయనిన అదియును లేదు. పైకి చూడబోయిన అన్నియును తెలిసినమాటలే; అన్నియు తేలికమాటలే. కాని, వాని నిజభావ మేవిధముగ జూచినను మనయీ దేశకాలపాత్రములతో సమన్వయింపజాలము. కాని యీ ఋక్కులలోని యంశములనే ఉత్తరధృవప్రాంత దేశములతో పోల్చిచూచినప్పుడు మాత్రము సర్వమును సంపూర్ణముగ సమన్వయమగును. ఆవర్ణనలు, ఆదేశకాలాది వ్యవహారములు, ఆచిత్రవిచిత్రములగు రాత్రింబవళ్ళ తారతమ్యములు ౼ అన్నియును ఉత్తరధృవదేశములకే సరిపోవును గాని మన యీ హిందూదేశము మొదలగుదక్షిణ భూభాగముల కెంతమాత్రమును సరిపోవు. పూర్వమొకప్పుడు మన యార్యులీ యుత్తరధృవప్రాంత దేశములలో నుండిరను అనుమానము మన భాష్యకారుల మనస్సులకు తట్టనందున, పైకి బహుతేలికగనుబడుచున్న కొన్ని కొన్ని వేదవాక్యములకు నిజార్థమును చెప్పలేక వారు ఉక్కిరిబిక్కిరియైరి. ఈ కీలకము నెరింగినయెడల వీనికన్నిటికిని అర్థము కరతలామలకమగును. కనుక యీ వేదవాక్యము లన్నిటినిగూర్చి విచారించుటకు ముందు ఉత్తరధృవ లక్షణములేవియో, దానిచుట్టుకుండు భూభాగముయొక్క లక్షణము లేవియో వీనికిని తక్కినవానికి నుండు భేదమేమియో కొంచెము దివ్మౌత్రముగ నీయధ్యాయములో సూచించెదము.
ఈ భూమి గుండ్రని మట్టి ముద్దవలె నున్నది. ఈ మట్టిముద్ద మధ్యగ నొకపుల్లను గ్రుచ్చినట్లైన నది రెండువైపులకును వచ్చును గద. ఈపుల్లయే యిరుసు. ఈ యిరుసు ఉత్తర దక్షిణములుగా నున్నది. ఈ యిరుసు నాధారముగ జేసికొని ఈభూగోళము పడమట నుండి తూర్పునకు ౨౪ గంటలకొక చుట్టు చొప్పున సంవత్సరమునకు ౩౬౦ చుట్లు తిరుగుచున్నది. ఈ యిరుసు భూమి యొక్క పైభాగమునకు పొడచుకొనివచ్చు రెండు చోటులకు ధృవములని పేరు. ఉత్తరపు వైపుననున్నది ఉత్తరధృవము. దక్షిణమున నున్నది దక్షిణధృవము. ప్రస్తుతము మనము ఉత్తర దృవ లక్షణములను గూర్చియే విచారింపవలసియున్నది. ఈ యుత్తర ధృవమును కొంతవరకు చుట్టుకొని యున్న భూభాగములకు "ఉత్తరధృవ ప్రాంతభూమి” యని పేరిడ వచ్చును. ఈ భూగోళ మెప్పుడును ఒక యిరుసు మీదనే తిరుగుచున్నది. గాని యీ యిరుసు మారిపోలేదని యిదివరకే చెప్పియుంటిమి. మన చిన్న భూగోళము అనంతమైన యీ బ్రహ్మాండఈ గోళములో కొన్ని కొన్ని నియమముల ననుసరించి తిరుగుచున్నది. ఈ భూభ్రమణము వలన బ్రహ్మాండ గోళములోని సూర్యుడు చంద్రుఁడు నక్షత్రములు మొదలగునవన్నియు తూర్పునుండి పడమటికి నడుచుచున్నట్లు మన కండ్లకు కనుపించు చున్నవి. కాని, యీయిరుసునకు సూటిగ నుత్తర దిశనున్న నొకా నొక నక్షత్రము మాత్రము కదలక ఒకేచోట నిలిచి యున్నట్లు కనుపించును. దీనికే ధృవనక్షత్రమని పేరు. ఈ ధృవ నక్షత్రము నాధారము చేసికొని తక్కిన నక్షత్రాదులన్నియు దానిచుట్టును తిరుగుచున్నట్లు కనుపించును. మన మెవరమైనను భూమిపై నున్న ఉత్తర ధృవము వద్దకు పోయి అచ్చట నిలువబడి చూచినట్లేన మన కేమికాన్పించును? ధృవనక్షత్రము సూటిగా మన నెత్తిమీద కాన్పించును. తక్కిన నక్షత్రాదులన్నియు, - యీ దేశములోవలె తూర్పున నుదయింపక ఆధృవ నక్షత్రము చుట్టును అడ్డముగ కుమ్మరి సారెవలె గిరగిర తిరుగు చుండును. అచ్చట సూర్యుడు దినదినమున నుదయింపడు. ఒక సారి యుదయించిన పిమ్మట సుమారు ఆరునెలల వరకును తిరిగి అస్తమింపడు. ఆ స్తమించినపిమ్మట తిరిగి సుమారు ఆరునెలల వరకును ఉదయింపడు. అనగ ఆరునెలలేడతెగని పగలును, దాని