Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 5/సంచిక 1/త్యాగరాజ మొదల్యారు

​

త్యాగరాజ మొదిల్యారు

(ఆలూరు గురురాజారావు గారు)

ఈ కవి నారాయణ మొదిల్యారునకు జానకమ్మకును శాలివాహన శ|| ౧౭౫౫ విజయ సం॥ శ్రావణ శుక్రా౯ దినమున జన్మించెను. ఈతఁడు తన బాల్యమునందే నాంధ్రభాషయందు చక్కని పాండిత్యము సంపాదించి గ్రంథరచన ప్రారంభించెను. బళ్ళారియిందు కొంత కాలము న్యాయవాదిగా నుండి తదుపరి యింజనీరింగుశాఖలో ఓవరుసీయరు ఉద్యోగమునందుఁ బ్రవేశించెను. తరువాత కొంతకాలమునకు నాగపూరు ప్రాంతము వెళ్ళి దొరతనము వారి యుద్యోగమునందు జేరెను. ఆ కాలమున సర్ సాలార్ జంగ్ బహద్దరుగారు నైజాము గారి ​రాజ్యతంత్రమునందు క్రొత్తమార్పులను గలుగజేసి రాజ్యముయొక్క ఆర్ధిక స్థితిని వృద్ధిపరిచుచుండిరి. ఈ సమయమునం దాంగ్లేయభాషలో నారితేరిన వారికి గొప్ప యుద్యోగములు లభించుట సంభవించుచుండెను. అప్పుడి మొదలియారు వచ్చి సర్ సాలార్ జంగు గారిని సందర్శించి యాతని దయకు బాత్రుఁదయి యింజనీయరింగు శాఖ యందు అధికారమును సంపాదించెను. ఈకవి ఆంధ్ర, ద్రావిడ, కన్నడ, మహారాష్ట్ర, యింగ్లీషు భాషలయందు సంపూర్ణమైన పాండిత్యము గలవాడైయుండెను. ఇంతియేగాక చిత్రలేఖనమునందును, వైద్యమునందును, వ్యవసాయమునందును, నైపుణ్యము గలిగియుండెను. తరువాత కొంతకాలమునకు సర్కారువారి తనికి సువ్వమ్ తాలూకాదారీ యధికారమొసంగి వరంగల్ జిల్లాకుఁబంపిరి. ఉర్దు భాషయందీతనికిఁ బరిచితి లేకపోయినను ఉద్యోగమునందుండు కాలమున తన నియుక్త కార్యములను మహాదక్షతతో నిర్వహించుచుండెను. విశేష కార్యభారమున్న యుద్యోగములయందుండుటచే నేమాత్రము తీరిక లేకుండినను ఈయడనేక ఆంధ్ర గ్రంథములు రచించెను. అందు కొన్ని ముఖ్యములగు వానిని క్రింద బొందుపరచవైనవి.*[1] కైవల్య హైయింగ వీనము, కౌముదీప్రచారము, సుబ్రహ్మణ్య విజయము, కందర్పదర్పదర్పణము, స్కందనందనకందళము, భాషాయోషాభూషణము. ప్రమోదప్రశ్లేషము, రసనికర సంవాదము, నైషధానందలహరి, అశ్వనిలాసము, శివానందలహరి,భువనేశ్వరీస్తవము,శృంగారతరంగరంగము, కుశలకలారత్నరత్నాకరము, పంపాకలంబకము, త్యాగరాజ విజయము, సోమాస్కందస్తవము, ఆంధ్ర లక్షణ కరతితలామలకచ్ఛందో రత్నాకరము, సుగంధి సౌగంధికము, చెన్నపురి డంబికాదంబము, సులక్షణక్షీరహంసావతంసము, వ్యవసాయశాస్త్రము, విజయ విజయ మను భారత కావ్యము, మొదలగునవి ఇంక నెన్నియో కలవు. నారాయణ మొదలియారునకు కుమారులు మువ్వురు. అందీకవి జ్యేష్ఠుఁడు. తక్కన యిరువురగు దేవశిఖామణి ముదిల్యారు, పార్థసారధి మొదల్యారు బళ్ళారియందే నివసించుచుండిరి. ఇందు పార్ధసారధిగారి కొమారుఁడు చిదంబరం మొదిల్యారు గారి వల్ల నాకీ కవిచే రచియింపఁబడిన భారతము లభించినది.

ఇతని కవిత్వమునందు వ్యతిరేకత్వార్థక సంధులు సమాస దోషములు తరుచుగా గానచ్చుచున్నవి. తన యాంధ్ర భాషాపరిచయమును బ్రశంసించుచు నీకవి సుబ్రహ్మణ్యవిజయములో యిట్లు వ్రాసికొని యున్నాఁడు. "బాల్యంబునఁ బ్రధమం బాంధ్రభాష వభ్యసించుట మరో దర్పణ పారదంబు గజా! నాలుగేడులు నిండినతోడనే ...యాంధ్రభాష నాకు ప్రథమమందభ్యాసమయ్యె. లసదుచ్చారణ లేని ద్రవిడ దేశస్థులలో నొకండనయ్యు నాకలవారికిఁ గల లేమి లేమియయ్యె. సంస్కృత ద్రావిడ హూణ ప్రముఖ భాషలనాయాస లభ్యంబు లయ్యె” దీనివలన నీకవి శుద్ధ ద్రావిడుఁడయ్యు బాల్యమునుండియే వ్యవహార భాషగా నాంధ్రమును నేర్చుకొని వ్యవహరించెననియు నందువలననే యాంధ్రవాఙ్మయమున - ద్రావిడ జనా సాధ్యమగు స్ఫుటోచ్చారణశక్తి కలవాడై యాంధ్రకవి కదంబములో జేరదగిన వాడయ్యననియు దెలియు చున్నది. ఇతనికి సంస్కృతమునఁ గూడ మంచి సాహిత్యమునట్లు లీతని గ్రంధములేగాక, పైవాక్యముగూడ నాధారమగురు. ఇతఁడు చాలకాలము వరంగల్లు చెంతఁగల హనుము కొండలో నివసించినటుల వినియున్నారము. భాషాభిజ్ఞులగు మహాశయులెవరని యేతత్కవికృత గ్రంధముల సేకరించి వాఙ్మయాభ్యుదయమునకై పాటుపడువారిలో నొకరను, ప్రకృత వ్యాస కర్తలునగు గురురాజారావుగారు హనుమకొండ వాస్తవ్యులు. కొలఁది కాలము క్రిందట వీరు కీర్తి శేషులైరి. భాషా సేవకులగు హనుమకొండ వాసులెవరని యీ గురురాజారావుగారు తనవద్ద నున్నదని వ్రాసికొనిన విజయవిజయము కొఱకు బ్రయత్నించి త్యాగరాజ కవి శ్రమఫలమంతము చేయుట ముఖ్య ధర్మము. మఱియు గురురాజారావుగారు యొద్ద కొన్ని యపూర్యశాసన ప్రతిబింబములు ప్రాచీనా ముద్రిత గ్రంథములు మేము స్వయముగా చూచియున్నారము. భాషాసేవకులా వంశీయులతో గలసికొని వానినిగూడ నుద్దరించుట కర్తవ్యము. ​ఈ కవి తన గ్రంథము యొక్క సూచిక యందిట్లు వ్రాసి కొని యున్నాఁడు.

“ఇక్కావ్యము, సంస్కృతాంధ్ర భారతములలో నుండు సర్వకథలును, ద్రావిడ, జైమినీ భారతాదులలో నుండి వివిద కథలును కలిగియున్నది. పాండవులతో సంబంధపడిన ముఖ్య కథలు విరివిగను, సందర్భసరణిచే వచ్చు నితరకథలను సంగ్రహముగను రచించి కావ్య సంపద బొంపిరిబోనిలాగునను, గీర్వాణాంధ్ర ద్రవిడ చ్ఛందోవృత్త జాతులెల్లయు వెళ్లివిరియులాగునను, ఆందందు పొందు పరుపబడి యున్నయది. కావున నిది పండిత మండలీచుండనమై యుండునని నమ్మఁబడినది.”

తరువాత వివరమును ఇట్లు వ్రాసియున్నాఁడు. భారతమునం ఆదిపర్వములో గావిస్వములలో చంద్రవంశ్యులగు రాజుల వంశానుక్రమణి నిక్కావ్యమునందు చెప్పంబూనుట వృథా విరివియగుట గాక పరిష్కారముగా తేటపడదుగాన సుపధమగులాగున చంద్రవంశ క్రమమును, వృక్షరూపముగా చిత్రగతి నేర్పరచిన పటంబీ గ్రంధాంతమునం జేర్పబడి యుండును. దానిచే వలయు వారు తదంశముల నెరుంగఁగలరు. భీష్మపర్వమునందలి భూగోళ వివరణంబును నీలాగే చిత్రింపఁబడి యుండెడి.”

పై నుబాహరించిన చిత్రపటముల కొఱకు నేను ప్రయత్నించితిని. ఇంకరు లభించలేదు.

ఈ కవి తన భారతమును, ప్రక్రమపర్వము, ప్రద్వేషపర్వము, ప్రధనపర్వము, ప్రశమనపర్వమను నాల్గుపర్వములుగా విభజించి యున్నాఁడు. ప్రక్రమపర్వము నందు ఆదిపర్వ సభాపర్వార్ధములు గలవు. ప్రద్వేషపర్వమునందు సభాపర్వార్థ అరణ్య విరాట పర్వములును, ఉద్యోగపర్వభాగమును గలవు. ప్రధనపర్వమునందు ఉద్యోగపర్వభాగము, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వంబులును, ప్రశమనపర్వమునందు స్త్రీ శాండ్యను, శాసనీ కాశ్వమేధాది పర్వములును, కలవని కవి తన గ్రంధముయొక్క ప్రారంభమున వ్రాసియున్నాఁడు. కాని కడపటి రెండు పర్వములు నాకు లభింపలేదు. ఆకవి రచించనే లేదని తెలియుచున్నది. ఈకవి 1879 సం| జూన్ 3వ తేది పరలోకగతుడయ్యెను.

ఈ భారతముయొక్క సభాపర్వమునుండి కొన్ని పర్వములు వరుసగా నీక్రింద వ్రాయఁబడియె.

సీ। దుర్యోధానభిఖ్య దుర్యోధనాకాంక్షి సర్వంసహాభర్త సవనకర్త
   గాంధారవర్వ రాగాంధారవుఁడు పాప వర్తకుండు క్రతుప్రవర్తకుండు
   కర్ణ దుశ్శాసన కర్ణ దుశ్చక్షత్వభాజనంబులు తత్సభాజనములు
   ధర్మరాజాభిఖ్య ధర్మరాద్భాగ్య విక్రమంబు ఘనాహుతిక్రమంబు


గీ ౹ ఈర్ష హుతవహుఁడును రాగ హర్ష మొప్ప ౹ రాజసూయంబునకు ధార్తరాష్ట్రు లెదురు
    జన్న మొనరింపబూని ప్రచ్ఛన్నవృత్తి । మంత్రకూటమొనర్చి యామనుజవిభుఁడు|


ఉ౹ కుండకులైన పాండవులు గూడి సుఖంబొనరించిపల్చినన్
   బండుగుఁగూడ నండఱును బంధువులై చనియుండ విభ్రమం
   బంతన నన్నుగాంచి హృదయంబున గౌరవమింతలేక యా
   మిండలమారి నవ్వ తనమింపనియఁడను కండగండునన్ |
|


సీ| సరసరమాస్ఫూర్తి జాఱఁగా ముఖకఁజ సుఖవఁజనలు నాఁడె చూఱలయ్యేఱలయె
   ప్రతిభానుభావంబు బడవలఁగా మతిచక్రగతిచక్రములు నాఁడె గతుకుఁగాంచె
   నిబిడతేజన్స్ఫూర్తినీలఁగా ఘనపర్వ దినగర్వములునాఁడె కినుకఁబాఱె
   నిర్నిద్రవిభవంబు నీరసంబుగ రాజ్య ఖగపూజ్యగతి నాఁడె యగడుఁజెండే


గీ౹ మామ యాలేను యుత్సాహధామ చంద । మామనభిమోమలర నిభరామలీల
  సాంద్రతర హాసనిస్వద్ర చంద్రికా ప్ర । సార మక్కట నామెపైఁగూరినంత |

​
చ.⁠

 బికిరము మేమొసఁగఁలొని బీరముతో నొకగుడ్డిపాటు దై
    వికమున మించి గర్వమున వీఁగెదరందఱు వారిభాగ్యమున్
    సుకరముగా హరించి పెనుసొంపున వారల నేలకున్ననే
    నిఁక ధరనుండ! మేను బలియిచ్చెద నీ యవమానవహ్నికి౯

⁠


కం.⁠

 గురుతరశౌర్యమున్ సహజ కుండలవర్మము మెప్పు కర్ణుఁడు౯
   నిరుపమసారమానులకు నీరధియైతు నీవునుండ నే
   స్ఫురదవమానపంకమున మున్గుటచెల్లునె మామ! ప్రీతి నన్
   బరువడిగ్రుచ్చి పాండవుల భాగ్యముగైకొని యిచ్చిగాననే!

⁠


కం.⁠

 అన విని కొండొక తనమన ౹ మునను విచారించి రోగపూరితునకు వేఁ
   డినభక్ష్యములనొసంగుట | లసరారాజుఁ నిశకుని యపుడిట్లనియెస్"

⁠


కం.⁠

 నిల్చిపుట్టుట సారె గెల్చికొట్టుట లూను కాయ్వులు చతురంగగణము గాఁగ
   జోడుగట్టుట హొయల్ పీడిముట్టుట లాది వర్తనల్ వ్యూహకల్పనలుగాఁ
   నద్దుబెట్టుట మేటి యొద్దు మెట్టుట లాది యౌక్రమంబులు విక్రమాప్తిగాఁగ
   చేరబట్టుట పందమూరఁ భట్టుట మెప్పు సారెలగతి శస్త్రశక్తి గాఁగ
   క్రొవ్వునను చిఱునవ్వులురువ్వుకొనుచు | నాతతద్యాతరణమున జేతనేత
   రప్రబల బలములగొని రాజరాజ! | పొంచి నీదాయసర్వంబు గెలిచి యిత్తు౹౹

⁠


ఉ.⁠

 అంగద యిటి దైన్యరసమానఁగ నేటికి రాజరాజసా
   రంగ శురంగ ముఖ్య చతురంగము అక్కఱలేక లీలదా
   యంగరమొప్పు చ్యాత చతురంగ సురంగమునందుఁ దాఁకి స
   ప్తాంగముల౯ హరించెదఁ దదంగనతో ననుజాళితోడుత౯౹౹

⁠


ఉ.⁠

 గౌరవమొప్ప నొక్క మణి కాంచన పూర్ణ విచిత్ర సత్సభా
   గారమ్ముట్టి పాండవుల గ్రక్కునఁ దత్సభంజూడఁబిల్వుమా
   సారసమిత్రిపౌత్రుఁడ నిశంబును చూతముకోరువానినే
   నేరుపుమీర దెచ్చి ధరణి౯ తరుణి౯ నృప నీకొసంగెద౯౹౹

⁠


కం.⁠

 అనవిని దరహాసంబా ! ననసీమను మొలక లెత్త నసహిష్ణుత్వా
   ద్యనుభావములు పెనంగఁగ | నినసుతుఁడిట్లనియె నమ్మహీపాలునితో౯

⁠


చం.⁠

 అహరహమిట్టివంచనల నార్యులఁ దూరఁగఁజేసి లోకదు
   స్సహులయి కార్యసాధన మెసంగమిఁగాంచియు వెండియు౯ మహా
   మహులగు పాండునందనులమార్కొ ని గెల్వక జూదమాడుటల్
   విహితముగాదుపో శకుని భీరువెఱుంగఁడు వీరకృత్యము౯॥

⁠


ఉ.⁠

 పక్కున నొక్క కొలఁగొని పాండవముండము లట్టెచెండి పే
   రుక్కుననిక్కి వారికమయు౯ క్షమయున్ నిను నేర్చు కర్ణఁడ౯
   రక్కసిచక్కి చూడక ధిరాజనముల్ నగ జూదమాడు న
   మ్మక్కల యెక్క సక్కెముల నాడుట మాన్యమె శూరకృత్యమే!

⁠


కం.⁠

 అనవిని యాగ్రహమునఁ గ | ర్ణుని నిలునిలుమని యదల్చి రోజుచు దుర్యో
   ధనుజూచి శకుని యపుడి | ట్లను నందలి దుష్టునివహ మౌ నౌ ననఁగన్౹౹

⁠

​

ఉ॥⁠

 బీరము లీరసంబుఁగన ప్రేలెడి కర్ణుఁడు బంట పోలె మున్
    వారలు మీరు నాద్రుపదుఁ బట్టఁగఁబోయిన వాడుఁద్రౌపదిన్
    వారలు బొండనోర్వమిని వారి నెదిర్చిననాఁడు జూఁపఁగా
    నేరఁడె ధర్మకౌశలము నిక్కపు సాహసశర్తులుండినన్ |

⁠


ఉ॥⁠

 ధర్మముతోడ బ్రీతిమెయి ధర్మముఖుల్ పీతలౌట వారి బల్
    ధర్మములందునిల్చి సతతంబు జయంబులనీన చావకన్
    మర్మములూడదూలక సమర్త్యపురంబును జేరక౯ ద్విష
    ధర్మముఁ జూపువారు వసుధాస్థలిలేమి నిజంబు భూవరా!

⁠


గీ॥⁠

 దండి గాండీవ చండకోదండ మొలుకు ౹ కాండములుశూలచక్రోరుదండములును
   నిలుపఁజాలు సె వైచునే నిలువుటడ్డ | సారెలేగాక నిజముగా సార్వభౌమ |

⁠


సీ॥⁠

 వైశ్వానరాననప్రభ వైరిమతిఁగాల్చు నజుమోములన నాకుఁ బ్రతిభలిచ్చు
    హరివక్తములునాఁగ నరిధర్మగతినొందు గుహముఖగతి నాకుఁ గూర్చుశక్తి
    రావణాస్యములునా రహి దాయసొమ్మందు నిధులనెల్లను నాకు నిత్యమొసఁగు
    దిగ్దంతులనఁగ నెదిరి హృదబ్దములార్చు దిననాథులన నాకుఁదేజమిచ్చు

⁠


గీ॥⁠

 వారినిధులనఁ బరభాగ్యవాహినులకు ౹ లాగి కొనుగీరులన నన్ను లావుమెఱయ
    విజయమున సుస్థిరునిజేయుఁ బెక్కు మూర్తు ౹ లలర నాచేతిసారెలో యలుకు రాగ

⁠


చ॥⁠

 అనవిని దుస్ససేనుండను నన్న దురంబు బలారి నాశనం
    బొనరఁగఁజేయు విగ్రహమయోగ్యము సామముఖంబులోప్పుచో
    పనుపడ మామపల్కినటు పాండవులం గెలువంగఁ గూఁడుగా
    కననికి దారసించుటలు గాదు సుసాధ్యమె? యుద్ధమిత్తఱి౯|

⁠


గీ॥⁠

 అనుఁడు దుర్యోధనుండు సాధ్యమగు కార్య | మిదియె యనినిశ్చయించి తా రెల్లవారు
    తండ్రికెఱిఁగించువారలై తఱచి యంతి ౹ పురమునందావిభుని గాంచి మ్రొక్కునపుడు|

⁠


చ॥⁠

 శకుని మహీశ! నీసుకుని సామజ సామ్య తనూవిలాస మం
   తక భవు యష్టిచూచిన దినంబుననుండి కృశించియుండుట౯
   సుకరములన్ స్పృశించి యిటుజూడుమన౯ ధృతరాష్ట్రుఁ డాత్మజాం
   గకములఁ బట్టిచూచి యనుకంపఁ గలంగుచుఁ బట్టితో నను౯|

⁠


ఉ॥⁠

 నందనరత్నమా ! యిటుమనంబుకలంగి కృశాంగుఁడౌచు వి
   న్నందనమూననేల నరనాథులలో నిరుబోలి ప్రాభవా
   నంద నయార్థ భోగ కలన౯ గలవారలు లేమిగాక నా
   నందన కల్పకాడ్యుఁడయిన౯ సరిగాఁడు కరంబుఁదెల్పుమా!

⁠


చ॥⁠

 అనుడు సుయోధనుండు వినయంబున నిట్లను నయ్య! తృప్తుఁడౌ
   జనపతి నష్టుఁడౌననుచుఁ జాఁటఁడె దేవగురుఁడు ధారుణీ
   శున కిల దాయ పెంపుపడఁజూచుట మేనునఁగఁడఁజెండులా
   గనుట నెఱుంగవే యినభవాత్మజు పెంపు సహింపఁ జెల్లునే!

⁠

​

సీ.⁠

 నవనిధుల్ గలలో నాధునానని జేరి రాజశేఖరులు మిత్రత ఘటింప
     సురభిసంతానముల్ నెఱయు గోపరియుచు మొనసి యు పేంద్రుండు పని వినంగ
     నిరుపను వాహినీశ్వర సేవితుడఁటంచు భువనముల్ తనపర్పుఁ బూనిసేయ
     పరమపావనుఁడయి ప్రబలెడిబలుఁ డంచు తనచే ధనుంజయోద్దతులువెలయ

⁠


గీ.⁠

 భవ్యతేజంబు సత్కాశావళి శుచిత్వ | పూర్తి నుగ్రాంబకస్ఫూర్తి పొలుపుఁ గాంచు
     ధర్మభవ లోకపాలకోత్తముని యెదుట | మోపు ఖద్యోతిమ్రోల ఖద్యోత మైత్రి

⁠


సీ.⁠

 రాజసూయాాత్త సామ్రాజ్య సింహాసన ఖచితరత్నంబు లేకడవెలుంగ
     సాత్యకి కిరధృతోజ్యొల మౌక్తికచ్ఛత్ర దీధితిప్రతితి చంద్రికలనీన
     భీమార్జునావర్తి తామలచామర క్రమము వపంతవారముల నింప
     శౌదిమాద్రేయ దుష్టదుృధ్యమ్య వినతభూ భృనౌళిరుచులు నీరెండగాయ

⁠


గీ.⁠

 ససను వైభవిసాంద్రఁడై యమసుతుఁడు | నిండుకొలువున్న విన్నవై నిలుచునన్ను
     కృష్ణ కృష్ణానుజులు కృష్ణ కృష్ణ బీమ | ముఖులు గని నవ్వ నవమానమును మునింగి |

⁠


ఉ.⁠

 అంగము రొసియుండియు సభాంగణము౯గనబోయి నప్పుడం
     డంగద యెందులేని మణు లయ్యనను౯ ఔనువెఱ్ఱిజేయ నే
     భంపడంగ నన్నగని పక్కున నవ్వెను భీముఁగూడి మై
     పొంగంగ నేవుర౯గవయు భోగిని గౌరవమెంచికొంకక౯

⁠


ఉ.⁠

  రాయలకీర్తియన్ సురనుతంఒగుభాగ్యము లెండలై సభన్
     దాయలకైన వారిపెనువ్వులు దాపశిఖాలియై కడు౯
     హేయపుఁ దొత్తుఁ గేలఁగోనుటెంతయు దుదుర్దినవర్షమైన భూ
     నాయక మానవల్లిక వినమ్రత నెండియుఁ గాలిరూపరె౯

⁠


గీ.⁠

 వసుచయంనిచ్చి | ప్రాణఁబు ప్రాణంబు | నిచ్చి మానమును మహీశ గావ
     వలయుఁ గాన మానవిలయమై మఱినేల | కొనకయున్న ప్రాణ మునుపఁదగునె

⁠


కం.⁠

 కావు సుధర్మవిభవము | చేన౯గోన రామి శకునీచే పనిచే ద్యూతమునన్
     కైవసమొనర్చి వారల | సేవలకున్ జొనుపకున్న జీవము నొల్లన్|

⁠


కం.⁠

 సెలవిమ్మని యేడ్చుచు నల | జలిబడి పలవించుసుతుని సంభ్రమమునఁగౌఁ
     గిలినుంచి యాంబినేయుడు | తులువలవలఁచిక్కి భీతితో నిట్లనియెన్ |

⁠


ఉ.⁠

 జూదము ఖేదమున్ బెనిచి సుస్థిరధర్మమునొంచి పిమ్మటన్
     వాదము బేదము౯లుగఁ బార్థుల ధర్మమువంచి నీ మహా
     హ్లాదము మోదమున్ జెరువునటుల బుత్ర కళత్ర రోదనో
     న్మాదము నాదమున్ బలధనక్షయమున్ ఘటియింపకుందునే|

⁠


చ.⁠

 వలసిన నీవు దిగ్విజయ వైభవమ౯గని ధీరవృత్తి న
    వ్వల సిరిగూర్చి చేయుమొక భవ్యముఖంబు సుఖంబుగాఁగఁ గే
    వల సితపక్ష చంద్రగతి భవ్యయశంబుఁ జెలంగఁ జిన్నిత్రో
    వల శివమెత్తినట్లరుగవచ్చును జిచ్చును హెచ్చుపుచ్చఁగ౯|

⁠

  1. ↑ ఇవిగాక బాహులేయఫలకము, అదశివ సూక్తమాల, యరు పొత్తములను రచించితినని యీకవి చెప్పుకొనినాఁడు. శుద్ధద్రావిడుఁడయ్యు నీకవి యాంధ్రమును స్వతంత్రభాషలో రచించినటులఁ బేక్కులు గ్రంధములు రచించియున్నాఁడు. ఇందు సుబ్రహ్మణ్య విజయము భాషాయోషా భూషణము మాత్రము ముద్రితములైనవి.