వెంట ఆరునెలలేడతెగని రాత్రియు నుండును. సూర్యోదయమునకు పూర్వము ఉషఃకాలముండును గద. అనగ, వెలుతురు కొద్ది కొద్దిగ వచ్చుటకు ప్రారంభించినది మొదలుకొని పూర్తిగ సూర్య బింబము పైకి వచ్చవరకును గల కాలము ఉషః కాలమనబడును. ఈ యుష్యఃకాలము సుమారు ముప్పది దినములేడతెగక యుండును. మొదట నీ వెలుతురు భూమియు ఆకాశమును కలిసినట్లు కనబడు చోటకాన్పించి, ఆ యంచుచుట్టును దినమునకొక సారి గీరున తిరుగుచుండును. ఈ వెలుతురిట్లు దినమునకొకసారి యొక చుట్టుచొప్పున తిరుగుచు, దినక్రమమున పైకివచ్చు చుండును. ఇట్లు క్రమక్రమముగ (ఉషస్సులు) పైకివచ్చు ఛుండగ 30 దినములైన పిమ్మట సూర్యబింబము పైకి గాన్పించును. ఈ సూర్య బింబము కూడ నిదేవిధమున అంచుచుట్టును తిరుగుచు, క్రమముగ దినముల వరుసను పైకి వచ్చుచుండును. ఇట్లు క్రమముగ కొంతవరకు పైకిపోయి, తిరిగి క్రమముగ క్రిందికిదిగి, ఆరు నెలలైన పిమ్మట బింబము కుంకును. బింబము కుంకినను “యీ రెండ” యుండును గద. ఉదయ కాలమున నుండు ఉషఃకాలమువలెనే ఈ "యీ రెండ” కూడ సుమారు ముప్పది దినములుండును. సూర్యుని వెలుతురు ఆరు నెలలును, ఉషఃకాలమును ఈ రెండయు కలిసి రెండు నెలలును ౼ మొత్తము యెనిమిది నెలలు వెలుతురును, తక్కిన నాలుగు నెలలును చీకటియు నుండును. వెరిశి ౧౨ నెలలును కలిసి సంవత్సరమగు చున్నది. దీనినిచూచి కొందరు "ఆమ్మో! నాలుగు నెలలు చీకటియే? మనుష్యులెట్లు బ్రతుకగలరు? మన పూర్వులచ్చట నెట్లు నివసింపగలిగిరి ” అని భయపడవచ్చును. కాని యీ నాలుగు నెలల రాత్రిలో సైతము సగము కాలము చంద్రకాంతి యుండును. సదా నక్షత్రకాంతి యుండును. అదికాక యుత్తర ధృవము వద్ద "అరోరా బోరియాలిస్ (Aurora Borealis)" అను పేరు గల గొప్ప వెలుతురొకటి (జ్యోతి) ఆకాశములో 'ధృవ నక్షత్రమునకు దగ్గరగా సదా వెలుగు చుండును. ఇవన్నియు కలిసి నాలుగు నెలల దీర్ఘ నిశాసమయమును కొంతవరకు కష్టముగ తోపనీయవు; కేవలము ఉత్తర ధృవము వద్దనున్న స్థితిగతులివి. కాని ఉత్తరధృవమును వదలి కొంచెము దక్షిణమునకు వచ్చినట్లయిన కొంచెముగ మార్పులు గన్పించును. ఉత్తరధృవము వద్దనున్న యెనిమిది నెలల పగలును కొంచెము మార్పు జెంది కొన్నిచోట్ల 7 నెలలును కొన్ని చోట్ల 10 నెలలును, కొన్నిచోట్ల 9 నెలలును కూడ పగలుగనే యుండును. కాన, ఈ విధముగ జూచినయెడల చీకటి కాలము బహుదినములుఁడునేయని మనము భయమందనక్కరలేదు. ఈ విషయములన్నియు కేవలము ఊహవలన చెప్పినవి కావు. కావలెననిన మన మచ్చటికి వెళ్ళి ప్రత్యక్షముగ నీ యంశములనన్నింటిని కండ్లార చూడవచ్చును. పూర్వము మన యార్యులు ఉత్తరధృవము వద్దనుఁడిరనగ, కేశేవల మాధృవము మీదనే కూర్చున్నారని యర్థము కాదు. ఏలననగ, ధృవమనునది యొక కొద్ది యణుమాత్రప్రదేశమేగాని, అలవిస్తారమైన దేశముకాదు. కనుక మన పూర్వులు ఉత్తరధృవమును చుట్టియున్న దేశములలో ధృవసమీపమున నుండిరని మావాదము. ఈ పైని చెప్పిన విచిత్రములైన రాత్రింబవళ్ళును నక్షత్రాదుల చిత్రవిచిత్ర భ్రమణములును ఈ మొదలెగు ఉత్తరధృవ ప్రాంతదేశ లక్షణములు వేదముల యందు మనకు కనఁబడిన యెడల మనయార్యులచ్చట మొదట నివసించియుఁడిరని సిద్దాంతము చేయవచ్చును. ఇక ముంధ్యాయములలో యీ వేదవిషయముల నన్నిటిని విచారించెదము.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse